కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ijwbq ఆర్టికల్‌ 54
  • మనుషులు ఎందుకు చనిపోతున్నారు?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మనుషులు ఎందుకు చనిపోతున్నారు?
  • బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • బైబిలు ఇచ్చే జవాబు
  • యేసు రక్షించును —కానీ ఎలా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
  • యేసు ఎందుకు చనిపోయాడు?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • యేసు ఎందుకు బాధ అనుభవించి చనిపోయాడు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2016
  • పాపము ఇక లేనప్పుడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
మరిన్ని
బైబిలు ప్రశ్నలకు జవాబులు
ijwbq ఆర్టికల్‌ 54

మనుషులు ఎందుకు చనిపోతున్నారు?

బైబిలు ఇచ్చే జవాబు

మనుషులు ఎందుకు చనిపోతున్నారని ఆలోచించడం సహజమే. ముఖ్యంగా, మనకు ఇష్టమైనవాళ్లు చనిపోయినప్పుడు మనమలా ఆలోచిస్తాం. బైబిలు ఇలా చెప్తుంది: “మరణపు ముల్లు పాపము.”—1 కొరింథీయులు 15:56.

మనుషులందరూ ఎందుకు పాపం చేసి చనిపోతున్నారు?

మొదటి మనుషులైన ఆదాము హవ్వలు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినందుకు తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు. (ఆదికాండము 3:17-19) దేవుని మాట వినకపోతే వాళ్లకు చావు తప్పదు, ఎందుకంటే దేవుని దగ్గరే “జీవపు ఊట” ఉంది. —కీర్తన 36:9; ఆదికాండము 2:17.

ఆదాము, పాపం ద్వారా వచ్చే ప్రభావాల్ని తన పిల్లలందరూ అనుభవించేలా చేశాడు. బైబిలు ఇలా చెప్తుంది: “ఒక మనుష్యునిద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో, ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను.” (రోమీయులు 5:12) మనుషులందరూ పాపం చేసినందువల్లే చనిపోతున్నారు.—రోమీయులు 3:23.

మరణం ఇక ఉండదు, ఎలా?

“మరెన్నడును ఉండకుండ మరణమును ఆయన” మ్రింగివేసే సమయం వస్తుందని దేవుడు మాటిస్తున్నాడు. (యెషయా 25:8) చావును తీసేయాలంటే ముందుగా, దానికి కారణమైన పాపాన్ని ఆయన తీసేయాలి. దీన్ని దేవుడు, ‘లోకపాపాన్ని’ నిర్మూలించే యేసుక్రీస్తు ద్వారా చేస్తాడు.—యోహాను 1:29; 1 యోహాను 1:7.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి