ప్రపంచ పరిశీలన
అసూయ దేవతా?
ఉత్తర జపానులో ఇటీవల ఒక సొరంగం పూర్తి అయిన సందర్భములో ఏర్పాటు చేయబడిన ప్రారంభోత్సవానికి పత్రికా విలేఖరులు ఆహ్వానించ బడినప్పటికి ఒక మహిళా విలేఖరిని ఆక్కడికి రానివ్వలేదు. ఆ నిర్మాణ సహాయాధికాది ఇలా వివరించాడు: “అక్కడొక కీడుకల్గించు దుష్టశక్తి ఉన్నది. ఆ పర్వతా దేవత ఒక స్త్రీ గనుక ఇతరస్త్రీలు ఆ ప్రాంతానికి వస్తే ఆమె ఆగ్రహించి ప్రమాదాలు కలిగిస్తుంది. ఒక స్త్రీ గనుక వస్తే మిగతా త్రవ్వకము చేయమని పురుషులు భీష్మిస్తారని చెప్తున్నారు.” ఈ అభూత కల్పన స్త్రీలు చెడిపోయారనే ఒక కాముకుని నమ్మకంపై ఆధారపడినదనీ విసుగుచెందిన మనస్తత్వశాస్త్ర ప్రొఫెసర్ ఒకరు అన్నారు. ఆ అలవాటు “విచక్షణ”తో కూడినదైనప్పటికీ, నిర్మాణ కార్మికుల భావాలను భంగపరచకూడదని నిర్మాణ మంత్రిత్వ శాఖాధికారి అన్నాడు.
సులభావరోహణా కోట
విజ్ఞాన శాస్త్రజ్ఞులు తరచు గురుత్వాకార్థణాశక్తిలేని వాతావరణంలో తమ పరిశోధనలు కొనసాగించవలసిన అవసరమున్నది, గానీ అలా చేయడానికి వారు అంతరిక్షానికి వెళ్లుట అత్యధిక ఖర్చుతోకూడినది; అందుకే జర్మనీలోని బ్రెమెన్ నిర్మించిన ఒక ప్రత్యేక గోపురం, విజ్ఞాన శాస్త్రజ్ఞులు సులభముగా-అవరోహణమయ్యే స్థితిలో వున్నవాటిని గమనించుటకు వారికి వీలుకల్గిస్తుంది. ఆ గోపురం 479 అడుగుల [146 మీ.] ఎత్తున్నది., అందులోని గొట్టం 361 అడుగుల [110 మీ.] పొడవు, 11.5 అడుగుల [3.5 మీ.] వెడల్పున్నది. ఆ గొట్టంలోపల అమర్చిన 6.6 అడుగుల [2 మీ.] పొడవాటి నాళములోని పరికరములు 4.74 సెకండ్లలో గంటకు 104 మైళ్ల వేగంతో [గంటకు 167 కి.మీ.] సులభావరోహణపద్ధతిలో దిగివచ్చును. ఆ అవరోహరణ సమయంలో, అందులో అమర్చబడిన పరికరాలలో ఒకటి, ఒక సెకండుకు 6,000 చిత్రాలను చిత్రీకరించగలిగిన ఒక కెమెరా వున్నది.
దొంగలను పట్టే బ్రిటిష్ కారు
బ్రిటన్‌లో పోయిన సంవత్సరము దొంగిలించబడిన 3,78,000 కార్లనిమిత్తం 50 కోట్ల డాలర్లు (28 కోట్ల పౌండ్లు) భీమా కంపెని చెల్లించవలసి వచ్చిందని చెప్పుచున్నది. దొంగలను పట్టుకొనుటకుగాను, అనేక ప్రాంతాల్లో పోలీసులు ఎలుక-బోనులని పిలిచే ప్రత్యేకముగా నిర్మించబడిన కారులనుపయోగిస్తున్నారు. ఒక్కక్కొటి దాదాపు 1,800 డాలర్లు ఖరీదుచేసే అట్టి వాహనములను నేరస్థులు దొంగిలించుకొని పోవురీతిగా వదలి వేస్తారు. గానీ 15 గజములు [15 మీ.] కారు ప్రయాణించేసరికి ఇంజను ఆగిపోతుంది, తలుపులు మూసుకుంటాయి మరియు పగలనట్టి అద్దాలు లేక ప్లాస్టిక్ కిటికీలు తెరుచుకోవు. తక్షణమే దాన్నినడిపే దొంగను బంధించుటకు వెంటనే ఆ స్థలానికి వచ్చునట్లు పోలీసులకు అందులోని రేడియో హెచ్చరిక చేస్తుంది. ఈ అలవాటు మంచిది కాదని ది నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సివిల్ లిబర్టీస్ గగ్గోలు పెట్టింది, గానీ హోమ్ ఆఫీస్, నేషనల్ క్రైం ప్రివెన్‌షన్ సెంటర్ డైరెక్టరు, “ఈ స్వయంగా తాళంవేయగల కార్లు, కారు దొంగలను పట్టే పద్ధతికి ఒక అమూల్యమైన అస్త్రమని” అన్నాడని లండన్ దినపత్రిక ది సన్‌డే టైమ్స్ తెలియజేస్తుంది.
ఆమ్ల వర్షంనుండి పునరుద్ధరణ
ఆమ్ల వర్షం, ప్రపంచమంతటనున్న పరిశుభ్రమైన నీటి కొలనులమీద కల్గించిన నష్టాన్ని పునఃస్థాపించవచ్చునని ఇద్దరు కెనడా దేశ జీవశాస్త్రవేత్తలంటున్నారు. కెనడాలోని ఓంటారియోనందున్న వైట్‌పైన్‌కొలను నీటి కాలుష్యానికి గురియగుట కారంభించిన నీళ్లలోని ఆమ్ల పరిమాణం పెరుగుకొలది, కొలనులోని తెల్ల చేపలును ఇతర మత్స్యజాతులు క్షీణింపనారంభించెను. అయినను కాలుష్యనివారణ జరిగిన ఆరు సంవత్సరముల అనంతరము, కొలను యొక్క ఆమ్లపరిమాణం దాని యథాస్థితికి చేరినపుడు మొదట వున్న తెల్ల చేపలలోని 3 భాగములు మరల కనబడినవి, మరియు ఇవి వీటితోపాటు ఇతర జీవరాసులు వృద్ధియగుటకారంభించినవి. గనుక ఆమ్ల వర్షం మూలంగా దెబ్బతిన్న కనీసం కొన్ని కొలనులు—అసలు కాలుష్య కారణాన్ని తొలగించగల్గినపుడు మాత్రమే—మానవజోక్యం లేకుండా సహజంగా అవి యథాస్థితికి రాగలవని అర్థమౌతుంది.
సంచారము చేయు ద్వీపము
ఊహించండి, 96 మైళ్ల పొడవు [154 కి.మీ.] 22 మైళ్ల వెడల్పు [35 కి.మీ.] 750 అడుగుల మందమున్న ఒక ద్వీపం మహాసముద్రంలో తేలియాడుచున్నది. ఆ తేలెడు హిమ పర్వతమునకు విజ్ఞాన శాస్త్రజ్ఞులు బి-9 అనే పేరుపెట్టారు. అది 1987 సంవత్సరములో అంటార్క్‌టిక్ రాక్ ఐస్‌షెల్ఫ్‌నుండి విడిపోయింది. ఉపగ్రహాలు ఈ టి-9 ను మొట్టమొదట కనిపెట్టినవి, తర్వాత విజ్ఞాన శాస్త్రజ్ఞులు దాని ఉపరితలములమీద రేడియో దీపస్తంభాన్ని వుంచి దాని కదలికలను గమనిస్తూ వచ్చారు. అది పగిలి ముక్కగా వచ్చి అంటార్క్‌టికా యొక్క పేరుగాంచిన వేల్స్ సముద్ర శాఖ నైసర్గిక స్వరూపాన్నే మార్చివేస్తూ ఈ బి-9 అనే హిమ పర్వతము 1,250 మైళ్లు [2,000 కి. మీ.] ప్రయాణించింది. ప్రయాణంలో అది మూడు అత్యంత పెద్దముక్కలై, అంటార్క్‌టికా చుట్టున్న సముద్ర జలాల ప్రవాహ పరిస్థితికి సంబంధించిన కష్టతరమగు, క్లిష్టమైన వాటిని గూర్చి విజ్ఞాన శాస్త్రజ్ఞులకు బోధించింది. భూమిమీదనున్న ప్రతి ఒక్కరికి రోజుకు రెండు గ్లాసుల నీళ్లచొప్పున దాదాపు రెండు వేల సంవత్సరములవరకు అందించగలిగినంత ఘనీభవించిన తాజా నీరు అందులో 287 ఘనపు మైళ్లవరకు [1,196 ఘనపు కి.మీ.] వున్నదని—ఒక అంచనాప్రకారము తెలియవస్తుంది.