మతాలుగా విభాగింపబడిన గృహం
ప్రపంచములో ఉన్న మతాలన్నింటిలోను రోమన్ కెథోలిక్, ఇస్లాం, హిందూ మతాలు అతి పెద్దవి. రోమన్ కెథోలిక్స్ 98 కోట్ల 50 లక్షలు అంటే 524 కోట్ల ప్రపంచ జనాభాలో 18.8 శాతం అని, ముస్లిం జనాభా 91 కోట్ల 20 లక్షలని (17.4 శాతం) హిందువులు 68 కోట్ల 60 లక్షలని (13.1 శాతం), బౌద్ధులు 32 కోట్లు అని చెప్పుకుంటున్నారు—అంటే హిందువులు బౌద్ధులకంటె రెట్టింపు.
“క్రైస్తవ మతాన్ని అత్యధికులు అవలంబిస్తున్నారని” ఏషియావీక్ పత్రిక తెల్పింది. “అయితే అది చారిత్రాత్మకముగా బద్ధవిరోధులైన శాఖలుగా విడిపోయినది—ఇక మిగిలినవి ఉదాహరణకు, ఉత్తర ఐర్లాండ్‌లోవున్న కెథోలిక్స్ మరియు ప్రొటస్టెంట్ శాఖలే—అందుకే దానిని ఒకే మతమని అనుకోవడానికి అనేకులకు కష్టంగా వుంది. . . . ముస్లింలు క్రైస్తవులకన్న తక్కువ శాఖలుగా విడిపోయారు, కానీ వారు సున్ని మరియు షియా అనే విభిన్న తెగలై ఎప్పుడూ ఐకమత్యముతో వున్నట్లు చరిత్రాధారాలేమి కనబడుటలేదు.” ముస్లింలలో సున్ని తెగవారే అతి పెద్దగుంపు.
అదియునుగాక, ప్రపంచ జనాభాలో ఏ మత విశ్వాసం లేనివారు కూడ చాలామంది వున్నారు. అలాంటివారు చైనా, తూర్పు ఐరోపా, మరియు సోవియట్ యూనియన్‌లలో వున్నారు. ఏ మతానికి చెందనివారు 89 కోట్ల 60 లక్షలు కాగా, నాస్తికులు 23 కోట్ల 60 లక్షలున్నారు.