కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w25 నవంబరు పేజీ 30
  • దాడికి గురైన ఆడవాళ్లకు ఆసరా

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దాడికి గురైన ఆడవాళ్లకు ఆసరా
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
  • ఇలాంటి మరితర సమాచారం
  • స్త్రీల భద్రత—బైబిలు ఏం చెప్తుంది?
    అదనపు అంశాలు
  • అధ్యయనం కోసం చిట్కా
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2023
  • సహాయం మీకు చేరువలో ఉంది
    తేజరిల్లు!—2020
  • జీవితం గురించిన ప్రశ్నలకు జవాబులు ఎవరు ఇస్తారు?
    జీవితం గురించిన ప్రశ్నలకు జవాబులు ఎవరు ఇస్తారు?
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
w25 నవంబరు పేజీ 30
“స్త్రీల భద్రత​—బైబిలు ఏం చెప్తుంది?” అనే ఆర్టికల్‌ ప్రింట్‌ కాపీని మన సిస్టర్‌ ఒకావిడకు ఇస్తుంది.

దాడికి గురైన ఆడవాళ్లకు ఆసరా

“ప్రపంచవ్యాప్తంగా లక్షలమంది స్త్రీల మీద, ఆడపిల్లల మీద దాడులు జరుగుతున్నాయి. మీకు కూడా అలా ఎప్పుడైనా జరిగిందా? అయితే గుర్తుంచుకోండి మీరు సురక్షితంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? స్త్రీలపై దాడులు జరగకుండా ఆయన ఏం చేయబోతున్నాడో తెలుసుకోవాలని ఉందా?”

ఈ మాటలతో jw.orgలో ఉన్న “స్త్రీల భద్రత—బైబిలు ఏం చెప్తుంది?” అనే ఆర్టికల్‌ మొదలౌతుంది. ఆ ఆర్టికల్‌ చివర్లో ఉన్న లింక్‌ని నొక్కి మీరు దాన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. దాన్ని మీరు ప్రింట్‌ తీసుకుని మడత పెడితే, అది నాలుగు పేజీల కరపత్రంలా కనిపిస్తుంది. అమెరికాలో ఉంటున్న స్టేసీ అనే సిస్టర్‌ ఇలా చెప్తుంది “నేను ఆ ఆర్టికల్‌ని ప్రింట్‌ తీసుకుని, ఇంకో సిస్టర్‌తో కలిసి మా టెరిటరీలో ఉండే, ఆడవాళ్ల వసతి గృహంలో ఇచ్చాం. అక్కడ దాడికి గురైన ఆడవాళ్లు తలదాచుకుంటారు.”

అక్కడ పనిచేస్తున్న ఒక ఆవిడా, ‘ఆ బిల్డింగ్‌లోని మిగతా వాళ్లందరికీ ఇవ్వడానికి ఇంకొన్ని కాపీలు ఉన్నాయా?’ అని అడిగింది. అప్పుడు మన సిస్టర్స్‌ ఇంకో 40 కాపీల్ని, దాంతోపాటు 30 jw.org కాంటాక్ట్‌ కార్డుల్ని ఇచ్చారు. వాళ్లను మళ్లీ కలిసినప్పుడు, ఆ బిల్డింగ్‌ని చూసుకుంటున్న ఒక ఆవిడా, అక్కడున్న వాళ్లందరికీ బైబిలు స్టడీ ఎలా చేస్తారో చూపించమని అడిగింది.

స్టేసీ అలాగే ఇంకో ఇద్దరు సిస్టర్స్‌ కలిసి, ఇలాంటి ఇంకో బిల్డింగ్‌లో ఈ కరపత్రాన్ని ఇచ్చినప్పుడు, చాలా మంచి ఫలితాలు వచ్చాయి. వాళ్లు అక్కడ ఐదు కరపత్రాల్ని ఇచ్చారు. అక్కడున్నవాళ్లయితే, మాకు ఇలాంటివి ఇంకా చాలా కావాలని అడిగారు. అక్కడ పనిచేస్తున్న ఒకామె ఇలా అంది: “ఇది ఆడవాళ్లందరికీ ఉపయోగపడుతుంది. ముఖ్యంగా, ఇక్కడున్నవాళ్లకు ఇది చాలా అవసరం.” మన సిస్టర్స్‌ వాళ్లను మళ్లీ కలవడానికి వెళ్లేసరికి, అక్కడ చాలామంది బైబిలు స్టడీ ఎలా చేస్తారో చూద్దామని ఆశగా ఎదురుచూస్తున్నారు. అందులో ఇద్దరైతే, ఆదివారం జరిగే మీటింగ్‌కు రావాలనుకుంటున్నాం అని కూడా చెప్పారు.

స్టేసీ ఇలా చెప్తుంది: “ఈ ఆర్టికల్‌ చాలామందికి నచ్చడం చూసి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. దీన్ని ప్రింట్‌ తీసి అందంగా మడతపెట్టి ఇచ్చినప్పుడు, దాడికి గురైన ఆడవాళ్లు కూడా దేవుని రాజ్యం గురించిన మంచివార్తకు ఆకర్షితులౌతున్నారు. ఈ కరపత్రం వాళ్ల చేతుల్లోకి వెళ్లినప్పుడు వాళ్ల కళ్లలో ఆనందాన్ని చూసి, మా కళ్లలో నీళ్లు తిరిగాయి. ఇలాంటివాళ్లకు కూడా మంచివార్త ప్రకటించడానికి మేము చేసే ప్రయత్నాల్ని యెహోవా ఇంకెలా ఆశీర్వదిస్తాడో చూడాలని ఉంది.”

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి