కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mrt ఆర్టికల్‌ 115
  • సోషల్‌ మీడియా పంజరంలో పిల్లలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సోషల్‌ మీడియా పంజరంలో పిల్లలు
  • అదనపు అంశాలు
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • తల్లిదండ్రులు ఏం చేయవచ్చు?
  • ఎక్కువ తెలుసుకోండి
  • పిల్లలు సోషల్‌ మీడియా వాడడం వల్ల వచ్చే ప్రమాదాల గురించి ఉన్నత స్థాయి హెల్త్‌ ఆఫీసర్‌ హెచ్చరించారు—బైబిలు ఏం చెప్తోంది?
    అదనపు అంశాలు
  • టీనేజ్‌ పిల్లల్లో పెరుగుతున్న మానసిక సమస్యలు—బైబిలు ఏం చెప్తోంది?
    అదనపు అంశాలు
  • టెక్నాలజీ మీ స్నేహితులతో ఉన్న సంబంధాన్ని ఎలా పాడుచేయగలదు?
    తేజరిల్లు!—2021
  • సోషల్‌ నెట్‌వర్క్‌ వల్ల వచ్చే ప్రమాదాలకు దూరంగా ఉండండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
మరిన్ని
అదనపు అంశాలు
mrt ఆర్టికల్‌ 115
చివరి మెట్టు మీద ఒక టీనేజీ అబ్బాయి చీకట్లో, ఒంటరిగా తల పట్టుకుని కూర్చున్నాడు

Thai Liang Lim/E+ via Getty Images

అప్రమత్తంగా ఉండండి!

సోషల్‌ మీడియా పంజరంలో పిల్లలు

సోషల్‌ మీడియా పంజరంలో పిల్లలు చిక్కుకుపోతున్నారు అని 2025 లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఒక దేశం 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్‌ మీడియాను బ్యాన్‌ చేసింది. వేరే దేశాల్లో కూడా ఇలాంటి చర్యలు తీసుకుంటే ఎలా ఉంటుందనే చర్చలు నడుస్తున్నాయి.

ఆసక్తికరంగా, కొంతమంది టీనేజర్లు కూడా సోషల్‌ మీడియా వల్ల నష్టం జరిగే అవకాశం ఉందని అర్థం చేసుకుంటున్నారు. ప్యూ రీసర్చ్‌ సెంటర్‌, అమెరికాలో చేసిన ఒక సర్వేని 2025, ఏప్రిల్‌లో విడుదల చేసింది. అది ఇలా చెప్తుంది: “[సోషల్‌ మీడియా] సైట్లు తమ వయసువాళ్లకు చెడే ఎక్కువ చేస్తుందని ఇంచుమించు సగంమంది టీనేజర్లు (48%) చెప్తున్నారు.”

సోషల్‌ మీడియా వల్ల పిల్లల్లో మానసిక సమస్యలు వస్తాయని కొంతమంది వైద్యులు హెచ్చరించారు. పోయిన సంవత్సరం, U.S. సర్జన్‌ జనరల్‌గా పనిచేసిన డాక్టర్‌ వివేక్‌ మూర్తి, ఇలా చెప్పారు: “యువతలో మానసిక సమస్యలు విజృంభిస్తున్నాయి. అందుకు ముఖ్యమైన కారణం, సోషల్‌ మీడియానే.”

పిల్లలు సోషల్‌ మీడియా పంజరంలో ఇరుక్కోకుండా తల్లిదండ్రులు ఎలా కాపాడొచ్చు? బైబిలు మంచి సలహాలు ఇస్తుంది.

తల్లిదండ్రులు ఏం చేయవచ్చు?

ఈ బైబిలు సలహాలు చూడండి.

“వివేకం గలవాడు ఆచితూచి అడుగులు వేస్తాడు.”—సామెతలు 14:15.

సోషల్‌ మీడియా వల్ల రిస్క్‌ ఉంది కాబట్టి, మీ పిల్లాడిని దాన్ని వాడనిచ్చే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. అతను ఇంత టైం అని పెట్టుకుని దానికి కట్టుబడతాడా, ఇంతకుముందులాగే ఫ్రెండ్స్‌తో బాగుంటాడా, చూడకూడని వాటికి దూరంగా ఉంటాడా, అంత మెచ్యూరిటీ అతనికి ఉందా అని ఆలోచించండి.

  • ఎక్కువ తెలుసుకోవడానికి, “మా పిల్లలు సోషల్‌ మీడియా వాడొచ్చా?” (ఇంగ్లీషు) అలాగే “మీ టీనేజీ పిల్లలకు సోషల్‌ మీడియా జాగ్రత్తలు చెప్పండి” (ఇంగ్లీషు) అనే ఆర్టికల్స్‌ చదవండి.

“మీ సమయాన్ని శ్రేష్ఠమైన విధంగా ఉపయోగించుకోండి.”—ఎఫెసీయులు 5:16.

ఒకవేళ మీ పిల్లాడిని సోషల్‌ మీడియా వాడనిస్తే కొన్ని రూల్స్‌ పెట్టండి, ఆ రూల్స్‌ తనకెలా మేలు చేస్తాయో కూడా చెప్పండి. మీ పిల్లాడి ప్రవర్తనలో ఏమైనా మార్పులు వస్తున్నాయేమో ఓ కంట కనిపెడుతూ ఉండండి. ఒకవేళ మార్పులు వస్తే, సోషల్‌ మీడియా వాడడాన్ని తగ్గించాలని దానర్థం.

  • రూల్స్‌ ఎందుకు పెడుతున్నారో మీ పిల్లాడికి అర్థమయ్యేలా చెప్పడానికి, సోషల్‌ నెట్‌వర్క్‌లను జాగ్రత్తగా ఉపయోగించండి అనే వైట్‌బోర్డ్‌ యానిమేషన్‌ చూపించండి.

తల్లిదండ్రులు ఏం చేయవచ్చు అనే దాని గురించి బైబిలు ఇచ్చే మరిన్ని సలహాల కోసం, “పిల్లలు సోషల్‌ మీడియా వాడడం వల్ల వచ్చే ప్రమాదాల గురించి ఉన్నత స్థాయి హెల్త్‌ ఆఫీసర్‌ హెచ్చరించారు—బైబిలు ఏం చెప్తోంది?” అనే ఆర్టికల్‌ చూడండి.

ఎక్కువ తెలుసుకోండి

మనం “ప్రమాదకరమైన, కష్టమైన” కాలాల్లో జీవిస్తున్నామని బైబిలు చెప్తుంది. (2 తిమోతి 3:1-5) అలాగే, వాటిని గట్టెక్కడానికి తిరుగులేని సలహాలు కూడా ఇస్తుంది. “టీనేజ్‌ పిల్లల్లో పెరుగుతున్న మానసిక సమస్యలు—బైబిలు ఏం చెప్తోంది?” అనే ఆర్టికల్‌లో తల్లిదండ్రులకు, పిల్లలకు ఉపయోగపడే బైబిలు ఆర్టికల్స్‌ 20కి పైనే ఉన్నాయి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి