మీకు జ్ఞాపకమున్నాయా?
మీరు ఈ సంవత్సరం కావలికోట పత్రికల్ని జాగ్రత్తగా చదివారా? అయితే, ఈ కింది ప్రశ్నలకు జవాబు ఇవ్వగలరేమో చూడండి:
యెహోవాను మనం ఎందుకు మహిమపరుస్తాం?
ఎందుకంటే మనకు యెహోవా అంటే చాలా గౌరవం, ప్రేమ. వేరేవాళ్లు కూడా ఆయన గురించి తెలుసుకోవాలని కోరుకుంటాం. కాబట్టి మనం ఆయన్ని మహిమపరుస్తాం.—w25.01, 3వ పేజీ.
ఎవరైనా మనల్ని బాధపెడితే, మనం వాళ్లని ఎలా క్షమించవచ్చు?
క్షమించడం అంటే మన ఫీలింగ్స్‌ని పట్టించుకోకపోడం కాదు. అయితే, ఆ బాధ మనల్ని తినేయకుండా ఉండాలంటే కోపాన్ని వదిలేయాలి.—w25.02, 15-16 పేజీలు.
యౌవన సహోదరులకు శిష్యుడైన మార్కు ఎలా మంచి ఆదర్శం?
మార్కు వేరేవాళ్లకు సేవచేయడానికి ఇష్టపడ్డాడు. ఒకానొక సంఘటన వల్ల కాస్త బాధపడి, నొచ్చుకున్నాడు గానీ తన బ్రదర్స్‌సిస్టర్స్‌కి సేవచేయడం ఆపేయలేదు. ఆయన పౌలుతో అలాగే పరిణతిగల ఇతర క్రైస్తవులతో సమయం గడిపాడు.—w25.04, 27వ పేజీ.
“నీ పేరును వీళ్లకు తెలియజేశాను” అని యేసు ప్రార్థనలో చెప్పిన మాటకు అర్థం ఏంటి? (యోహాను 17:26)
తన శిష్యులకు అప్పటికే దేవుని పేరు తెలుసు. కానీ యేసు ఆ పేరు వెనకున్న వ్యక్తిని వాళ్లకు పరిచయం చేశాడు. అంటే ఆయన ఉద్దేశాలు, పనులు, లక్షణాల గురించి వాళ్లకు చెప్పాడు.—w25.05, 20-21 పేజీలు.
మనకు అణకువ ఉంటే ఏం గుర్తిస్తాం?
మనకు కొన్ని విషయాలు తెలీవని గుర్తిస్తాం. ఉదాహరణకు, అంతం ఎప్పుడు వస్తుందో, అప్పుడు యెహోవా ఎలా చర్య తీసుకుంటాడో మనకు తెలీదు. రేపన్న రోజు ఏం జరుగుతుందో మనకు తెలీదు. యెహోవాకు మన గురించి ఎంత బాగా తెలుసో మనం అంచనా కూడా వేయలేం.— w25.06, 15-18 పేజీలు.
ఒక ఆర్టికల్ నుండి గానీ బహిరంగ ప్రసంగం నుండి గానీ మనం ప్రయోజనం పొందాలంటే ఏం చేయాలి?
మనం ఈ ప్రశ్నలు వేసుకోవచ్చు: ‘ప్రేక్షకుల్ని ఒప్పించడానికి ఏ రుజువులు వాడారు? ఈ సత్యాన్ని వేరేవాళ్లకు చెప్పడానికి ఏదైనా మంచి ఉదాహరణ ఉందా? ఈ అంశం ఎవరికి నచ్చుతుంది? వాళ్లకు నేను ఎప్పుడు చెప్పొచ్చు?’—w25.07, 19వ పేజీ.
యెహోవా దావీదు విషయంలో చేసిన దాన్నిబట్టి, ఆయన క్షమాపణ గురించి మనం ఏం నేర్చుకోవచ్చు?
దావీదు తన జీవితంలో పెద్దపెద్ద పాపలు చేసినా, మనస్ఫూర్తిగా పశ్చాత్తాపపడినప్పుడు యెహోవా ఆయన్ని క్షమించాడు. (1 రాజు. 9:4, 5) ఒక్కసారి దేవుడు క్షమించాడంటే, మళ్లీ వాటిని ఎప్పుడూ ఎత్తి చూపించి, శిక్షించడు.—w25.08, 17వ పేజీ.
ఒకవేళ బైబిలు విద్యార్థి ఏదైనా విషయాన్ని అర్థం చేసుకోలేకపోతుంటే, మీరు ఏం చేయవచ్చు?
మీరు ప్రస్తుతానికి ఆ అంశాన్ని దాటేసి స్టడీ ముందుకు కొనసాగించాలి. ఆ తర్వాత మళ్లీ వాటిగురించి ఎప్పుడైనా చర్చించవచ్చు.—w25.09, 24వ పేజీ.
పాపానికి “మోసకరమైన శక్తి” ఉందని బైబిలు చెప్తుంది. (హెబ్రీ. 3:13) అలాగని ఎందుకు చెప్పవచ్చు?
మనలో ఉన్న పాపం, మనతో తప్పులు చేయించడమే కాదు, యెహోవా ప్రేమను కూడా అదేపనిగా అనుమానించేలా చేస్తుంది.—w25.10, 16వ పేజీ.
మన ప్రార్థనలు ఇంకా మనస్ఫూర్తిగా ఉండాలంటే చేయాల్సిన మూడు పనులు ఏంటి?
(1) యెహోవా లక్షణాల గురించి ఆలోచించండి. (2) ఇప్పుడు మీరు ఎలాంటి సమస్యలతో పోరాడుతున్నారు? మీరు ఎవరినైనా క్షమించాలా? ఈ మధ్యకాలంలో మీ జీవితంలో వచ్చిన మార్పువల్ల యెహోవా సహాయం మీకు అవసరమా? లాంటి వాటిగురించి ఆలోచించండి. (3) హడావిడిగా కాకుండా ప్రార్థనలో సమయం గడపండి. అప్పుడు, మన మనసు లోలోతుల్లో ఉన్నవి చెప్పుకోగలుగుతాం.—w25.10, 19-20 పేజీలు.
వయసుపైబడిన వాళ్లకు మనం ఎలా సహాయం చేయవచ్చు?
వాళ్ల ఇంటికి వెళ్లొచ్చు లేదా కాల్ చేయవచ్చు. వాళ్లకు తోడుగా హాస్పిటల్‌కి వెళ్లొచ్చు. లేదా, వాళ్లతో కలిసి వేర్వేరు రకాలుగా పరిచర్య చేయవచ్చు.—w25.11, 6-7 పేజీలు.
పెళ్లిని గౌరవంగా, పద్ధతిగా చేసుకోవడంలో ఏమేం ఉన్నాయి?
చట్టపరమైన విషయాలకు లోబడండి. పెళ్లి ప్రసంగం అలాగే భోజన ఏర్పాట్లు అన్నిట్లో పవిత్రశక్తి పుట్టించే లక్షణాలు ఉట్టిపడేలా చూసుకోండి. మీ బట్టలు అణకువగా ఉండేలా చూసుకోండి, లేఖన విరుద్ధమైన ఆచారాలు చేయకండి. పెళ్లి పనులు ప్లాన్ చేసుకుంటున్నప్పుడు స్పష్టంగా, దయగా మాట్లాడుకోండి.—w25.12, 21-24 పేజీలు