కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ijwfq ఆర్టికల్‌ 33
  • యెహోవాసాక్షులు ప్రొటస్టెంటులా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవాసాక్షులు ప్రొటస్టెంటులా?
  • తరచూ అడిగే ప్రశ్నలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • యెహోవాసాక్షులది ప్రొటస్టెంట్‌ మతమా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2010
  • లాటిన్‌ అమెరికా చర్చి సంకటంలో ఉంది—లక్షల ప్రజలెందుకు విడిచి వెళ్తున్నారు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • నిర్ణయించుకోడానికి ఇదే ఎందుకు సమయము?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
తరచూ అడిగే ప్రశ్నలు
ijwfq ఆర్టికల్‌ 33
ఒక యెహోవాసాక్షి తన పక్కింటి ఆయనకు బైబిలు నుండి తన నమ్మకాల గురించి చెప్తున్నాడు

యెహోవాసాక్షులు ప్రొటస్టెంటులా?

కాదు. యెహోవాసాక్షులు క్రైస్తవులే, కానీ ప్రొటస్టెంట్లు కాదు. ఎందుకు?

ప్రొటస్టెంటు మతం అనేది “రోమన్‌ క్యాథోలిక్‌ చర్చికి వ్యతిరేకంగా ప్రారంభమైన మత ఉద్యమం.” మేము కూడా క్యాథోలిక్‌ చర్చి బోధలతో ఏకీభవించం. అయితే, ఈ కింది కారణాల్నిబట్టి మేము ప్రొటస్టెంట్లం కాము:

  1. ప్రొటస్టెంట్లకున్న చాలా నమ్మకాలకూ బైబిలు నిజంగా బోధిస్తున్నదానికీ పొంతనలేదు. ఉదాహరణకు, “దేవుడు త్రిత్వం కాదని,” “దేవుడు ఒక్కడే” అని బైబిలు చెబుతోంది. (1 తిమోతి 2:5; యోహాను 14:28) దేవుడు దుష్టులను పూర్తిగా నాశనం చేసి వాళ్లను శిక్షిస్తాడని, నరకంలో శిక్షించడనికూడా అది స్పష్టంగా చెబుతోంది.—కీర్తన 37:9; 2 థెస్సలొనీకయులు 1:9.

  2. క్యాథోలిక్‌ చర్చికి లేదా వేరే మత గుంపుకు వ్యతిరేకంగా మేము నిరసన (protest) గానీ, వాటిని మార్చే ప్రయత్నం గానీ చేయం. అయితే, మేము దేవుని రాజ్య సువార్తను ప్రకటించి, ఆ సువార్త మీద ఇతరులు నమ్మకం పెంచుకునేందుకు సహాయం చేస్తాం. (మత్తయి 24:14; 28:19, 20) ఇతర మత గుంపుల్లో ఉన్న తప్పులు సరిదిద్దాలనే లక్ష్యం మాకు లేదు. ఆసక్తి ఉన్నవాళ్లకు దేవుని గురించి, ఆయన వాక్యమైన బైబిలు గురించి వాస్తవాలు బోధించడమే మా లక్ష్యం.—కొలొస్సయులు 1:9, 10; 2 తిమోతి 2:24, 25.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి