కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w25 డిసెంబరు పేజీలు 26-30
  • వృద్ధులారా—మీరు సంఘానికి ఒక ఆస్తి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • వృద్ధులారా—మీరు సంఘానికి ఒక ఆస్తి
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • యెహోవా మీ నుండి ఏం ఆశిస్తున్నాడు?
  • మీ నుండి వేరేవాళ్లు చాలా ప్రయోజనం పొందుతారు
  • నమ్మకంగా మీరు చేసే సేవను యెహోవా విలువైనదిగా చూస్తాడు
  • మీరు ఎంత వీలైతే అంత బిజీగా ఉండండి
  • ఆయన తన హృదయ కోరికను గ్రహించాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • వృద్ధులైన తన సేవకులను యెహోవా వాత్సల్యంతో సంరక్షిస్తాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2008
  • యెహోవా సేవలో మీరు చేయగలిగిందంతా చేస్తూ సంతోషాన్ని పొందండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2022
  • వృద్ధ సహోదరసహోదరీలను విలువైనవాళ్లుగా చూడండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2021
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
w25 డిసెంబరు పేజీలు 26-30
చిత్రాలు: పెద్దవయసు బ్రదర్స్‌సిస్టర్స్‌ యెహోవా సేవను ఆనందంగా చేస్తున్నారు. 1. ఒక బ్రదర్‌ ధైర్యంగా, ముఖం మీద చిరునవ్వుతో ముందుకు చూస్తున్నాడు. 2. ఒక నర్స్‌కి వీల్‌ఛైర్‌లో ఉన్న ఒక సిస్టర్‌ కరపత్రం ఇస్తుంది. 3. ఒక సిస్టర్‌ మీటింగ్‌లో కామెంట్స్‌ ఇస్తుంది. 4. ఒక పెద్ద వయసు సిస్టర్‌ ఒక యౌవన సహోదరుని చేయి పట్టుకొని ప్రీచింగ్‌ చేస్తుంది. 5. ఇద్దరు పిల్లలు తాము గీసిన బొమ్మల్ని రాజ్యమందిరంలో ఒక పెద్ద వయసు బ్రదర్‌కి చూపిస్తున్నారు. పక్కన వాళ్ల అమ్మ కూడా ఉంది.

వృద్ధులారా—మీరు సంఘానికి ఒక ఆస్తి

“ ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే, అసలు వయసులో ఉన్నప్పుడు అన్ని పనులు ఎలా చేశానా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు అంత హుషారు లేదు.”—కోని, 83 ఏళ్లు.

బహుశా మీ వయసు పెరగడం వల్ల మీకు కూడా ఆ సిస్టర్‌లాగే అనిపించవచ్చు. మీరు ఎన్నో ఏళ్లు యెహోవాకు నమ్మకంగా సేవ చేసినా, ప్రస్తుతం మీరు ఒకప్పుడు చేసినంత బాగా చేయలేకపోతున్నారని డీలా పడిపోవచ్చు. ఉదాహరణకు, ప్రస్తుతం మీరు చేస్తున్న సేవను ఒకప్పుడు చేసిన సేవతో మీరు పోల్చుకుంటుండవచ్చు. అలాగైతే ఆ ఆలోచనల నుండి ఎలా బయటపడవచ్చు?

యెహోవా మీ నుండి ఏం ఆశిస్తున్నాడు?

మీరు ఇలా ప్రశ్నించుకోవచ్చు, ‘యెహోవా నా నుండి ఏం ఆశిస్తున్నాడు?’ ద్వితీయోపదేశకాండం 6:5 లో మీకు ఓదార్పునిచ్చే ఈ మాటలున్నాయి: “నువ్వు నీ దేవుడైన యెహోవాను నీ నిండు హృదయంతో, నీ నిండు ప్రాణంతో, నీ పూర్తి బలంతో ప్రేమించాలి.”

ఆ వచనం ప్రకారం, యెహోవా మీ నుండి ఆశించేది ఒక్కటే. అదేంటంటే: మీ నిండు హృదయంతో, నిండు ప్రాణంతో, పూర్తి బలంతో తనకు సేవచేయడం. ఈ వాస్తవం మీరు తెలుసుకుంటే వేరేవాళ్లతో మీరు పోల్చుకోరు లేదా ఇప్పుడు మీరు చేస్తున్న దాన్ని గతంలో చేసిన దాంతో పోల్చుకోరు.

దీనిగురించి ఆలోచించండి: మీరు వయసులో ఉన్నప్పుడు యెహోవాకు ఏం ఇచ్చారు? చాలామంది యెహోవాకు తమ బెస్ట్‌ ఇచ్చామని చెప్తారు. మీరు కూడా ఒకప్పుడు మీ పరిస్థితుల్ని బట్టి మీ బెస్ట్‌ ఇచ్చారు. అయితే, ఇప్పుడు మీ పరిస్థితులు మారాయా? ఇప్పుడు మీరు యెహోవాకు ఏం ఇవ్వగలరు? నిజం చెప్పాలంటే, ప్రస్తుతం మీ పరిస్థితుల్ని బట్టి, ఇప్పుడు మీరు ఏం చేయగలరో అదే మీ బెస్ట్‌. ఇలా ఆలోచిస్తే, బహుశా ఒకప్పుడు మీరు యెహోవాకు ఏం ఇచ్చారో ఇప్పుడూ అదే ఇస్తున్నారని మీరు అర్థం చేసుకుంటారు. అప్పుడూ మీ బెస్ట్‌ ఇచ్చారు, ఇప్పుడు కూడా యెహోవాకు మీ బెస్ట్‌ ఇస్తున్నారు.

చిత్రాలు: చాలా ఏళ్లగా ఒక సిస్టర్‌ యెహోవాకు నమ్మకంగా సేవ చేస్తుంది. 1. చాలా ఏళ్ల క్రితం, ఒక యౌవన సిస్టర్‌ ఇంటింటి పరిచర్యలో ఒకావిడతో మాట్లాడుతుంది.  2. ఆ సిస్టర్‌కి ఇప్పుడు వయసైపోయింది. ఇప్పుడు ఆమె ఒక యౌవన సిస్టర్‌తో కలిసి, టెలిఫోన్‌ సాక్ష్యం ఇస్తుంది.

మీ వృద్ధాప్యంలో బెస్ట్‌ ఇస్తే, మీ వయసులో ఉన్నప్పుడు చేసిందే చేస్తున్నట్టు!

మీ నుండి వేరేవాళ్లు చాలా ప్రయోజనం పొందుతారు

నాణేనికి ఇంకోవైపు ఏంటంటే: మీ వయసును ఒక అడ్డుగా కాదు ఒక అవకాశంగా చూడండి. నిజానికి వయసు పైబడిన క్రైస్తవులుగా, మీరు వయసులో ఉన్నప్పుడు చేయలేని కొన్ని పనుల్ని ఇప్పుడు చేయవచ్చు. ఉదాహరణకు, మీరు ఈ కింది పనులు చేయవచ్చు:

మీ అనుభవాన్ని వేరేవాళ్లతో పంచుకోండి. బైబిల్లో ఉన్న ఈ మాటల్ని గమనించండి:

దావీదు రాజు: “ఒకప్పుడు నేను చిన్నవాణ్ణి, ఇప్పుడు ముసలివాణ్ణి, అయితే ఒక్క నీతిమంతుడైనా విడిచిపెట్టబడడం గానీ, అతని పిల్లలు ఆహారం కోసం భిక్షమెత్తుకోవడం గానీ నేను చూడలేదు.”—కీర్త. 37:25.

యెహోషువ: “చూడండి! నేను చనిపోబోతున్నాను, మీ దేవుడైన యెహోవా మీకు చెప్పిన మంచి వాగ్దానాలన్నిట్లో ఒక్కమాట కూడా తప్పిపోలేదని మీకు బాగా తెలుసు. అవన్నీ మీ విషయంలో నిజమయ్యాయి. వాటిలో ఒక్కమాట కూడా తప్పిపోలేదు.”—యెహో. 23:14.

బహుశా మీరు ఒకప్పుడు ఇలాంటి మాటలే చెప్పి ఉంటారు. కానీ దావీదు, యెహోషువ ఎన్నోసార్లు, ఎన్నో ఏళ్లు స్వయంగా అనుభవించిన వాటిని బట్టి ఆ మాటల్ని చెప్పారు. అందుకే వాటికి విలువ ఎక్కువ!

ఒకవేళ మీరు ఎప్పటి నుండో యెహోవా సేవ చేస్తుంటే, అలా సేవ చేయడం వల్ల మీకు వచ్చిన దీవెనల గురించి వేరేవాళ్లకు చెప్పండి. యెహోవా తన ప్రజల్ని దీవించిన ఏదైనా ఒక సందర్భం మీకు గుర్తుందా? అయితే, దానిగురించి వేరే వాళ్లకు చెప్పండి! అలా చెప్తే, ఎదుటి వ్యక్తికి ప్రోత్సాహంగా ఉంటుంది. అంతేకాదు, అపార అనుభవంతో మీరు చెప్పే మాటలు ఎదుటివ్యక్తి వెన్ను తడతాయి.—రోమా. 1:11, 12.

వృద్ధులు వేరేవాళ్లను ప్రోత్సహించే ఇంకొక విధానం ఏంటంటే, వీలైనంతవరకు నేరుగా మీటింగ్స్‌కు వెళ్లడం. అలా వెళ్తే, తోటి బ్రదర్స్‌సిస్టర్స్‌కే కాదు మీకు కూడా మేలు చేసుకున్న వాళ్లౌతారు. మొదట్లో చెప్పుకున్న కోని అనే సిస్టర్‌ ఇలా అంటుంది: “మీటింగ్స్‌కి వెళ్లడం వల్ల నేను డీలా పడిపోకుండా ఉండగలిగాను. ఎందుకంటే, కింగ్‌డమ్‌ హాల్లో నన్ను అందరూ ప్రేమతో ముంచెత్తుతారు. అలాంటప్పుడు నేను ఎందుకు డీలా పడిపోవాలి? వాళ్లు చూపించిన ప్రేమకు కృతజ్ఞతగా నేను కూడా చిన్నచిన్న గిఫ్ట్‌లు ఇస్తుంటాను. అలాగే మీటింగ్స్‌లో వేరేవాళ్లను ప్రోత్సహిస్తాను, వాళ్లు ఇచ్చే ప్రోత్సాహాన్ని తీసుకుంటాను.”

నమ్మకంగా మీరు చేసే సేవను యెహోవా విలువైనదిగా చూస్తాడు

తమ పరిస్థితులవల్ల యెహోవా సేవ ఎక్కువ చేయలేకపోయిన వాళ్లమీద కూడా ఆయన ప్రేమ ఏమాత్రం తగ్గలేదు. అలాంటి చాలామంది గురించి బైబిల్లో ఉంది. ఉదాహరణకు, సుమెయోను గురించి ఆలోచించండి, ఆయన యేసు పుట్టినప్పుడు ఇంకా బ్రతికే ఉన్న ఒక వృద్ధ ఇశ్రాయేలీయుడు. సుమెయోను ఆలయానికి వెళ్లినప్పుడు బహుశా, యువకులు ఆలయంలో ముఖ్యమైన పనులు చేయడం చూసి ఉంటాడు. మరి, సుమెయోను తన గురించి తాను ఏమనుకున్నాడు? తన వయసును బట్టి, యెహోవా తనను పెద్దగా పట్టించుకోడని ఆయన అనుకుని ఉంటాడు. కానీ యెహోవా, విషయాన్ని వేరేలా చూశాడు. యెహోవా సుమెయోనును “నీతిమంతుడు, దైవభక్తిగల” వ్యక్తిగా చూశాడు. అలాగే పసివాడైన యేసును చూసే గొప్ప అవకాశాన్ని కూడా ఇచ్చాడు. యేసే మెస్సీయ అవుతాడనే ప్రవచనాన్ని కూడా యెహోవా సుమెయోనుతో చెప్పించాడు! (లూకా 2:25-35) దీన్నిబట్టి, యెహోవా ముడతపడిన సుమెయోను శరీరాన్ని చూడలేదు గానీ, బలంగా ఉన్న ఆయన విశ్వాసాన్ని చూశాడు. ‘తన పవిత్రశక్తిని ఆయనమీద ఉంచాడు.’

పసివాడైన యేసును సుమెయోనుకు చూపిస్తున్న యోసేపు, మరియలు.

సుమెయోనుకు పసివాడైన యేసును చూసే గొప్ప అవకాశం దొరికింది. అలాగే, యేసే కాబోయే మెస్సీయ అనే ప్రవచనాన్ని కూడా సుమెయోను చెప్పేలా యెహోవా చేశాడు!

మీకు కొన్ని పరిమితులున్నా నమ్మకంగా తన సేవచేస్తే, యెహోవా దాన్ని విలువైనదిగా చూస్తాడనే నమ్మకంతో ఉండండి. ఎందుకంటే, యెహోవాకు మీరు ‘ఇవ్వగలిగింది ఇచ్చినప్పుడు దేవుడు దాన్ని సంతోషంగా అంగీకరిస్తాడు, మీరు ఇవ్వలేని దాన్ని ఆయన ఆశించడు.’—2 కొరిం. 8:12.

దీన్ని గుర్తుపెట్టుకుని మీరు ఏం చేయగలరో దానిమీద మనసుపెట్టండి. ఉదాహరణకు, మీరు కాసేపైనా సరే, ఏ పద్ధతిలో ప్రీచింగ్‌ చేయగలరు? మన బ్రదర్స్‌సిస్టర్స్‌కి ఫోన్‌చేసి మాట్లాడగలరా? లేదా వాళ్లను ప్రోత్సహిస్తూ ఒక చిన్న కార్డు రాయగలరా? ముఖ్యంగా, ఎంతోకాలంగా యెహోవాకు నమ్మకంగా సేవచేసిన మీలాంటివాళ్లు ప్రేమతో చేసే ఇలాంటి చిన్నచిన్న పనులు మీ తోటి బ్రదర్స్‌సిస్టర్స్‌కి ఎంతో ప్రోత్సాహాన్నిస్తాయి.

కొంతమంది శరీరం సహకరించకపోయినా యెహోవా సేవలో చేయగలిగినదంతా చేస్తున్నారు. తూర్పు ఆఫ్రికాలోని ఒక అనుభవాన్ని, “అది నా ప్రాణాల్ని కాపాడింది” అనే బాక్స్‌లో చూడండి.

ఎన్నో ఏళ్లుగా మీరు చూపించే విశ్వాసం, విశ్వసనీయత వేరేవాళ్లను ప్రోత్సహిస్తుందని మర్చిపోకండి. మీరు సహనానికి నిలువెత్తు రూపం. అలాగే “మీరు పవిత్రులకు సేవచేశారు, ఇంకా సేవ చేస్తున్నారు; ఈ విధంగా మీరు చేసే పనిని, తన పేరు విషయంలో మీరు చూపించే ప్రేమను దేవుడు మర్చిపోడు, ఎందుకంటే ఆయన అన్యాయస్థుడు కాడు” అనే నమ్మకంతో ఉండండి!—హెబ్రీ. 6:10.

మీరు ఎంత వీలైతే అంత బిజీగా ఉండండి

వేరేవాళ్లకు సహాయం చేసే చాలామంది వృద్ధులు, కాస్త ఆరోగ్యంగా ఉంటారని, వాళ్ల మెదడు చురుగ్గా పనిచేస్తుందని, ఇంకాస్త ఎక్కువకాలం బ్రతుకుతారని నివేదికలు చెప్తున్నాయి.

నిజమే, నాలుగు మంచిపనులు చేసినంత మాత్రాన వృద్ధాప్య సమస్యలు పోవు. వృద్ధాప్యానికి, మరణానికి మూల కారణమైన పాపాన్ని దేవుని రాజ్యం మాత్రమే తీసేయగలుగుతుంది.—రోమా. 5:12.

అయినా, యెహోవా సేవలో మీరు చేసే ప్రతీ పని అంటే, తన గురించి తెలుసుకునేలా వేరేవాళ్లకు సహాయం చేయడం వల్ల కూడా మీ భవిష్యత్తు ఆశను బలపర్చుకోగలుగుతారు, మీ ఆరోగ్యాన్ని కూడా కొంతవరకు కాపాడుకోగలుగుతారు. కాబట్టి వృద్ధులారా, తన సేవలో మీరు చేసేదాన్ని యెహోవా చాలా విలువైనదిగా చూస్తాడని దయచేసి గుర్తుంచుకోండి. మీరు ఇప్పటివరకు చూపించిన విశ్వాసాన్ని బట్టి మీరు నిజంగా సంఘానికి ఒక ఆస్తి!

ఒక పెద్ద వయసు సిస్టర్‌ కార్డ్‌ దగ్గర ఉంది. ఆమె ఒక యౌవనస్థురాలికి లేఖనం చూపిస్తుంది. ఆ లేఖనం చూసి ఆమె కన్నీళ్లు టపటప రాలిపోయాయి.

అది నా ప్రాణాల్ని కాపాడింది

ఒక యౌవనస్థురాలు మన కార్టు దగ్గర నడుచుకుంటూ వెళ్తుంది. అప్పుడు మన సిస్టర్‌ ఆమెను పలకరించి, ప్రోత్సాహాన్నిచ్చే ఒక లేఖనాన్ని చూపించవచ్చా? అని అడిగి, యెహోవా ‘విపత్తును కాదు శాంతిని దయచేస్తాడు’ అని చెప్పే యిర్మీయా 29:11 చూపించింది. తర్వాత ఇలా అడిగింది, “దేవుడు నీ కోసం ఎలాంటి భవిష్యత్తు ఇస్తానని చెప్తున్నాడో గమనించావా?”

ఆ మాటలు ఆ యౌవనస్థురాలికి చాలా నచ్చాయి. ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ ఇలా అంది: “దేవుడు నాకు మంచి భవిష్యత్తును, ప్రశాంతతను ఇవ్వాలనుకుంటున్నాడు. ఈ మాటలు నాకు చూపించినందుకు చాలాచాలా థ్యాంక్స్‌. ఇది నా ప్రార్థనకు జవాబు అనుకుంటున్నాను. ఎందుకంటే, నాకు ఒకదాని తర్వాత ఒకటి చాలా కష్టాలు వచ్చాయి. నాకు ఎన్ని కష్టాలు ఉన్నాయంటే, నేను ఇక చచ్చిపోవాలనుకున్నాను. ఈ రోజు పొద్దున్నే, ‘నన్ను పట్టించుకుంటున్నావు అని చూపించే ఒక్క పనైనా చేయమని’ దేవుణ్ణి అడిగాను. ఆ తర్వాత, ఇప్పుడు ఇదిగో! నేను ఎవరో మీకు తెలియక పోయినా, నన్ను ఆపి దేవుడు నా గురించి ఏం అనుకుంటున్నాడో చదివి వినిపించారు. ఇదేదో అనుకోకుండా జరిగింది మాత్రం కాదు.”

ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలతో పోరాడడానికి బైబిలు ఎలా సహాయం చేస్తుందో తెలిపే ఆర్టికల్స్‌ jw.orgలో ఉన్నాయి. మన సిస్టర్‌, ఆ యౌవనస్థురాలికి వాటిని చూపించింది. ఆ తర్వాత, బైబిలు స్టడీ గురించి చెప్పి మీటింగ్స్‌కి పిలిచింది. ఆ ఆదివారం మీటింగ్‌కి ఆమె వచ్చింది. ప్రస్తుతం, ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! అనే బ్రోషుర్‌ నుండి స్టడీ తీసుకుంటుంది.

మీ వయసు ఏదైనా, కార్టు విట్నెసింగ్‌ చేయవచ్చు!

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి