కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ijwyp ఆర్టికల్‌ 68
  • ప్రతీది పర్ఫెక్ట్‌గా ఉండాలనే స్వభావం నాలో ఉందా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రతీది పర్ఫెక్ట్‌గా ఉండాలనే స్వభావం నాలో ఉందా?
  • యువత అడిగే ప్రశ్నలు
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ప్రతీది పర్ఫెక్ట్‌గా ఉండాలని కోరుకోవడం తప్పా?
  • దీనికి ఏదైనా పరిష్కారం ఉందా?
  • పరిపూర్ణతను సాధించాలనే మనస్తత్త్వాన్ని ఎందుకు అధిగమించాలి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
  • పరిపూర్ణ జీవితం కేవలమొక కల కాదు!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
  • నాకు ఎవరైనా సలహా ఇస్తే ఎలా స్పందించాలి?
    యువత అడిగే ప్రశ్నలు
  • మనం ఆశించే వాటి విషయమై మనమెందుకు సహేతుకంగా ఉండాలి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
మరిన్ని
యువత అడిగే ప్రశ్నలు
ijwyp ఆర్టికల్‌ 68
గుర్రం బొమ్మ పర్ఫెక్ట్‌గా గీయాలని ప్రయత్నిస్తున్న టీనేజీ పిల్లాడు

యువత అడిగే ప్రశ్నలు

ప్రతీది పర్ఫెక్ట్‌గా ఉండాలనే స్వభావం నాకుందా?

ఒకవేళ మీరు

  • ఎప్పుడూ ఫస్ట్‌ ర్యాంక్‌ రావాలని కోరుకుంటుంటే

  • పర్ఫెక్ట్‌గా చేయలేనన్న భయంతో ఏదైనా కొత్త పని చేయడానికి వెనకడుగు వేస్తుంటే

  • ఇతరులు సలహా ఇచ్చినప్పుడు అవమానంలా భావిస్తుంటే

. . . , అప్పుడు పైన అడిగిన ప్రశ్నకు జవాబు అవును. కానీ అదంత ప్రాముఖ్యమైన విషయమా?

  • ప్రతీది పర్ఫెక్ట్‌గా ఉండాలని కోరుకోవడం తప్పా?

  • దీనికి ఏదైనా పరిష్కారం ఉందా?

  • మీ వయసువాళ్లు ఏమంటున్నారు?

ప్రతీది పర్ఫెక్ట్‌గా ఉండాలని కోరుకోవడం తప్పా?

మీరు చేయగలిగినదంతా చేయాలనుకోవడంలో తప్పులేదు. అయితే, “చేయగలిగినదంతా చేయడానికి, చేయలేనిది కూడా చేయాలనుకోవడానికి మధ్య చాలా తేడా ఉంది. పర్ఫెక్ట్‌గా ఉండాలనుకోవడం మనకో భారంగా తయారవ్వగలదు. ఎందుకంటే ఎవ్వరూ పర్ఫెక్ట్‌ కాదు” అని పర్ఫెక్షనిజమ్‌​—వాట్స్‌ బ్యాడ్‌ ఎబౌట్‌ బీంగ్‌ టూ గుడ్‌? అనే పుస్తకం చెప్తుంది.

బైబిలు కూడా అదే చెప్తుంది, ‘అస్సలు పాపం చేయకుండా ఎప్పుడూ మంచి చేసే నీతిమంతుడు భూమ్మీద ఒక్కడు కూడా లేడు.’ (ప్రసంగి 7:20, NW) మనం పరిపూర్ణులం కాదు కాబట్టి, ప్రతీ పనిని పర్ఫెక్ట్‌గా చేయలేకపోవచ్చు.

ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారా? అయితే, ప్రతీది పర్ఫెక్ట్‌గా చేయాలనుకునే స్వభావం, ఏ నాలుగు విషయాల మీద ప్రభావం చూపిస్తుందో గమనించండి.

  1. మిమ్మల్ని మీరు చూసుకునే విధానం. పర్ఫెక్ట్‌గా ఉండాలనుకునే వ్యక్తి, చేరుకోలేని మరీ కష్టమైన లక్ష్యాలు పెట్టుకుంటాడు, ఆఖరికి నిరుత్సాహపడతాడు. ఎలీసా అనే అమ్మాయి ఇలా చెప్తుంది: “వాస్తవానికి, మనం ప్రతీ పనిని పర్ఫెక్ట్‌గా చేయలేం. అలా చేయలేనప్పుడల్లా నిరుత్సాహపడి, చివరికి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతాం. అప్పుడు ఇంకా కృంగిపోతాం.”

  2. ఇతరుల సలహాను చూసే విధానం. పర్ఫెక్ట్‌గా ఉండాలనుకునేవాళ్లు, ఇతరులు సలహా ఇస్తే తమను అవమానించినట్లు భావిస్తారు. “నాకు ఎవరైనా సలహా ఇస్తే భరించలేను” అని జరమీ చెప్తున్నాడు. ఆయన ఇంకా ఇలా అంటున్నాడు: “పర్ఫెక్ట్‌గా ఉండాలని చూసేవాళ్లు తమ పరిమితుల్ని గుర్తించలేరు, ఇతరుల సలహాలను తీసుకోలేరు”.

  3. మీరు ఇతరుల్ని చూసే విధానం. ప్రతీది పర్ఫెక్ట్‌గా చేయాలనుకునే వాళ్లు, ఇతరుల్ని తరచూ విమర్శిస్తుంటారు. కారణం ఏంటంటే, “పర్ఫెక్ట్‌గా ఉండాలనుకునే వాళ్లు, ఇతరుల నుండి కూడా అదే ఆశిస్తారు. ఎవరైనా వాళ్లు అనుకున్నట్లు లేకపోతే తెగ బాధపడిపోతారు” అని 18 ఏళ్ల యానా చెప్తోంది.

  4. ఇతరులు మిమ్మల్ని చూసే విధానం. మీరు ఇతరుల నుండి పర్ఫెక్షన్‌ ఆశిస్తే, వాళ్లు మిమ్మల్ని దూరం పెడతారు! అందులో ఆశ్చర్యం లేదు. “పర్ఫెక్ట్‌గా ఉండాలనుకునే వ్యక్తి ఇతరుల నుండి మరీ ఎక్కువ ఆశిస్తాడు. కాబట్టి అలాంటి వాళ్ల దగ్గరికి రావడానికి ఎవ్వరూ ఇష్టపడరు” అని బెత్‌ అనే యువతి చెప్తోంది.

దీనికి ఏదైనా పరిష్కారం ఉందా?

బైబిలు ఇలా చెప్తుంది: “మీరు మొండిపట్టు పట్టే ప్రజలు కాదని అందరికీ తెలియనివ్వండి.” (ఫిలిప్పీయులు 4:5) సహేతుకంగా ఉండేవాళ్లు, తమ నుండి అలాగే ఇతరుల నుండి పర్ఫెక్షన్‌ ఆశించకుండా సమతుల్యంగా ఉంటారు.

“ఇప్పటికే బయట నుండి చాలా ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నాం. ఇక అన్నీ పర్ఫెక్ట్‌గా ఉండాలనే ఆలోచనతో ఆ ఒత్తిడిని ఇంకా పెంచుకోవడం ఎందుకు? ఆ ఒత్తిళ్లన్నిటిని భరించడం చాలా కష్టం!”​—నైలా.

‘అణకువ కలిగి నీ దేవునితో నడువు’ అని బైబిలు చెప్తుంది. (మీకా 6:8, NW) అణకువగల వాళ్లు తమ పరిమితుల్ని గుర్తిస్తారు. వాళ్లు చేయలేని పనుల్ని ఒప్పుకోరు; అలాగే ఏదైనా పని చేయడానికి తమ శక్తికి మించి సమయాన్ని పెట్టరు.

“నేను చేయగలిగే పనుల్నే ఒప్పుకుంటాను, నా శాయశక్తులా కృషిచేస్తాను. అప్పుడే నా పనుల్ని బాగా చేస్తున్నాననే సంతృప్తి కలుగుతుంది.”​—హేలీ.

“నీ చేతికి వచ్చిన యే పనినైనను నీ శక్తిలోపము లేకుండ చేయుము” అని బైబిలు చెప్తుంది. (ప్రసంగి 9:10) కాబట్టి అన్నీ పర్ఫెక్ట్‌గా చేయాలని చూడొద్దంటే సోమరిపోతుల్లా ఉండమని కాదు. బదులుగా కష్టపడి పనిచేయాలి, ఆ కష్టానికి పైన చెప్పిన సహేతుకత, అణకువ వంటి లక్షణాల్ని జోడించాలి.

“నాకిచ్చిన పనిని చేయడానికి నా శక్తిమేర కృషిచేస్తాను. ఆ పనిని పర్ఫెక్ట్‌గా చేయలేనని తెలుసు, కానీ ఆ పనిచేయడానికి నేను చేయగలిగినదంతా చేశాననే తృప్తి నాకు చాలు.”​—జాషువ.

మీ వయసువాళ్లు ఏమంటున్నారు?

సియారా

“అన్నీ పర్ఫెక్ట్‌గా చేయాలని చూస్తే ఒత్తిడి పెరుగుతుంది. ఎవరైనా మనకి సలహా ఇచ్చినప్పుడు బాధగా ఉంటుంది. పొరపాట్లను ఓటమిలా చూసే బదులు, వాటి నుండి పాఠాలు నేర్చుకోవడం మంచిది.”​—సియారా.

బో

“ప్రతీది పర్ఫెక్ట్‌గా ఉండాలని చూస్తే, జీవితంలో ఎన్నో ఆనందాల్ని కోల్పోతారు. అంతేకాదు, మీరు మీ స్నేహితుల్ని చీటికిమాటికి విమర్శించడం వల్ల లేదా వాళ్లని పనికిరాని వాళ్లలా చూడడం వల్ల, వాళ్లు మీకు దూరమౌతారు.”​—బో.

సరీనా

“రోజుకి 24 గంటలు మాత్రమే ఉంటాయి. ఆ సమయంలోనే చాలా పనులు చేసుకోవాలి. కాబట్టి ప్రతీ చిన్న దానికి ఎక్కువ సమయం వెచ్చిస్తే తినడం, నిద్రపోవడం వంటి ముఖ్యమైన పనులకు సమయం ఉండదు.”​—సరీనా.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి