యౌవనస్థులు ఇట్లు అడుగుదురు . . .
మరింత సంపన్నమైన దేశానికి నేను తరలి వెళ్లాలా?
టారే తన స్వదేశమైన ట్రినిడాడ్ వదలి వెళ్లింది, షీలే జమైకాను వదలి వెళ్లింది, ఎరిక్ సురినామ్ వదలి వెళ్లాడు. ఈ ముగ్గురు యౌవనులు అధిక సంపన్నమైన దేశానికి తరలి వెళ్లారు. ఎందుకని?
“ట్రినిడాడ్‌లోని యౌవనులమైన మేము పత్రికలు, టివిలో చూచిన దాన్నిబట్టి చాలా ప్రభావితులమయ్యాం. దుఃఖకరమైన విషయమేమంటే, అది మాలో అమెరికా మరితర సంపన్న దేశాలను గురించిన సాహసోపేత అభిప్రాయాన్ని కల్గిస్తుందని” టారే వివరిస్తుంది.
షీలే కథనం కూడా అలాగే ఉంది: “ఉద్యోగాలు, ఉచిత విద్య పొందడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని ఇతరులు చెప్పడం నాకు బాగా గుర్తుంది.” ఆమె ఇంకా ఇలా అన్నది: “ఎందుకో నాకు తెలియదు కాని, ఈ దేశాలకు వెళ్లినవారు మిగతా కథంతా ఎప్పుడూ చెప్పరు. బహుశా అక్కడి పరిస్థితులు కూడా చెప్పుకోదగినంత మంచిగా లేవని ఒప్పుకోడానికి వారు సిగ్గుపడ్తున్నారేమో.”
అయినా, ప్రజలు తరలి వెళ్తున్నారు. 1980 నుండి 1990 వరకు, వేరే దేశాలకు తరలివెళ్తున్న ప్రజల సంఖ్య రెండింతలైంది, 2000 సంవత్సరం నాటికి మళ్లీ రెండింతలు అవుతుందని అంచనా వేయబడినట్లు లాస్ ఏంజిల్స్ టైమ్స్‌నందలి ఒక నివేదిక పేర్కొంది. ప్రతి సంవత్సరం 7,00,000కంటే ఎక్కువ మంది ప్రజలు అమెరికాకు తరలి వెళ్తున్నారు. ఆస్ట్రేలియా, కెనడా, కోట్ డి ఐవోరి, సౌదీ అరేబియాలకు ప్రతి ఏటా 50,000 మంది విదేశాలనుండి వలస వస్తారు, వారిలో చాలా మంది మరింత సంపన్నవంతమైన జీవితాన్ని అన్వేషిస్తూ వచ్చిన వారే.
ఒకవేళ నీవు పేద దేశంలోగాని లేక వర్థమాన దేశంలోగాని జీవిస్తున్నట్లైతే, సంపన్న దేశానికి వెళ్తే నా భవిష్యత్తక్కడ ఉజ్వలమౌతుందని నీవు భావిస్తుండవచ్చు. ఇది ఒక గంభీరమైన నిర్ణయం. నీవెలా వివేకవంతంగా ఎంచుకోగలవు?
త్వరపడి నిర్ణయం తీసుకోవద్దు
మనం ఎప్పుడూ త్వరపడి చర్యగైకొనకూడదు, కాని మనకు వీలైనంత సమాచారాన్ని మొదట సేకరించాలని సురినామ్ వాడైన ఎరిక్ నమ్ముతున్నాడు. “ఇక్కడ సురినామ్‌లో ఉన్న చాలా కుటుంబాల బంధువులు సంపన్న దేశాలలో ఉన్నారు, నీవు సరైన సమాచారాన్ని పొందగలిగి ప్రపంచ ఆర్థిక స్థితిని గూర్చిన వాస్తవాలను గ్రహించగలిగి ఉండాలి,” అని అతను అంటున్నాడు.
నీవు నిర్ణయం తీసుకొనక ముందు, “ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును, ఆలోచన చెప్పువారు బహుమంది యున్నయెడల ఉద్దేశములు దృఢపడును” అని గుర్తుంచుకో. (సామెతలు 15:22) కావున, నీ తలిదండ్రులతో, క్రైస్తవ పెద్దలతో, నీపట్ల శ్రద్ధ ఉన్న అనుభవంగల ఇతరులతో నీవు ఎంచుకున్న వాటిని గురించి దాపరికం లేకుండా చర్చించు.
నీవు వినేదంతా నమ్మవద్దు
దూరాన ఉన్న సంపన్న దేశాలను గూర్చిన తేజోవంత నివేదికలను మనం విన్నప్పుడు, సహేతుకమైన సందేహం కొంత అవసరమే. “జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును,” అని ఒక వివేకవంతమైన సామెత చెప్తుంది, “వివేకియైనవాడు తన నడతలను బాగుగా కనిపెట్టును.”—సామెతలు 14:15.
జమైకాలో నివసిస్తున్న షీలే ఇలా చెప్పింది: “అమెరికాకు తరలి వెళ్లడం నేను చేయదగ్గ మంచిపనని మా ఇంగ్లీషు ఉపాధ్యాయిని పట్టుపట్టింది. నేను కెనడా, అమెరికా, లేక ఇంగ్లాండుకు వెళ్తే, నేనే రంగాన్ని ఎన్నుకున్నప్పటికి నా పరిస్థితి చాలా మెరుగౌతుందని కొందరు పెద్దవారు నాతో అన్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే, అలాంటి అవకాశాన్ని కాలదన్నితే నేనొక అవివేకినౌతా.”
ఆమె అమెరికాకు వెళ్లడం ఆమెకు నిజంగా సహాయపడిందా? “నా జీవితం చాలా విషయాల్లో మెరుగయ్యింది, కాని జమైకాలో ఉన్న నా స్నేహితులు కూడా తమ జీవితాలను తీర్చిదిద్దుకున్నారు. సర్వసాధారణంగా మనం ఒక సమస్యకు బదులు మరొక సమస్యను కొనితెచ్చుకుంటాం. మనం ఎక్కడ జీవిస్తున్నాం అన్నది దానంతటదే మార్పులు తీసుకురాదు.”
ట్రినిడాడ్ నుండి అమెరికాకు వెళ్లిన టారే ఇలా ఒప్పుకుంటోంది: “ప్రజలు సంపన్న దేశాలను—చదువుకు, పనికి, డబ్బు సంపాదించడానికి, మంచి పరిస్థితులలో జీవించడానికి అవకాశాలున్న దేశాలుగా పరిగణిస్తున్నారు. కాని అన్నిచోట్లా పరిస్థితులు క్షీణిస్తున్నాయని వలస వెళ్లిన వారిలో చాలా మంది గ్రహిస్తున్నారు. కొందరు స్వదేశానికి తిరిగి వచ్చేశారు.”
మేలు కీడులను వివేచించండి
సమతూకమైన నిర్ణయం చేయడానికి, ఇతర దేశాల ధనసమృద్ధిని గూర్చిన మంచి వార్తలే కాకుండా ఇంకా ఎక్కువ విషయాలు తెలుసుకో. నీవు తరలి వెళ్లడంలో ఇమిడివున్న నీ ఆర్థిక, సామాజిక, నైతిక, మరియు ఆత్మీయ మేలు కీడులను వివేచించు.
ఉదాహరణకు, నీవు జీవిస్తున్న ప్రాంతపు ఆర్థిక పరిస్థితి క్షీణించవచ్చు. కాని నీ స్వదేశంలో ఉద్యోగావకాశాలే లేవా? “మా స్వదేశంలో, ముఖ్యంగా ఉన్నత విద్య లేనివారికి నిరుద్యోగ సమస్య చాలా ఎక్కువగా ఉండేది” అని టారే అంటున్నది. కావున ఆమె తరలి వెళ్లింది; కాని ఆమె తమ్ముళ్లు వెళ్లలేదు. “నా ఇద్దరు తమ్ముళ్లు గృహోపకరణములు తయారు చేయడం, తెరలు, తివాచీలు అమర్చేపని నేర్పే కోర్సును చేపట్టారు. వాళ్లిప్పుడు కర్మాగారాల్లో పని చేస్తున్నారు, వాళ్ల పనితనాన్ని ఇష్టపడే వ్యక్తులనుండి వాళ్లకు ప్రత్యేకమైన పని కూడా ఎంతో లభిస్తున్నది. ఇక్కడ ‘అవకాశాల దేశంలో’ ఉన్న నాకంటే స్వదేశంలో ఉండిపోయిన వాళ్లే బహుశా మంచి స్థితిలో ఉన్నారేమో.”
నీవు తరలి వెళ్తే, సాంప్రదాయపర సమస్యలను ఎదుర్కొనవలసి వస్తుందేమో, బహుశా నీవు ఎంతో విలువైనవిగా ఎంచిన నైతిక సూత్రాలు కూడా సమూలంగా ధ్వంసం కావచ్చు. నీవు తరలి వెళ్లడం సమంజసమేనా? దానికితోడు. సంపన్న దేశాలలో ఐశ్వర్యాసక్తి శృతిమించుతోంది. అది నీ ఆత్మీయతను ఎలా దెబ్బతీయవచ్చు?
ఏశావు పొరపాట్లనుండి నేర్చుకొనుట
మేలు కీడులను వివేచించాల్సి వచ్చినప్పుడు, బైబిలు కాలమందలి ఏశావుకు గంభీరమైన సమస్య ఉండింది. తన కుటుంబ ఆత్మీయత వంటి కీలక విషయాలను పరిగణలోనికి తీసుకొనడంలో అతను అనేకసార్లు తప్పిపోయాడు. తత్ఫలితంగా, అతని ముఖ్య నిర్ణయాలలో కొన్ని విపత్కరంగా పరిణమించాయి.
“ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావువంటి భ్రష్టులుగా” ఉండకూడదని బైబిలు హెచ్చరిస్తోంది. (హెబ్రీయులు 12:16) ఆ జన్మహక్కు పవిత్రమైనది. మానవజాతి రక్షణకు కీలకమైన మెస్సీయా వంశావళిలో ఉండగల అవకాశాన్ని దేవుడు ఏశావు కుటుంబానికి కల్పించాడు. (ఆదికాండము 22:18) అయినా, “ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను.” కలగూర భోజనం కొరకు అతను దాన్ని అమ్మి వేశాడు. (ఆదికాండము 25:30-34) నీ సృష్టికర్తతో నీకున్న సంబంధమే నీ అతి పవిత్రమైన సంపద. వస్తుసంబంధ లాభానికై దాన్ని మార్చుకోవద్దు, అలక్ష్యం చేయవద్దు, లేక అపాయంలో పడవేసుకోవద్దు.—మార్కు 12:30.
తర్వాత, ఏశావు తన స్వగ్రామమునుండి వేరే దేశానికి తరలినప్పుడు, ఇద్దరు హిత్తీయ స్త్రీలను అతను వివాహం చేసుకున్నాడు. కొన్ని కారణాలను బట్టి ఈ వివాహాలు ఆచరణాత్మకమనిపించి యుండవచ్చు, కాని ఆ స్త్రీలు ఏశావు తలిదండ్రులైన రిబ్కా, ఇస్సాకుల దేవున్ని ఆరాధించలేదు గనుక అవి ఆత్మీయ విషయాలలో కేవలం సమస్యలే తెచ్చాయి. ఆ భార్యలు అతని తలిదండ్రులకు “మనోవేదన” కలుగజేశారు.—ఆదికాండము 26:34, 35.
యౌవనస్థులు కేవలం మరింత సంపన్నమైన దేశాలలో ప్రవేశించడానికే వివాహం చేసుకొనడం పరిపాటి. భారతదేశం నుండి సంవత్సరానికి 4,000 మంది అమెరికాకు వెళ్తున్నారని, మరో 10,000 మంది వెళ్లడానికి ఎదురు చూస్తున్నట్లు అంచనా వేయబడిందని నివేదించబడింది. అయితే, వివాహం దేవుడిచ్చే విలువైన వరం. దాన్ని చులకనగా ఎంచకూడదు, వలస వెళ్లడానికి ఒక టిక్కెట్టులా పరిగణించ కూడదు. నీవు ‘అవిశ్వాసితో జోడుగా’ ఉంటే అది యెహోవాను మరియు నమ్మకస్తులైన నీ కుటుంబ సభ్యులను ఎంతగా బాధపెడుతుందో కూడా ఆలోచించు.—2 కొరింథీయులు 6:14.
నీ నిర్ణయాన్ని సఫలం చేసుకో
నీవు చేసుకొనే నిర్ణయంకంటే దాని విషయంలో నీవు ఎలా ప్రవర్తిస్తావు అన్నది ఎక్కువ ప్రాముఖ్యము. నీవు ఉన్న చోట ఉండిపోయినా, లేక తరలి వెళ్లినా, నీ నిర్ణయం సఫలమయ్యేలా చేయడమే ముఖ్యమైన విషయం.
ఒకవేళ నీవు వెళ్లకపోతే: వెళ్లే వారిని విమర్శించవద్దు. అది వారి స్వంత బాధ్యత. (రోమీయులు 14:4; గలతీయులు 6:4, 5) నీ స్వదేశంలో ఉన్న అనుపమాన అందాలను, అనుకూలతలను మెచ్చుకొనడానికి నేర్చుకో. ప్రజలపట్ల ఎక్కువ ప్రేమను, వారి యిబ్బందులు, సవాళ్ళపట్ల దయను వృద్ధిచేసుకో.
ఒకవేళ నీవు తరలివెళ్తే: నీవు క్రొత్త సాంప్రదాయాలను, బహుశా క్రొత్త భాషను నేర్చుకొనుటకు ప్రాధాన్యతనిమ్ము. నీకు ముందెన్నడూ అవసరంకాని వస్తువులను సంపాదించుట కొరకు ఎక్కువ గంటలు పని చేయడంలో నిమఘ్నం కావద్దు. లేకపోతే కొద్ది రోజులకే ఆత్మీయ విషయాలకు సమయం లేనంత పనితొందర గలవాడవౌతావు.
“నేడు లోకంలో ఉద్యోగం కలిగుండడం చాలా ప్రాముఖ్యమని” షీలే ఒప్పకుంటోంది. “అయితే, కుటుంబం, స్నేహితులు, మరియు ఆత్మీయ విషయాలు ముఖ్యమైనవి. సమస్తము విఫలమైనప్పుడు, అవే మనల్ని ముందుకు సాగనిస్తాయి.” ‘లోకమును . . . అమితముగా అనుభవించవద్దని’ బైబిలు జ్ఞానవంతమైన సలహానిస్తుంది; ‘ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది.’ (1 కొరింథీయులు 7:31) నిజంగా విజయం సాధించేవారు తమ ఉద్యోగం, డబ్బు గురించిన విషయాలను సరైన స్థానంలో ఉంచుతారు, కుటుంబ అవసరతలు, ఆత్మీయ లక్ష్యాలకంటే వాటిని ముందుంచరు.
క్రొత్త స్నేహితులను జాగ్రత్తగా ఎన్నుకో. “మంచి జీవన విధానాన్ని ప్రోత్సహించే స్నేహితులతో పరిచయాన్ని కలిగియుండు” అని ఎరిక్ చెబుతున్నాడు.
నీ నిజమైన అవసరాలను గుర్తుంచుకో
సంతోషం కొరకు మనకు నిజంగా అవసరమైన విషయాలు మారవు. “మనం ఎక్కడ జీవించినా యెహోవా మన నుండి కోరుతున్నవి ఒకే విధంగా ఉంటాయి” అవి ఏమిటి? యేసు సంక్షిప్తంగా ఇలా చెప్పెను: “తమ ఆత్మీయ అవసరతలందు శ్రద్ధగలవారు ధన్యులు.” అవసరమైన ఆహారం, వస్త్రాల విషయమై “చింతింపకుడి” ‘[దేవుని] రాజ్యమునకు, నీతికి’ ప్రథమ స్థానమివ్వండి; ‘అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును.’—మత్తయి 5:3; NW 6:31, 33.
ఈ సూత్రాలను బట్టి జీవించడం ఏ దేశంలోనైనా మంచి జీవితాన్ని కనుగొనడానికి నీకు సహాయం చేస్తుంది. (g93 4/22)
[15వ పేజీలోని చిత్రాలు]
సంపన్న దేశాలు అవి వాస్తవంగా ఉన్నదానికంటే ఎక్కువ మనోహరంగా కనిపిస్తాయి