కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g93 2/8 పేజీ 31
  • మీరు ఆప్యాయతగల తలిదండ్రులా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీరు ఆప్యాయతగల తలిదండ్రులా?
  • తేజరిల్లు!—1993
  • ఇలాంటి మరితర సమాచారం
  • తల్లిదండ్రులారా—మీ పిల్లలకు ప్రేమతో శిక్షణనివ్వండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
  • తల్లిదండ్రులారా, యెహోవాను ప్రేమించేలా మీ పిల్లలకు సహాయం చేయండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2022
  • మన పిల్లలు—ఒక అమూల్యమైన స్వాస్థ్యము
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
  • మీ పిల్లలకు యెహోవాను ప్రేమించడం నేర్పించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
మరిన్ని
తేజరిల్లు!—1993
g93 2/8 పేజీ 31

మీరు ఆప్యాయతగల తలిదండ్రులా?

మీరు మీ పిల్లల్ని ప్రేమిస్తారా? వారినిబట్టి మీరు గర్విస్తున్నారా? ప్రతి ఒక్కరు ఒక ప్రత్యేక, శ్రేష్ఠమైన, సాటిలేని వారని మీరు భావిస్తున్నారా? చాలమంది తలిదండ్రులు అలా భావిస్తారు. కాని, మీరు ఇలా భావిస్తున్నారని మీ పిల్లలకు చెప్తారా? ముఖ్యంగా ఏదైనా ఒక పనిని వారు చక్కగా చేసినప్పుడు వారిని మీరు పొగడుతున్నారా? పిల్లలతో సౌమ్యంగా ఆడటం, అభయానిచ్చేలా స్పర్శించడం, ప్రేమగా హత్తుకోవడంవంటి ఇతర మార్గాల ద్వారా మీ ఆప్యాయతను వ్యక్తం చేస్తారా?

“కాని అది నా పద్ధతి కాదు” అని కొంతమంది అభ్యంతరం చెప్పవచ్చు. “నేను నా భావాలను బాహాటంగా వ్యక్తపర్చలేను.” నిజమే, సహజంగా ప్రతిఒక్కరు అలా బాహాటంగా వ్యక్తపరచరు. అయినా మీరు గ్రహించినదానికంటె మీ పిల్లలకు ఆప్యాయత చూపించటం ఎంతో ప్రాముఖ్యం.

నాలుగువందల మంది కిండర్‌ కార్టెన్‌ పిల్లలపై 1951లో జరిపిన అధ్యయనాన్ని విజ్ఞానశాస్త్రజ్ఞుల గుంపు ఒకటి యిటీవల పునఃపరిశీలించింది. వారు 94 మంది స్త్రీపురుషులలో కొన్ని మంచి మాదిరులను కనుగొన్నారు. ది న్యూయార్క్‌ టైమ్స్‌ ప్రకారం ప్రేమ, ఆప్యాయతగల తలిదండ్రులున్న పిల్లలు వారి తరువాతి జీవితంలో చాలా మెరుగుగా వుండిరి. వారు విజయవంతమైన వివాహాలను పిల్లలను పెంచి, తమ పనిలో ఆనందించిరి, సన్నిహిత స్నేహాలను నిలుపుకోగల్గారు. అధ్యయనం చేసిన వైద్యురాలైన కారెల్‌ ఫ్రాంజ్‌ ఆ పత్రికకు యిలా చెప్పింది: “వారు మానసిక ఆరోగ్యాన్ని కలిగి ఉన్నారు వారు తమతోను, తమ జీవితాలతోను తృప్తిని పొందారు.”

మరోవిధంగా చూస్తే, “వాత్సల్యం తిరస్కరించే తలిదండ్రులచే పెంచబడిన పిల్లలు ప్రతిమార్గంలోను కష్టసమయాలను—పనిలో, సాంఘిక సర్దుబాటులో, మానసిక ఆరోగ్యంలో—అనుభవించారన్నట్లు” ఫ్రాంజ్‌ కనుగొన్నది. వాస్తవానికి, తలిదండ్రుల ప్రేమ కరువైనట్లైతే, తలిదండ్రుల విడాకులు, త్రాగుబోతుతనము లేక దారిద్ర్యమువంటి వాటికంటే పిల్లలకు మరింత హానికరమైనదని ఆ అధ్యయనం తెల్పింది.

యథార్థమైన చిత్తశుద్ధిగల బైబిలు విద్యార్థులకిది ఆశ్చర్యకరంగా ఉండకూడదు. పిల్లలతో యేసు ఎలా వ్యవహరించాడో వారికి బాగా తెలుసు. ఆయన వారికి విలువిచ్చి అక్కున చేర్చుకుని, మక్కువ చూపాడు. (మార్కు 10:13-16; లూకా 9:46-48; 18:15-17) తండ్రి లేని పిల్లవానికి తండ్రి అయ్యే, తన పరలోక తండ్రినే అతను ఈ విషయంలో అనుకరించాడు. (కీర్తన 68:5) యెహోవాయే పరిపూర్ణుడైన తండ్రి, ఆయన తనను ప్రేమించు వారికి తండ్రియై, తలిదండ్రులు లేని లోటును తీర్చుతాడు.—2 కొరింథీయులు 6:18. (g92 10/22)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి