మా పాఠకులనుండి
విపత్తులు తుఫాను భూకంపములను గూర్చిన వార్తలున్న శీర్షిక చూచి నేను నిజంగా కలవరపడ్డాను. (ఏప్రిల్ 8, 1990) “లోక ప్రజలకు” యెహోవాసాక్షులకున్న తారతమ్యమునకు ఒక దోపిడీ సంఘటనను ఉదాహరణంగా చూపారు. యెహోవాసాక్షులను మాత్రమే అతిగా పొగడుట దురుద్దేశముతో కూడినదని నేను భావిస్తున్నాను.
జె. కె., అమెరికా
మొదటి శతాబ్దములోవలె క్రైస్తవులీనాడు ఆపద సమయాల్లో ఎట్లు పరస్పరముగా నిజమైన ప్రేమను ప్రదర్శిస్తారో ఆ శీర్షిక చూపించింది. (2 కొరింథీయులు 8:1-4) అందులో కొన్ని ఆక్షేపణా సంఘటనలు వ్రాయబడినప్పటికి “సాక్షులు కానటువంటి వారు చూపిన మానవ కరుణారస క్రియలనేకములనుబట్టి అట్టి కౄరమైన క్రియలు మరుగైపోయినవని” కూడా ఆ శీర్షిక తెల్పింది.—ఎడి.
పొగత్రాగుట ఫోనుబూత్‌లో పొగత్రాగుట విషయాన్ని చర్చించిన మేల్కొలుపు! పత్రికను చూశాను. (సెప్టెంబర్ 8, 1990) అట్టమీదనున్న కపాలము నిజంగా ఆకర్షింపజేయునదిగా ఉండెను! నేను నాల్గు సంవత్సరాల క్రితమే పొగత్రాగుట మానుకున్నాను గానీ ఆ పత్రికను పొగత్రాగే నా కుమారులలో ఒకరికిచ్చాను. పొగత్రాగుట మానుకోవలసిన మిగతా ముగ్గురు కుమారులు కూడా వున్నారు. అందులో ఆ శీర్షికలు సూటిగాను అత్యధికసమాచారాన్ని కల్గివుండెను. నేను మీ విశ్వాసంలో లేకున్ననూ నేను దాన్ని గౌరవిస్తున్నాను.
పి. టి., అమెరికా
నా టీచరు అతిగా పొగత్రాగేది, ఆమె నాతో మాట్లాడినప్పుడెల్లా ఆమె నోరు సిగరెట్టు వాసనవచ్చేది. పది పద్ధతుల ద్వారా పొగత్రాగుట మానవచ్చునని తెల్పిన ఆ శీర్షిక నాకు జ్ఞాపకమున్నది. నా టీచర్ కొక ప్రతి ఇచ్చి మూడు నెలల అనంతరము ఆమె పొగత్రాగుటమానుకున్నదో లేదోనని అడిగాను. ఆ పత్రిక సహాయం వలన, తన ప్రయత్నంమూలంగా తాను పొగత్రాగుట మానుకున్నదని నాకు చెప్పింది. ఆమె గత 25 సంవత్సరములనుండి పొగత్రాగుతుంది.
బి. ఓ., అమెరికా
చిరుతపులి “ది ఎల్యుసివ్ జంగిల్ కాట్” అనే మీ శీర్షికను చదివి చాలా ఆనందించాను. (ఫిబ్రవరి 8, 1990) చిరుత పులులెంత ఆత్యాశ్చర్యకరమైనవో నేనెన్నడు గుర్తించలేదు. అవి నిశ్చయంగా దేవునికి మహిమతెచ్చు అందమైన జంతువులే.
యల్. యఫ్., అమెరికా
సర్వలోక సహోదరత్వము నవంబరు నెలారంభములో మా టీచరు మమ్మల్ని “ఒక జాతిని మరొక జాతి కంటే గొప్పదిగా ఎంచవచ్చా?” అనే అంశముమీద ఒక వ్యాసము వ్రాయమని చెప్పింది. సర్వలోక సహోదరత్వం మీద ఒక శీర్షిక (డిశంబర్ 8, 1990) సంచికలో సరిగ్గా ఆ సమయానికే వచ్చింది! మా టీచరు అడిగింది ఆ సమాచారమెక్కడనుండి సేకరించానని. అప్పుడు నేనామెకు మేల్కొలుపు! శీర్షికలనిచ్చాను. ఈ వ్యాసానికి నాకు 20 కి 18 మార్కులొచ్చినవి!
యల్. క్యూ., ఫ్రాన్స్
మెక్సికో నగరం “మెక్సికో సిటి—ఎ గ్రోయింగ్ మాన్‌స్టర్?” (జనవరి 8, 1991) అనే శీర్షిక తప్పుగా వుందని నేను గమనించాను. పెద్ద కుటుంబం కల్గివుండుట సాంస్క్రతిక హక్కు అని మీరంటున్నారు. అయితే ఈ అసాధారణ సంఘటన దేశంలోని కొన్నిప్రాంతాల్లో మాత్రమే సంభవిస్తుంది గానీ—మెక్సికో నగరంలో కాదు.
యస్. సి., విక్సికో
ఆ శీర్షిక మిమ్ములను అన్యదా భావించునట్లు చేసినందుకు మేము చింతిస్తున్నాము. అయినను మెక్సికో నగరాన్ని మాత్రమేగాక మెక్సికో దేశమంతటిని దృష్టిలో వుంచుకొని వ్రాసిన విషయమే అది.—ఎడి.
దేవుడెందుకు బాధననుమతిస్తున్నాడు నేను 1985 నుండి మేల్కొలుపు! పత్రికను చదివేవాడినేగానీ దేవుడెందుకు బాధననుమతిస్తున్నాడనే ప్రశ్నకు అక్టోబరు 8, 1990 సంచికలో ఇవ్వబడిన విపులమైన సమాధానాన్ని నేనెన్నడు చూడలేదు. లోపంలేకుండా వ్రాయబడిన ఈ శీర్షికలను చదువుటద్వారా ఆలోచనాపరులైన వారెవరైననూ స్పష్టమైన సమాధానములను పొందగలరు.
ఈ. టి. వి., బ్రెజిల్
తూర్పు ఐరోపా ఇటీవల తూర్పు ఐరోపాలో పలుమార్పులొస్తున్న దృష్ట్యా, ఆ భూభాగంలో నివసిస్తున్న యెహోవాసాక్షులను గూర్చి నేనెంతో కుతూహలంగా ఉంటిని. మన సాహిత్యాలలో కొంత సమాచారమే వుండేది. “జెహోవాస్ విట్‌నెసెస్ ఇన్ ఈస్టర్న్ యూరోప్,” అనే శీర్షికతో ఈ సంచిక (జూలై 8, 1991) వచ్చినపుడు నేనెంతగా తృప్తి చెందానో మీరు ఊహించవచ్చును. ఆ భాగంలో సువార్త సేవాభివృద్ధి ఎలా జరుగుతుందో తెలుపుతునే వుంటారని నేనాశిస్తున్నాను.
ఈ. యస్. యల్., బ్రెజిల్