కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ijwbq ఆర్టికల్‌ 166
  • డబ్బు అన్ని రకాల చెడుకు కారణమా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • డబ్బు అన్ని రకాల చెడుకు కారణమా?
  • బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • బైబిలు ఇచ్చే జవాబు
  • డబ్బు గురించి బైబిలు ఏం చెప్తుంది?
  • డబ్బు మీది మోజు ప్రమాదకరమని బైబిలు ఎందుకు చెప్తుంది?
  • డబ్బు విషయంలో బైబిలు ఇచ్చే సలహాల్ని పాటిస్తే ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి?
  • జీవితంలో డబ్బుకున్న స్థానం ఏంటి?
    తేజరిల్లు!—2015
  • డబ్బు విషయంలో జ్ఞానయుక్తమైన దృక్పథమేమిటి?
    తేజరిల్లు!—2007
  • మీరు డబ్బు గురించి సమతుల్యమైన దృక్కోణాన్ని ఎలా కలిగివుండగలరు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
  • డబ్బును జాగ్రత్తగా ఎలా ఖర్చు పెట్టాలి?
    ఆనందం వెల్లివిరిసే కుటుంబ జీవితం కోసం
మరిన్ని
బైబిలు ప్రశ్నలకు జవాబులు
ijwbq ఆర్టికల్‌ 166
ఒకతను పెద్ద మొత్తంలో డబ్బును ఆత్రంగా తీసుకోబోతున్నాడు.

డబ్బు అన్ని రకాల చెడుకు కారణమా?

బైబిలు ఇచ్చే జవాబు

కాదు. డబ్బు చెడ్డదని, లేదా అన్ని రకాల చెడుకు డబ్బే కారణమని బైబిలు చెప్పట్లేదు. కొంతమంది, “డబ్బే అన్ని రకాల చెడుకు కారణం” అని అంటుంటారు. కానీ నిజానికి, బైబిలు ఇలా చెప్తుంది: “డబ్బు మీది మోజు అన్నిరకాల చెడ్డవాటికి మూలం.”—1 తిమోతి 6:10.

  • డబ్బు గురించి బైబిలు ఏం చెప్తుంది?

  • డబ్బు మీది మోజు ప్రమాదకరమని బైబిలు ఎందుకు చెప్తుంది?

  • డబ్బు విషయంలో బైబిలు ఇచ్చే సలహాల్ని పాటిస్తే ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి?

  • డబ్బు గురించి వివరించే బైబిలు వచనాలు

డబ్బు గురించి బైబిలు ఏం చెప్తుంది?

డబ్బును తెలివిగా వాడితే దానివల్ల ఉపయోగాలు ఉంటాయని, అది కొన్నిసార్లు “రక్షణగా” కూడా ఉంటుందని బైబిలు చెప్తుంది. (ప్రసంగి 7:12) అంతేకాదు, ఉదారంగా చేసే సహాయాన్ని బైబిలు మెచ్చుకుంటుంది. అది డబ్బు సహాయం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు.—సామెతలు 11:25.

అదే సమయంలో, డబ్బే జీవితం కాకూడదని బైబిలు హెచ్చరిస్తుంది. అది ఇలా చెప్తుంది: “డబ్బును ప్రేమించకండి, ఉన్నవాటితో సంతృప్తిగా జీవించండి.” (హెబ్రీయులు 13:5) దీన్నిబట్టి డబ్బును దాని స్థానంలో ఉంచాలని, దాని వెనకాల పరుగెత్తకూడదని అర్థమౌతుంది. బదులుగా ఆహారం, బట్టలు, ఇల్లు వంటి కనీస అవసరాలతో మనం తృప్తిపడాలి.—1 తిమోతి 6:8.

డబ్బు మీది మోజు ప్రమాదకరమని బైబిలు ఎందుకు చెప్తుంది?

అత్యాశపరులు శాశ్వత జీవితాన్ని సొంతం చేసుకోలేరు. (ఎఫెసీయులు 5:5) ఒక కారణం ఏంటంటే, అత్యాశ అనేది విగ్రహపూజతో లేదా అబద్ధ ఆరాధనతో సమానం. (కొలొస్సయులు 3:5) ఇంకో కారణం ఏంటంటే, చాలావరకు అత్యాశపరులు తాము కోరుకున్నది దక్కించుకోవడం కోసం, మంచి-చెడ్డ పట్టించుకోకుండా ఎంతకైనా తెగిస్తారు. ఉదాహరణకు వాళ్లు బ్లాక్‌ మెయిల్‌, దోపిడీ, మోసం, కిడ్నాప్‌, లేదా హత్య వంటి నేరాలు చేసే అవకాశం ఉంది. అందుకే సామెతలు 28:20 ఇలా చెప్తుంది: “ధనవంతుడు అవ్వడానికి తొందరపడేవాడు నిర్దోషిగా ఉండడు.”

డబ్బు మీది మోజు వల్ల మనం పైన చెప్పినలాంటి నేరాలు చేయకపోవచ్చు, కానీ దానివల్ల హాని అయితే ఉంది. దాని గురించే బైబిలు ఇలా చెప్తుంది: “ధనవంతులు అవ్వాలని నిశ్చయించుకున్నవాళ్లు ప్రలోభంలో, ఉరిలో, ఎన్నో హానికరమైన వెర్రి కోరికల్లో చిక్కుకుంటారు.”—1 తిమోతి 6:9.

డబ్బు విషయంలో బైబిలు ఇచ్చే సలహాల్ని పాటిస్తే ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి?

డబ్బు కోసం మన నీతి-నిజాయితీల్ని, విలువల్ని వదిలేసుకోకుండా ఉంటే మన గౌరవం మనకుంటుంది, అలాగే దేవుని అనుగ్రహం, మద్దతు ఉంటాయి. దేవుణ్ణి సంతోషపెట్టాలని ఎవరైతే నిజాయితీగా ప్రయత్నిస్తారో, వాళ్లకు దేవుడు ఇలా మాటిస్తున్నాడు: “నిన్ను ఎప్పుడూ విడిచిపెట్టను, నిన్ను ఎన్నడూ వదిలేయను.” (హెబ్రీయులు 13:5, 6) ఆయన ఇంకా ఇలా చెప్తున్నాడు: “నమ్మకమైనవాడు ఎన్నో దీవెనలు పొందుతాడు.”—సామెతలు 28:20.

డబ్బు గురించి వివరించే బైబిలు వచనాలు

ప్రసంగి 7:12: “డబ్బు ... రక్షణగా ఉంటుంది.”

అంటే: డబ్బును తెలివిగా వాడితే దానివల్ల ఉపయోగాలు ఉంటాయి. అది కొంతవరకు భద్రతను ఇస్తుంది.

లూకా 12:15: “ఒక వ్యక్తికి చాలా ఆస్తిపాస్తులు ఉన్నా, అవి అతనికి జీవాన్ని ఇవ్వవు.”

అంటే: జీవితంలో డబ్బే ముఖ్యం కాదు. అది మనకు శాశ్వత జీవితాన్ని ఇవ్వలేదు.

1 తిమోతి 6:10: “డబ్బు మీది మోజు అన్నిరకాల చెడ్డవాటికి మూలం. కొందరు దాని మోజులో పడి విశ్వాసం నుండి తొలగిపోయారు, ఎన్నో బాధలతో తమను తామే పొడుచుకున్నారు.”

అంటే: డబ్బు ఉండడం తప్పు కాదు. డబ్బు మీద మోజు ఉండడం తప్పు. డబ్బే లోకంగా జీవించేవాళ్లు కష్టాల్ని కొనితెచ్చుకుంటారు. ఉదాహరణకు, కుటుంబ బంధాలు తెగిపోతాయి, అలాగే ఎక్కువ గంటలు పని చేసిచేసి వాళ్ల ఆరోగ్యం చెడిపోతుంది.

హెబ్రీయులు 13:5: “డబ్బును ప్రేమించకండి, ఉన్నవాటితో సంతృప్తిగా జీవించండి.”

అంటే: డబ్బే సర్వస్వం అనుకుంటూ దాని వెనక పరుగెత్తే బదులు, మనకు నిజంగా అవసరమైన వాటితో తృప్తిగా జీవించడం తెలివైన పని.

మత్తయి 19:24: “ధనవంతుడు దేవుని రాజ్యంలోకి ప్రవేశించడం కన్నా సూది రంధ్రం గుండా ఒంటె దూరడం తేలిక.”

అంటే: యేసు తనను అనుసరించమని బాగా డబ్బున్న ఒక యువకుడిని ఆహ్వానించాడు. అతను డబ్బును ఎక్కువగా ప్రేమించాడు కాబట్టి ఆ ఆహ్వానాన్ని ఒప్పుకోలేదు. అప్పుడు యేసు, దేవుని కంటే డబ్బును ఎక్కువగా ప్రేమించే వ్యక్తి శాశ్వత జీవితాన్ని కోల్పోయే ప్రమాదముందని హెచ్చరించాడు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి