కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g92 5/8 పేజీలు 10-11
  • ఈగ్వాసూ జలపాతములు పచ్చికపై వ్రేలాడే రత్నాలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఈగ్వాసూ జలపాతములు పచ్చికపై వ్రేలాడే రత్నాలు
  • తేజరిల్లు!—1992
  • ఇలాంటి మరితర సమాచారం
  • పాఠకుల ప్రశ్నలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2020
  • “నదులు చప్పట్లు కొట్టునుగాక”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2004
  • మన మహోన్నత సృష్టికర్త, ఆయన కార్యములు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
తేజరిల్లు!—1992
g92 5/8 పేజీలు 10-11

ఈగ్వాసూ జలపాతములు పచ్చికపై వ్రేలాడే రత్నాలు

బ్రెజిల్‌నుండి మేలొలుపు! విలేఖరి పంపినది

దక్షిణ అమెరికాలో గుర్తుంచుకోదగిన సహజ అద్భుతాల్లో ఇదొకటని” ఈ ప్రసిద్ధిచెందిన జలపాతములను గూర్చి ఓ నిఘంటువు వర్ణిస్తుంది. ఇవి అర్జెంటీనా, బ్రెజిల్‌ మరియు పెరాగ్వే దేశాల సరిహద్దులకు దగ్గర ప్రాంతంలో వున్నవి. వాటికున్న విశేషాకర్షణ ఏమంటే వాటి సహజసిద్ధ నిర్మాణం—చుట్టువున్న చెక్కుచెదరని ఉష్ణమండల అరణ్యప్రాంతమే. నిజానికి పచ్చని ప్రదేశంలో రత్నాలవలె అలంకరించబడినవి. దక్షిణ అమెరికాకు వెళ్లే యాత్రికులకు దీనిని సందర్శించుట తప్పదనుటలో ఆశ్చర్యంలేదు.

“ఈగ్వాసూ” అంటే గ్వారాని భాషలో “మహాజలం” అని అర్థం. మరెందుకు అవి మహాజలమంటే, ఆనీళ్ల ఉరవడి శబ్దం 30 కిలో మీటర్ల దూరం వరకు వినబడుతుంది. సంవత్సరంలో వచ్చే రుతువును బట్టి దాదాపు 300 రకములైన జలపాతములు ఒక్క పెద్దకొండ చరియమీదుగా దుముకుతూవుండుట గమనించగలం. కొన్ని జలపాతములైతే కలిసి ఒకేఒక్క ఉదుకులో పడుతూవుండును, మరికొన్ని సగందూరం క్రిందకి దుమికి ఆతర్వాత మరొకసారి క్రింద అడుగుభాగం వరకు దుముకును. వర్షాకాలంలో ఒక సెకండుకు 10,000 ఘనపు మీటర్ల నీరు ఆ జలపాతంగుండా ప్రవహిస్తోందని అంచనా. తత్ఫలితంగా, క్రిందవున్న పెద్ద పాత్రవంటి భాగం, నీటి ఆవిరి ఎగజిమ్మిన రీతిలో పెద్ద నీటి పొగను ఉత్పత్తిచేస్తుంది, దాన్ని ఎండకాచిన రోజున చూస్తే దినమంతా రంగురంగుల ఇంద్రధనస్సులెన్నో కనబడినట్లుంటుంది.

ఈ అద్భుతకరమైన దృశ్యానికి గల ముఖ్యభాగమేమనగా సుప్రసిద్ధ గార్గంటా డొ డియాబొ (దయ్యపు గొంతు, లేదా అంగిలి), సందర్శకులకిచ్చే కరపత్రములో దీనిని ఇలా వర్ణించారు: “దాదాపు 90 మీటర్ల ఎత్తునుండి కొండచరియల మీదుగా పద్నాలుగు జలపాతములు ఒక వలయముగా క్రిందికి దుమికెడి దృశ్యమే దానికంతటికి మహా అద్భుతమైన అందమైన దృశ్యం.”

ఆ జలపాతములను బాగా చూడవలెనంటే హెలికాప్టర్‌నుండి చూస్తే బహుశా అందంగా కనబడవచ్చును. అలా చూచిన ఒక యాత్రికుడు ఇట్లన్నాడు: ‘క్రింద వున్న అందమైన దృశ్యాన్ని ఆనందించవలసిన అవసరాన్ని మా పైలట్‌ పసిగట్టినట్లున్నాడు. తరచూ అతడు చేసినట్లే ఎటో దూరంగా వెళ్లేబదులు ఆ లోయ పొడవునా అటుఇటు అనేక సార్లు తిరిగాడు. మా కెమెరాలు, వీడియో, నిరంతరం వుపయోగిస్తూ యెహోవా సృష్టి కార్యములలో ఈ అద్భుత దృశ్యాన్ని చిత్రీకరించినవి.

ఇతర సందర్శకులు వారికొరకు ఏర్పాటు చేయబడిన మార్గాలలోను దారులలోను నడుస్తూ చూచి సంతృప్తి చెందుచున్నారు. బ్రెజిల్‌ దేశము నుండి ఈ జలపాతముల అందమైన దృశ్యం పూర్తిగా కనబడుతుంది, అర్జెంటీనా పక్కనుండైతే ఒక్కొక్క జలపాతాన్ని విడివిడిగా చూడవచ్చును, కొన్ని ప్రాంతాల్లో కాంక్రీటుతో కట్టిన దారిమీదుగా నడిచి ఒకదానిని దాటి మరొక దాన్ని చేరవచ్చును. చాలామంది సందర్శకులైతే ఈ రెండిటిని చేస్తూ వుంటారు అనగా ఆ దృశ్యాన్ని చూస్తూ అటు కనులవిందు చేసుకుంటూ, ఇటు కెమెరాలతో, దిగ్మండలం వరకు పరచినట్లు మనోహరమైన నవనవలాడే పచ్చని వర్షపు అరణ్యం వల్ల ఏర్పడిన మనోజ్ఞ, సుందర జలపాత దృశ్యాలను చిత్రీకరిస్తున్నారు.

హుషారుగా వున్నవారైతే, పొడవాటి తోకగల పక్షులు ఎగజిమ్మిన ఆవిరి మేఘాలలోపలికి బయటికి గెంతులు వేస్తూ చెట్లమీదికి చేరకముందు వేసే మరొక గెంతును పరిశీలిస్తారు. లేక కిచకిచలాడు పచ్చని చిలుకలు, లోతుగా నీరు లేని చోట మునిగి వెంటనే కొండచరియచేరి మరల అకస్మాత్తుగా అదృశ్యమై ఆ వెంటనే చెట్ల పైకొమ్మలమీదికి ఎగిరి ఈకలను ముక్కుతో శుభ్రం చేసుకుంటూ వుండుట చూస్తారు. మరొక వేళ సందర్శకులు వాటిని ఇంకా దగ్గరగా చూస్తే బంగారు పిచ్చుక వర్గానికిచెందినవి తోకభాగం ఎర్రగా వుండి, శబ్దంచేస్తూ వున్నవాటితో నిండియున్న అనేక గూళ్లను చూస్తారు. ఆ పక్షులు గుంపులు గుంపులుగా నివసిస్తూ, పొడవాటి గడ్డిపోచలతో అల్లిన గూళ్లలో చెట్టుకు వ్రేలాడ దీయబడివుండును. ఇవన్నీ, వీటితో పాటు పలురకముల సీతాకోక చిలుకలు, ఆ జలపాతములను దర్శించేవారికెంతో రంగుల పండుగగా కనిపించును.

నిజానికి వాటిని పూర్తిగా అభినందించాలంటే ఈగ్వాసూ జలపాతములను తప్పక చూడవలసిందే, వినవలసిందే. 1939 లో స్థాపించబడిన ఈ బ్రెజిల్‌లోని ఈగ్వాసూ నేషనల్‌ పార్కును, సహజ మనోహర నయనానంద దృశ్యానికి నిలయమైన దీనిని ప్రతి సంవత్సరం వేలమంది సందర్శకులు దర్శిస్తూ వుంటారు. వారేమి నిరుత్సాహం చెందలేదు, మరి నీవు దక్షిణ అమెరికాను సందర్శించునపుడు దీనిని కూడా చేర్చితే నీవును నిరుత్సాహం చెందవు. (g91 1/22)

[10,11వ పేజీలోని చిత్రం]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

ఈగ్వాసు జలపాతములు

బ్రెజిల్‌

అర్జెంటీనా

పరాగ్వే

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి