మా పాఠకులనుండి
వృద్ధులను గౌరవించుడి: “మీరు వృద్ధులను గౌరవిస్తారా?” (మార్చి 22, 1991) అను అంశం మీద వ్రాసిన శీర్షికల కొరకు మీకు వందనములు. నలభై సంవత్సరాలు దేవున్ని నమ్మకముతో సేవచేసిన తర్వాత కేంద్ర నాడీమండల వ్యాధితో బాధపడుచున్నందున మా అమ్మకు నిరంతర పరామర్శ అవసరమయింది. వాచ్‌టవర్ సొసైటి ప్రచురించిన క్యాలెండర్ బాగా సహాయ పడుతుంది ఎందుకంటె ఆమెను సందర్శించబోవు అనేకుల పేర్లు అందులో వ్రాసేవారు. నేనొక్కదాన్నే సందర్శించడం లేదుగానీ అందులోని సగం తేదీలు సందర్శకుల పేర్లతో నిండిపోయినవని ఆమెకు నేను జ్ఞాపకం చేయగల్గేదాన్ని. అంతేగాక, నర్సింగ్ హోమ్ సిబ్బంది కూడ ఆమెను చాలా చక్కగా చూసుకునేవారు ఎందుకంటె అనేకమంది ఆమె క్షేమాన్ని కోరేవారే. మా యెడల చూపిన శ్రద్ధకు మీకు వందనములు.
డబ్ల్యు. జె. హెచ్. అమెరికా
మా అమ్మకు నడుము నుండి క్రింది భాగమంతా చచ్చుబడి పోయినందున, ఆమె అసౌకర్యముతో బాధపడుతుంది. ప్రతి ఉదయం మేము ఆమెకు స్నానం చేయించి, దుప్పట్లు కూడ మార్చాలి. ఆమెకు బట్టలు వేయాలి, తినిపించాలి, తరచూ వైద్య చికిత్స చేయించాల్సి వస్తుంది. నా భర్త, పిల్లలు నిజంగా చాలా మద్దతునిస్తున్నారు గానీ భారమంతా ముఖ్యంగా నా మీదే పడుతుంది. కొన్నిసార్లు నిరుత్సాహం కలుగుతుంది నాకు, ఎప్పుడూ స్వయం త్యాగం అవసరమౌతుంది. అందుకే మీ శీర్షికలను అత్యానందంతో చదివాను. నా హృదయపూర్వక వందనములు.
యల్. డి., ఇటలీ.
జంతువులను గూర్చిన శీర్షికలు జంతువులు, సహజ సృష్టినిగూర్చి వ్రాస్తున్న శీర్షికలకొరకు వందనములు. బొమ్మలు రంగులతో అందంగావున్నట్లు నేను గమనించి నప్పటికిని మొదట నిజంగా నేనంతగా వాటిమీద ధ్యానముంచలేదు. ఒకరోజు కుదు అని పిలువబడే జింకనుగూర్చి తాను చదివిన శీర్షికనుగూర్చి ఎవరో ఒకాయన చెప్పాడు. దాన్నిబట్టి నాకూ చదవాలనే ఆశ కలిగింది. ముంగిసలు మొదలగు జంతువుల మీద వ్రాయబడిన శీర్షికలను నేను కూడ చదువుట కారంభించాను. యెహోవాను, ఆయన చేసిన సృష్టిద్వారా “చూచుటకు” యీ శీర్షికలు నాకు సహాయం చేసినవి.
బి. టి., అమెరికా