జూలై 13-19, 2026
పాట 127 నేను ఇలాంటి వ్యక్తిగా ఉండాలి
మీ మనస్సాక్షికి బైబిలు సూత్రాలతో శిక్షణ ఇవ్వండి
“ప్రతీ వ్యక్తి తన బరువు తానే మోసుకోవాలి.”—గల. 6:5.
ముఖ్యాంశం
మనస్సాక్షి మనల్ని సరైన దారిలో నడిపించాలంటే, దానికి బైబిలు సూత్రాలతో ఎలా శిక్షణ ఇవ్వాలో చూస్తాం.
1-2. (ఎ) ఆదాముహవ్వలకు ఏ సామర్థ్యం ఉంది? (బి) వాళ్లు ఏం చేసుంటే బాగుండేది?
యెహోవా మనుషులకు ఒక విలువైన బహుమతి ఇచ్చాడు. అదే, సొంతగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ! కానీ జంతువులకు ఆ స్వేచ్ఛ లేదు. రోబోలు కూడా అంతే, మనం ఏం చెప్తే అదే చేస్తాయి. మొట్టమొదటి మనిషైన ఆదామును దేవుడు తన స్వరూపంలో సృష్టించాడని బైబిలు చెప్తుంది. (ఆది. 1:26, 27) కాబట్టి ఆదాముకు, ఆయన భార్య హవ్వకు సొంతగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, తెలివి ఉన్నాయి.
2 యెహోవా ఆదాముహవ్వలకు ఒక పెద్ద నియమాల లిస్ట్ ఇవ్వలేదు. కేవలం భూమిని జాగ్రత్తగా చూసుకుంటూ, దాన్ని పిల్లలతో నింపాలని చెప్పాడు. అలాగే, వాళ్లకు కొన్ని హద్దులు పెట్టే హక్కు తనకు ఉందని గుర్తిస్తే చాలు అనుకున్నాడు. (ఆది. 1:28; 2:16, 17) యెహోవా వాళ్లకు సొంతగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఇచ్చాడు కాబట్టి వాళ్లు ఏం చేసుంటే బాగుండేది? వాళ్లకు అన్ని ఇచ్చిన యెహోవా మాట వినుంటే బాగుండేది. యెహోవా మీద ప్రేమ, ఆయన్ని సంతోషపెట్టాలనే ఆలోచన ఉండివుంటే వాళ్లు మాట వినేవాళ్లు.—సామె. 23:15.
3. దేవుడు ఇచ్చిన స్వేచ్ఛను ఆదాముహవ్వలు ఎలా ఉపయోగించారు?
3 ఆదాముహవ్వలు సొంతగా నిర్ణయాలు తీసుకునే ఆ స్వేచ్ఛను సరిగ్గా ఉపయోగించలేదని బైబిలు చెప్తుంది. వాళ్లు యెహోవా మాట వినొద్దని నిర్ణయించుకున్నారు. దాన్నిబట్టి వాళ్లకు యెహోవా మీద ప్రేమ, కృతజ్ఞత లేవని, స్వార్థంతోనే ప్రవర్తించారని అర్థమౌతుంది. (ఆది. 3:1-7) ఆరోజు వాళ్లు చేసిన తప్పువల్ల మనం ఈరోజు వరకు బాధలు పడుతూనే ఉన్నాం.—రోమా. 5:12.
4. (ఎ) గలతీయులు 6:5 ప్రకారం మనమందరం ఏం చేయాలి? (బి) దేవుడు ఇచ్చిన ఇంకో బహుమతి ఏంటి?
4 మనం ప్రతీరోజు ఎన్నో నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. (గలతీయులు 6:5 చదవండి.) అందులో కొన్ని చిన్నవి, కొన్ని పెద్దవి. అయితే, మనం యెహోవాను సంతోషపెట్టే నిర్ణయాలు ఎలా తీసుకోవచ్చు? ముందు, మనకు యెహోవా సహాయం అవసరమని గుర్తించాలి. (సామె. 16:3; యిర్మీ. 10:23) ఎందుకంటే, పరిపూర్ణ మనిషైన యేసుకే యెహోవా సహాయం అవసరమైంది. (హెబ్రీ. 5:7) అలాంటిది, అపరిపూర్ణులమైన మనకు ఇంకెంత అవసరమో కదా! మనం మంచి నిర్ణయాలు తీసుకోవడానికి యెహోవా ఇంకో బహుమతి ఇచ్చాడు. అదే మనస్సాక్షి! దాని గురించి ఇప్పుడు చూద్దాం.
మనస్సాక్షి అంటే ఏంటి?
5. (ఎ) మనస్సాక్షి అంటే ఏంటి? (బి) అది ఏం చేస్తుంది, ఎలా సహాయం చేస్తుంది? (రోమీయులు 2:14, 15)
5 ఇది తప్పు, ఇది కరెక్ట్ అని మన లోపల నుండి మనకు చెప్పేదే మనస్సాక్షి. దేవుని నియమాల గురించి బొత్తిగా తెలియని వ్యక్తికి కూడా మనస్సాక్షి ఉంటుంది. (2 కొరిం. 4:2) ఈ మనస్సాక్షి మన లోపల ఒక జడ్జిలా పనిచేస్తుంది. (రోమీయులు 2:14, 15 చదవండి.) ఒకవేళ మనం తప్పు వైపు అడుగులు వేస్తుంటే నిలదీస్తుంది. (1 సమూ. 26:8-11) సరైంది చేసినప్పుడు, ఇలాగే చేస్తూ ఉండమని మెచ్చుకుంటుంది. మనకు నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఉన్నంత మాత్రాన, మనం ఏ నిర్ణయం తీసుకున్నా యెహోవాకు నచ్చుతుందని కాదు. అందుకే మంచి నిర్ణయం ఏదో, చెడు నిర్ణయం ఏదో తెలుసుకోవడానికి మనస్సాక్షి సహాయం చేస్తుంది.
6. మనస్సాక్షితో వచ్చిన చిక్కు ఏంటి?
6 అయితే, మనస్సాక్షితో వచ్చిన చిక్కు ఏంటంటే మనలాగే అది కూడా అపరిపూర్ణమైనది. పైగా మనం పెరిగిన విధానం వల్ల, మన సంస్కృతి వల్ల, మనలో ఉన్న పాపపు కోరికల వల్ల అది కొన్నిసార్లు తిన్నగా పనిచేయకపోవచ్చు. అందుకే బైబిలు కొన్నిసార్లు మన మనస్సాక్షి ‘బలహీనం అవ్వవచ్చు,’ ‘కలుషితం అవ్వవచ్చు,’ ‘మొద్దుబారిపోవచ్చు,’ ‘చెడిపోవచ్చు’ అని అంటుంది. (1 కొరిం. 8:12; తీతు 1:15; 1 తిమో. 4:2; హెబ్రీ. 10:22) ఇలాంటి మనస్సాక్షితో సరైన నిర్ణయాలు తీసుకోవడం అయ్యే పని కాదు. అది పాడైపోయిన గడియారంతో సమానం. అది సరిగ్గా పనిచేయాలంటే రిపేర్ చేయాల్సిందే. కాబట్టి, మన మనస్సాక్షి బాగుండాలంటే దాన్ని ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూ ఉండాలి. (1 పేతు. 3:16) అయితే దాన్ని ఎలా చేయవచ్చు?
మనస్సాక్షికి శిక్షణ ఎలా ఇవ్వవచ్చు?
7-8. (ఎ) మన మనస్సాక్షికి ఎలా శిక్షణ ఇవ్వవచ్చు? (బి) బైబిలు సూత్రాలు మనల్ని ఎలా నడిపిస్తాయో ఒక ఉదాహరణతో చెప్పండి. (చిత్రం కూడా చూడండి.)
7 మనస్సాక్షికి శిక్షణ ఎలా ఇవ్వవచ్చు? ప్రతీరోజు బైబిలు చదవాలి, యెహోవా దృష్టిలో ఏది తప్పో, ఏది కరెక్టో తెలుసుకోవాలి. దేవుని నియమాల్ని అధ్యయనం చేస్తూ ఉంటే యెహోవా ఆలోచన ఏంటో అర్థం చేసుకుంటాం. కానీ ముందటి ఆర్టికల్‌లో చూసినట్టు, నియమాలకు కొన్ని పరిమితులు ఉంటాయి, కాబట్టి మనం సూత్రాల కోసం కూడా వెతకాలి. అలా వెతికినప్పుడు యెహోవా ఆలోచననే కాదు, ఆయన మనసును కూడా అర్థంచేసుకుంటాం.—యెష. 55:9.
8 మీరు ఒక అడవిలో ప్రయాణిస్తున్నట్టు ఊహించుకోండి. మీరు ఏ దిక్కులో వెళ్లాలో చెప్పే గుర్తులు గానీ, సైన్ బోర్డులు గానీ లేకపోతే ఏం చేస్తారు? సూర్యున్ని, నక్షత్రాల్ని చూస్తే మీకు ఎటు వెళ్లాలో కొంతవరకు తెలుస్తుంది; కానీ పూర్తిగా అర్థం కాదు. కాబట్టి మీ గమ్యాన్ని చేరాలంటే, మీ చేతిలో ఒక మ్యాప్ ఉంటే బాగుంటుంది. మీరు ఏ దారిలో వెళ్లాలో, ఆ దారిలో ఏయే గుర్తులు ఉన్నాయో మ్యాప్‌లో కనిపిస్తుంది. కాబట్టి సరిగ్గానే వెళ్తున్నామా, పక్కదారి పడుతున్నామా అని తెలిసిపోతుంది. ఆ గుర్తులు ప్రకారం వెళ్తే మీ గమ్యానికి సురక్షితంగా చేరుకుంటారు. మన జీవితానికి కూడా ఒక గమ్యం ఉంది. అదే, యెహోవాను సంతోషపెట్టడం. బైబిలు మన గమ్యానికి నడిపించే ఒక మ్యాప్ లాంటిది. అందులో ఉన్న సూత్రాలు మన దారిలో ఉండే గుర్తులు. మనం వాటిని చూసుకుంటూ నడిస్తే మన గమ్యాన్ని సురక్షితంగా చేరుకుంటాం.
బైబిలు సూత్రాలు దారిలో ఉండే గుర్తులు లాంటివి, వాటివల్ల మనం సరైన దారిలో వెళ్తున్నామనే ధైర్యం వస్తుంది (8వ పేరా చూడండి)
9. రోమీయులు 9:1 ప్రకారం, మన మనస్సాక్షికి శిక్షణ ఇవ్వడానికి ఇంకా ఏం సహాయం చేస్తుంది?
9 మన మనస్సాక్షికి సరిగ్గా శిక్షణ ఇవ్వాలంటే దేవుని పవిత్రశక్తి కావాలి. (రోమీయులు 9:1 చదవండి.) ఫలానా విషయంలో దేవుని ఆలోచన ఏంటో అర్థం చేసుకోవడానికి పవిత్రశక్తి సహాయం చేస్తుంది. అంతేకాదు, యెహోవాకు నచ్చే పనులు చేయాలనే కోరికను, వాటిని చేసే శక్తిని అది మనకు ఇస్తుంది. (ఫిలి. 2:13) అయితే, యెహోవా పవిత్రశక్తి మనకు ఎలా వస్తుంది?
10. పవిత్రశక్తి సహాయం కావాలంటే మనం ఏం చేయాలి? (లూకా 11:10, 13)
10 పవిత్రశక్తి ఇవ్వమని ప్రార్థన చేయండి. (లూకా 11:10, 13 చదవండి.) పవిత్రశక్తి ఇచ్చే విషయంలో యెహోవాది పెద్ద చెయ్యి అని మనకు తెలుసు. (యోహా. 3:34) తన మాట వినేవాళ్లందరికీ యెహోవా పవిత్రశక్తిని కొద్దికొద్దిగా కాదుగానీ, పూర్తిగా కుమ్మరిస్తాడు. (సామె. 1:23; యాకో. 1:5) అయితే, మన మనస్సాక్షికి శిక్షణ ఇవ్వడానికి ఇంకా ఏది సహాయం చేస్తుంది?
11. (ఎ) మన జీవిత లక్ష్యం ఏంటి? (బి) మనకు శిక్షణ పొందిన మనస్సాక్షి ఎందుకు అవసరం?
11 ఎప్పుడూ యెహోవా ఆమోదం కోసం చూడండి. (సామె. 8:34, 35) దాన్నే మన జీవిత లక్ష్యంగా చేసుకోవాలి. ఎలాంటి పరిస్థితులు వచ్చినాసరే ఆ లక్ష్యాన్ని మనసులో ఉంచుకుంటే, మన మనస్సాక్షికి శిక్షణ ఇవ్వగలుగుతాం. బాగా శిక్షణ పొందిన మనస్సాక్షి మనకుంటే, మన ఆలోచనల్ని యెహోవా ఆలోచనలకు తగ్గట్టు మార్చుకుంటాం, ఆయన మనసు తెలుసుకుంటాం. ఈరోజుల్లో మన జీవితం చాలా కష్టంగా తయారౌతుంది. కాబట్టి శిక్షణ పొందిన మనస్సాక్షి చాలా అవసరం. కొన్నిసార్లు బైబిల్లో సూటిగా లేని విషయాల్లో మనం నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఉదాహరణకు పని, చదువు, వినోదం, స్నేహాలు లాంటి విషయాల్లో మనం తీసుకునే నిర్ణయాల్ని యెహోవా ఆమోదిస్తాడో లేదో ఎలా తెలుస్తుంది?—2 కొరిం. 1:12.
12. మన మనస్సాక్షి సరైన దారిలో నడిపిస్తుందో లేదో ఎలా తెలుస్తుంది? (ఎఫెసీయులు 5:10)
12 దేవుని వాక్యాన్ని ధ్యానించండి. (కీర్త. 49:3) బైబిలు చదువుతున్నప్పుడు, యెహోవా ఆలోచనను అర్థం చేసుకోవడానికి సహాయం చేసే సూత్రాల కోసం చూడండి. (ఎఫెసీయులు 5:10 చదవండి.) అలాచేస్తే, చిక్కుముడి లాంటి సమస్యలు వచ్చినప్పుడు, సరైన నిర్ణయాలు తీసుకునేలా మన మనస్సాక్షి మనల్ని నడిపిస్తుందో లేదో తెలుస్తుంది. (సామె. 2:4-9, 11-13) ఒకవేళ మన మనస్సాక్షి తప్పుదారిలో నడిపిస్తుంటే, దాన్ని మళ్లీ గాడిలోకి తెచ్చుకోవడానికి ఆ సూత్రాలు సహాయం చేస్తాయి.—హెబ్రీ. 5:14.
13. మనం ముందే ఏం చేయకూడదు? ఒక ఉదాహరణ చెప్పండి.
13 ముందే నిర్ణయం తీసేసుకొని, దాన్ని సమర్థించే సూత్రాల కోసం వెతకవద్దు. క్రీస్తు పూర్వం 607 లో యెరూషలేము నాశనమయ్యాక కూడా యూదాలోనే ఉండిపోయిన ఇశ్రాయేలీయులు అదే చేశారు. కానీ మనం అలా ఉండకూడదు. వాళ్లు యిర్మీయాతో ఏమన్నారంటే: “మేము ఏ మార్గంలో నడవాలో, ఏంచేయాలో నీ దేవుడైన యెహోవా మాకు చెప్పాలి.” (యిర్మీ. 42:3-6) వాళ్లు పైకి అలా చెప్పారు గానీ, ముందే ఒక నిర్ణయం తీసేసుకున్నారు. యెహోవా ఇచ్చిన నిర్దేశం వాళ్లు అనుకున్నట్టుగా రాలేదు, కాబట్టి వాళ్లకు అది నచ్చలేదు. చివరికి వాళ్లు అనుకున్నదే చేశారు; చాలా నష్టపోయారు. (యిర్మీ. 42:19-22; 43:1, 2, 4) కాబట్టి నిర్ణయం తీసుకోకముందే యెహోవా ఆలోచన ఏంటో చెప్పే సూత్రాల కోసం వెతకాలి, ఆ తర్వాత దానికి తగ్గట్టు నిర్ణయాలు తీసుకోవాలి.
14. మన నిర్ణయాలు బైబిలు సూత్రాలపై ఎందుకు ఆధారపడి ఉండాలి?
14 మన నిర్ణయాలు బైబిలు సూత్రాలపై ఆధారపడి ఉండాలి. (మత్త. 7:24-29; యాకో. 1:23-25) బైబిలు సూత్రాలపై ఆధారపడి నిర్ణయాలు తీసుకుంటే, మనం యెహోవా పవిత్రశక్తికి తగ్గట్టు పనిచేసినట్టే. అలా చేస్తే, యెహోవా ఎప్పటిలాగే తన పవిత్రశక్తిని ఇస్తూనే ఉంటాడు. (అపొ. 5:32) అయితే, పవిత్రశక్తి చెప్పినట్టు కాకుండా, మనం ఇంకోవైపు వెళ్తే దాన్ని ‘బాధపెట్టినట్టే,’ లేదా ‘ఎదిరించినట్టే.’ (ఎఫె. 4:30; యెష. 63:10; అపొ. 7:51) అప్పుడు యెహోవా మనకు పవిత్రశక్తిని ఇవ్వడం ఆపేస్తాడు. (కీర్త. 51:11; 1 థెస్స. 5:19) అంతకంటే ఘోరమైన విషయం ఇంకేమైనా ఉంటుందా! ఎందుకంటే పవిత్రశక్తి నుండే మనకు కావాల్సిన బలం, శక్తి వస్తాయి.—ఎఫె. 3:16.
మనకు సరిపోయే బైబిలు సూత్రాలు ఎలా వెతకాలి?
15-16. (ఎ) మనకు సరిపోయే బైబిలు సూత్రాల్ని ఎలా వెతకాలి? (బి) సిగరెట్ మానేయడానికి మీ బైబిలు విద్యార్థికి ఏ సూత్రాలు సహాయం చేస్తాయి?
15 అధ్యయనం కోసం ఉన్న పనిముట్లను చక్కగా వాడండి. బైబిలు సూత్రాల్ని పాటించాలంటే ముందు అవి ఎక్కడున్నాయో తెలియాలి. ఉదాహరణకు, మీ బైబిలు విద్యార్థికి సిగరెట్ తాగే అలవాటు ఉంది అనుకుందాం. అది మానేయడం అతనికి ఇష్టం లేదు. అతను ఇలా అనొచ్చు: ‘సిగరెట్ తాగొద్దని బైబిల్లో లేదు కదా. అది తప్పని మీరెలా అంటారు?’ సిగరెట్ తాగడం తప్పని చెప్పే బైబిలు సూత్రాల్ని వెతకడానికి అతనికి ఎలా సహాయం చేయవచ్చు? దానికి ఉపయోగపడే ఒక చక్కని పనిముట్టు ఏంటంటే, యెహోవాసాక్షుల పరిశోధనా పుస్తకం. దానిలో “సాతాను వ్యవస్థ” అనే అంశం కింద “పొగాకు, పొగతాగడం” అనే అంశాన్ని చూపించవచ్చు. ముఖ్యంగా దాంట్లో “పొగతాగడం గురించి దేవుడు ఏమంటున్నాడు?” అనే ఆర్టికల్ చూపించవచ్చు. (కావలికోట, జూలై-సెప్టెంబరు 2014 చూడండి.) ఆ ఆర్టికల్ చదువుతున్నప్పుడు మీ బైబిలు విద్యార్థికి ఏ లేఖనాలు, సూత్రాలు కనిపిస్తాయి?
16 ఆ ఆర్టికల్‌లో ఐదు సూత్రాలు ఉన్నాయి. (1) మనల్ని చావుకు దగ్గర చేసే దేనికీ బానిసలు అవ్వొద్దు. (రోమా. 6:16) (2) మన శరీరానికి హాని చేసేవాటికి దూరంగా ఉండాలి. (2 కొరిం. 7:1) (3) తనను నిండు ప్రాణంతో ఆరాధించమని యెహోవా కోరుకుంటున్నాడు. (మత్త. 22:37) (4) ఇతరులకు హాని చేసే వాటికి దూరంగా ఉండాలి. (మత్త. 22:39; 1 కొరిం. 10:24) (5) సరైంది చేసే బలాన్ని యెహోవా ఇస్తాడు. (ఫిలి. 4:13) కాబట్టి, సిగరెట్ తాగొద్దని బైబిల్లో ఎక్కడా లేకపోయినా, మనకు దొరికిన బైబిలు సూత్రాల్ని బట్టి సిగరెట్ తాగే విషయంలో యెహోవా ఆలోచన ఏంటో మీ బైబిలు విద్యార్థి అర్థం చేసుకోగలుగుతాడు.
17. పెళ్లి చేసుకోవాలని అనుకునేవాళ్లు మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఏ బైబిలు సూత్రాల కోసం వెతకవచ్చు?
17 పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్న ఒక జంట, పెళ్లి ఏర్పాట్ల విషయంలో మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఏ బైబిలు సూత్రాల కోసం వెతకవచ్చు? వాళ్లకు కూడా పరిశోధనా పుస్తకమే సహాయం చేస్తుంది. “కుటుంబ జీవితం” అనేదాని కింద “పెళ్లిళ్లు, పెళ్లి విందులు” అనే అంశంలో చాలా ఆర్టికల్స్ ఉన్నాయి. దానిలో వాళ్లకు బైబిలు సూత్రాలు దొరుకుతాయి. వాళ్లు ఈ ఆరు సూత్రాల గురించి ఆలోచించవచ్చు: (1) పెళ్లి ఏర్పాట్లు అన్నీ యెహోవాకు ఘనత తేవాలి. (1 కొరిం. 10:31, 32) (2) మన బట్టలు సందర్భానికి తగినట్టుగా ఉండాలి, అసభ్యంగా ఉండకూడదు. (1 తిమో. 2:9; 1 పేతు. 3:3, 4) (3) లోకస్థుల్లా మరీ ఆర్భాటంగా చేసుకుంటూ, మనకున్న వాటిని గొప్పగా చూపించుకోకూడదు. (యోహా. 17:14; యాకో. 1:27; 1 యోహా. 2:15, 16) (4) పెళ్లి ఏర్పాట్లన్నీ మర్యాదగా, పద్ధతిగా జరగాలి. (1 కొరిం. 14:40) (5) అతిగా తాగడం వల్ల పెళ్లివిందు అల్లరివిందుగా మారకూడదు. (గల. 5:21) (6) ఏర్పాట్లన్నీ చూసుకునే ఒక పెళ్లి పెద్ద ఉండాలి.—యోహా. 2:8, 9.
18-19. (ఎ) మనకు ఇంకా ఏ పనిముట్టు సహాయం చేస్తుంది? (బి) పండుగలు, వేడుకలకు సంబంధించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు బైబిలు సూత్రాల్ని మనం ఎలా వెతకవచ్చు? (“వీటి సూత్రాల్ని మీరు గుర్తుపట్టగలరా?” అనే బాక్స్ చూడండి)
18 చాలామందికి పనికొచ్చిన ఇంకో పనిముట్టు ఏంటంటే, మంచి క్రైస్తవులుగా ఉండడానికి ఉపయోగపడే లేఖనాలు. దాంట్లో రకరకాల విషయాల గురించి ప్రశ్నలు, లేఖనాలు ఉంటాయి. మీరు ఒక అంశం ఎంచుకుని, అక్కడ ఇచ్చిన ప్రశ్నలు వేసుకుని లేఖనాలు చదివితే, అందులో ఉన్న సూత్రాల్ని గుర్తుపట్టవచ్చు. ఉదాహరణకు, ఒకవ్యక్తి ఏదైనా వేడుకకు వెళ్లాలా వద్దా అని ఆలోచిస్తుంటే, ఆయన ఏం చేయవచ్చు? ఆయన ఆ పుస్తకంలోని “పండుగలు, వేడుకలు” అనేదాని కిందున్న “క్రైస్తవులు చేసుకోనివి” అనే అంశం చూడొచ్చు.
19 ఉదాహరణకు, ఆ అంశం కింద ఈ ప్రశ్న ఉంది: “అబద్ధ మతం వల్ల కలుషితమైన పండుగల్లో పాల్గొనడం ఎందుకు తప్పు? (1కొ 10:21; 2కొ 6:14-18; ఎఫె 5:10, 11).” దానికి సంబంధించి కొన్ని ఉదాహరణలు కూడా ఇచ్చారు. ఒకవ్యక్తి దేశ చరిత్రను, యుద్ధాల్ని గుర్తుచేసుకునే వేడుకలకు లేదా ప్రముఖుల్ని దేవుడిలా పూజించే వేడుకలకు వెళ్లాలా వద్దా అని ఆలోచిస్తుండవచ్చు. అప్పుడు ఈ పుస్తకంలో ఉన్న “జాతీయ వేడుకలు” అనే అంశం కిందున్న లేఖన సూత్రాలు అతనికి సహాయం చేస్తాయి. మన మనస్సాక్షికి శిక్షణ ఇవ్వడానికి ఇలాంటి పనిముట్లను ఇస్తున్నందుకు యెహోవా సంస్థకు ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే!
మీ మనస్సాక్షికి బాగా శిక్షణ ఇచ్చుకున్నారని చూపించండి
20. మన మనస్సాక్షికి చక్కగా శిక్షణ ఇస్తే ఏం చేస్తాం?
20 మనకు నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛను యెహోవా ఒక బహుమతిగా ఇచ్చాడు. దానిమీద కృతజ్ఞత చూపించాలన్నా, దాన్ని చక్కగా వాడాలన్నా మన మనస్సాక్షికి శిక్షణ ఇచ్చుకోవాలి. మన మనస్సాక్షికి చక్కగా శిక్షణ ఇస్తే యెహోవాకు ఘనత తెచ్చేలా, ఆయనకు నచ్చేలా నిర్ణయాలు తీసుకుంటాం. అలా చేయాలంటే, మనకు పవిత్రశక్తి కావాలి కాబట్టి ఎప్పుడూ దానికోసం అడుగుతూ ఉందాం, అది నడిపించే దారిలో వెళ్తూ ఉందాం. అంతేకాదు, మనస్సాక్షికి శిక్షణ ఇచ్చుకోవడానికి బైబిలు సూత్రాలు కూడా సహాయం చేస్తాయి. కాబట్టి ఈ బహుమతుల్ని చక్కగా ఉపయోగించండి, దేవుని వాక్యానికి ఎంత శక్తి ఉందో చూడండి.—2 తిమో. 3:16, 17; హెబ్రీ. 4:12.
పాట 135 యెహోవా ప్రేమతో అడుగుతున్నాడు: ‘నా కుమారుడా, జ్ఞానాన్ని సంపాదించు’