పాడే పక్షులు—వివేచనకతీతమైన కళానిపుణులు
ఉదయాన్నే, నగర శబ్దాలకు అలవాటుపడిన చెవులకు క్రొత్తగా వింతగా వున్న శబ్దముల మూలంగా నిద్రలేచాను. అది పక్షుల కోలాహలమే. ఒకటి రెండు కాదు చాలా వున్నవి. అనేక పక్షులు, కొన్ని దగ్గరగాను మరికొన్ని దూరంగాను వుండి అన్నీ పాడుతునేవున్నవి. నేను పడక మీదనే వుండి విన్నాను, నాలో ఆశ్చర్యం అధికమైంది నేను లేచి కిటికీ దగ్గరికి వెళ్లి, దాన్ని తెరచి, మోకాళ్లమీదికి వంగి, దాని అడ్డకొయ్యమీద నా మోచేతులను ఆనించాను. ఇప్పుడింకా దగ్గరైనందుకు వాటి కోలాహలం, బయటి ప్రపంచమంతా సంగీతముతో నిండుకున్నదా యన్నట్లు మారు మ్రోగుతూవుంటే నేను విన్నాను. పాడే అనేక పక్షులు వాటి వాటి స్వంతపాటలనే పాడిననూ అన్నీ ఒకే గీతలహరి వలె ఆలపిస్తున్నవి. చలిని నేను లెక్క చేయలేదు. నేను మైమరచిపోయాను.”
న్యూయార్క్ పట్టణంనుండి వచ్చి ఇంగ్లాండులోని నార్త్ యార్క్‌షైర్‌లోని మిత్రులను దర్శించిన ఒక వ్యక్తి యొక్క అనుభవమే పైన తెలుపబడింది. వారి గృహం చుట్టూ పొలాలు, అడవిప్రదేశాలు—మరియు పక్షులున్నవి. ఆ ఉదయం అతడు తానున్న ఇంటి యజమానుడికి యజమానురాలికి శుభవచనం చెప్పినపుడు అతడు ఆనందోత్సాహముతో వుండెను. ‘ప్రాతఃకాల గీతలహరి’ అతడు విన్నట్లు వారతనికి వివరించారు. ప్రతి వసంతకాలం మొదలుకొని మధ్యవేసవి వరకు అలా వుంటుంది. ‘సాయంకాల గీతలహరికూడా వున్నది. అది కొంచెం తక్కువ స్థాయిలో వున్ననూ మధురంగానే వుంటుంది. ప్రపంచంలోని పలు ప్రాంతాలలో యిలా పాడుట అరుదైపోతుంది, కొన్ని ఇతర ప్రాంతాలలో అసలు అటువంటి సంగీతమే ఆగిపోయింది.
పక్షులలో 9,000 రకాలుండగా, వీటిలో 5,000 దాకా పాడగలవని వర్గీకరించబడినవి, అంటే ఓసీన్ పక్షి జాతిలో రెండవరకం పక్షులన్నమాట. కొన్ని పెంటి పక్షులు పాడిననూ, ఈ ప్రాతఃకాల, సాయంకాల సంగీతలహరి మృదుమాధుర్యాన్ని వినిపించేవి మగ విహంగములే. అవి వాటి స్థావరాలను, జతలను భద్రంగా వుంచుకునే దృష్టితోనే పాడుతున్నవని చెప్పారు, అయితే అవి సంగీతం ఆలపించి ఆనందించుటకు కూడా అలా పాడుట సాధ్యమే. నిశ్చయంగా, ప్రాతఃకాల సంగీతలహరి ఉచ్ఛస్థాయికి చేరి 30 నిమిషముల వరకు నిరాటంకముగా కొనసాగితే, వాటి ఆనందహేల హద్దులు దాటినట్లే.
అనేక రకముల పాటలు
వర్ణించాలంటే వాటి పాటలు మామూలు నుండి క్లిష్టమైన పాటలవరకు వున్నవి. తెల్లకిరీటమున్న పిచ్చుక ఆపకుండ అనేకసార్లు పాడే మామూలు పాటలతో తృప్తిపడుతున్నట్లున్నది. పాడే పిచ్చుక, దీర్ఘకాల ఆలాపన చేస్తుంది, కోయిలవంటి చిన్నపిట్టలు కొల్లలుగా పాడును, మరి ఎక్కిరించి పాడే పక్షుల రవములు వాటి మధుర స్వరముతో గంటల తరబడి రవళించ గలవు . అయిననూ వట్టిగా పాటల సంఖ్య తెలుసుకోవాలంటే, ఒక్క గోధుమవన్నె, పొడువాటి తోక వున్న పక్షులే 2,000 వరకు పాడగలవు. నైటింగేల్ అనే చిన్న పక్షి, ఐరోపా, అమెరికాలోని పొడవాటి తోకవున్న త్రషెస్, త్రాషెర్స్ అనే పక్షులు, చిన్నపిట్టలు, ఎర్రని ఎదగల పక్షులు, పచ్చికబయళ్లయందు తిరుగులాడు పక్షులు, నల్లజాతి పిట్టలు, కోయిలవంటి చిన్నపిట్టలు, సింధూరవర్ణ పక్షులు, ఎర్రని ఎదగలిగి ఎగురుతూ పాడేపక్షులు, భరద్వాజ పక్షులు, మరియు అనేక ఇతర పక్షులు ప్రపంచంలోని పలు ప్రాంతాలలోను వాటి గాన మాధుర్యాన్ని వినిపించే జ్ఞానం గలవని కీర్తినార్జించగలవు.
ప్రాతఃకాల, సాయంకాల సంగీతలహరితో పాటు ఇతర పాటలు కూడవున్నవి. ప్రత్యేక శ్రద్ధకల్గించే వాటిలో “గుసగుసల” పాటలు, అంటే మార్పులు కూర్పులతో కూడి కొన్ని గజాలదూరం మాత్రామే వినపడగల సన్నని స్వరముతో కూడిన మూల పాటల భాగాలన్నమాట. తరచూ గూళ్లలో గ్రుడ్డు పొదుగుటకు కూర్చున్నప్పుడు తీసే కూనిరాగాలే ఇవి లేదా చిక్కనిపొదలలో దాగివున్నపుడు, ఈచిన్న ఆడమగ పక్షులుపాడే ముచ్చటైన పాటలు వాటి తృప్తికి తార్కాణములు.
అనేక జాతుల జతలపక్షులు యుగళగీతాలు పాడును. అవి కలిసి ఒకేపాటను గానీ లేక వేర్వేరు పాటలనుగానీ లేదా అదే పాటను మార్చుకొని వేర్వేరు భాగాలుగా పాడవచ్చును. అవెంత ఖచ్చితమైన సమయాన్ని పాటిస్తాయంటే ఒకే పక్షి పాటపాడుచున్నదా అన్నట్లు వుంటుంది అవి పాడే పాటలు వింటే పాటను ఒకటి ఆపి, మరొకటి ఎత్తుకునే మధ్య విరామసమయాన్ని మిల్లీసెకండ్లలో కొలువవచ్చును. ఒకటికాదు రెండు పాడుతున్నాయని తెలుసుకోవాలంటే వాటిమధ్య నిలబడుటే ఉత్తమ మార్గం. దక్షిణ అమెరికాలో కోయిల వంటి చిన్నపిట్టలు యుగళగీతాలకు పెట్టింది పేరు, అక్కడున్న అడవులలో వినబడే అతిమధుర సంగీతాన్ని వినిపించే పక్షులివే అని అనేకుల భావము.
సిగ్గుఎగ్గులేని అనుకరణ
స్వర అనుకరణ అనేక పక్షిజాతులకు ఇష్టమైన అలవాటు. పక్షిశాస్త్రజ్ఞులు ఇదొక ఆశ్చర్యకరమగు అనుకరణ అంటూవున్నారు, పక్షులు అలా ఆడుకుంటున్నాయి తప్ప మరే ప్రత్యేకత అందులో లేదని ఒక పరిశోధకుడు సలహాయిచ్చాడు. ఉత్తరమెరికాలో ఎక్కిరించి పాడే పక్షిజాతి ఈ అనుకరణలో ఆరితేరిందట. దాని శాస్త్రీయనామము మైనస్ పోలిగ్లోటోస్ అనగా “అనేకనాలుకల అనుకరణ” అని అర్థం. ఒక గంటపాటలోనే ఒక పక్షి 55 రకాల పక్షుల శబ్దాలను అనుకరించినట్లు వార్తలందినవి.
అయితే ఎక్కిరించే పక్షులు అనుకరణల గుత్తాధిపత్యము తీసుకోలేదు. ఆస్ట్రేలియాలో లైర్‌పక్షి “సమస్త పక్షిజాతులలోను అత్యంత శక్తివంతమైన, రక్తికరమగు పాటలుపాడుతుంది.” అయినను “తన స్వంతపాటకు, దగ్గరలో నివసించే ప్రతిజాతి పక్షిపాటను కలుపుకుంటుంది.” బర్డ్ బిహేవియర్ అనే పుస్తకం 130-1 పేజీలలో రాబర్ట్ బర్టన్, పొదరింటి పక్షులు, కోయిలవంటి పక్షులు మరియు పసుపుపచ్చని ఈకలుగల పక్షుల స్వర అనుకరణను గూర్చి వ్రాస్తున్నాడు. ఆస్ట్రేలియా పొదరింటి పక్షులు “పిల్లులను, కుక్కలను, కర్రనుకొట్టే గొడ్డల్లను, మోటారు కారు హార్న్, మరియు కంచె కట్టిన తీగెల కదలికను మరి ఇతర పక్షిరకముల శబ్దాలను అనుకరిస్తున్నట్లు రికార్డు అయివున్నది. కోయిలవంటి పక్షి ఒకటి, కోడి దాని పిల్లలు దాగుగొనుటకు పరుగెత్తవలసివచ్చినంత రీతిగా పక్షిరాజు శబ్దాన్ని అనుకరణ చేసిందట. నిశ్చయంగా ఈ కోయిలవంటి పక్షులు కర్రనరికే గొడ్డళ్లతో పొందుచేయుటకు లేక వాటి చుట్టూ కట్టిన కంచె తీగెలను తరుముటకు అవి అలా అనుకరించుటలేదు! వాటి కిలకిల రవములను వినేవారు ఆనందించినట్లే అవి కూడ బహుశా తమాషా కొరకు చేస్తుండవచ్చు.
ఐరోపాలోని కోయిలవంటి చిన్నపిట్ట ఇతర పక్షులనుండి దొంగతనంగా ఎంత బాగా అనుకరిస్తుందంటే “దాని అనుకరణపద్ధతి అంతటిని బెల్జియంలో చేసిన ఒక అధ్యయనము ద్వారా మాత్రమే తెలిసికొనగలిగారు. దాని శబ్దతరంగముల విశ్లేషణ తెలిపేదేమనగా బహుశా దాని పూర్తి ఆలాపన అంతయు అనుకరణతోనే నిండియున్నది. ఈ శబ్దతరంగిణి ద్వారా దాదాపు ఒక వంద ఐరోపా జాతిపక్షుల పాటలను గుర్తించుటయే గాక కోయిలవంటి చిన్నపిట్టలు చలికాలములో వినే ఇతర ఒక వంద కంటె ఎక్కువ ఆఫ్రికా జాతి పక్షుల పాటలను కూడ గుర్తించారు.”
పసుపు పచ్చని ఈకలుగల పక్షులు (కానరీస్) “విచక్షణారహితంగా దేనినైనా అనుకరిస్తవి గనుకనే అవి పంజరపు పక్షులని ప్రతీతి చెందినవి. 19వ శతాబ్దపు తొలిభాగంనుండి ఇందుకు ఒక శ్రేష్టమైన మాదిరి ఉన్నది, అదే ‘దేవుడు రాజును రక్షించునుగాక’ అని ఈలవేయునట్లు నేర్పించబడిన యూరేసియన్ బుల్‌ఫిన్చ్ అను పక్షి. ఆ ప్రక్క గదిలో వున్న కానరీ పక్షి ఈ మాటలను ఒక సంవత్సరములో నేర్చుకున్నది, మూడవ వాక్యముదగ్గర ఈ బుల్‌ఫిన్చ్ ఆగి తడబడేటప్పుడు కానరీ పక్షి ఆమాటలను చిన్నగా ఆలపించి రాగాన్ని పూర్తిచేసేది.”
వివిధరకముల పక్షులకు వాటి రంగస్థలం మీదకు వచ్చి అభినయం చేయుటకు వాటివాటి నిర్దిష్ట ప్రత్యేకతలున్నవి. కొన్ని నేలమీదనుండి, కొన్ని కలుపుమొక్కల కొనల మీదనుండి, మరికొన్ని చెట్టు చివరి చిరుకొమ్మపైనుండి పాడుతవి. ఎగతాళి చేసే పక్షిరకం అటువంటి ఎత్తయిన స్థలాలను ఎన్నుకొని అప్పుడప్పుడు 3-6 మీటర్ల క్రిందికి అడ్డు కొమ్మలమీదికి దూకుతూనే పాడుతూవుంటవి. పొలాలలో వున్న పక్షులైతే తరచూ, అవితిరిగే ప్రాంతాలలో ఎగురుతూ పాడుతూ వుండును. షెల్లీ అనే రచయిత “ఓడి టు ఎ స్కైలార్క్” అనే తన రమ్యమైన రచనలో స్కైలార్క్ అను పక్షిని గూర్చి తెల్పుచూ ఆయన ఈ “ఉల్లాస ప్రాణి,” “పుష్కలంగా వున్న అనాలోచనా కళతో” గళంవిప్పి గుండెనిండుగా పాడుతుంది.
ప్రాతఃకాల సాయంకాల సంగీత లహరికి, వసంత కాలం, గ్రీష్మకాలపు తొలిదశ, అనుకూల సమయం. పక్షులు పాడుటకిదే ప్రత్యేక సమయమని బైబిలు సహితం తెల్పుచున్నది. పరమగీతములు, శీతాకాలం గతించెనని, పువ్వులు విరియపూస్తున్నవని, చెట్లమీద పండ్లు కాయుచున్నవని, వలసపోయిన పక్షులు శీతాకాలానంతరం తిరిగి తమగూటికి చేరియున్నవనియు “పిట్టలు కోలాహలము చేయు కాలము వచ్చెను, పావురం స్వరము మన దేశములో వినబడుచున్నదని” తెల్పుచున్నది. (2:11, 12, ది న్యూ ఇంగ్లీష్ బైబిలు) అయిననూ, అనేక పక్షులు వసంత, గ్రీష్మ కాలానంతరం, జతకూడి, గ్రుడ్లుపెట్టేకాలం అయిపోయిన తర్వాతకూడా పాడుతూనే వుంటవి.
పక్షిపాట వింతగానే వున్నదని, “గంభీరంగా పాడవలసిన అవసరం మొదట ఎందుకు పరిణామం చెందవలసివచ్చిందోయనేది ఒక గొప్పమర్మం” గనుక అనవసరమైన పెద్దపాట దేనికి పనికిరాదు” అని ఓ రచయిత అంటున్నాడు. “ఈ పెద్దపాట” పాడే ఈ లక్షణం అసలు పరిణామము చెందలేదని, పిచ్చుకల ఎడల, గూళ్లలో కూర్చునే తల్లి పక్షి ఎడల దయచూపే యెహోవాదేవుడే వాటిని సృజించినప్పుడు వాటికి ఈ సంగీత వరాలను ఆయన అనుగ్రహించాడని బహుశా అతడు తెలుసుకోవాలి. (ద్వితీయోపదేశకాండము 22:6, 7; మత్తయి 10:29) పక్షులకు ఆనందం కలుగజేయు “పనులలో” ఇదొకటైయుండవచ్చును. ఎగతాళి చేసే పక్షులు మరియు ఇతరములు తరచూ చాలారాత్రి గడచిన తర్వాత పాడుతూవుంటవి. ఇది మనకును, వాటికిని సంతోషంకొరకు కాదని ఎవరనగలరు.
అవెట్లు చేస్తున్నవనేది ఇంకా రహస్యంగానే వున్నది
అవి ఎందుకు పెద్దపాటలను పాడుచున్నవనేది “గొప్ప రహస్యం” కాదేమోగానీ అవెట్లు పాడుచున్నవనేది రహస్యంగా ఉండవచ్చును. అందుకు విభిన్న అభిప్రాయాలున్నవి, మరి ఇప్పటికీ విపరీతమైన విజ్ఞాన పరిశోధన జరుగుచున్ననూ, ఈ విషయంలో ఏకాభిప్రాయం కుదరటంలేదు. పక్షియొక్క స్వరపేటికను సైరింక్స్ అంటారు—అంటే ప్రత్యేకరకమైన కండరముల సహాయంతో సాగే పొరలుగల భాగాలతోకూడిన ప్రతిధ్వనించే ఎముకలతో సంధించబడిన పెట్టెవంటిది. ఇది ట్రాచియా లేక గాలిగొట్టం క్రింద చివరన వుంటుంది, దానికి రెండు వేర్వేరు కండరములు, పొరలువున్నవి గనుకనే పాడే పక్షులు ‘ద్విస్వరములు’ కల్గియున్నవని చెప్పబడుచున్నవి. పొరలమీద కండరాల బిగువును తిప్పుతూ, గాలి ఒత్తిడిని మార్చుతూ పక్షి స్వరమార్పిడి చేస్తుంది. పక్షులకు అత్యంత శక్తివంతమగు చిమ్మేగొట్టపు కండరాలున్నందున అవి వివిధరకముల చిక్కయిన పాటలను పాడుటకు లేదా కూతలు కూయుటకు వాటికి మహాగొప్ప అవకాశమున్నది. అత్యంత మేధాసంపత్తిగల ఈకలుగల ఈ గాత్రసంగీత కళాకారులకు ఏడునుండి తొమ్మిదిదాకా ఇంటువంటి కండరాలున్నవి.
బర్డ్ బిహేవియర్ అనే తన పుస్తకములో రాబర్ట్ బర్టన్ పక్షులు పాటల ప్రయోగాలెందుకు మన మేధస్సుకు మించినవో తెలియజేస్తున్నాడు: “రెళ్లు పక్షి మరియు గోదుమవర్ణ పక్షి ఒకే క్షణంలో ఖచ్చితంగా సైరింక్స్ యొక్క సగభాగం నుండి బయలువెడలే వివిధ పల్లవులతో ఒకేసారి రెండు స్వరాలను వినిపించగలిగే స్వర ఉత్పత్తి అమోఘంగావుంటుంది. పాటపాడే ఒకానొక సమయంలో గోధుమవర్ణ పక్షి నిజంగా ఒకే సారి నాలుగు రకాల శబ్దాలను వినిపిస్తుంది గానీ అదెలా వస్తుందో అంతుపట్టదు.”
గత 20 సంవత్సరాలుగా పక్షులెలా పాడుచున్నాయనే విషయంలో ఆమోదించబడిన సిద్ధాంతము సైరింక్స్ మీద మాత్రమే ఆధారపడినది. దాని ‘ద్విస్వరములు,’ అవినాభావసంబంధములేని రెండు స్వరాలను ఏక కాలములో తయారు చేయగలవు, ద్విస్వరములు దేనికదే పనిచేస్తూ పక్షిపాటల నాణ్యతకు, విభిన్న స్వరాలకు పూర్తిబాధ్యత వహిస్తున్నవని భావించబడెను. ఈ రెండు శబ్దతరంగాలు సైరింక్స్‌ను వదిలిన తరువాత నోటినుండి బయటికి రాకముందు అవి గొట్టము పొడవునా ప్రయాణించాలి. అయిననూ పాటల ఉత్పత్తికి, ఈ గాలిగొట్టమునకు దాని ప్రతిధ్వని భాగాలకు ఎటువంటి ప్రాముఖ్యత ఇవ్వబడలేదు.
గత కొన్ని సంవత్సరములలో విజ్ఞానశాస్త్రం యొక్క బలమైన పరిశోధనా ఫలితంగా ఓ క్రొత్త సిద్ధాంతం బయలుదేరింది. అందుకు “రెండు స్వర ఉత్పత్తి స్థానముల మధ్య అవినాభావ సంబంధముండాలి,” మరియు ప్రతిధ్వని లేక గాత్ర మార్గమైన గాలిగొట్టం చురుకుగా తన పని నిర్వహించాలి. అందుమూలంగా వచ్చే స్వరమే “స్వరపేటికలోను కంఠమార్గములోను సన్నిహిత సహకారమువలన కలిగేది. ఈ సహకారం, ప్రతిధ్వనిలోని నిరంతర మార్పులు కూర్పులను అనగా స్వర ఉత్పత్తిలో వచ్చు మార్పులకు తగినట్లు మహా వేగాన్ని అందుకొని ఖచ్ఛితమైన రీతిగా వచ్చునట్లు విన్యాసం చేయడానికి నిర్మించబడింది.” ప్రతి “స్వరాన్ని” ప్రత్యేకంగా వింటే, ముగించిన పాటలోని కొన్ని ధ్వనులు వినబడవు.
పాడేపక్షి తన గాత్ర స్వరూపాన్ని వడగట్టి మార్చగలిగే సామర్థ్యమును గూర్చి స్టీవెన్ నోవిక్కి తను నేచర్ లో వ్రాసిన శీర్షికయందు ఇలా చర్చిస్తున్నాడు: “ఒక పక్షి తన గాత్ర స్వరూపమును అనేకరీతులుగా మార్చుకోగలదు: ఉదాహరణకు, గాలిగొట్టపు పొడవును హెచ్చు తగ్గులు చేస్తూ, స్వరపేటికను కుదిస్తూ లేదా గొంతును ముక్కును పెద్దవిగా చేస్తూ అలా మార్చగలదు. అటువంటి విన్యాసపు మార్పులు, పాటపాడే పక్షులలో మనం సాధారణంగా గమనించగల తల కదలికలతో మంచి సంబంధంకల్గివున్నది. నోవిక్కి ఇలా ముగిస్తున్నాడు. “ముందటి సిద్ధాంతములకు వ్యతిరేకముగా పక్షిపాడే పాటను, అనేక మోటారు పద్ధతుల సహకారము వలన ఉత్పన్నమవు సమ్మేళనంగా దృష్టించాలి.”
పక్షుల కూతలకును పాడేపక్షులు స్పష్టంగా వేసే ఈలలకును తేడా వున్నట్లు పరిశోధకులు చూపిస్తున్నారు. యన్. ఎచ్. ఫ్లెచ్చర్, జర్నల్ ఆఫ్ థియొరటికల్ బయోలజీ అనే పుస్తకంలో వ్రాస్తూ పక్షిపాటలోని స్పష్టమైన స్వరమున్న ఈలలు స్వరపేటికలో ఊగేపొరలనుండి వస్తున్నట్లు కన్పించుటలేదు గానీ పూర్తి విభిన్నమైన మరో యాంత్రికత్వము ద్వారా, బహుశా “కదిలే పైభాగపు యాంత్రిక సహాయంలేకుండా పూర్తి గాలి వత్తిడివలన తయారుచేయబడిన” వాటివలన వస్తున్నట్లున్నవి. ఈ జ్ఞానంగల ప్రాణుల మధురస్వరములు ఇంకను వివేచనకతీతమైనవే.
రాక్‌ఫెల్లర్ యూనివర్సిటీ ఫీల్డ్‌సెంటర్ ఉద్యోగి జెఫ్రీ సింక్స్ ఈ మంచి మాట అంటున్నాడు: “పాడే పక్షులలో శ్రేష్టమైన స్వరమాధురిలోని కళను కనుగొనుటకు పాఠకులు ఆనందించవచ్చును లేదా విస్మయమొందవచ్చును . . . శ్రేష్టమైన స్వరమాధురి గ్రహణమును గూర్చి నా సహ ఉద్యోగులు నేను అనేక పక్షులను పరీక్షించి వాటికి గ్రహణ శక్తి అమోఘంగా వుందని గ్రహించాము.”
వాటికి రమ్యమైనదే, మనకూ రమ్యమైనదే
“విజ్ఞానశాస్త్రజ్ఞులు జంతు లక్షణములను గూర్చి పరిశోధన జరుపుచుండగా పక్షి పాట యొక్క పద్ధతి, పరిణామ ప్రాముఖ్యతవలన మనం తరచూ ముగ్ధులమై అదొక సమాచార సంకేతమని ఆలోచిస్తూ, సహజ సంగీతమువంటి శక్తివంతమైన శ్రవణగోచరమగు భావాలను మనం మరచిపోతాము,” అని స్టీవెన్ నొవిక్కి మరియు పీటర్ మార్లర్ మ్యూజిక్ పర్‌సెప్షన్ అనే పుస్తకంలో వ్రాశారు. 1920 దశాబ్దంలోనూ, అటు తర్వాతనూ వున్న కొందరు విజ్ఞాన శాస్త్రజ్ఞులు “పక్షిపాటను అనాగరిక కళగాను, పక్షిదృష్టికి మనదృష్టికి రమ్యమైనదిగా భావించాలని సలహా ఇచ్చారని” పిదప వారు జ్ఞాపకం చేసుకుంటున్నారు.
గూడులోని తల్లిపక్షి తీసే కూనిరాగాలు, చిట్టడవులలో గానకోకిలవంటి పక్షుల యుగళగీతాలు, భరద్వాజ పక్షియొక్క అనాలోచనతో అనర్గళంగా పాడేకళ, పక్షిరాజువలె కూసి అనుకరించుటవలన కోడి దాని పిల్లలు దాగుకొనుటకై పరుగెత్తించే పొదరింటి పిట్ట, తెలతెలవారుచుండగా ఎగతాళి చేసే పక్షి రాగాలు, మరియు ఇటువంటివన్నియు ప్రాతఃకాల సంగీత లహరితో బయటి ప్రాంతమంతయు సంగీతముతో మారుమ్రోగుతుంది. నిశ్చయంగా ఇది గణాంకములకు ప్రతిధ్వనులకు మించిపోవాలి. పక్షులు ఈ ఘనకార్యములు ఖచ్చితంగా అలా ఎట్లు చేస్తున్నవనే విషయం మన వివేచనకతీతమైనదే కావచ్చును, గానీ ఆ మర్మం, పాడే పక్షుల బ్రహ్మాండమైన జ్ఞానానికి, వాటిని సృజించిన దేవునికి మన హృదయపూర్వక అభినందనను అధికం చేయాలి! (91 5/22)
[16,17వ పేజీలోని చిత్రాలు]
పైన కుడివైపు, కుడినుండి ఎడమవైపు: ఎర్రనినొసలుగల జీనువాయి పిట్ట, సాటిన్ పొదరింటి పిట్ట, పాడే పిచ్చుక, వివిధ వర్ణముల కోయిల, తూర్పుప్రాంత మైదానపుపక్షి
[క్రెడిట్ లైను]
Philip Green
[క్రెడిట్ లైను]
Philip Green
[క్రెడిట్ లైను]
J. P. Myers/VIREO/H. Armstrong Roberts