కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ijwyp ఆర్టికల్‌ 19
  • నేనెందుకు కోసుకుంటాను?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • నేనెందుకు కోసుకుంటాను?
  • యువత అడిగే ప్రశ్నలు
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • కోసుకోవడం అంటే ఏంటి?
  • ప్రజలు ఎందుకలా చేస్తుంటారు?
  • మీకూ ఇలాంటి సమస్య ఉంటే మీరు దాన్నెలా పరిష్కరించుకోవచ్చు?
  • ఆమె అనేకుల జీవితాలను ప్రభావితం చేసింది
    తేజరిల్లు!—1995
  • నా ఆరోగ్య సమస్యతో నేనెలా జీవించాలి? (3వ భాగం)
    యువత అడిగే ప్రశ్నలు
  • ‘నీతిమంతులు యెహోవానుబట్టి సంతోషిస్తారు’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2018
  • సమస్యల నెదుర్కొనుటకు దేవునితోటి సన్నిహితత్వం నాకు సహాయపడింది
    తేజరిల్లు!—1993
మరిన్ని
యువత అడిగే ప్రశ్నలు
ijwyp ఆర్టికల్‌ 19

యువత అడిగే ప్రశ్నలు

నేనెందుకు కోసుకుంటాను?

  • కోసుకోవడం అంటే ఏంటి?

  • ప్రజలు ఎందుకలా చేస్తుంటారు?

  • మీకూ ఇలాంటి సమస్య ఉంటే మీరు దాన్నెలా పరిష్కరించుకోవచ్చు?

  • ఇంటర్వ్యూ

  • ఈ ప్రశ్నలకు జవాబు ఇవ్వండి

  • నా లేఖనాల పుస్తకం

కోసుకోవడం అంటే ఏంటి?

ఏదైనా పదునైన వస్తువుతో బలవంతంగా హాని చేసుకోవడాన్ని కోసుకోవడం అంటారు. తమకుతాము హాని-చేసుకోవడంలో ఇదొక పద్ధతి. కాల్చుకోవడం, గాయం చేసుకోవడం, వాళ్లంతట వాళ్లే కొట్టుకోవడం లాంటి ఇంకొన్ని పద్ధతులు కూడా ఉన్నాయి. ఈ ఆర్టికల్‌ కోసుకోవడం గురించి మాట్లాడుతున్నా, ఇందులో చెప్పిన విషయాలు మిగతా వాటికి కూడా వర్తిస్తాయి.

మీకు ఎంతవరకు తెలుసో చూసుకోండి: అవును/కాదు.

  1. కేవలం అమ్మాయిలే కోసుకుంటారు.

  2. కోసుకుంటే “మీ దేహమును చీరుకొనకూడదు” అని లేవీయకాండము 19:28 లో బైబిలు చెప్పిన మాటలు మీరినట్లు అవుతుంది.

సరైన జవాబులు:

  1. కాదు. ఈ సమస్య అమ్మాయిల్లో ఎక్కువగా కనిపించినా, కొంతమంది అబ్బాయిలు కూడా కోసుకోవడం లేదా మరో విధంగా తమనుతాము గాయపర్చుకోవడం లాంటివి చేస్తుంటారు.

  2. కాదు. లేవీయకాండము 19:28 ఒక ప్రాచీనకాల అన్యమత ఆచారం గురించి చెప్తుందే గానీ ఈ ఆర్టికల్లో చర్చిస్తున్నట్లు తమకుతాము హాని చేసుకోవడం గురించి కాదు. అయితే, మన ప్రేమగల సృష్టికర్త మనకి మనం హాని చేసుకోవాలని ఖచ్ఛితంగా కోరుకోడు.—1 కొరింథీయులు 6:12; 2 కొరింథీయులు 7:1; 1 యోహాను 4:8.

ప్రజలు ఎందుకలా చేస్తుంటారు?

మీకు ఎంతవరకు తెలుసో చూసుకోండి: ఇందులో ఏ వాక్యం సరైనదని మీరు అనుకుంటున్నారు?

ప్రజలు ఎందుకు కోసుకుంటారంటే . . .

  1. మానసికంగా వాళ్లు అనుభవించే బాధతో పోరాడడానికి.

  2. చనిపోవడానికి.

సరైన జవాబు: ఎ. నిజానికి అలా కోసుకునే చాలామంది చనిపోవాలని అనుకోరు. వాళ్లకు మానసికంగా ఉన్న బాధను తగ్గించుకోవడానికే అలా చేస్తారు.

ఇలా కోసుకునే అలవాటున్న కొంతమంది యౌవనులు దాని గురించి ఏం చెప్తున్నారో గమనించండి:

సీల్‌యా : “అలా కోసుకున్నప్పుడు నాకు హాయిగా అనిపించేది.”

టమారా : “మనసులోని బాధను తప్పించుకోవడానికి అదొక ప్రయత్నం. శరీరానికి కలిగే బాధ మనసుకు కలిగే బాధకంటే ఎంతో నయం.”

క్యారీ : “దిగులు పడడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. అందుకే నా దృష్టిని బాధపెట్టే ఆలోచనల మీద నుండి, నా శరీరానికి కలిగే బాధవైపుకు మరల్చుకోవడానికి నేను కోసుకుంటాను.”

జరీన్‌: “నేను కోసుకున్న ప్రతీసారి నా చుట్టుపక్కల ఏం జరుగుతుందో నాకు తెలిసేదికాదు. ఇక నేను నా సమస్యల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అలా ఉంటే నాకు బాగుంటుంది.”

మీకూ ఇలాంటి సమస్య ఉంటే మీరు దాన్నెలా పరిష్కరించుకోవచ్చు?

ఈ బాధనుండి కోలుకునేందుకు యెహోవా దేవునికి ప్రార్థించడం ఒక మంచి పద్ధతి. బైబిలు ఇలా చెప్తుంది, “ఆయన మిమ్మునుగూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయనమీద వేయుడి.”​—1 పేతురు 5:7.

సలహా: చిన్నచిన్న ప్రార్థనలతో ప్రారంభించండి. బహుశా యెహోవాని “నాకు సహాయం కావాలి” అని అడిగినా సరే, సమయం గడిచేకొద్దీ మెల్లమెల్లగా మనసువిప్పి మీ భావాలన్నిటినీ ‘సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుని’ ముందు మీరే కుమ్మరించగలుగుతారు.—2 కొరింథీయులు 1:3, 4.

ప్రార్థన అంటే కేవలం మనశ్శాంతి కోసం చేసే పని కాదు. అది “నీకు సహాయము చేయువాడను నేనే నీతియను నా దక్షిణహస్తముతో నిన్ను ఆదుకొందును” అని మాటిస్తున్న మీ పరలోకపు తండ్రితో నిజంగా మాట్లాడడం.—యెషయా 41:9, 10.

కోసుకునే అలవాటుతో బాధపడుతున్న చాలామంది వాళ్ల అమ్మ లేదా నాన్నతో, మరెవరైనా నమ్మకమైన పెద్దవాళ్లతో మాట్లాడి ఉపశమనం పొందారు. అలా చేసిన ముగ్గురు యౌవనులు చెప్పే మాటలు గమనించండి:

ఇంటర్వ్యూ

  • డయానా, 21 ఏళ్లు

  • క్యాతి, 15 ఏళ్లు

  • లోరినా, 17 ఏళ్లు

మీరు కోసుకోవడం మొదలుపెట్టినప్పుడు మీ వయసు ఎంత?

లోరినా: నాకు 14 ఏళ్లున్నప్పుడు నేను కోసుకోవడం మొదలుపెట్టాను.

డయానా: నాకు 18 ఏళ్లు. నేను ఎప్పుడూ కోసుకునేదాన్ని కాదు. ఒక్కోసారి వారం, రెండువారాలపాటు రోజూ కోసుకుంటే, ఆ తర్వాత ఒక నెలరోజులపాటు అస్సలు కోసుకునేదాన్ని కాదు.

క్యాతి: నాకు 14 ఏళ్లున్నప్పుడు కోసుకోవడం మొదలుపెట్టాను. ఇప్పటికీ అప్పుడప్పుడూ కోసుకుంటాను.

మీకు మీరే ఎందుకు హాని చేసుకోవాలనుకుంటారు?

క్యాతి: నన్ను నేనే ద్వేషించుకునేదాన్ని. ఈ ప్రపంచంలో ఎవ్వరూ నాతో స్నేహం చేయడానికి ఇష్టపడరని నేను అనుకునేదాన్ని.

డయానా: కొన్నిసార్లు బాధ ఎక్కువై నిస్సహాయంగా, విసుగుగా అనిపించేది. ఆ విసుగు కాస్తా నిరాశగా మారేది. ఇక నిరాశ మెల్లమెల్లగా పెరుగుతూ, నాలో ఏదో పెద్ద మృగం ఉన్నట్టు, నన్ను నేను కోసుకుని దాన్ని బయటకు పంపించాలి అన్నట్టు నాకు అనిపించేది.

లోరినా: నాలో నేనే నిజంగా కృంగిపోయేదాన్ని, నా మీద నాకే కోపం వచ్చేది లేదా చాలా తక్కువ దాన్నని నాలో నేనే బాధపడేదాన్ని. నేను ఎందుకూ పనికిరాని చెత్తనని అనిపించేది. ఈ దారుణమైన ఆలోచనల్ని తట్టుకోవడం నా వల్ల కాదు, వాటిని తీసేసుకోవాలని అనుకునేదాన్ని. కొన్నిసార్లు నన్ను నేను హింసించుకోవడమే సరైనదని నాకు అనిపించేది.

హింసిచుకోవడం వల్ల మీ బాధ తగ్గుతుందా?

డయానా: అవును. అలా హింసించుకున్నాక నాకు ఏదో బరువు దించేసుకున్నట్టు, తేలిగ్గా హాయిగా ఉన్నట్టు అనిపించేది.

క్యాతి: హింసించుకోవడం అంటే అది కూడా ఏడవడం లాంటిదే. కొంతమందికి ఏడ్చిన తర్వాత ఎలాగైతే హాయిగా అనిపిస్తుందో, అలాగే నాకు కూడా కోసుకున్నాక హాయిగా అనిపించేది.

లోరినా: ఎలా అయితే ఒక పెద్ద బెలూన్‌కు చిన్న రంధ్రం చేస్తే మెల్లగా గాలి బయటకు వస్తుందో. అలానే శరీరాన్ని గాయ పర్చుకుంటే నన్ను బాధపెట్టే ఆలోచనలన్నిటినీ మెల్లమెల్లగా బయటకు పంపించేస్తున్నట్లు ఉంటుంది. అప్పుడు ఒక్కసారిగా పగిలిపోదు.

మీరు చేస్తున్న పని గురించి ఎవరికైనా చెప్పడానికి భయపడుతున్నారా?

లోరినా: అవును. అందరూ నేను వింతగా ప్రవర్తిస్తున్నాను అనుకుంటారేమోనని భయం. పైగా నా వ్యక్తిగత జీవితం గురించి ఇతరులు తెలుసుకోవడం నాకు ఇష్టం ఉండదు.

డయానా: నేను చాలా ధైర్యవంతురాల్ని అనుకుంటున్నట్లు ప్రజలు నాతో ఎప్పుడూ చెప్తుండేవాళ్లు. వాళ్లు ఎప్పటికీ నా గురించి అలాగే అనుకోవాలి. అలాంటప్పుడు ఎవరినైనా సహాయం అడగడం నా ఓటమిగా భావించేదాన్ని.

క్యాతి: నా మానసిక స్థితి బాగోలేదని ప్రజలు అనుకుంటారని, అప్పుడు నేను ఇంకా బాధపడాల్సి వస్తుందని నేను భయపడేదాన్ని. దానికన్నా నన్ను నేను హింసించుకోవడమే మంచిదని అనుకునేదాన్ని.

మరి ఈ అలవాటును ఎలా మానుకోగలిగారు?

లోరినా: నేనేమి చేస్తున్నానో మా అమ్మకు చెప్పాను. చెడు ఆలోచనలను అదుపు చేసుకోవడానికి ఒక డాక్టర్‌ నాకు సహాయం చేశారు. కొన్ని విషయాలు నన్ను ఇంకా వెనక్కు లాగుతున్నా, క్రమంగా బైబిలు చదవడం నాకెంతో ప్రయోజనకరంగా ఉంది. క్రైస్తవ పరిచర్యలో నేను చక్కగా పాల్గొంటాను. ఇప్పటికీ అప్పుడప్పుడూ నేనెందుకూ పనికిరాననే ఆలోచనలు వస్తుంటాయి, కానీ నేను వాటికి లొంగిపోకుండా ఉండడానికి ప్రయత్నిస్తాను.

క్యాతి: నాకంటే పదేళ్లు పెద్ద వయసున్న ఒక క్రైస్తవ సహోదరి ఏదో తేడా జరుగుతుందని కనిపెట్టింది. ఇక నేను ఈ రహస్యాన్ని వెంటనే బయటపెట్టేశాను. అయితే ఒకప్పుడు ఆమె కూడా కోసుకోవడం అనే ఈ సమస్యతోనే పోరాడిందని తెలుసుకొని ఆశ్చర్యపోయాను. ఆమె కూడా స్వయంగా ఇలాంటి సమస్యతోనే పోరాడింది కాబట్టి, ఆమెతో మాట్లాడడానికి నేను వెనుకాడలేదు. అప్పుడు నేను ఒక డాక్టరు దగ్గరకు వెళ్లాను. నా పరిస్థితి గురించి నేను, మా అమ్మానాన్నలు బాగా అర్థం చేసుకునేలా ఆ డాక్టర్‌ మాకు సహాయం చేసింది.

డయానా: ఒకరోజు రాత్రి ఒక భార్యాభర్తల ఇంట్లో ఉన్నాను. వాళ్లంటే నాకు నమ్మకం. ఆ భర్త నా పరిస్థితి బాలేదని గమనించి, అదేంటో వాళ్లకు చెప్పమని నన్ను బ్రతిమాలాడు. ఆయన భార్య నన్ను పట్టుకొని, గట్టిగా కౌగిలించుకుంది. నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు మా అమ్మ కూడా సరిగ్గా అలానే చేసేది. ఇక నేను వెంటనే ఏడ్చేశాను. ఆమె కూడా నన్ను చూసి ఏడ్చింది. నన్ను నేను హింసించుకుంటున్నానని వాళ్లకు చెప్పడం చాలా కష్టంగా అనిపించింది. అయినా ధైర్యం చేసి వాళ్లకు ఆ విషయం చెప్పినందుకు ఇవాళ నేను ఎంతో సంతోషిస్తున్నాను.

బైబిలు మీకెలా సహాయం చేసింది?

డయానా: బైబిలు చదివినప్పుడు నాకు అర్థమైన విషయం ఏమిటంటే ఈ సమస్యతో నాకు నేనే పోరాడలేను. అందుకు నాకు యెహోవా దేవుని సహాయం కావాలి.—సామెతలు 3:5, 6.

క్యాతి: బైబిల్ని చదవడం, అందులో ఉన్న సందేశాన్ని దేవుడే ఇచ్చాడని తెలుసుకోవడం నాకెంతో ఊరటనిస్తుంది.—2 తిమోతి 3:16, 17.

లోరినా: నాకు ఉపయోగపడే లేఖనాలు ఏవైనా కనిపించినప్పుడు, మళ్లీ పరిశీలించేందుకు వీలుగా, వాటిని ఒక పుస్తకంలో రాసి పెట్టుకుంటాను.—1 తిమోతి 4:15.

ప్రత్యేకించి ఏదైనా లేఖనం మీకు బాగా సహాయం చేసిందా?

డయానా: సామెతలు 18:1 ఇలా చెప్తుంది, “వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారముగా నడచువాడు అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి.” కొన్నిసార్లు అందరి మధ్యలో ఉండడం నాకు ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఒంటరిగా ఉండడం ప్రమాదకరమని నేను అర్థం చేసుకునేందుకు ఈ లేఖనం నాకు సహాయం చేసింది.

క్యాతి: మత్తయి 10:29-31 లేఖనాలంటే నాకు చాలా ఇష్టం. అక్కడ యేసు, యెహోవా దేవుని అనుమతి లేకుండా ఒక్క పిచ్చుక కూడా చనిపోదు అని చెప్తూ ఇంకా ఇలా అన్నాడు, “భయపడకుడి; మీరనేకమైన పిచ్చుకలకంటె శ్రేష్ఠులు.” ఈ రోజుకు కూడా ఆ మాటలు చదివినప్పుడల్లా యెహోవాకు నేను విలువైనదాన్నని గుర్తుచేసుకుంటాను.

లోరినా: యెషయా 41:9, 10 చెప్తున్న మాటలు నాకు బాగా నచ్చాయి. అక్కడ యెహోవా తన ప్రజలతో ఇలా అంటున్నాడు, “నేను నిన్ను ఉపేక్షింపక . . . . నీకు తోడైయున్నాను భయపడకుము. . . . నేను నిన్ను బలపరతును.” ఈ లేఖనం చదివినప్పుడు యెహోవా నన్ను ప్రేమిస్తున్నాడని, ఆయన ఎప్పుడూ నాకు తోడుగా ఉంటాడని అనిపిస్తుంది. అలా ఈ లేఖనం నాకెంతో శక్తిని ఇస్తుంది.

ఈ ప్రశ్నలకు జవాబు ఇవ్వండి

  • మీరు ఎవరినైనా సహాయం అడగాలి అనుకున్నప్పుడు, ఎవరి మీద ఆధారపడవచ్చు?

  • మీ సమస్య గురించి ప్రార్థనలో యెహోవా దేవునికి ఏమి చెప్పవచ్చు?

  • మీ ఒత్తిడిని, ఆందోవనను పోగొట్టుకోవడానికి (మీకు మీరు హాని చేసుకోని) ఏవైనా రెండు మార్గాలు చెప్పగలరా?

నా లేఖనాల పుస్తకం

సలహా: యెహోవా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని మీకు భరోసా ఇచ్చే లేఖనం, లేదా మీ గురించి, మీలో ఉన్న లోపాల గురించి సరైన విధంగా ఆలోచించుకునేలా మీకు సహాయం చేసే ఏదైనా ఒక లేఖనం మీకు కనిపించినప్పుడు, వెంటనే ఆ లేఖనాన్ని ఒక పుస్తకంలో రాసుకోండి. ఆ లేఖనం మీకు ఎందుకంత నచ్చిందో ఒకటి లేదా రెండు వాక్యాల్లో రాసుకోండి. డయానా, క్యాతి, లోరినాలకు సహాయం చేసిన కొన్ని లేఖనాలు ఇక్కడ ఉన్నాయి. వీటిని చూసి మీరు కూడా అలా మీకు సహాయం చేసిన లేఖనాలేంటో రాసుకోండి.

  • రోమీయులు 8:38, 39

    “పరిస్థితులు చాలా దిగజారిపోయాయని నాకు అనిపించినప్పటికీ, యెహోవా మాత్రం నన్ను ప్రేమిస్తూనే ఉన్నాడని ఈ లేఖనాలు నాకు చెప్తూ ఉంటాయి.”—డయానా.

  • కీర్తన 73:23

    “ఇలాంటి లేఖనాలు నేను ఒంటరిగా లేననీ, యెహోవా ఇక్కడే నా పక్కనే ఉన్నాడనీ నాకు భరోసానిస్తాయి.”—క్యాతి.

  • 1 పేతురు 5:10

    “వెంటనే ఉపశమనం దొరకకపోవచ్చు, ‘కొద్దిసేపు’ మనం బాధపడాల్సి రావచ్చు. కానీ చివరకు దేనినైనా సహించగల శక్తిని యెహోవా మనకు ఇస్తాడు.”—లోరినా.

ఇంకొన్ని లేఖనాలు పరిశీలించండి

  • కీర్తన 34:18

  • కీర్తన 54:4

  • కీర్తన 55:22

  • యెషయా 57:15

  • మత్తయి 11:28, 29

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి