“మీరు నిజంగా మానవుల యెడల శ్రద్ధకలిగి ఉన్నారు”
అలా వాచ్ టవర్ సొసైటీ ప్రచురణలు చదవటం ఇష్టపడే, యు.ఎస్.ఏ., కాలిఫోర్నియాలోని ఒక వ్యక్తి అభిప్రాయపడ్డాడు. ది గ్రేటెస్ట్ మ్యాన్ హూ ఎవర్ లివ్డ్ అను పుస్తకం గురించి, అతనిలా వ్రాస్తున్నాడు:
“నేనిప్పుడు దాన్ని రెండవసారి చదువుతున్నా, అయినా అదెప్పుడు చదవడానికి ఉదాసీనంగా ఉండదు. ఆ పుస్తకంలో బోధనాత్మక విషయాలు ఉండడమే కాక అందులోని రంగు చిత్రాలు కూడా చాలా సహజంగా ఉన్నాయి. ప్రతి చిత్రం నేను యేసు కాలంలో జీవిస్తునానేమో అను భావనను నాలో కలుగజేస్తుంది.
“ఉదాహరణకు, 45వ అధ్యాయంలో ఉన్న చిత్రంలోని దయ్యంపట్టిన మనిషి నిజంగా ఉన్మాదంగా ప్రమాదకరంగా కనిపిస్తున్నాడు. అయినను యేసు నిర్భయంగా తీరానికి వచ్చి దయ్యాల గుంపును వెళ్లగొట్టినట్లు చూపబడింది. . .
“ద్వేషించు యూదా నాయకుల బొమ్మలు కళాత్మకంగా ఉన్నాయి. ఒక మనిషి యేసుతో మెలగవలసిన పరిస్థితిని ఎదుర్కొనవలసి వచ్చినను అతను తన పాపకరమైన మార్గాలను విడనాడకుండా ఉన్నప్పుడు అతనెంత కోపంగా కనిపించగలడో అవి చూపిస్తున్నాయి. నేనింకా ఎంతో చెప్పగలను. . . . మీరు నిజంగా మానవులపట్ల శ్రద్ధకలిగి ఉన్నారు . . .
“నేను యెహోవా సాక్షులలో ఒకరినికాకున్నను కావలికోట మరియు అవేక్! అందుకొనుటకు ఇష్టపడతాను. ప్రతి సంచిక కొరకు ఆతురతతో ఎదురుచూస్తాను, అది వచ్చినపుడు, ఆ దినంలో నేనందుకున్న జాబులలో అవే చాలా మంచిగా అనిపిస్తాయి. జూన్ 22వ అవేక్! బహుమతి పొందింది! ‘అవినీతి లోకంలో పిల్లలను పెంచుట’కన్నా సందర్భోచిత విషయం ఇంకొకటి ఉండదు. . . .
“నాకు 35 సంవత్సరాల వయసు మరియు ఈ పాతలోకం అనేక సమస్యలను ఎదుర్కొంటుందని నేను గ్రహించాను. ఈ పాతలోకాన్ని గూర్చిన సత్యాన్ని మరియు దాని గురించి దేవుడెట్లు భావిస్తున్నాడో ప్రజలకు చెప్పుటకు మీరున్నారని నేను ఆనందిస్తున్నాను.
యెహోవా సాక్షులు 40 లక్షలపైగా ఉన్న బైబిలు విద్యార్థులైయుండి ఒక అంతర్జాతీయ సంస్థగా ఉన్నారు. వారి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గూర్చి, దేవుని వాక్యాన్ని గూర్చి, దాని నెరవేర్పును గూర్చి ఎక్కువగా తెలుసుకొనుటకై ప్రజలకు సహాయ పడటానికి వారు తమను తాము సమర్పించుకున్నారు. మీరు ఇంకా ఎక్కువ సమాచారం కావాలనుకుంటే లేక ఉచిత గృహ బైబిలు పఠనం కావాలనుకుంటే Watchtower, H-58, Old Khandala Road, Lonavla, 410 401 Mah.,కు లేక 5వ పేజీలోని తగిన అడ్రస్‌కు వ్రాయండి.
[32వ పేజీలోని చిత్రం]
జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి