కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mrt ఆర్టికల్‌ 121
  • ఎవర్ని నమ్మవచ్చు?—బైబిలు ఏం చెప్తుంది?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఎవర్ని నమ్మవచ్చు?—బైబిలు ఏం చెప్తుంది?
  • అదనపు అంశాలు
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • నమ్మకస్థుడైన ఒక వ్యక్తి
  • సంతోషకరమైన జీవితానికి నమ్మకం ఆవశ్యం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
  • రాజకీయ నాయకుల మీద ప్రజల నమ్మకం తగ్గుతుంది—బైబిలు ఏం చెప్తుంది?
    అదనపు అంశాలు
  • యేసు పేదరికానికి ముగింపు పలుకుతాడు
    అదనపు అంశాలు
  • సహోదర సహోదరీల్ని మీరు నమ్మవచ్చు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2022
మరిన్ని
అదనపు అంశాలు
mrt ఆర్టికల్‌ 121
చిత్రాలు: సాధారణంగా ప్రజలు నమ్మకం పెట్టుకునేవాళ్లు: 1. మైక్‌ ముందు నిలబడిన రాజకీయ నాయకుడు. 2. రెండు చేతులు జోడించిన చర్చి ఫాదర్‌. 3. రైటింగ్‌ పాడ్‌ పట్టుకున్న సైంటిస్ట్‌.

ఎడమ వైపు: Olena Yefremkina/stock.adobe.com; మధ్యలో: lunamarina/stock.adobe.com; కుడి వైపు: Rido/stock.adobe.com

అప్రమత్తంగా ఉండండి!

ఎవర్ని నమ్మవచ్చు?—బైబిలు ఏం చెప్తుంది?

నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన వాళ్లే ఆశలు అడియాశలు చేసినప్పుడు ‘ఇక ఎవర్నీ నమ్మాలి?’ అనే ప్రశ్న ప్రజల మనసులో తిరుగుతోంది. చాలామందికి వీళ్ల మీద నమ్మకం పూర్తిగా పోయింది:

  • ప్రజల అవసరాల్ని పక్కన పెట్టేసి, సొంత అవసరాలకు పెద్దపీట వేసే రాజకీయ నాయకులు.

  • నిజం కంటే అబద్ధాన్నే ఎక్కువ చేసి చూపించే మీడియా వాళ్లు.

  • ప్రజలకు ప్రయోజనం కల్పించాల్సింది పోయి నష్టం కలిగిస్తున్న సైంటిస్ట్‌లు.

  • దేవుని గురించే చెప్పే బదులు రాజకీయాలకు గొంతు చించుకుని మద్దతు ఇస్తున్న మతనాయకులు.

ఎవరినైనా నమ్మే ముందు పదిసార్లు ఆలోచించుకోవడం మంచిదే. బైబిలు కూడా మనకు ఈ జాగ్రత్త చెప్తుంది:

  • “సహాయం కోసం మీ నాయకుల మీద ఆధారపడవద్దు. మనుష్యులు నిన్ను రక్షించలేరు గనుక మనుష్యులను నమ్ముకోవద్దు.”—కీర్తన 146:3, పరిశుద్ధ బైబల్‌: తెలుగు ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌.

నమ్మకస్థుడైన ఒక వ్యక్తి

 మీరు నమ్మకం పెట్టుకోగలిగే ఒక వ్యక్తి గురించి బైబిలు చెప్తుంది. ఆయనే యేసుక్రీస్తు! ఆయన వందల సంవత్సరాల క్రితం జీవించిన ఒక మంచి మనిషి మాత్రమే కాదు. దేవుడే యేసును రాజుగా నియమించాడు, ఆయన “ఎప్పటికీ రాజుగా పరిపాలిస్తాడు, ఆయన రాజ్యానికి అంతం ఉండదు.” (లూకా 1:32, 33) యేసు దేవుని రాజ్యానికి రాజు, అది ఇప్పుడు పరలోకం నుండి పరిపాలిస్తున్న ప్రభుత్వం.—మత్తయి 6:10.

  • యేసు మీద మీరు ఎందుకు నమ్మకం పెట్టుకోవచ్చో తెలుసుకోవడానికి, ఈ ఆర్టికల్స్‌ చదవండి: “దేవుని రాజ్యానికి రాజు ఎవరు?,” “దేవుని ప్రభుత్వం ఏమి చేస్తుంది?”

నమ్మదగిన ఒక పుస్తకం

యేసు జీవితం గురించి, మరెన్నో ముఖ్యమైన అంశాల గురించి బైబిల్లో చాలా సమాచారం ఉంది. ఈ ప్రత్యేకమైన పుస్తకంలో ఉన్న విషయాలు నమ్మదగినవి, విలువైనవి. వాటి గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే, మా ఫ్రీ బైబిలు స్టడీ కోర్సును తీసుకోవచ్చు. దీనికి అవసరమయ్యే పుస్తకాలు మేమే ఇస్తాం అలాగే వ్యక్తిగతంగా మీకు సహాయం చేయడానికి కూడా ఒకరు ఉంటారు. ఈ కోర్సులో మీరు యేసు ఎలాంటివాడు, ఆయన ఏం చేశాడు, ఏం చేస్తున్నాడు, ఏం చేస్తాడు వంటి విషయాలు తెలుసుకుంటారు.

మా బైబిలు స్టడీ కోర్సు ట్రై చేయండి

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి