ప్రపంచ పరిశీలన
అగ్ని పర్వతం గ్రహాన్ని చల్లబరుస్తుంది
ఫిలిప్పియన్‌లోని పినెటుబొ అగ్నిపర్వతం 1991లో ప్రేలినపుడు, దాని ఫలితంగా మన గ్రహం కొద్దిగా చల్లబడుతుందని శాస్త్రజ్ఞులు ముందుగానే తెలిపారు. అలాగే జరిగింది గనుక వారు చెప్పింది నిజమే. అగ్నిపర్వతం ప్రేలడం వల్ల 20 మిలియన్ టన్నుల సల్ఫర్ డయాక్సైడ్ వాయువు వాయుమండలంలోనికి వెలువడింది. పడిపోయిన చిన్న చిన్న గంధకామ్ల అణువులతో ఒక పెద్ద మేఘంగా ఏర్పడింది. మరియు కొన్ని వారాలలో ఆ వాయువు వేగంగా ఎత్తైన గాలి తరంగాలతో పైకిచేరి భూగోళమంతా వ్యాపించింది. ఈ చిన్న చిన్న అణువులన్ని విడిపోయి సూర్యకిరణాలకు అడ్డు తగిలాయి, ఫలితంగా క్రిందనున్న నేల ఉష్ణోగ్రత చల్లబడింది. సైన్స్ న్యూస్ ప్రకారంగా, ఉత్తరార్థగోళంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ ప్రేలుడు సంభవించినప్పటినుండి సగటు ఉష్ణోగ్రత దాదాపు ఒక సెంటీగ్రేడ్ పడిపోయింది. అయితే, దీని ప్రభావం తాత్కాలికమే, భూగోళం వేడెక్కుటకు యిదొక ప్రతిక్రియని తలంచరాదు. ఈ అగ్నిపర్వతం వల్ల కలుగుతున్న యీ చల్లదనం 1994 నాటికెల్లా ఆగిపోతుందని ఒక వాతావరణ నిపుణుడు చెప్పాడు.
ఆసియాలో శరీరావయవాల వ్యాపారం
“ఆ ప్రదేశంలో సప్లయి డిమాండు అవే ప్రాధాన్యం” అని మానవ శరీర అవయవాల వ్యాపారము అనే అంశముపై ఆసియావీక్ పత్రిక అన్నది. హాంకాంగ్‌లో 1992 వసంతకాలంలో యించుమించు 600 మంది మూత్రపిండాల మార్పిడికొరకు వేచియుండిరి, కాని వారిలో కేవలం 50 మందికి మాత్రమే ఆ సంవత్సరాంతానికి మార్పిడి జరిగింది. కనుక, అనేకులు ఇండియావంటి యితర దేశాలకు వెళ్తున్నారు, అక్కడ సంవత్సరానికి 6,000 మూత్రపిండాల మార్పిడి జరుగుతున్నవి, అందువల్ల సంవత్సరానికి 2 కోట్ల డాలర్ల వ్యాపారం జరుగుతున్నది. తరచు పేదవారు లేదా ఆర్థిక దౌర్భల్యం అనుభవిస్తున్నవారు ఒక మూత్రపిండాన్ని అమ్మడానికి యిష్టపడుతుంటారు. ఎందుకంటే ఒకదానితో జీవించడం సాధ్యమే గనుక. కాని ఈ అవయవాల వ్యాపారం అవినీతితో కూడుకొన్నదని ఆసియావీక్ చెప్పుచున్నది. దానము చేస్తున్న కొందరికి అన్యాయస్థులైన మద్య దళారీల మూలంగా వారికి ముట్టాల్సిన ద్రవ్యం ముట్టడం లేదు. ఒక వ్యక్తి స్వల్ప కడుపునొప్పితో ఆసుపత్రికి వెళ్లాడు చివరకు ఒక మూత్ర పిండంతో బయటికి వచ్చాడు, ఎందుకంటే అతని ప్రమేయం లేకుండా ఒకటి తీసివేయబడింది.
అమాయకుల సంహారం
అమెరికాలో 1991 నందు కనీసం 1,383 మంది పిల్లలు కొట్టడంవల్లనో, లేదా నిర్లక్ష్యం వల్లనో చంపబడ్డారని ది వాషింగ్టన్ పోస్ట్ నివేదించింది. నేషనల్ కమిటీ ఫర్ ప్రివెన్ష్‌న్ ఆఫ్ చైల్డ్ ఎబ్యూజ్ వారందించిన తాజా అంచనా ప్రకారం ప్రతిదినము దెబ్బలవలన నలుగురు చనిపోతున్నారు, ఇది గత ఆరు సంవత్సరాల కన్నా 50 శాతం ఎక్కువే. ఈ సంఖ్య అభివృద్ధిచెందుటకు గలకారణాలు వివిధంగా ఉన్నాయి. క్షీణిస్తున్న ఆర్థిక విధానాలు అనగా ఉద్యోగాలను కోల్పోవడం, తక్కువ ఆదాయం, నిరాశనిస్పృహల వలన ప్రజలు విసుగుచెంది నిస్సహాయులైన వీరిపై విరుచుకుపడుతున్నారని కొందరు నిపుణులు అట్టి పరిస్థితులను నిందిస్తున్నారు. పిల్లలసంరక్షకులు తమ ఆధ్వర్యమందున్న వారినికొట్టడం మూలంగా అనేకమంది చనిపోతున్నారని కొన్ని బహుళ ప్రచారంచెందినను, “పెక్కుమంది మరణించుటకుగల కారణం యింటిలోనే పిల్లలను అమితంగా ప్రేమించాల్సిన తల్లితండ్రులే కారకులని నిపుణులకు తెలుసు.
అధిక జనాభా—ఎందుకు?
పేదదేశాలలో జనాభా అధికంగా ఎందుకుంటుంది? వేజున్ పత్రికలో, బ్రెజిల్ పర్యావరణ మాజీకార్యదర్శి పాలో నొగారె నేటో దృఢంగా దీనికి సమాధానమిచ్చాడు: “బ్రెజిల్‌లో ఈ కథ చెప్పబడుతోంది. ఒక వ్యక్తిని, నీకు తొమ్మండుగురు పిల్లలెందుకున్నారని అడిగితే అతడిలా అన్నాడు, ‘ముగ్గురు తాము చిన్నవాళ్లుగా ఉన్నప్పుడు చనిపోతారు; మరిముగ్గురు సావొ పౌలోకి, రిమోడి జానెరో, లేదా బ్రసిలియకు వలసవెళ్తారు, మిగిలిన ముగ్గురు మేము ముసలివారమైనప్పుడు మమ్మల్ని పరామర్శించడానికి యిక్కడే ఉంటారు, పేదప్రజానీకానికి పిల్లవాడు పోషకుడుగా పరిగణించబడతాడు.” నేటో అశుభసూచనతో ఇంకను యిట్లన్నాడు; “లోకమంతట దీన్ని పాటించుట సులభమే: ఎక్కడైతే పేదరికముందో అక్కడెల్లా జనాభాసంఖ్య విస్తరిస్తుంటుంది. అది కొనసాగితే, భూగోళం నాశనమైపోతుంది. పరిమిత వనరులుగల లోకంలో ఆత్మీయ, నైతిక లేదా విజ్ఞానశాస్త్రాభివృద్ధియందు యితరత్రా మనం అనంతమైన అభివృద్ధిని సాధించలేము.” (g93 1/22)
పెరుగుతున్న జీవన ప్రమాణం ఆశీర్వాదమా?
ఇటీవల సంవత్సరాలలో వైద్యవిజ్ఞాన శాస్త్రం మానవుని సగటు జీవితాన్ని కొద్దోగొప్పో పెంచినప్పటికిని, “ప్రపంచ జనాభాయొక్క ఆరోగ్య జీవన సరళి ఏమంత అభివృద్ధిచెందటంలేదని” ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) డైరెక్టర్ జనరల్ డా. హిరోషి నకాజిమా ఒప్పుకొంటున్నాడు. లె ఫిగారో అనే పారిస్ వార్తాపత్రికకిచ్చిన ఇంటర్వ్యూలో డాక్టర్ నకాజిమా యిలా అన్నాడు: “మాకందిన సమాచారమునుబట్టి ముఖ్యంగా వృద్ధులలో రోగులు లేదా అంగవికలులు ఎక్కువైపోయారు.” లోకవ్యాప్తంగా నేడు సగటు జీవనప్రమాణం 65 సంవత్సరాలుంటుందని అంచనావేయబడింది. పారిశ్రామిక దేశాలలో అది 76 సంవత్సరాలుంటుంది, అయితే అభివృద్ధిచెందుతున్న దేశాల్లో దానిసగటు 62 సంవత్సరాలు గాని అతితక్కువ అభివృద్ధిచెందిన భూభాగాల్లో అది కేవలం 50 సంవత్సరాలు మాత్రమే. రానున్న ఐదు సంవత్సరాలలో, సగటు జీవనప్రమాణం నాలుగునెలలు పెంచగలదని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిరీక్షిస్తుంది. కాని డా. నకాజిమా యిలా అంటున్నాడు: “పెరుగుతున్న జీవనప్రమాణం అంటే, తీవ్రరోగాలు లేక అస్వస్థత లేకుండా ఉండటం కాదనుట స్పష్టమే.” (g93 2/08)
భాషలు మరియు మెదడు
ఇటలీలోని ట్రయిస్టీ యూనివర్శిటీలో పరిశోధకుడైన ఫ్రాంకో ఫెబ్రో ప్రకారం, మనకు తెలిసిన లేదా, పాక్షికంగా తెలిసిన ప్రతీ భాష మన మెదడు యొక్క ఒక ప్రత్యేక భాగములో ఉంటుంది. ఆయన ఈ ముగింపుకు ఏ విధంగా వచ్చాడు? అనేక భాషలు మాట్లాడగలిగి చాలామంది మెదడు వ్యాధితో దెబ్బతిన్న వ్యక్తులు, ఇక వాళ్ల స్వభాషను సరిగా మాట్లాడలేకపోయిరి. అట్టివారు తమకు సరిగారాదని ఒకప్పుడు తలంచిన విదేశీ భాషలో ధారళంగా మాట్లాడడం ప్రారంభించారు. “మాతృభాష వేరే భాషలకు అడ్డుతగిలి వారు వ్యక్తపరచే మాటలను పరిమితం చేస్తుందని యిది సూచిస్తుంది,” అని లెస్ ప్రెసో పత్రిక చెబుతుంది. (g93 1⁄22)
ఎయిడ్స్ యెడల అభిప్రాయాలు
“చాలామంది దక్షిణాఫ్రికా దేశస్థులు ఎయిడ్స్ ప్రాముఖ్యతను తెలుసుకొనుటలో విఫలులవుతున్నారు లేదా ఈ వ్యాధి అసలు ఉందని నమ్మడానికి నిరాకరిస్తున్నారు,” అని దక్షిణాఫ్రికాలోని జొహాన్స్‌బర్గ్ యొక్క సాటర్‌డె స్టార్ తెల్పుతుంది. “అధికంగా వివిధ జాతులవారు మిళితమౌతున్నందున, పేదరికము, అజ్ఞానం మూలంగా నయంకాని ఈ రోగం వ్యాపిస్తుంది.” ఎయిడ్స్ అనే ఆలోచన ఆఫ్రికాను బలహీనం చేయడానికి పన్నిన కుట్రయని లేదా యిది ఆఫ్రికా నల్ల జననాలరేటును ఆపడానికి ఏదో తెల్లవారు కనిపెట్టినదని, కొంతమంది తలంచుచున్నారు. ఎయిడ్స్ ఎడల ప్రజల అభిప్రాయానికి అడ్డుతగిలే మరొకకారణం ఏమనగా చాలామంది ప్రతిదిన జీవితంలో హింస ఒక భాగమైంది. అల్లకల్లోలిత ప్రాంతంలోని దక్షిణాఫ్రికాకు చెందిన ఒక వ్యక్తి, ఎయిడ్స్ సలహాదారుల గుంపుతో ఈ విధంగా అన్నాడు: “పది సంవత్సరాలలో ఎయిడ్స్ నాకు అంటుకుంటుందేమో నీవు చెప్పు. కాని గడచిన వారములో . . . ఇక్కడే [రాజకీయ దౌర్జన్యం వల్ల] 25 మంది ప్రజలు చనిపోయారు. నిజంగా ఎయిడ్స్ జీవితాన్ని ప్రస్తుతమున్న పరిస్థితికంటె దుర్భరం చేస్తుందా? ప్రజల దృక్పథాలలో మార్పు రాకపోతే, దక్షిణాఫ్రికాలో రానైయున్న 10 నుండి 15 సంవత్సరాలలో ఈ వ్యాధి తీవ్రరూపం దాల్చుతుందని అంచనావేయబడింది.
చంద్రుని ప్రభావం
చంద్రుడు సముద్రపు అలల ఆటుపోటులను కలిగిస్తాడనేది ఎంతోకాలంనుండి తెలిసిందే. అయితే, భూమి ఉపరితలంపై కూడా చంద్రుడు అటువంటి ప్రభావం కలిగియుంటాడనే విషయాన్ని సియన్‌ఆర్‌ఎస్ (ఫ్రెంచ్ నేషనల్ సెంటర్ ఆఫ్ సెంటిఫిక్ రిసర్చ్) నందలి శాస్త్రజ్ఞులు ఇప్పుడు ధృవపరుస్తున్నారని ఫ్రెంచ్ పత్రిక టర్ సోవజ్ రిపోర్టు చేస్తున్నది. భూమి ఉపరితలం నుండి 1,000 మీటర్లలోతున మూయబడియున్న గుహనందలి ఉప్పునీటి కొలను నందుంచబడిన పరిశీలనా పరికరం సహాయముతో ప్రతి 12 గంటలకు ఆ గుహలోనున్న పదార్థాలు లేచిపడుతున్నట్లు పరిశోధకులు కనుగొనగల్గారు. ఆ గుహకున్న గోడలయొక్క స్వల్ప సంకోచ వ్యాకోచముల వలన సంభవించిన ఈ కదలిక, చంద్రుడు భూమిచుట్టూ తిరుగుతున్న దానికి పోలియున్నది. మరియు టర్ సోవజ్ చెప్పినట్లు చంద్రుడు నిజంగా భూపైభాగమున ఆశ్చర్యకరంగా జరిగే కదలికకు కారణమని రుజువు చేస్తుంది.
ప్రయాణం వలన కలిగే అనారోగ్యం
అనేకమంది ప్రజలు ప్రయాణంవలన కలిగే అనారోగ్యంతో తమ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు బాధపడేయుంటారు. లక్షలాదిమంది తాము ప్రయాణిస్తూ దానికి గురౌతుంటారు. ఈ వికారానికి కారణమేమిటో తాము గ్రహించామని శాస్త్రజ్ఞులిప్పుడు నమ్ముతున్నారు. సమస్య మెదడులో ఉంది, అక్కడ కన్నుద్వారా ప్రసరించబడుతున్న సమాచారానికి, చెవిలోపలి భాగంద్వారా గ్రహించబడుతున్న సమాచారానికి పొత్తు కుదరడంలేదు. ఉదాహరణకు, చెవిలోపలిభాగం ప్రయాణిస్తున్న పడవ కదలికను పసిగడుతుంది. అయితే శరీరం పడవతో పాటు కదలాడుతుండగా స్థిరంగావున్న చిత్రాన్ని కన్ను చూస్తుంటుంది. ఈ విభిన్నవర్తమానములు మెదడును చేరి అక్కడ వత్తిడికి సంబధించిన హర్మోనులు ఉత్పన్నమై కడుపులోనున్న కండరాలలో విద్యుత్ చలనం ఎక్కువై, తరువాత కొద్దిసేపటికి వికారం కల్గి వాంతులౌతాయి. ప్రయాణం వలన కలిగే అనారోగ్యాన్ని తప్పించుకొనడానికి ప్రయాణానికిముందు కొద్ది పరిమాణంలో, పిండిపదార్థాలను, తక్కువ క్రొవ్వు పదార్థాలున్న ఆహారాన్ని తినాలి; కారులో ప్రయాణించేటప్పుడు రోడ్డుచివర వంకరులను చూస్తుండాలి లేదా పడవలో ప్రయాణించేటప్పుడు నిదానంగా చూడాలి. అప్పుడే చెవి అంతర్భాగం పసిగట్టి దానిని కళ్లు చూచేట్లు చేయగలం. తల శరీర కదలికలను తగ్గించాలి; మెదడును వేరే తలంపులతో నింపాలి.
నడివయస్కులు ఉద్యోగాలను కోల్పోతున్నారు
“నీకు 40 సంవత్సరాలు పైబడితే నీ ఉద్యోగాన్ని మార్చేందుకు తలంచనేవద్దు,” అని దక్షిణాఫ్రికాలోని, జొహాన్స్ బర్గ్ వార్తాపత్రిక దిస్టార్ చెబుతున్నది. దక్షిణాఫ్రికాలో ఆర్థిక మాంద్యం ఫలితంగా అనేకమంది కార్మికులను పనినుండి తొలగిస్తున్నారు. ఉద్యోగాలను కోల్పోయేవారిలో తరచు ఉద్యోగ విరమణ వయస్కుకు సమీపిస్తున్న వృద్ధులే ఉంటున్నారు. మ్యాన్ పవర్ డిపార్ట్‌మెంట్ నుండి వచ్చిన గణాంకముల ప్రకారం, దక్షిణాఫ్రికాలో 50 సంవత్సరములు పైబడినవారు ప్రతినెల 37,500 మంది తమ ఉద్యోగాలను కోల్పోతున్నారు. “పనిచేసే స్థలాలలో 55 ఏండ్లు దాటిన స్త్రీపురుషులలో ప్రమాద భరితంగా భావించే విదేశాలతో పోలిస్తే దక్షిణాఫ్రికా పరిస్థితి ఏమంత భిన్నంగా లేదు,” అని ది స్టార్ చెప్పుచున్నది. “ది ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో ఆపరేషన్ అండ్ డెవలెప్‌మెంట్ చెప్పిన ప్రకారం 55 సంవత్సరాలు, అంతకన్నా పైబడిన స్త్రీ పురుషులకు ఏదొక ఉద్యోగం లభించడం అరుదైపోయింది. జపాన్‌లో పనిచేస్తున్న 60 శాతం మంది వృద్ధులు మాత్రం యీ లెక్కల్లో రాకుండ మినహాయింపబడుతున్నారు.” (g93 2⁄08)
ధర్మాధాయ సంస్థ నిజంగా ధర్మం చేస్తుందా?
స్నేహితులనుండి, ఇరుగుపొరుగు వారినుండి చందాలు సేకరించి పంపించండని ప్రజలను ఉత్తరాలద్వారా అడిగిన ఒక క్యాన్సరు ధర్మాధాయ సంస్థను గురించి కన్‌స్యూమర్ రిపోర్ట్స్ పత్రిక ఈ మధ్యనే ప్రత్యేకంగా వివరించింది. ఈ రిపోర్ట్ గుర్తించినట్లుగా, ఈ ఉత్తరాల్లో ఒక ఉత్తరం వెనుకనున్న సాంకేతిక భాష కొన్ని నిజాల్ని బయట పెట్టింది. ఉదాహరణకు, గత సంవత్సరంలో ఈ ధర్మాదాయం 25 లక్షల డాలర్లవరకు రాగా, ప్రతి డాలర్‌నుండి ఒక పెన్ని మాత్రమే క్యాన్సరు పరిశోధన నిధికి చేరింది. “మిగిలిన ధనమంతా, నిధిని పెంచడానికి ఉపయోగించిన వ్యక్తులకు, వసూలు చేసిన ఖర్చులకు, కార్యనిర్వహణకు, గత సంవత్సరంలో వచ్చిన చందాల దుర్వినియోగం చేసినందుకు వేసిన దావా ఖర్చులకు ఉపయోగించారు, మరియు ‘పబ్లిక్ ఎడ్యుకేషన్ నిమిత్తం’ కూడా కొంతధనాన్ని చెల్లించారని” ఆ పత్రిక పేర్కొంది. “మీరు పనిచేయు స్థలాన్ని క్యాన్సరుకు దూరంగా ఉంచండి” అని ఎంతో సౌమ్యంగా సాధారణంగా సలహా యిచ్చే పబ్లిక్ ఎడ్యుకేషన్‌ను ఒక ఉదాహరణగా చూపి ఆ పత్రిక వివరించింది.” (g93 1⁄22)