కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ijwbq ఆర్టికల్‌ 159
  • జంతువులు పరలోకానికి వెళ్తాయా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • జంతువులు పరలోకానికి వెళ్తాయా?
  • బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • బైబిలు ఇచ్చే జవాబు
  • చనిపోయిన జంతువులకు ఏమౌతుంది?
  • జంతువులు పాపం చేస్తాయా?
  • జంతువుల పట్ల క్రూరంగా ప్రవర్తించవచ్చా?
  • పాఠకుల ప్రశ్నలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
  • జంతువుల పట్ల క్రూరత్వం—తప్పా?
    తేజరిల్లు!—1998
  • మాంసం తినడం తప్పా?
    తేజరిల్లు!—1997
  • వీగన్‌ లైఫ్‌స్టైల్‌—బైబిలు ఏం చెప్తుంది?
    అదనపు అంశాలు
మరిన్ని
బైబిలు ప్రశ్నలకు జవాబులు
ijwbq ఆర్టికల్‌ 159
ఒక కుక్క

జంతువులు పరలోకానికి వెళ్తాయా?

బైబిలు ఇచ్చే జవాబు

భూమ్మీద చాలా రకాల ప్రాణులు ఉన్నప్పటికీ, కేవలం కొద్దిమంది మనుషులే పరలోకానికి వెళ్తారని బైబిలు చెప్తుంది. (ప్రకటన 14:1, 3) అక్కడ వాళ్లు యేసుతో కలిసి రాజులుగా, యాజకులుగా పరిపాలన చేస్తారు. (లూకా 22:28-30; ప్రకటన 5:9, 10) కానీ మనుషుల్లో చాలామంది పరదైసుగా మారిన భూమ్మీద శాశ్వతంగా జీవించడానికి పునరుత్థానం అవుతారు.—కీర్తన 37:11, 29.

అయితే పెంపుడు జంతువులకు, కుక్కలకు ఒక పరలోకం ఉన్నట్లు బైబిలు చెప్పట్లేదు. అందుకు సరైన కారణమే ఉంది. ఎందుకంటే “పరలోక పిలుపు” పొందడానికి అర్హత సంపాదించే సామర్థ్యం జంతువులకు లేదు. (హెబ్రీయులు 3:1) అలా అర్హత సంపాదించాలంటే దేవుని గురించి తెలుసుకోవాలి, విశ్వాసం ఉంచాలి, దేవుని ఆజ్ఞల్ని పాటించాలి. (మత్తయి 19:17; యోహాను 3:16; 17:3) కాబట్టి కేవలం మనుషులు మాత్రమే శాశ్వతకాలం జీవించేలా సృష్టించబడ్డారు.—ఆదికాండం 2:16, 17; 3:22, 23.

చనిపోయిన ప్రాణి పరలోకానికి వెళ్లాలంటే పునరుత్థానం అవ్వాలి. (1 కొరింథీయులు 15:42) బైబిల్లో ఎన్నో పునరుత్థానాల గురించిన ప్రస్తావన ఉంది. (1 రాజులు 17:17-24; 2 రాజులు 4:32-37; 13:20, 21; లూకా 7:11-15; 8:41, 42, 49-56; యోహాను 11:38-44; అపొస్తలుల కార్యాలు 9:36-42; 20:7-12) అయితే అవన్నీ మనుషుల పునరుత్థానాలే గానీ జంతువుల పునరుత్థానాలు కాదు.

  • చనిపోయిన జంతువులకు ఏమౌతుంది?

  • జంతువులు పాపం చేస్తాయా?

  • జంతువుల పట్ల క్రూరంగా ప్రవర్తించవచ్చా?

చనిపోయిన జంతువులకు ఏమౌతుంది?

దేవుడు జంతువుల ప్రాణాన్ని, మనుషుల ప్రాణాన్ని రెండింటినీ ఒకేలా చూస్తున్నాడని బైబిలు చెప్తుంది. (సంఖ్యాకాండం 31:28) మనుషులైనా, జంతువులైనా “నేల మట్టి,” “జీవ వాయువు” నుండే తయారుచేయబడ్డాయి.—ఆదికాండం 2:7.

మనుషుల్లాగే జంతువులు కూడా చనిపోతాయని బైబిలు చెప్తుంది. (నిర్గమకాండం 19:13) చనిపోయాక మనుషులైనా, జంతువులైనా తిరిగి మట్టిలో కలిసిపోవాల్సిందే. (ప్రసంగి 3:19, 20) ఇంకో మాటలో చెప్పాలంటే అవి ఉనికిలో ఉండవు.

జంతువులు పాపం చేస్తాయా?

లేదు. పాపం చేయడం అంటే దేవుని ప్రమాణాలకు విరుద్ధంగా ఆలోచించడం, భావించడం, ప్రవర్తించడం. ఏది మంచో ఏది చెడో నిర్ణయించుకునే సామర్థ్యం ఉన్న ప్రాణులే పాపం చేయగలుగుతాయి. కానీ జంతువులకు ఆ సామర్థ్యం లేదు. అవి జీవితకాలమంతా వాటి సహజ స్వభావం ప్రకారమే ప్రవర్తిస్తాయి. (2 పేతురు 2:12) ఏ పాపం చేయకపోయినా వాటి జీవితకాలం పూర్తయ్యాక అవి చనిపోతాయి.

జంతువుల పట్ల క్రూరంగా ప్రవర్తించవచ్చా?

ప్రవర్తించకూడదు. దేవుడు మనుషులకు జంతువుల మీద అధికారం ఇచ్చాడు గానీ వాటితో క్రూరంగా ప్రవర్తించే హక్కు ఇవ్వలేదు. (ఆదికాండం 1:28; కీర్తన 8:6-8) దేవుడు చిన్నపక్షులతో సహా ప్రతీ జంతువు మీద శ్రద్ధ చూపిస్తాడు. (యోనా 4:11; మత్తయి 10:29) తన సేవకులు జంతువులతో దయగా ప్రవర్తించాలని ఆయన ఆజ్ఞాపించాడు.—నిర్గమకాండం 23:12; ద్వితీయోపదేశకాండం 25:4; సామెతలు 12:10.

జంతువుల గురించిన బైబిలు వచనాలు

ఆదికాండం 1:28: “దేవుడు వాళ్లను [మొదటి మనుషులను] దీవిస్తూ ఇలా అన్నాడు: ‘మీరు పిల్లల్ని కని, ఎక్కువమంది అయ్యి, భూమిని నింపండి, దాన్ని లోబర్చుకోండి; సముద్రంలోని చేపల్ని, ఆకాశంలో ఎగిరే ప్రాణుల్ని, భూమ్మీద కదిలే ప్రతీ జీవిని ఏలండి.’”

అర్థం: దేవుడు మనుషులకు జంతువుల మీద అధికారం ఇచ్చాడు.

ప్రసంగి 3:19, 20: “మనుషులకూ జంతువులకూ పట్టే గతి ఒక్కటే. జంతువులు చనిపోయినట్టే మనుషులు చనిపోతారు; వాటన్నిట్లో ఉన్న జీవశక్తి ఒక్కటే. జంతువులకన్నా మనుషుల గొప్పేమీ లేదు, అంతా వ్యర్థం. అన్నీ ఒకే చోటికి వెళ్తున్నాయి. అన్నీ మట్టిలో నుండే వచ్చాయి, అన్నీ మట్టిలోకే తిరిగెళ్తున్నాయి.”

అర్థం: మనుషులైనా, జంతువులైనా చనిపోయాక మట్టిలో కలిసిపోతారు.

సామెతలు 12:10: “నీతిమంతుడు తన పశువుల బాగోగులు చూసుకుంటాడు.”

అర్థం: మంచివాళ్లు తమ పెంపుడు జంతువులతోపాటు అన్ని జంతువుల మీద శ్రద్ధ చూపిస్తారు.

మత్తయి 10:29: “తక్కువ విలువగల ఒక నాణేనికి రెండు పిచ్చుకలు వస్తాయి కదా? అయినా మీ తండ్రికి తెలియకుండా వాటిలో ఒక్కటి కూడా నేలమీద పడదు.”

అర్థం: దేవుడు చిన్నపక్షులతో సహా ప్రతీ జంతువు పట్ల శ్రద్ధ చూపిస్తాడు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి