కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ijwbq ఆర్టికల్‌ 172
  • మగ్దలేనే మరియ ఎవరు?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మగ్దలేనే మరియ ఎవరు?
  • బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • బైబిలు ఇచ్చే జవాబు
  • మగ్దలేనే మరియ ఒక వేశ్యా?
  • మగ్దలేనే మరియ అపొస్తలులకు గురువా?
  • మగ్దలేనే మరియ యేసుక్రీస్తు భార్యా?
  • “నేను ప్రభువును చూశాను!”
    ధైర్యం చూపిస్తూ దేవునితో నడవండి
  • “నేను ప్రభువును చూశాను!”
    వాళ్లలా విశ్వాసం చూపించండి
  • పాఠకుల ప్రశ్నలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2004
  • ‘ఇదిగో! యెహోవా దాసురాలిని!’
    వాళ్లలా విశ్వాసం చూపించండి
మరిన్ని
బైబిలు ప్రశ్నలకు జవాబులు
ijwbq ఆర్టికల్‌ 172
ఖాళీ సమాధి ముందు తిరిగి బ్రతికిన యేసును కలుసుకున్న మగ్దలేనే మరియ.

మగ్దలేనే మరియ ఎవరు?

బైబిలు ఇచ్చే జవాబు

మగ్దలేనే మరియ యేసుక్రీస్తును నమ్మకంగా అనుసరించిన స్త్రీ. మగ్దలేనే అనే పేరు గలిలయ సముద్రం దగ్గరున్న మగదాలా (బహుశా మగదాను) ఊరు నుండి వచ్చి ఉంటుంది. ఈ మరియ ఒకప్పుడు అక్కడ నివసించి ఉండవచ్చు.

యేసుతో, ఆయన శిష్యులతో కలిసి ప్రయాణించిన చాలామంది స్త్రీలలో మగ్దలేనే మరియ కూడా ఉంది. యేసుకు, ఆయన శిష్యులకు ఈ స్త్రీలు తమ దగ్గరున్న వాటితో అవసరమైన సహాయం చేశారు. (లూకా 8:1-3) యేసు చనిపోవడాన్ని మగ్దలేనే మరియ కళ్లారా చూసింది. అలాగే, యేసు తిరిగి బ్రతికిన తరువాత ఆయన్ని మొదటిగా చూసిన వాళ్లలో ఈమె ఒకరు.—మార్కు 15:40; యోహాను 20:11-18.

  • మగ్దలేనే మరియ ఒక వేశ్యా?

  • మగ్దలేనే మరియ అపొస్తలులకు గురువా?

  • మగ్దలేనే మరియ యేసుక్రీస్తు భార్యా?

  • మరియ అనే పేరుతో బైబిల్లో ఎంతమంది ఉన్నారు?

మగ్దలేనే మరియ ఒక వేశ్యా?

మగ్దలేనే మరియ వేశ్య అని బైబిలు చెప్పడం లేదు. యేసు ఆమెలో నుండి ఏడుగురు చెడ్డదూతల్ని వెళ్లగొట్టాడని మాత్రమే బైబిలు చెప్తుంది.—లూకా 8:2.

మరి చాలామంది ఆమె వేశ్య అని ఎందుకు అనుకుంటారు? మగ్దలేనే మరియ చనిపోయిన వందల సంవత్సరాల తర్వాత ప్రజల్లో ఆ ఆలోచన పుట్టింది. యేసు పాదాల్ని తన కన్నీళ్లతో తడిపి తలవెంట్రుకలతో తుడిచిన స్త్రీయే (బహుశా వేశ్య) మగ్దలేనే మరియ అని అనుకున్నారు. (లూకా 7:36-38) కానీ, అది నిజం అనడానికి బైబిల్లో ఏ ఆధారం లేదు.

మగ్దలేనే మరియ అపొస్తలులకు గురువా?

కాదు. క్యాథోలిక్‌ చర్చి మరియను “సెయింట్‌ మగ్దలేనే మరియ” అని, “అపొస్తలులకు గురువు” అని పిలుస్తుంది. ఎందుకంటే యేసు తిరిగి బ్రతికాడని అపొస్తలులకు మొదట చెప్పినవాళ్లలో ఈమె ఒకరు. (యోహాను 20:18) అంతమాత్రాన ఆమె అపొస్తలుల్లో ఒకరు అని, అపొస్తలులకు గురువు అని అనలేం. బైబిలు కూడా ఎక్కడా ఆమె గురించి అలా చెప్పలేదు.—లూకా 6:12-16.

క్రీస్తు శకం మొదటి శతాబ్దంలో బైబిలు రాయడం పూర్తి అయ్యింది. అయితే, మగ్దలేనే మరియ అపొస్తలుల కంటే గొప్పదని చర్చి నాయకులు చెప్పడం మొదలుపెట్టింది క్రీస్తు శకం 6వ శతాబ్దం నుండే. క్రీస్తు శకం 2వ శతాబ్దంలో, 3వ శతాబ్దంలో రాసిన కొన్ని పుస్తకాలు ‘కొంతమంది యేసు అపొస్తలులు మగ్దలేనే మరియను చూసి అసూయపడ్డారు’ అని చెప్పాయి. అయితే ఆ పుస్తకాలు ప్రేరేపిత బైబిలు పుస్తకాలు కాదు. అలాంటి కట్టు కథలకు బైబిల్లో ఎలాంటి రుజువులు లేవు.

మగ్దలేనే మరియ యేసుక్రీస్తు భార్యా?

కాదు, యేసు పెళ్లి గురించి బైబిల్లో ఎక్కడా లేదు. నిజానికి, ఆయనకు పెళ్లి కాలేదని బైబిలు స్పష్టం చేస్తుంది.a

a “యేసుకు పెళ్లయిందా? ఆయనకు తోబుట్టువులు ఉన్నారా?” అనే ఆర్టికల్‌ చూడండి.

మరియ అనే పేరుతో బైబిల్లో ఎంతమంది ఉన్నారు?

మరియ అనే పేరుతో బైబిల్లో ఆరుగురు ఉన్నారు.b

  1. 1. యేసు తల్లియైన మరియ.—మత్తయి 1:18.

  2. 2. మార్త, లాజరు తోబుట్టువైన మరియ.—యోహాను 11:1, 2.

  3. 3. మగ్దలేనే మరియ.—లూకా 8:2.

  4. 4. యాకోబు, యోసే అనేవాళ్ల అమ్మ మరియ.—మత్తయి 27:56.

  5. 5. మార్కు అని కూడా పిలవబడే యోహాను తల్లియైన మరియ.—అపొస్తలుల కార్యాలు 12:12.

  6. 6. రోములో కష్టపడి పనిచేసిన క్రైస్తవురాలైన మరియ.—రోమీయులు 16:6.

b మోషే అక్క పేరు హీబ్రూలో మిర్యాము, గ్రీకులో మరియ.—1 దినవృత్తాంతాలు 6:3.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి