కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ijwbq ఆర్టికల్‌ 24
  • ప్రపంచ శాంతి—ఎందుకు పగటి కలగానే మిగిలిపోతోంది?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రపంచ శాంతి—ఎందుకు పగటి కలగానే మిగిలిపోతోంది?
  • బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • బైబిలు ఇచ్చే జవాబు
  • శాంతిని ఎందుకు తీసుకురాలేకపోతున్నాం?—బైబిలు ఏం చెప్తుంది?
    అదనపు అంశాలు
  • ఈ ప్రశ్నలకు బైబిలు ఇచ్చే జవాబులు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2013
  • మానవులను ఎవరు శాంతికి నడుపగలరు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
  • నిజమైన శాంతి—ఏ మూలం నుండి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
మరిన్ని
బైబిలు ప్రశ్నలకు జవాబులు
ijwbq ఆర్టికల్‌ 24
యుద్ధ విమానం

ప్రపంచ శాంతి—ఎందుకు పగటి కలగానే మిగిలిపోతోంది?

బైబిలు ఇచ్చే జవాబు

ప్రపంచ శాంతి తీసుకురావాలని మనుషులు చేస్తున్న ప్రయత్నాలు విఫలం అవ్వడానికి ఎన్నో కారణాలు:

  • “తమ మార్గము నేర్పరచుకొనుట నరులవశములో లేదు.” (యిర్మీయా 10:23) మనల్ని మనం పరిపాలించుకునే సామర్థ్యంతో మనం సృష్టించబడలేదు. అందుకే, నిరంతరము నిలిచే శాంతిని తీసుకురావడం మనవల్ల కాదు.

  • “రాజులచేతనైనను నరులచేతనైనను రక్షణ కలుగదు వారిని నమ్ముకొనకుడి వారి ప్రాణము వెడలిపోవును వారు మంటిపాలగుదురు వారి సంకల్పములు నాడే నశించును.” (కీర్తన 146:3, 4) మంచి ఉద్దేశాలున్న అధికారులు కూడ యుద్ధానికి దారితీసే మూల కారణాలను తీసివేయలేకపోతున్నారు.

  • “అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలిసికొనుము. ఏలాగనగా మనుష్యులు ... క్రూరులు, సజ్జనద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు.” (2 తిమోతి 3:1-4) ఇలాంటి ప్రజలు ఎక్కువగా ఉన్న చెడు లోకం నాశనం కాబోయే ఈ ‘చివరి రోజుల్లో’ శాంతిని తీసుకురావడం మరీ కష్టంగా ఉంది.

  • “భూమీ, సముద్రమా, మీకు శ్రమ; అపవాది తనకు సమయము కొంచెమే అని తెలిసికొని బహు క్రోధముగలవాడై మీయొద్దకు దిగివచ్చియున్నాడు.” (ప్రకటన 12:12) దేవుని శత్రువైన సాతాను ఈ భూమికే పరిమితం చేయబడ్డాడు, ప్రజలు కూడా తనలాగే క్రూరంగా తయారయ్యేలా చేస్తున్నాడు. అతడు ‘ఈ లోకాధికారిగా’ ఉన్నంత కాలం మనం ప్రశాంతంగా జీవించలేం. (యోహాను 12:31)

  • “ఆ రాజ్యము [దేవుని రాజ్యము] ... ముందు చెప్పిన రాజ్యములన్నిటిని [దేవుని ఎదిరించే రాజ్యాలన్నిటిని] పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగముల వరకు నిలుచును.” (దానియేలు 2:44) నిరంతరం నిలిచే ప్రపంచ శాంతి కావాలనే మన కోరికను కేవలం దేవుని ప్రభుత్వం మాత్రమే తీరుస్తుంది, మరే మానవ ప్రభుత్వం తీర్చలేదు.—కీర్తన 145:16.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి