కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ijwbq ఆర్టికల్‌ 176
  • మహమ్మారుల గురించి బైబిలు ఏం చెప్తుంది?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మహమ్మారుల గురించి బైబిలు ఏం చెప్తుంది?
  • బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • బైబిలు ఇచ్చే జవాబు
  • మహమ్మారుల గురించి బైబిలు ముందే చెప్పిందా?
  • దేవుడు ఎప్పుడైనా ప్రజల్ని జబ్బులతో శిక్షించాడా?
  • ఈ రోజుల్లో దేవుడు మహమ్మారులతో ప్రజల్ని శిక్షిస్తున్నాడా?
  • మహమ్మారులే లేని రోజు ఎప్పటికైనా వస్తుందా?
  • అనారోగ్యం గురించి చెప్పే బైబిలు వచనాలు
  • మనకు ఒక కొత్త లోకం అవసరం!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2021
  • కోవిడ్‌ 60 లక్షలమందిని పొట్టనబెట్టుకుంది—బైబిలు ఏమంటుంది?
    అదనపు అంశాలు
  • బాధలు—దేవుని నుండి మనకు వచ్చే శిక్షలా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2018
  • వ్యాధులు ఇక ఉండని కాలం!
    తేజరిల్లు!—2007
మరిన్ని
బైబిలు ప్రశ్నలకు జవాబులు
ijwbq ఆర్టికల్‌ 176
జబ్బు భూమి మీద అన్ని ఖండాలకు వ్యాప్తి చెందుతున్నట్లు చూపిస్తున్న చిత్రం.

మహమ్మారుల గురించి బైబిలు ఏం చెప్తుంది?

బైబిలు ఇచ్చే జవాబు

చివరి రోజుల్లో పెద్దపెద్ద అంటువ్యాధులు (తెగుళ్లు లేదా మహమ్మారులు) వస్తాయని బైబిలు ముందే చెప్పింది. (లూకా 21:11) అలాంటి మహమ్మారులతో దేవుడు ప్రజల్ని శిక్షించడం లేదు. నిజానికి, దేవుడు త్వరలోనే తన రాజ్యం ద్వారా మహమ్మారులను, ఇతర అనారోగ్య సమస్యలను పూర్తిగా తీసేస్తాడు.

  • మహమ్మారుల గురించి బైబిలు ముందే చెప్పిందా?

  • దేవుడు ఎప్పుడైనా ప్రజల్ని జబ్బులతో శిక్షించాడా?

  • ఈ రోజుల్లో దేవుడు మహమ్మారులతో ప్రజల్ని శిక్షిస్తున్నాడా?

  • మహమ్మారులే లేని రోజు ఎప్పటికైనా వస్తుందా?

  • అనారోగ్యం గురించి చెప్పే బైబిలు వచనాలు

మహమ్మారుల గురించి బైబిలు ముందే చెప్పిందా?

కోవిడ్‌-19, ఎయిడ్స్‌, స్పానిష్‌ ఫ్లూ వంటి మహమ్మారుల లేదా జబ్బుల గురించి బైబిలు ముందే చెప్పలేదు. అయితే “పెద్దపెద్ద అంటువ్యాధులు,” “ప్రాణాంతకమైన జబ్బు” గురించి అది ముందే చెప్పింది. (లూకా 21:11; ప్రకటన 6:8) అవి “చివరి రోజుల” గురించిన సూచనలో ఒక భాగం, ఆ కాలాన్నే బైబిలు “ఈ వ్యవస్థ ముగింపు” అని కూడా పిలుస్తుంది.—2 తిమోతి 3:1; మత్తయి 24:3.

దేవుడు ఎప్పుడైనా ప్రజల్ని జబ్బులతో శిక్షించాడా?

దేవుడు కొన్ని సందర్భాల్లో ప్రజల్ని జబ్బులతో శిక్షించాడని బైబిలు చెప్తుంది. ఉదాహరణకు, ఆయన కొంతమందిని కుష్ఠువ్యాధితో శిక్షించాడు. (సంఖ్యాకాండం 12:1-16; 2 రాజులు 5:20-27; 2 దినవృత్తాంతాలు 26:16-21) అయితే అవి అమాయక ప్రజలకు కూడా వ్యాపించే మహమ్మారుల లాంటివి కావు. అవి దేవుని తీర్పులు, ఆయనకు ఎదురుతిరిగిన ఆయా వ్యక్తుల మీదికి అవి వచ్చాయి.

ఈ రోజుల్లో దేవుడు మహమ్మారులతో ప్రజల్ని శిక్షిస్తున్నాడా?

లేదు. దేవుడు మహమ్మారులతో, జబ్బులతో ఇప్పుడు ప్రజల్ని శిక్షిస్తున్నాడని కొంతమంది అంటారు. అయితే బైబిలు అలా చెప్పట్లేదు. ఈ విషయం మనకెలా తెలుసు?

గతంలో అలాగే ఇప్పుడు దేవుని సేవకుల్లో కొంతమంది అనారోగ్యం పాలయ్యారు. ఉదాహరణకు, దేవునికి నమ్మకంగా సేవచేసిన తిమోతి ‘తరచూ వచ్చే జబ్బుతో’ బాధపడ్డాడు. (1 తిమోతి 5:23) అయితే తిమోతి మీద దేవుని అనుగ్రహం లేకపోవడం వల్లే అలా జబ్బు వచ్చిందని బైబిలు చెప్పట్లేదు. అలాగే ఈ రోజుల్లో కూడా దేవున్ని నమ్మకంగా సేవించే కొంతమందికి అనారోగ్యం రావచ్చు లేదా అంటువ్యాధులు సోకవచ్చు. ఎక్కువ సందర్భాల్లో దానికి కారణం, వాళ్లు ఉండకూడని సమయంలో ఉండకూడని చోట ఉండడమే.—ప్రసంగి 9:11.

అంతేకాదు, దేవుడు చెడ్డవాళ్లను శిక్షించే సమయం ఇంకా రాలేదని బైబిలు బోధిస్తుంది. ఇప్పుడు మనం ‘రక్షణ రోజులో,’ అంటే తనకు దగ్గరై రక్షణ పొందమని దేవుడు మనుషులందర్నీ ప్రేమగా ఆహ్వానిస్తున్న సమయంలో జీవిస్తున్నాం. (2 కొరింథీయులు 6:2) ఆయన అలా ఆహ్వానిస్తున్న ఒక మార్గం ఏమిటంటే, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న “రాజ్య సువార్త” ప్రకటనా పని. అది నిజానికి చాలా మంచివార్త.—మత్తయి 24:14.

మహమ్మారులే లేని రోజు ఎప్పటికైనా వస్తుందా?

వస్తుంది. అతి తర్వలోనే ఏ ఒక్కరూ అనారోగ్యం పాలవ్వని రోజు వస్తుందని బైబిలు చెప్తుంది. దేవుడు తన రాజ్య పరిపాలనలో అనారోగ్య సమస్యలన్నిటినీ తీసేస్తాడు. (యెషయా 33:24; 35:5, 6) ఆయన బాధల్ని, నొప్పిని, మరణాన్ని పూర్తిగా తీసేస్తాడు. (ప్రకటన 21:4) అంతేకాదు, చనిపోయిన వాళ్లను తిరిగి బ్రతికిస్తాడు, అప్పుడు వాళ్లు మంచి ఆరోగ్యంతో చాలా సంతోషకరమైన పరిస్థితుల్లో జీవిస్తారు.—కీర్తన 37:29; అపొస్తలుల కార్యాలు 24:15.

అనారోగ్యం గురించి చెప్పే బైబిలు వచనాలు

మత్తయి 4:23: “[యేసు] గలిలయ అంతటా ప్రయాణిస్తూ సమాజమందిరాల్లో బోధిస్తూ, రాజ్యం గురించిన మంచివార్త ప్రకటిస్తూ, ప్రజలకున్న ప్రతీ జబ్బును, అనారోగ్యాన్ని నయం చేస్తూ ఉన్నాడు.”

దాని భావం: యేసు చేసిన అద్భుతాలు, దేవుని రాజ్యం త్వరలో మనుషులందరి కోసం ఏం చేస్తుందో చూపించే ఒక చిన్న ఉదాహరణ లాంటివి.

లూకా 21:11: “పెద్దపెద్ద అంటు​వ్యాధులు వస్తాయి.”

దాని భావం: అనారోగ్య సమస్యలు ఎక్కువవ్వడం చివరి రోజుల సూచనలో ఒక భాగం.

ప్రకటన 6:8: “ఇదిగో, పాలిపోయిన ఒక గుర్రం కనిపించింది. దానిమీద కూర్చున్న వ్యక్తికి ‘మరణం’ అనే పేరు ఉంది. సమాధి అతని వెనకాలే వెళ్తూ ఉంది. ప్రాణాంతకమైన జబ్బుతో ప్రజల్ని చంపేలా వాళ్లకు అధికారం ఇవ్వబడింది.”

దాని భావం: ప్రకటన పుస్తకంలోని నలుగురు గుర్రపురౌతుల ప్రవచనం, మన కాలంలో మహమ్మారులు వస్తాయని సూచిస్తుంది.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి