కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g92 5/8 పేజీలు 12-14
  • బాప్తిస్మం పొందుటకు నేను సిద్ధమేనా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • బాప్తిస్మం పొందుటకు నేను సిద్ధమేనా?
  • తేజరిల్లు!—1992
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ‘నాకు తగినంత వయస్సున్నదా?’
  • ‘నేను సరిపడునంత జ్ఞానాన్ని పొందితినా?’
  • “వాక్యప్రకారం ప్రవర్తించువారైయుండుడి”
  • ‘నేను దేవున్ని నా మిత్రునిగా చేసికొన్నానా?’
  • బాప్తిస్మం, దేవునితో మీ సంబంధం
    బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది?
  • యౌవనులారా బాప్తిస్మం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2016
  • మీరు బాప్తిస్మం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2020
  • దేవున్ని నిరంతరం సేవించడమే మీ లక్ష్యంగా చేసుకోండి
    నిత్యజీవానికి నడిపించే జ్ఞానము
మరిన్ని
తేజరిల్లు!—1992
g92 5/8 పేజీలు 12-14

యౌవనస్థులు ఇట్లు అడుగుదురు . . .

బాప్తిస్మం పొందుటకు నేను సిద్ధమేనా?

ప్రియమైన వాచ్‌టవర్‌ సొసైటీకి:

నా పేరు షారాను, నాకు 13 ఏండ్ల వయస్సు. నేను బాప్తిస్మమునకు సిద్ధమేనా కాదాయని ఆలోచిస్తున్నాను. నేను సిద్ధమేనని అనుకుంటున్నాను గానీ ఇంకా నాకు నమ్మకం కుదరలేదు. ఇతర యౌవనస్థులలోనూ ఇదే అభిప్రాయం వున్నదని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. నా ఆలోచనను సరిదిద్దుకొనుటకు సహాయపడునట్లు మీరొక శీర్షికను వ్రాయగలరా?

షారాను అన్నది నిజమే. అనేకమంది దైవభయంగల యౌవనస్థుల మనస్సులలో బాప్తిస్మమును గూర్చిన తలంపు నిజంగా వున్నది. యెహోవాసాక్షులలో, దేవుని సేవించుటకు తామే ఓ నిర్ణయం తీసికోవాలని, తమకొరకు వారి తల్లిదండ్రులు అట్టి నిర్ణయం చేయకూడదని యౌవనస్థులు గుర్తిస్తున్నారు. నీళ్లలో బాప్తిస్మం పొందుట ద్వారా దేవునికి వారి సమర్పణను తెలియజేయుడని యేసుక్రీస్తు తన అనుచరులతో చెప్పిన విషయాన్ని కూడ వారు గుణగ్రహిస్తున్నారు.— మత్తయి 28:19, 20.

సమర్పించుకున్న దేవుని సేవకుడిగా బహిరంగ ప్రకటన చేయుట ఒక గొప్ప బాధ్యతాయుతమైన క్రియ. నీ స్నేహితులను లేక తలిదండ్రులను మెప్పించుటకు మాత్రమే నీవు దాని విషయంలో తొందర పడుట కిష్టపడవు. అంతేగాక బాప్తిస్మం తీసుకొనవలెనని ఎవ్వరూ నిన్ను బలవంతపెట్టకూడదు. (కీర్తన 110:3) అయిననూ, తన శిష్యులగు వారు దాని ‘తగులుబడిని లెక్కించి చూచుకొనవలెను’ అని అందరికి యేసు ఖచ్చితంగా సలహా ఇచ్చాడు. (లూకా 14:28) అంటే నీవు క్రీస్తు శిష్యుడివి కావలెనా వద్దా యని పరిశీలించుకొనవలెనని దీని భావం కాదు. నిజానికి, నీవు అలా శిష్యుడగుట యుక్తమైన పనియే. అయితే యెహోవాకు సాక్షివగుటలో ఏమి ఇమిడియున్నది అనే విషయంలో నీవు దాన్ని క్షుణ్ణంగా తెలిసికొని ఉండాలి.a తర్వాత నీవు ఈ బాధ్యతలను చేపట్టుటకు సిద్ధంగా ఉన్నావా లేదా యని నిర్ణయించుకోవాలి.—సామెతలు 20:25.

‘నాకు తగినంత వయస్సున్నదా?’

కౌమారదశలో ఉన్నవారు పెరిగి పెద్దవారయ్యే కొలది వారు కొన్ని ఆధిక్యతలను బాధ్యతలను అనుభవించే హక్కున్నదని తరచూ భావిస్తారు. కుటుంబానికున్న కారును నడపాలని పట్టుబడతారు, స్కూలు అయిపోయిన తరువాత ఆటలాడుకొనుటకు అర్ధించుట, స్వంత ఖర్చులకు డబ్బుకావలెనని కోరడము వంటివి చేస్తారు. అయితే బాప్తిస్మం మాట వచ్చినప్పుడు మాత్రం అనేక మంది యౌవనస్థులు, వారు అతి చిన్నవారని లేదా ఆ బాధ్యత తీసుకొనుటకు సిద్దంగాలేరని చెబుతూ వుంటారు. ఆండ్రి అనే ఒక యౌవనస్థుడు ఇలా అంటున్నాడు: “చాలామంది యౌవనస్థులు బాప్తిస్మం తీసుకొనుటకు 17 లేక 18 సంవత్సరముల వరకు వేచివుంటారు, కొంచెం ఎక్కువ వయస్సే.” ఎందుకు? “ఎందుకంటే ఆ వయస్సుకు చాలా ముందే వారికొరకు ఇతర నిర్ణయములు వారు చేసికొనగల వయస్సు మాత్రం వారికున్నది.”

అవును, నీవు కౌమార దశలో ఉన్నంత మాత్రాన నీవు ‘రెండు తలంపుల మధ్య తడబడుటకు’ లేదా క్రైస్తవునిగా ఒక స్థానం తీసికొనుటకు వెనుకంజ వేయుటకు ఇది సమయము కాదు. (1 రాజులు 18:21) “నీ బాల్యదినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము” అని బైబిలు ఉపదేశిస్తున్నది. (ప్రసంగి 12:1) సమూయేలు ప్రవక్త చాలా లేత వయస్సులోనే యెహోవాను సేవించుటకారంభించాడు. (1 సమూయేలు 3:1-18; 12:2) కీర్తనల రచయితయైన దావీదు అలాగే చెప్పగలిగాడు: “నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే బాల్యమునుండి నా ఆశ్రయదుర్గము నీవే.”—కీర్తన 71:5.

అలాగే వేలమంది క్రైస్తవ యౌవనస్థులు—కౌమారదశలోవున్న వారు సహితం—దేవుని సేవించుటకై సమర్పించుకొను బాధ్యతగల వారైయున్నారని రుజువు చేసికొనియున్నారు. ఒప్పుకుందాం, కొంతమంది యౌవనస్థులు గంభీరం లోపించినందువలన, బాప్తిస్మంవంటి తీర్మానం చేసికొనగలిగేంత బాధ్యత తీసికోలేరు లేక మానసిక పరిపక్వత కలిగి వుండరు. (సామెతలు 22:5) అయితే ఇది నీ విషయంలో వాస్తవమేనా? (ఈ విషయంలో నీ తల్లిదండ్రులే నిశ్చయంగా ఎక్కువ చెప్పగలరు) కౌమారదశలో ఉన్నవాడు 40 ఏండ్ల వయస్సున్న వ్యక్తి చేసినట్లు చేయాలాని దేవుడు కోరడు. “యౌవనేచ్ఛల” వత్తిడి నీకున్నదని ఆయనకు ఖచ్చితంగా తెలుసు. (2 తిమోతి 2:22) అయితే నీవు సరియైన గంభీరతతో బాధ్యతలను గుర్తించగలిగే స్థితిలో వుంటే, నీవిప్పుడు సమర్పణను గూర్చి ఆలోచించగలవు. అయినను, స్వయంగా నిన్నునీవు అడుగుకోవలసిన ఇతర ప్రశ్నలున్నవి.

‘నేను సరిపడునంత జ్ఞానాన్ని పొందితినా?’

యఫ్‌. ఫిలిప్‌ రైస్‌ వ్రాసిన ది అడోలసెన్స్‌ అనే పుస్తకం తెల్పునదేమనగా “మతం విషయంలో పైపై, అతి సాధారణ నమ్మకముంటే అది దాడికి, శ్రమకు తట్టుకోలేదు.” అయినను రైస్‌ చెప్పేదేమంటే: “ఈ నాటి యౌవనస్థులకు సరియైన ఉపదేశము లభించుట లేదనేసూచనలు కనబడుచున్నవి. ప్రొటెస్టెంట్‌, యూదామత విశ్వవిద్యాలయ రెండవ సంవత్సరపు విద్యార్థుల బైబిలు జ్ఞానమును గూర్చి చేసిన అధ్యయనం తెల్పునదేమంటే వారికి పాత మరియు క్రొత్త నిబంధనలను గూర్చి అసలు తెలియనే తెలియదు.”

బాప్తిస్మం పొందబోవు వ్యక్తి విషయం ఇలా వుండకూడదు. ఒకడు శిష్యుడు లేక ఉపదేశం పొందువాడు కావాలంటే మొదట ‘జ్ఞానం’ సంపాదించుకోవాలి. (యోహాను 17:3; మత్తయి 28:19) గనుక బాప్తిస్మం పొందకముందు నీకు కనీసం “దేవోక్తులలో మొదటి మూల పాఠములు” తెలిసికొనియుండ వలెనని కోరుట సహేతుకం కాదా? (హెబ్రీయులకు 5:12) అందులో, ఆత్మ, మృతులస్థితి, దేవుని నామం పరిశుద్ధపరచబడుట, రాజ్యం, మరియు విమోచన మొదలగు అంశములను గూర్చి బైబిలు బోధించే వాటిని తెలిసికొనుట ఇమిడియున్నది.

నిజమే, నీ తల్లిదండ్రులతో పాటు క్రైస్తవకూటములకు వెళుతున్న సాధారణ కారణమును బట్టి కూడ బైబిలును గూర్చికొంతైనా నీవు తెలిసికొనివుండాలి. అయితే ఆవిధంగా సంపాదించినది బహుశా పైపై జ్ఞానమైయుండి “దాడికి, శ్రమకు తట్టుకో” లేక పోవచ్చును. “నీలోవున్న నిరీక్షణను గూర్చి హేతువడుగు” వారికి నీవు సమాధానం చెప్పగలిగి వుండాలి.—1 పేతురు 3:5.

బైబిలు సత్యములు నమ్మినట్లు టెర్రీ చెపుతుంది. అయినను ఆమె ఇలా అంగీకరిస్తుంది: “నా స్వంత ప్రశ్నలు నేను వేసుకొని వాటికి సమాధానం చెప్పుకుంటూ నేనెప్పుడూ తృప్తిపడలేదు. ఇటీవల నేనీ పనిచేస్తున్నాను.” బైబిలు పఠనమునకు అటువంటి కార్యక్రమము ఏర్పాటు చేసుకున్నందువలన వచ్చిన ఫలితమేమి? నా విశ్వాసం వృద్ధి చెందుతున్నది, మరి నిజమైన దృఢనమ్మకముతో నేనిప్పుడు ప్రజలతో మాట్లాడగలుగుతున్నాను. ఇది సత్యమా అని ప్రశ్నించుకొనుటకు భయపడవద్దని యౌవనస్థులైన సాక్షులందరికి నేను చెబుతున్నాను. పరిశీలించండి! పరిశోధించండి, పఠించండి. ‘సమస్తమును పరీక్షించండి’. అప్పుడు యెహోవాకు హృదయపూర్వకముగా మిమ్మును మీరు సమర్పించుకొనగలరు.—1 థెస్సలొనీకయులు 5:21.

“వాక్యప్రకారం ప్రవర్తించువారైయుండుడి”

అయిననూ, మనం “వాక్యమును విను వారు మాత్రమేగాక దాని ప్రకారము ప్రవర్తించు వారమైయుండవలెను.” (యాకోబు 1:22) తీవ్రమైన పాపములు దాచుకుంటూ ‘అసలు తానేమైయున్నాడో తెలుపకుండ’ వుంటూనే వున్నవానివలె’ నీవు బాప్తిస్మమునకు ముందుకు రాలేవు. (కీర్తన 26:4) అట్టి పాపములలో లైంగిక అవినీతి, త్రాగుబోతుతనము, మాదకద్రవ్య దుర్వినియోగము, లేదా 1 కొరింథీయులకు 6:9, 10 లో చెప్పిన పాపములు అయినను చేరియున్నవి. ఇటువంటి వాటి విషయములో నీకేదైనా సమస్య ఉంటే నీ తల్లిదండ్రులతో కలిసి సంఘ పెద్దలతో మాట్లాడే ఏర్పాటు ఎందుకు చేసికొనకూడదూ? దయగల సహాయం నీకు లభిస్తుందని నమ్మకముంచుము.—యాకోబు 5:14, 15.

నీవు నీ తల్లిదండ్రుల మాట వినే విషయంలో గానీ క్రైస్తవ పెద్దలు నుండి వచ్చే సలహా విషయంలో నీ దృక్పథమే గానీ, నీ స్నేహితులను ఎన్నుకునే పద్ధతిలోనేగానీ కొన్ని మార్పులు అవసరమేమో. (సామెతలు 6:20; 13:20; 1 కొరింథీయులు 15:33; హెబ్రీయులు 13:17) అట్టి మార్పులు చేసికొనుట అంత సులభమేమీ కాదుగానీ సామెతలు 11:9 ఇలా మనకు జ్ఞాపకం చేస్తుంది: “యథార్థమైన నీతి జీవదాయకము. దుష్టక్రియలు విడువక చేయువాడు తన మరణమునకే చేయును.”

నీవు పరిపూర్ణుడిగా ఉండాలని యెహోవా కోరుతున్నాడా? లేనేలేదు. “నా హృదయము శుద్ధపరచుకొని యున్నాను. పాపము పోగొట్టుకొని పవిత్రుడనైతిననుకొన దగిన వాడెవడు?” అని సామెతలు 20:9 అడుగుచున్నది. మనం అపరిపూర్ణులము గనుక మనమింకా తప్పులుచేయడానికి మొగ్గుతాము. అయితే క్రీస్తు విమోచన మూలంగా దేవుని ఎదుట మంచి స్థితిలో ఉండగలం. (యోహాను 2:1, 2) ఉదాహరణకు, హస్తప్రయోగం వంటి దురలవాటుతో పోరాడవలసి వచ్చిన పడుచువారు, తాను లేక ఆమె బాప్తిస్మం పొందే అర్హత పోగొట్టుకుంటున్నట్లు అనవసరంగా అనుకోకూడదు.b నిజానికి, అవినీతిని గట్టిగా అడ్డుకుంటూ యెహోవా హృదయాన్ని ఒకడు సంతోషపరచగలడు.—సామెతలు 27:11.

‘నేను దేవున్ని నా మిత్రునిగా చేసికొన్నానా?’

అయిననూ, దేవునితో నీ సంబంధం విషయంలో వచ్చేదే బహుశా అతి క్లిష్టమైన ప్రశ్న. నిన్ను నీవు ఒక పనికి లేదా ఓ ఉద్దేశ్యమునకు, లేదా ఓ సంస్థకు కూడా కాదు గానీ దేవునికే సమర్పించుకుంటున్నావు అని గుర్తుంచుకొనుము. దేవుడు ప్రత్యేకంగా, దూరంగా కనబడుతున్నాడా? లేక నీవు ఆయనను ఒక వ్యక్తిగా స్వయంగా ఎరిగి ప్రేమిస్తున్నావా? (నిర్గమకాండం 34:6, 7) అలాగైతే, నీవు యాంత్రికంగా కాకుండా, హృదయపూర్వకంగా ఆయనతో మాడ్లాడుతునే వుంటావు.—కీర్తన 62:8.

నీవు దేవుని గూర్చి ఇతరులతో కూడా ఖచ్చితంగా మాట్లాడుతావు. (2 కొరింథీయులు 5:14 పోల్చుము) సామెతలు 15:7 ఇలా చెబుతుంది: “జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లును.” క్రమంగా ఇతరులకు ప్రకటించుట ద్వారా నీవూ అలాగే చేస్తున్నావా? లేక విశ్రాంతి వినోదము లేదా సోమరితనము అనునవి, ఇతరులు దేవున్ని తెలుసుకొనుటకు వారికి నీవు సహాయము చేయుటలో నిన్ను ఆటంకపరచుట కనుమతిస్తున్నావా?—సామెతలు 19:24.

అవును, బాప్తిస్మం అర్థవంతమై యుండవలెనంటే, దేవుడు నీకు అతి సన్నిహిత స్నేహితుడైవుండాలి. (యాకోబు 2:23 పోల్చుము) ఇప్పుడిది సత్యం కానిచో, అది దేవుని తప్పేమికాదు ఎందుకంటే ఆయన అందరిని తనను వెదకవలెనని ఆహ్వానిస్తున్నాడు. (అపొస్తలుల కార్యములు 17:27) ఇంకనూ, వ్యక్తిగత పఠనం, ప్రార్థన, ఆయన ప్రజలతో సహవాసము చేయుటలో పట్టుదల కల్గివుంటూ వుంటే సకాలంలో నీవు దేవునికి సన్నిహితుడవౌతున్నట్లు భావిస్తావు. (రోమా 12:12; 1 తిమోతి 4:15; హెబ్రీయులు 10:24, 25) ‘దేవునియొద్దకు వచ్చుట’ వలన వచ్చే సహజ ఫలితమే ఆ బాప్తిస్మం.—యాకోబు 4:8.

ఉదాహరణకు సిండి యనే యౌవన బాలికను గమనించండి. ఆ అమ్మాయి ఇలా అంటుంది: “14 సంవత్సరముల వయస్సులో నేను బాప్తిస్మం తీసుకున్నాను. అలా చేయుటకు అయిష్టపడుట అంటే ఏమిటో నాకు తెలుసు. అయితే నీవు చేయగలిగిన వాటిలో అది ఆత్యంత అద్భుతమైన విషయమని నేను చెప్పదలిచాను. యెహోవా అంగీకారము నీకున్నదని, ‘ఆయన నిన్ను ఎడబాయడు’ అనేది ఊహించుము! (హెబ్రీయులు 13:5) తాను యెహోవాకు సమర్పించుకొనవలెనాయని ఎవరైనా నన్నడిగితే నేను సమర్పించుకొనండి అనే చెప్తాను! గానీ ఇతరులను సంతోషపరచుటకు అలా చేయవద్దు. నీవు కోరుచున్నావు గనుక అలా చేయుము.” (g90 4/8)

[అధస్సూచీలు]

a See “should I Get Baptized?” in the March 22, 1990, issue of Awake!

b See chapters 25, 26 of the book Questions Young People Ask—Answers that work, published by the Watchtower Bible and Tract Society of New York, Inc.

[13వ పేజీలోని చిత్రం]

బాప్తిస్మం కొరకు అనేకమంది యౌవనస్థులు అర్హులుగా వున్నారు, నీవునూ అలాగే వున్నావా?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి