కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ijwfq ఆర్టికల్‌ 55
  • యెహోవాసాక్షులు ఇతర మతాల ఆచారాల్ని కూడా పాటిస్తారా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవాసాక్షులు ఇతర మతాల ఆచారాల్ని కూడా పాటిస్తారా?
  • తరచూ అడిగే ప్రశ్నలు
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఇతర మతాలవాళ్లతో యెహోవాసాక్షులు మాట్లాడతారా?
  • అన్ని మతాలు ఒక్కటే అనే నమ్మకం విషయంలో యెహోవాసాక్షుల అభిప్రాయం ఏమిటి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2010
  • పాఠకుల ప్రశ్నలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2002
  • యెహోవాసాక్షులు నిజమైన క్రైస్తవులా?
    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
  • మీ నమ్మకాలకు ఆధారం ఏమిటి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
మరిన్ని
తరచూ అడిగే ప్రశ్నలు
ijwfq ఆర్టికల్‌ 55
వేర్వేరు వ్యక్తులు తమ మతాన్ని తెలిపే బట్టలు వేసుకుని ఉన్నారు

యెహోవాసాక్షులు ఇతర మతాల ఆచారాల్ని కూడా పాటిస్తారా?

యెహోవాసాక్షులముగా, విశ్వాసానికి సంబంధించిన విషయాలను అన్ని మతాలవాళ్లతో మేం సంతోషంగా మాట్లాడుతుంటాం. కానీ ఆరాధన విషయానికొస్తే, ఇతర నమ్మకాలున్న వాళ్లతో కలిసి వాళ్ల ఆరాధనలో పాలుపంచుకోం. నిజ క్రైస్తవులు ‘చక్కగా అమర్చబడి’ ఉన్నారని బైబిలు చెప్తోంది. అలా ఉండడానికి గల ముఖ్య కారణం ఏమిటంటే ఒకేలాంటి నమ్మకాలు ఉండడం. (ఎఫెసీయులు 4:16; 1 కొరింథీయులు 1:10; ఫిలిప్పీయులు 2:2) అంటే ప్రేమ, కనికరం, క్షమాగుణం వంటి లక్షణాల విలువను మేం అందరం ఒకేలా గుర్తించామని మాత్రమే కాదు. మా మత నమ్మకాలన్నీ బైబిల్లో ఉన్న ఖచ్చితమైన జ్ఞానంపై ఆధారపడి ఉన్నాయి. ఆ జ్ఞానం లేకపోతే మాకు విశ్వాసం లేనట్లే.—రోమీయులు 10:2, 3.

వేరే నమ్మకాలున్న ప్రజలతో కలిసి వాళ్ల ఆరాధనలో పాలుపంచుకోవడాన్ని, ఒకే లాంటి ఎత్తులో లేని కాడి కింద ఉండడంతో బైబిలు పోలుస్తోంది. అలా చేయడం వల్ల క్రైస్తవుల విశ్వాసానికి హాని కలుగుతుంది. (2 కొరింథీయులు 6:14-17) అందుకే తన శిష్యుల్ని వేరే మతాల నమ్మకాల్ని పాటించడానికి యేసు అనుమతించలేదు. (మత్తయి 12:30; యోహాను 14:6) అదేవిధంగా మోషే ద్వారా దేవుడిచ్చిన ధర్మశాస్త్రంలో, పొరుగువాళ్లతో కలిసి వాళ్ల ఆరాధనలో భాగం వహించడానికి దేవుడు ప్రాచీన కాలంలోని ఇశ్రాయేలీయులకు అనుమతివ్వలేదు. (నిర్గమకాండము 34:11-14) వేరే మతంవాళ్లు తమకు సహాయం చేస్తామని వచ్చినప్పుడు నమ్మకమైన ఇశ్రాయేలీయులు దాన్ని తిరస్కరించారు. ఎందుకంటే వాళ్ల సహాయం తీసుకుంటే వాళ్ల మతాచారాలతో సంబంధం పెట్టుకునే అవకాశం ఉండేది.—ఎజ్రా 4:1-3.

ఇతర మతాలవాళ్లతో యెహోవాసాక్షులు మాట్లాడతారా?

మాట్లాడతారు. అపొస్తలుడైన పౌలులాగే, మేం కూడా పరిచర్యలో “ఎంతమందిని వీలైతే అంతమందిని” కలిసి వాళ్ల ఆలోచనల్ని, అవగాహనల్ని అర్థంచేసుకోవడానికి కృషిచేస్తాం. (1 కొరింథీయులు 9:19-22) అలా ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు, అవతలి వ్యక్తి పట్ల “ప్రగాఢ గౌరవం” చూపించాలనే బైబిలు సలహాను పాటించడానికి మనస్ఫూర్తిగా ప్రయత్నిస్తాం.—1 పేతురు 3:15.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి