స్వాతంత్ర్య సూచిక
యు.ఎన్.డి.పి (ఐక్య రాజ్యసమితి వికాస కార్యక్రమం) ప్రచురించిన ఒక “మానవ స్వాతంత్ర్య సూచిక” 88 వేర్వేరు దేశాల ప్రజలు ఎంతమేరకు స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తున్నారనే విషయాన్ని సూచిస్తుంది. మానవ హక్కులను గూర్చిన ప్రపంచ మానవ హక్కుల తీర్మానంలో పొందుపరచబడిన 40 హక్కులు మరియు స్వాతంత్ర్యాలపై ఆధారపడి, ఆ సూచిక ఒక్కొక్క దేశానికి ఒక స్వాతంత్ర్యానికై ఒక పాయింటు ఇస్తుంది.
ఐరోపా సమాఖ్యచే ప్రచురింపబడుచున్న, ది కొరియర్ పత్రిక ప్రకారం, ఐక్య రాజ్యసమితి వికాస కార్యక్రమం యొక్క సూచిక మేరకు పరిగణించబడిన కొన్ని స్వాతంత్ర్యాలేవంటే: శాంతియుతంగా కూడుకొనుటకు మరియు సహవసించుటకు హక్కు; పాఠశాలలో బలవంతంగా మతమును అంటగట్టుట లేదా రాష్ట్రీయ సిద్ధాంతం నుండి స్వాతంత్ర్యం; పుస్తకాలను స్వేచ్ఛగా ప్రచురించుటకు స్వాతంత్ర్యం; వ్యక్తిగత సంపదను అకారణంగా జప్తుచేయడం నుండి స్వాతంత్ర్యం; మరియు ఏ మతాన్నైనా పాటించేందుకు వ్యక్తిగత హక్కు. మొదలైనవి. ఈ విషయాలకు దేశాలు ఎలా సరితూగాయి?
ఏ దేశమూ 40 పాయింట్లు సంపాదించుకోలేకపోయినా, స్వీడెన్ మరియు డెన్‌మార్క్ 38 పాయింట్లతో సరిసమానంగా వచ్చాయి, మరియు నెదర్‌లాండ్ 37 పాయింట్లు సంపాదించి మూడవ స్థానంపొందింది. ఒకటీ రెండు తక్కువ పాయింట్లు పొందిన దేశాలు, జాబితా చివరిబాగంలో ఉన్నాయి. జాబితాలో ఆఖరున ఉన్న ఒక దేశానికి అసలు ఒక్క పాయింటు కూడా ఇవ్వబడలేదు. “ఆ సూచిక 1985లో ఉండిన పరిస్థితికే పరిమితం” అను విషయం గమనించాలని, మరియు ఆ తరువాత ప్రపంచం ఎంతో స్వాతంత్ర్యాన్ని సంపాదించిందని ఐక్య రాజ్యసమితి వికాస కార్యక్రమం నివేదిక చెప్తుంది.
“కోస్టారికా (18వ స్థానం), పాపువా న్యూగినియా (20వ స్థానం), మరియు వెనేజుఎలా (22వ స్థానం) వంటి అభివృద్ధిచెందుచున్న దేశాలు, ఐరోపాదేశాలైన ఐర్‌లాండ్ (23వ స్థానం) మరియు స్పెయిన్‌కన్నా (24వ స్థానం) జాబితాలో ఎక్కువ పాయింట్లు సాధించాయి” అని ఇంటర్‌నేషనల్ సామెన్‌వర్‌కింగ్ అను డచ్ పత్రిక పేర్కొంటున్నది.
సాధారణ నియమం ప్రకారం, స్వాతంత్ర్యానికి, వికాసానికి మధ్య అవినాభావ సంబంధం ఉందని నివేదిక ముగింపుకొస్తుంది. ఉన్నత పరిమాణంలో స్వాతంత్ర్యాన్ని కలిగివున్న చాలా దేశాలు మానవ వికాసాన్ని కూడా ఉన్నత స్థాయిలో కలిగివున్నట్లు కనబడుతుంది, అయితే, తక్కువ స్వాతంత్ర్యాన్ని కలిగివున్న దేశాలు తక్కువ వికాసంతో తరచూ బాధపడుతున్నాయి. “తమకు తమ సమాజాలకై ఆర్థిక అవకాశాలను చేపట్టుటకు స్వాతంత్ర్యం ప్రజల సృజనాత్మక శక్తిని ఉత్పత్తి చేస్తుందని” ఐక్య రాజ్యసమితి వికాస కార్యక్రమ నివేదిక అభిప్రాయ పడింది.
అవును, మానవ సమాజం కొరకు వాంఛనీయమైన లక్ష్యాలైన ఐక్య రాజ్యసమితి వికాస కార్యక్రమం సూచించిన 40 స్వాతంత్ర్యాల లక్ష్యాలలో అనారోగ్యం, వృద్ధాప్యం, మరియు మరణం వల్ల కలిగే దుష్పరిణామాల నుండి వచ్చు స్వాతంత్ర్యం చేర్చబడలేదు. ఆయన కుమారుడైన యేసు క్రీస్తు చేతులలోని దేవుని రాజ్యమందు మాత్రమే అటువంటి స్వాతంత్ర్యం లభిస్తుంది. “సృష్టి, నాశనమునకు లోనయిన దాస్యములో నుండి విడిపింపబడి, దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందునని” బైబిలు వాగ్దానం చేస్తుంది.—రోమీయులు 8:20, 21.
[31వ పేజీలోని చిత్రం]
బెర్లిన్ గోడ పడగొట్టడంవల్ల తూర్పు ఐరోపాలో గణనీయమైన స్వాతంత్ర్యం లభించింది