కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ijwfq ఆర్టికల్‌ 34
  • యెహోవాసాక్షులకు సొంత బైబిలు ఉందా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవాసాక్షులకు సొంత బైబిలు ఉందా?
  • తరచూ అడిగే ప్రశ్నలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • దేవుని వాక్య ప్రేమికులకు ఒక మైలురాయి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ పట్ల ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది కృతజ్ఞతాభావంతో ఉన్నారు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
  • కొత్తలోక అనువాదం ఖచ్చితమైనదేనా?
    తరచూ అడిగే ప్రశ్నలు
  • తేలిగ్గా అర్థమయ్యే ఓ బైబిలు అనువాదం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2015
మరిన్ని
తరచూ అడిగే ప్రశ్నలు
ijwfq ఆర్టికల్‌ 34
ఒకతను బైబిలు చదువుతున్నాడు

యెహోవాసాక్షులకు సొంత బైబిలు ఉందా?

యెహోవాసాక్షులం బైబిలును అధ్యయనం చేయడానికి ఎన్నో అనువాదాలు ఉపయోగించాం. అయితే, ఏదైనా భాషలో పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం అందుబాటులో ఉంటే, ఆ భాషలో మేము దాన్ని ఉపయోగించడానికే ఇష్టపడతాం. ఎందుకంటే, అందులో దేవుని పేరు ఉంటుంది, దాన్ని ఉన్నదున్నట్టుగా అనువదించారు, అది స్పష్టంగా ఉంటుంది.

  • దేవుని పేరు. బైబిలును ప్రచురించిన కొంతమంది ప్రచురణకర్తలు దాని రచయితకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదు. ఉదాహరణకు, ఒక బైబిలు అనువాదంలో, దాని తయారీకి ఏదోవిధంగా సహాయం చేసిన 70 మంది పేర్లను వరుసగా రాశారు. కానీ, దాని రచయిత అయిన యెహోవా దేవుని పేరును మాత్రం వాళ్లు పూర్తిగా వదిలేశారు!

    కొత్త లోక అనువాదంలో మాత్రం అలా జరగలేదు. మూలభాషలో దేవుని పేరున్న ప్రతీచోట, కొత్త లోక అనువాదంలో కూడా ఆ పేరు ఉంది. అలా దేవుని పేరు అందులో వేలాదిసార్లు కనిపిస్తుంది. కానీ దాన్ని తయారుచేసిన కమిటీలోని వాళ్ల పేర్లు మాత్రం అందులో ప్రచురించలేదు.

  • ఉన్నదున్నట్టుగా అనువదించారు. చాలా అనువాదాలు బైబిల్లోని అసలైన సందేశాన్ని ఉన్నదున్నట్టుగా చెప్పట్లేదు. ఉదాహరణకు, ఒక అనువాదంలో మత్తయి 7:13 ఇలా ఉంది: “నరకానికి వెళ్ళే మార్గము సులభంగా ఉంటుంది. దాని ద్వారం విశాలంగా ఉంటుంది.” నిజానికి అక్కడ, మూలభాషలో ‘నరకం’ అనే పదం లేదు, ‘నాశనం’ అనే పదం ఉంది. అయితే చెడ్డవాళ్లంతా నరకాగ్నిలో నిత్యయాతన అనుభవిస్తారని నమ్మడం వల్ల బహుశా ఆ అనువాదకులు ‘నరకం’ అనే పదాన్ని చేర్చివుంటారు. కానీ ఆ నమ్మకానికి బైబిల్లో ఎలాంటి ఆధారం లేదు. అందుకే, కొత్త లోక అనువాదం ఆ వచనాన్ని ఉన్నదున్నట్టుగా ఇలా అనువదించింది: “నాశనానికి నడిపించే ద్వారం వెడల్పుగా, ఆ దారి విశాలంగా ఉంది.”

  • స్పష్టంగా అనువదించారు. మంచి అనువాదం అంటే, ఉన్నదున్నట్టుగా మాత్రమే కాదు, అర్థం చేసుకోవడానికి సులువుగా ఉండేలా అనువదించాలి. ఓ ఉదాహరణ చూడండి. మత్తయి 5:3 లో యేసు చెప్పిన మాటకు, “ఆత్మవిషయమై దీనులైనవారు ధన్యులు” అనేది అక్షరార్థం. కానీ ఈ రోజుల్లో ప్రజలకు ఆ మాట అర్థం కాదు కాబట్టి, కొత్త లోక అనువాదం ఆ వచనాన్ని సులువుగా అర్థమయ్యేలా అనువదించింది. అది ఇలా ఉంది: “దేవుని నిర్దేశం తమకు అవసరమని గుర్తించేవాళ్లు సంతోషంగా ఉంటారు.”

దేవుని పేరును ఉపయోగించడం, ఉన్నదున్నట్టుగా, స్పష్టంగా అనువదించడంతోపాటు కొత్త లోక అనువాదం బైబిలుకు మరో ప్రత్యేకత కూడా ఉంది. అదేమిటంటే, దాన్ని ఉచితంగా పంచిపెడుతున్నారు. దాని ఫలితంగా లక్షలాది ప్రజలు తమ మాతృభాషలో బైబిలును చదవగలుగుతున్నారు. వాళ్లలో, బైబిలును డబ్బులిచ్చి కొనుక్కోలేనివాళ్లు కూడా ఉన్నారు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి