వాటికి అటువంటి అందమైన ఈకలు ఎలా వచ్చినవి?
మధ్య, దక్షిణ ఆఫ్రికాలో ఎదపై నీలి రంగుగల పల్టీకొట్టే అందమైన పక్షులు ప్రతిచోట కన్పించును. రోడ్డు ప్రక్కనున్న చెట్లమీద, టెలిఫోను తీగలమీద కూర్చొనును. అక్కడనుండి అవి చుట్టూవున్న కీటకములు, ఇతర ఆహారం కొరకు చక్కగా చూచుటకు చాల వీలుగా వుంటుంది.
నీవు బోట్సువానా లేక జింబాబ్వే గుండా ప్రయాణిస్తే మెరుపుతీగలాగ నీలి రంగు రెక్కలు గల ఒక పక్షి అటుగా ఎగిరి పోవుట నీవు గమనిస్తావు. పల్టీలు కొట్టే పక్షి అనేపేరు సూచించు రీతిగా అవి గగన తలంలో విన్యాసము చేస్తున్నట్లు ఆకాశంలో పల్టీలు కొడుతూ వాటి రంగురంగుల రెక్కలను అప్పుడప్పుడు చూపించును. ఇక్కడున్న ఆ పక్షి పటము, దాని రెక్క భాగం పల్టీలపక్షి వివిధ వర్ణములను చూపిస్తున్నవి. రెక్కలకున్న ఈకలు నాలుగు విధములైన నీలిరంగుతోను, నలుపు, గోధుమ వన్నెలతో మిళితమైయున్నవి. ఎద ఊదారంగు, నారింజరంగుల చెక్కిళ్లు, తెల్లని నొసలు, లేత పచ్చని జుట్టు కలిగి ఎంత అందంగావుంటుందో! ఇందుకు ఒక ముఖ్యమైన ప్రశ్న వస్తుంది: వాటికి అటువంటి అందమైన రెక్కలెలా వచ్చినవి?
నీవు ఈ పక్షి పాదాలను పరీక్షిస్తే, అవి ఈకలతో కాక, చర్మపుపొరతో కప్పబడిన చిగురుతో వున్నవని గమనిస్తావు. పరిణామ సిద్ధాంతీకులు బోధించినట్లు ప్రాకెడి జీవి యొక్క చర్మపుచిగురునుండి పరిణామము చెంది వీటి రెక్కలుగా మారినవా?
సరే, ఒక్క ఈక ఒక సాంకేతిక అద్భుతమని తలంచుము. ఈకలో గట్టిభాగమునుండి రోమరాసులు పరచుకొనివున్నవి. “ప్రక్కప్రక్కనేవున్న రెండు రోమములు వేరు చేస్తే—వాటిని తెంపుటకు చాలా బలం అవసరం—వేళ్లకొనలతో వాటిని జిప్లాగే వెంటనే అతికించ వచ్చును,” ఇంటగ్రేడెడ్ ప్రినిపిల్స్ ఆఫ్ జువాలజీ అనే విజ్ఞానశాస్త్ర పాఠ్యపుస్తకము వివరిస్తుంది. “పక్షి తనముక్కుతో ఇదంతా చేస్తుందనుకోండి.”
అట్లు వందలాదిగల “కలిపే సాధనముల” ఈ (జిప్పర్స్) కలయికతో ఒక్క ఈక పరిణామముచెంది రాగలదా? చర్మపుచిగురు నిజంగా ఒక ఈకగా మారిందనుటకైనా విజ్ఞానశాస్త్రజ్ఞులకు రుజువుందా? “ఇప్పుడున్న పక్షులకు చర్మపు చిగుళ్లు ముఖ్యంగా వాటి పాదముల మీద ఈకలు ఈ రెండు వున్నప్పటికీ ఈ రెండిటిమధ్య వృద్ధిచెందుంటకవసరమైన ఏ మధ్యస్థమైన ఉపకరణమున్నదని అటు అవశేషాలలో గాని జీవించుప్రాణుల మూలంగా కానీ బహిర్గతం కాలేదనుట విశదమని” పైన తెలుపబడిన పుస్తకము ఒప్పుకుంటుంది.
నిశ్చయంగా, ఈకలు ఒక మహాగొప్ప ఇంజనీరు ఉన్నాడని ఆయన అందమైన రంగులను కలుపుటలో నిపుణుడని రుజువు చేస్తున్నవి. ఎదపై నీలిరంగుల పల్టీకొట్టు పక్షులవంటి జీవులు, నిజమైన దేవుని, “యెహోవా నామమును మహిమపరచు” “రెక్కలపక్షులలో” చేరియున్నవి.—కీర్తన 148:7, 10-13. (g90 10/22)
[Picture Credit Line on page 32]
National Parks Board of South Africa