అధ్యయనం కోసం చిట్కా
చక్కగా సిద్ధపడి ప్రోత్సహించే కామెంట్స్ చెప్పండి
మీటింగ్స్‌లో కామెంట్స్ చెప్పడం ద్వారా బ్రదర్స్-సిస్టర్స్‌ని ప్రోత్సహించే గొప్ప అవకాశం మనకు ఉంటుంది. (హెబ్రీ. 10:24, 25) మరి, వాళ్లను ప్రోత్సహించేలా కామెంట్స్ చెప్పాలంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి?
యెహోవాకు ప్రార్థించండి. ఆయన్ని స్తుతించే, ఇతరుల్ని ప్రోత్సహించే కామెంట్స్ చెప్పడానికి సహాయం చేయమని అడగండి.—కీర్త. 35:18.
సొంత మాటల్లో కామెంట్ చెప్పండి. ఉన్నది-ఉన్నట్టు చదవకుండా మీ సొంత మాటల్లో కామెంట్ చెప్పినప్పుడు, మీ విశ్వాసం నుండి అందరూ ప్రయోజనం పొందుతారు.
చిన్న కామెంట్స్ చెప్పండి. చిన్నగా, సింపుల్‌గా ఇచ్చే కామెంట్స్ బాగా ప్రోత్సాహాన్ని ఇస్తాయి. అంతేకాదు, ఎక్కువమందికి కామెంట్స్ చెప్పే అవకాశం కూడా దొరుకుతుంది.—సామె. 10:19.
బాధపెట్టేలా కామెంట్లు చెప్పకండి. ఒక బ్రదర్‌ని గానీ సిస్టర్ని గానీ లేదా సంఘం అంతటిని గానీ సరిదిద్దడానికో, తప్పుబట్టడానికో కామెంట్స్ చెప్పకండి.
మీకు కామెంట్స్ చెప్పే అవకాశం రాకపోయినా, వేరేవాళ్ల కామెంట్స్ శ్రద్ధగా విని, వాళ్లను మెచ్చుకోవడం ద్వారా ఇతరుల్ని ప్రోత్సహించవచ్చు.—సామె. 10:21.