కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w26 జూలై పేజీ 31
  • విరిగిన మనసును త్వరగా అతికించేద్దాం!

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • విరిగిన మనసును త్వరగా అతికించేద్దాం!
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2026
  • ఇలాంటి మరితర సమాచారం
  • నేనెందుకు స్నేహితులను నిలుపుకోలేకపోతున్నాను?
    తేజరిల్లు!—1996
  • “నేను మిమ్మల్ని స్నేహితులని పిలిచాను”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2020
  • స్నేహితులను మీరెలా సంపాదించుకోగలరు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
  • నా ప్రాణ స్నేహితుడు ఇల్లెందుకు మారాడు?
    తేజరిల్లు!—1997
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2026
w26 జూలై పేజీ 31
ఒక సిస్టర్‌ ఇంకో సిస్టర్‌ ఇంటికి వెళ్లి మనస్ఫూర్తిగా సారీ చెప్తుంది.

విరిగిన మనసును త్వరగా అతికించేద్దాం!

ఒక బ్రదర్‌ లేదా సిస్టర్‌ వల్ల మీ మనసు ఎప్పుడైనా విరిగిపోయిందా? దానివల్ల మీ స్నేహం తెగిపోయేదాకా వెళ్లిందా? అదే జరిగుంటే, విరిగిన మీ మనసును అతికించుకోవడానికి, మీ స్నేహాన్ని తిరిగి నిలబెట్టుకోవడానికి ఏం చేయవచ్చు? (1) మీరు వెంటనే చర్య తీసుకోవాలి, (2) మీకు సరైన ఉద్దేశం ఉండాలి.a

దీని గురించి ఒక ఉదాహరణ చూద్దాం. మన శరీరంలో ఏదైనా ఎముక విరిగితే, వెంటనే డాక్టర్‌ దగ్గరికి వెళ్లి, వైద్యం చేయించుకోవాలి. అప్పుడే నొప్పి తగ్గుతుంది, ఎముక బాగా అతుకుతుంది. మీరు దాన్ని వెంటనే పట్టించుకోకపోతే, నొప్పి ఇంకా ఎక్కువైపోతుంది. ఆ ఎముక సరిగ్గా అతకదు, ఎప్పటికీ అలానే ఉండిపోతుంది.

ఒక ఎముక విరిగిపోయినప్పుడు దాన్ని ఎలాగైతే వెంటనే బాగుచేసుకుంటామో, బ్రదర్స్‌-సిస్టర్స్‌తో మనకున్న సంబంధం పాడైనప్పుడు కూడా దాన్ని వెంటనే బాగుచేసుకోవాలి. లేకపోతే, మన మనసుకైన గాయం అలాగే ఉండిపోతుంది. మెల్లమెల్లగా ద్వేషం పెరిగి, మన స్నేహితున్ని దూరం చేసుకుంటాం. అందుకే, యేసు ఇలా చెప్పాడు: ‘త్వరగా రాజీపడు.’ (మత్త. 5:25) కాబట్టి మీ స్నేహితుని దగ్గరికి వెళ్లి ఏ దాపరికం లేకుండా, దయగా జరిగినదాని గురించి మాట్లాడండి. అలా చేయడం ఎందుకు కష్టంగా అనిపించవచ్చో చెప్పే రెండు కారణాల్ని చూద్దాం.

మొదటిది, జరిగినదాని గురించి వాళ్లతో మాట్లాడడం మనకు ఇబ్బందిగా అనిపిస్తుంది కాబట్టి, ఆ సమస్యని పరిష్కరించుకోకుండా అలాగే వదిలేస్తాం.b యువొదియ, సుంటుకే అనే ఇద్దరు సహోదరీల మధ్య కూడా అదే జరిగింది. వాళ్ల మధ్య వచ్చిన మనస్పర్థల్ని వాళ్లు పరిష్కరించుకోలేదు. అందుకే సమస్య అలానే ఉండిపోయింది. అది ఎక్కడో రోములో ఉన్న పౌలు దాకా వెళ్లింది; ఆయన వాళ్లను మళ్లీ కలిసిపోమని బ్రతిమాలాడు. (ఫిలి. 4:2) వాళ్లు వినయంగా జరిగినదాని గురించి మనసువిప్పి మాట్లాడుకుని, క్షమించుకుంటే ఆ స్నేహం మళ్లీ చిగురిస్తుంది.

రెండవది, ఎదుటి వ్యక్తే తప్పును ఒప్పుకోవాలని మనం ఎదురుచూస్తూ ఉండవచ్చు. తప్పు ఎవరిది అని నిరూపించుకోవడం కన్నా, వాళ్లతో ఉన్న సంబంధాన్ని బాగుచేసుకోవడమే మన ఉద్దేశం. ఎముక విరిగిందని డాక్టర్‌ దగ్గరికి వెళ్లినప్పుడు, ఆయన దాన్ని ఎలా బాగుచేయాలనే ఆలోచిస్తాడు గానీ, అది ఎందుకు విరిగిందనే దాని గురించే ఆలోచిస్తూ కూర్చోడు కదా! అలాగే, మీ స్నేహితునితో మాట్లాడుతున్నప్పుడు, తప్పు ఎవరిది అని ఆలోచించే బదులు మీ స్నేహం ఎంత అమూల్యమైనది, దాన్ని ఎలా బాగుచేసుకోవాలి అనే దానిమీద మనసుపెట్టండి.

మీ స్నేహాన్ని బాగుచేసుకుని, దాన్ని నిలబెట్టుకోవడానికి ఈ రోజే వెళ్లి, ఆ బ్రదర్‌తో లేదా ఆ సిస్టర్‌తో మాట్లాడి చూడండి. “సూర్యుడు అస్తమించే లోపే మీ కోపాన్ని తీసేసుకోండి.” (ఎఫె. 4:26) విరిగిన మనసును అతికించుకోవడానికి వెంటనే ప్రయత్నిస్తే, ‘ఐక్యతను కాపాడుకోగలుగుతాం.’—ఎఫె. 4:1-3.

a ఇద్దరి మధ్య చిన్నచిన్న మనస్పర్థలు వస్తే కలిసి మాట్లాడుకోవాలి. (మత్త. 5:23, 24) అలాగే, ఒకరినొకరు క్షమించుకోవడానికి ముందుండాలి. ఒకవేళ మీది పెద్ద సమస్య అయితే, పెద్దల సహాయం తీసుకోవచ్చు. (మత్త. 18:17) కానీ ముందు మత్తయి 18:15, 16 లో ఉన్న పనులు చేశాకే వాళ్ల సహాయం తీసుకోండి.

b బ్రదర్స్‌-సిస్టర్స్‌ కొన్నిసార్లు మన మనసును బాధపెట్టినా, అది మాట్లాడాల్సినంత పెద్ద విషయమేం కాదు అని మీకు అనిపిస్తే, ఆ పొరపాటును చూసీచూడనట్టు వదిలేయడం మంచిది.—సామె. 26:20.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి