కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ijwyp ఆర్టికల్‌ 69
  • నేను ఎందుకు ప్రార్థించాలి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • నేను ఎందుకు ప్రార్థించాలి?
  • యువత అడిగే ప్రశ్నలు
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ప్రార్థన అంటే ఏమిటి?
  • దేవుడు వింటున్నాడా?
  • నేను వేటి గురించి ప్రార్థన చేయవచ్చు?
  • దేవునికి దగ్గరవ్వడానికి ప్రార్థన సహాయం చేస్తుంది
    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
  • ప్రార్థన అనే వరం
    బైబిల్లో మనం ఏమి నేర్చుకోవచ్చు?
  • మీరెలా దేవునికి సన్నిహితులు కాగలరు
    నిత్యజీవానికి నడిపించే జ్ఞానము
  • ప్రార్థనలో దేవునికి సన్నిహితమవండి
    బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది?
మరిన్ని
యువత అడిగే ప్రశ్నలు
ijwyp ఆర్టికల్‌ 69
చెరువు పక్కన కూర్చున్న ఒక టీనేజ్‌ అమ్మాయి

యువత అడిగే ప్రశ్నలు

నేను ఎందుకు ప్రార్థించాలి?

ఒక సర్వే ప్రకారం అమెరికాలో 80 శాతం యౌవనులు ప్రార్థిస్తారు, కానీ వాళ్లలో సగం మందే రోజూ ప్రార్థిస్తారు. ఆ యౌవనుల్లో కొంతమంది ఇలా ఆలోచిస్తున్నారు: ‘ప్రార్థన చేస్తే మనసు ప్రశాంతంగా ఉండడం తప్ప వేరే ప్రయోజనాలేమైనా ఉన్నాయా?’

  • ప్రార్థన అంటే ఏమిటి?

  • దేవుడు వింటున్నాడా?

  • నేను వేటి గురించి ప్రార్థన చేయవచ్చు?

  • మీ వయసువాళ్లు ఏమంటున్నారు?

ప్రార్థన అంటే ఏమిటి?

ప్రార్థన అంటే అన్నిటినీ తయారుచేసిన సృష్టికర్తతో నిజంగా మాట్లాడడం. ఆయనతో మాట్లాడడం గురించి ఒకసారి ఆలోచించండి! యెహోవా ప్రతీ విషయంలో మనుషుల కంటే ఎంతో గొప్పవాడు అయినా “ఆయన మనలో ఏ ఒక్కరికీ దూరంగా లేడు.” (అపొస్తలుల కార్యాలు 17:27) అంతేకాదు, బైబిల్లో ఈ అద్భుతమైన ఆహ్వానం ఉంది: “దేవునికి దగ్గరవ్వండి, అప్పుడు ఆయన మీకు దగ్గరౌతాడు.”—యాకోబు 4:8.

మీరు దేవునికి ఎలా దగ్గరవ్వచ్చు?

  • ఒక మార్గం ఏంటంటే ప్రార్థన చేయడం—దాని ద్వారా మీరు దేవునితో మాట్లాడవచ్చు.

  • ఇంకో మార్గం ఏంటంటే బైబిల్ని స్టడీ చేయడం—దాని ద్వారా దేవుడు మీతో “మాట్లాడతాడు.”

ఒకరితో ఒకరు ఇలా మాట్లాడుకోవడం వల్ల అంటే ప్రార్థన, బైబిలు చదవడం వల్ల మీరు దేవునితో బలమైన స్నేహాన్ని పెంచుకుంటారు.

“యెహోవాతో మాట్లాడడం అంటే సర్వోన్నతునితో సంభాషించడం, అది మనుషులకు దొరికిన అత్యంత గొప్ప గౌరవమని చెప్పవచ్చు.”​—జెరమీ.

“నా హృదయ లోతుల్లో ఉన్న ఫీలింగ్స్‌ని ప్రార్థనలో యెహోవాతో చెప్పినప్పుడు ఆయనకు మరింత దగ్గరైనట్లు నాకనిపిస్తుంది.”​—మరాండ.

దేవుడు వింటున్నాడా?

మీరు దేవున్ని నమ్మినప్పటికీ, మీకు ప్రార్థన చేసే అలవాటు ఉన్నప్పటికీ, ఆయన నిజంగా మీ ప్రార్థనల్ని వింటున్నాడని నమ్మడం కష్టంగా అనిపించవచ్చు. అయితే, బైబిలు యెహోవాను “ప్రార్థన ఆలకించువాడా” అని పిలుస్తుంది. (కీర్తన 65:2) అంతేకాదు “మీ ఆందోళనంతా ఆయన మీద వేయండి” అని మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఎందుకు? ఎందుకంటే “మీరంటే ఆయనకు పట్టింపు ఉంది కాబట్టి.”—1 పేతురు 5:7.

ఆలోచించండి: మీరు మీ క్లోస్‌ ఫ్రెండ్స్‌తో రోజూ మాట్లాడడానికి టైం తీసుకుంటారా? మీరు దేవునితో కూడా అలా మాట్లాడవచ్చు. ప్రార్థన ద్వారా ఆయనతో రోజూ మాట్లాడండి. యెహోవా అనే ఆయన పేరు ఉపయోగించి ప్రార్థన చేయండి. (కీర్తన 86:5-7; 88:9) నిజానికి బైబిలు, “ఎప్పుడూ ప్రార్థించండి” అని చెప్తుంది.—1 థెస్సలొనీకయులు 5:17.

“ప్రార్థనలో నేను నా పరలోక తండ్రితో మాట్లాడతాను, నా మనసులో ఉన్నదంతా ఆయనకు చెప్పేస్తాను.”​—మాయ్‌సెస్‌.

“నేను అమ్మతో లేదా నా క్లోస్‌ ఫ్రెండ్‌తో మాట్లాడినట్లు, ఏమి దాచుకోకుండా యెహోవాతో అన్ని విషయాలు చెప్తాను.”​—కారెన్‌.

నేను వేటి గురించి ప్రార్థన చేయవచ్చు?

బైబిలు ఇలా చెప్తుంది: “కానీ ప్రతీ విషయంలో కృతజ్ఞతలు తెలుపుతూ ప్రార్థనల ద్వారా, అభ్యర్థనల ద్వారా మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి.”—ఫిలిప్పీయులు 4:6.

అంటే మీరు మీ సమస్యల గురించి ప్రార్థించడం సరైనదేనా? అవును. నిజానికి, బైబిలు ఇలా చెప్తుంది: “నీ భారము యెహోవామీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొనును.”—కీర్తన 55:22.

నిజమే, మీరు ప్రార్థించేటప్పుడు మీ సమస్యల గురించే మాట్లాడకూడదు. “కేవలం సహాయం కోసమే నేను యెహోవాకు ప్రార్థిస్తే, నేను మంచి ఫ్రెండ్‌ని కాలేను అనిపిస్తుంది. ప్రార్థనలో ముందుగా థ్యాంక్స్‌ చెప్పాలి. అంతేకాదు, థ్యాంక్స్‌ చెప్పాల్సిన విషయాలు ఒక పెద్ద లిస్టే ఉండాలి” అని షాంటెల్‌ అనే అమ్మాయి చెప్తుంది.

ఆలోచించండి: మీ జీవితంలో మీరు వేటి గురించి థ్యాంక్స్‌ చెప్పాలనుకుంటున్నారు? యెహోవాకు ప్రార్థించేటప్పుడు ఈరోజు మీరు ఏ మూడు విషయాల గురించి థ్యాంక్స్‌ చెప్పవచ్చో ఆలోచించండి.

“మామూలు విషయాల గురించి కూడా, అంటే ఒక అందమైన పువ్వును చూసినప్పుడు కూడా యెహోవాకు ప్రార్థనలో థ్యాంక్స్‌ చెప్పవచ్చు.”​—అనీట.

“సృష్టిలో మీకు బాగా నచ్చిన ఒక విషయం గురించి లేదా మీ హృదయానికి హత్తుకున్న ఒక బైబిలు వచనం గురించి బాగా ఆలోచించండి తర్వాత దాని గురించి యెహోవాకు థ్యాంక్స్‌ చెప్పండి.”​—బ్రైయన్‌.

మీ వయసువాళ్లు ఏమంటున్నారు?

మాయ్‌సెస్‌

“మన ప్రార్థనలు చిన్న నీటి గుంట అంత లోతుగా కాదుగానీ మహాసముద్రం అంత లోతుగా ఉండాలి. యెహోవా మనకు సహాయం చేయాలనుకుంటున్నాడు. మనం అడగకముందే ఆయనకు మన అవసరాల గురించి తెలుసు. అయినప్పటికీ ప్రార్థనలో మనం చెప్పే హృదయలోతుల్లోని విషయాలు ఆయనను ఎంతగా నమ్ముతున్నామో నిరూపిస్తాయి.”​—మాయ్‌సెస్‌.

మరాండ

“ప్రార్థన ఒక తాడు లాంటిది. ఒకవైపు యెహోవా పట్టుకుంటే, ఇంకోవైపు నేను పట్టుకున్నాను. నేను బాగా ఆలోచిస్తున్న దానిగురించి ప్రార్థించినప్పుడు నేను ఆ తాడుని ఇంకా గట్టిగా పట్టుకున్నట్లు అనిపిస్తుంది. అంతేకాదు యెహోవా కూడా స్పందిస్తున్నట్లు మా ఇద్దరి మధ్య బంధం ఇంకా బలపడుతున్నట్లు అనిపిస్తుంది.”​—మరాండ.

జెరమీ

“మనం జాగ్రత్తగా లేకపోతే, ప్రార్థించినప్పుడల్లా కేవలం మనకు కావాల్సినవాటి గురించే ప్రార్థిస్తాం. అయితే, యెహోవాకు థ్యాంక్స్‌ చెప్పడం ద్వారా ఆయన మనకు ఇచ్చిన ఎన్నో మంచి విషయాల పట్ల కృతజ్ఞత చూపిస్తాం. అంతేకాదు, మన గురించే కాకుండా వేరే విషయాల గురించి కూడా ప్రార్థించగలుగుతాం.”​—జెరమీ.

షెల్బీ

“యెహోవాకు ఎంత ఎక్కువ థ్యాంక్స్‌ చెప్తే, మనలో కృతజ్ఞత అంత ఎక్కువ పెరుగుతుంది. ప్రార్థనలో యెహోవాకు థ్యాంక్స్‌ చెప్పడం ద్వారా మన సమస్యలపై దృష్టిపెట్టే బదులు మనం పొందుతున్న ఆశీర్వాదాలపై దృష్టి పెట్టగలుగుతాం.”​—షెల్బీ.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి