కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ijwbq ఆర్టికల్‌ 108
  • ప్రవచనం అంటే ఏంటి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రవచనం అంటే ఏంటి?
  • బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • బైబిలు ఇచ్చే జవాబు
  • బైబిలును దేవుడు ఎలా ప్రేరేపించాడు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • ఎవరైనా ఎప్పుడైనా దేవుణ్ణి చూశారా?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • నాటి, నేటి ప్రజలకు యెహోవా ఇచ్చిన సందేశాలు
    యెహోవా మహాదినాన్ని మనసులో ఉంచుకొని జీవించండి
  • గొప్ప మోషేగా యేసు పాత్రను గుర్తించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2009
మరిన్ని
బైబిలు ప్రశ్నలకు జవాబులు
ijwbq ఆర్టికల్‌ 108
బాప్తిస్మమిచ్చే యోహాను

ప్రవచనం అంటే ఏంటి?

బైబిలు ఇచ్చే జవాబు

ప్రవచనం అంటే దైవప్రేరణతో చెప్పిన సందేశం లేదా దేవుడు బయల్పర్చిన సందేశం. ప్రవక్తలు ‘పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపించబడి’ దేవుని నుండి వచ్చిన విషయాలు తెలియజేశారు అని బైబిలు చెప్తుంది. (2 పేతురు 1:20, 21) కాబట్టి ప్రవక్త అంటే, దేవుని సందేశాన్ని అందుకొని, దాన్ని ఇతరులకు చేరవేసే వ్యక్తి అని అర్థం.—అపొస్తలుల కార్యములు 3:18.

దేవుడు తన సందేశాన్ని ప్రవక్తలకు ఎలా అందజేశాడు?

దేవుడు తన సందేశాన్ని ప్రవక్తలకు చేరవేయడానికి ఎన్నో పద్ధతులు ఉపయోగించాడు:

  • రాతపూర్వకంగా తెలియజేశాడు. దేవుడు ఈ పద్ధతిని కనీసం ఒక సందర్భంలో ఉపయోగించాడు. ఆయన పది ఆజ్ఞల్ని రాసి మోషేకు ఇచ్చాడు.—నిర్గమకాండము 31:18.

  • దూతల ద్వారా మాట్లాడాడు. ఉదాహరణకు, మోషే ఫరో దగ్గరికి వెళ్లి ఏం చెప్పాలో, దేవుడు ఒక దూత ద్వారా అతనికి తెలియజేశాడు. (నిర్గమకాండము 3:2-4, 10) అయితే, ఫలానా పదాలే ఉపయోగించాలి అనుకున్నప్పుడు మాత్రం, దేవుడు దూతల ద్వారా తన సందేశాన్ని మనుషులకు చెప్పించి, ఉన్నదున్నట్లుగా రాయించాడు. ఆయన మోషేకు ఇలా చెప్పాడు, ‘ఇప్పుడు చెప్పిన ఈ మాటలు రాసుకో. ఎందుకంటే, ఈ మాటల ప్రకారం నేను నీతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఒడంబడిక చేశాను.’—నిర్గమకాండము 34:27, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన పహితం.a

  • దర్శనాల ద్వారా తెలియజేశాడు. దర్శనాలు కొన్నిసార్లు, ప్రవక్త మెలకువగా పూర్తి స్పృహతో ఉన్నప్పుడు కలిగేవి. (యెషయా 1:1; హబక్కూకు 1:1) కొన్ని దర్శనాలు ఎంత స్పష్టంగా ఉండేవంటే, ప్రవక్త కూడా వాటిలో భాగం వహించేవాడు. (లూకా 9:28-36; ప్రకటన 1:10-17) మరికొన్నిసార్లు, ప్రవక్త పరవశుడై ఉన్నప్పుడు దర్శనాలు కలిగేవి. (అపొస్తలుల కార్యములు 10:10, 11; 22:17-21) అంతేకాదు, ప్రవక్త నిద్రపోతున్నప్పుడు కలల ద్వారా కూడా దేవుడు తన సందేశాన్ని తెలియజేశాడు.—దానియేలు 7:1; అపొస్తలుల కార్యములు 16:9, 10.

  • ప్రవక్తల ఆలోచనల్ని నిర్దేశించాడు. తన సందేశాన్ని తెలియజేయడానికి, దేవుడు ప్రవక్తల ఆలోచనల్ని నిర్దేశించాడు. ఆ విషయాన్నే బైబిలు ఇలా చెప్తుంది, “లేఖనాలన్నీ దైవావేశంవల్ల కలిగినవి.” (2 తిమోతి 3:16, 17, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం) “దైవావేశం” అనే మాటను, “దేవుడు ఊదాడు” అని ది ఎంఫసైజ్డ్‌ బైబిల్‌ అనువదించింది. దేవుడు పరిశుద్ధాత్మను, అంటే చురుకైన శక్తిని ఉపయోగించి, తన ఆలోచనల్ని తన సేవకుల మనసుల్లోకి “ఊదాడు.” సందేశం దేవునిదే, కాకపోతే పదాల్ని ఎంచుకుని రాసింది మాత్రం ప్రవక్తలు.—2 సమూయేలు 23:1, 2.

ప్రవచనాలు ఎప్పుడూ భవిష్యత్తు గురించే చెప్తాయా?

లేదు. బైబిలు ప్రవచనాలు కేవలం భవిష్యత్తు గురించే చెప్పవు. అయితే చాలా ప్రవచనాలు సూటిగా కాకపోయినా, పరోక్షంగా అయినా భవిష్యత్తు గురించే చెప్పాయి. ఉదాహరణకు, చెడ్డ పనుల్ని విడిచిపెట్టమని, దేవుని ప్రవక్తలు ఇశ్రాయేలీయుల్ని పదేపదే హెచ్చరించారు. దేవుని మాట వింటే భవిష్యత్తులో ఎలాంటి ఆశీర్వాదాలు వస్తాయో, వినకపోతే ఎలాంటి కష్టాలు వస్తాయో వాళ్లు హెచ్చరించారు. (యిర్మీయా 25:4-6) అయితే, ఇశ్రాయేలీయులకు ఆశీర్వాదాలు వస్తాయా లేక కష్టాలు వస్తాయా అన్నది, వాళ్లు ఎంచుకునే ప్రవర్తనను బట్టే ఉంటుంది.—ద్వితీయోపదేశకాండము 30:19, 20.

కొన్ని బైబిలు ప్రవచనాలు భవిష్యత్తు గురించి చెప్పట్లేదు. ఉదాహరణకు:

  • ఒక సందర్భంలో ఇశ్రాయేలీయులు, సహాయం చేయమని దేవుణ్ణి అడిగారు. అప్పుడు, ఆయన ఒక ప్రవక్తను పంపించి, వాళ్లు తన ఆజ్ఞలు పాటించలేదు కాబట్టి వాళ్లకు సహాయం చేయనని ఆ ప్రవక్త ద్వారా తెలియజేశాడు.—న్యాయాధిపతులు 6:6-10.

  • యేసు సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు, గతంలో ఆమె చేసిన పనుల గురించి ఆయన వెల్లడిచేశాడు. దేవుని ప్రేరణతోనే యేసు అలా చెప్పగలిగాడు. ఆ సందర్భంలో ఆయన భవిష్యత్తు గురించి ఏమీ చెప్పకపోయినా, ఆయనొక ప్రవక్త అని ఆమె గుర్తించింది.—యోహాను 4:17-19.

  • ఒక సందర్భంలో శత్రువులు యేసు ముఖాన్ని కప్పి ఆయన్ని కొట్టారు. ‘నిన్ను కొట్టినవాడెవడో ప్రవచించు’ అని ఎగతాళి చేశారు. వాళ్లు భవిష్యత్తు గురించి చెప్పమని అడగట్లేదు. బదులుగా, తనను కొట్టిందెవరో దేవుని సహాయంతో చెప్పమని అడుగుతున్నారు.—లూకా 22:63, 64.

a  ఈ సందర్భంలో దేవుడే స్వయంగా మోషేతో మాట్లాడినట్లు అనిపించవచ్చు. కానీ, దేవుడు దూతల ద్వారా మోషేకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడని బైబిలు చెప్తుంది.—అపొస్తలుల కార్యములు 7:53; గలతీయులు 3:19.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి