కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w25 మార్చి పేజీలు 14-19
  • ప్రీచింగ్‌లో యేసులాంటి ఉత్సాహాన్ని చూపించండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రీచింగ్‌లో యేసులాంటి ఉత్సాహాన్ని చూపించండి
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఆయన యెహోవా ఇష్టం మీద మనసుపెట్టాడు
  • ఆయన బైబిలు ప్రవచనాల మీద మనసుపెట్టాడు
  • ఆయన సహాయం కోసం యెహోవా వైపు చూశాడు
  • కొంతమందైనా వింటారనే ఆశతో ఆయన ఉన్నాడు
  • ప్రీచింగ్‌లో బోలెడంత సంతోషాన్ని సొంతం చేసుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2024
  • ప్రేమ వల్లే మనం ప్రీచింగ్‌ చేస్తాం!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2024
  • మనకు తెలియనివి తెలీదని ఒప్పుకోవాలంటే వినయం కావాలి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
  • ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోండి
    2025-2026 ప్రాంతీయ సమావేశం, బ్రాంచి ప్రతినిధితో
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
w25 మార్చి పేజీలు 14-19

అధ్యయన ఆర్టికల్‌ 11

పాట 57 అన్నిరకాల ప్రజలకు ప్రకటిద్దాం

ప్రీచింగ్‌లో యేసులాంటి ఉత్సాహాన్ని చూపించండి

“ప్రభువు . . . తాను వెళ్లబోతున్న ప్రతీ నగరానికి, ప్రాంతానికి తనకన్నా ముందు ఇద్దరిద్దరిగా పంపించాడు.”—లూకా 10:1.

ముఖ్యాంశం

ప్రీచింగ్‌లో యేసులాంటి ఉత్సాహాన్ని చూపించడానికి మనం చేయాల్సిన నాలుగు పనులు.

1. క్రైస్తవులు అని చెప్పుకునేవాళ్లకు, యెహోవా ప్రజలకు ఉన్న ముఖ్యమైన తేడా ఏంటి?

క్రైస్తవులు అని చెప్పుకునేవాళ్లకు, యెహోవా సేవకులకు ఒక ముఖ్యమైన తేడా ఏంటంటే, పరిచర్యలో వాళ్లు చూపించే ఉత్సాహం. (తీతు 2:14) అయితే, కొన్నిసార్లు మనం ఉత్సాహంగా ప్రీచింగ్‌ చేయలేకపోవచ్చు. బహుశా మీకు కూడా కష్టపడి పనిచేసే ఈ సంఘ పెద్దలాగే అనిపించవచ్చు. ఆయన ఇలా అన్నాడు: “నాకు కొన్నిసార్లు ప్రీచింగ్‌కి వెళ్లాలి అనిపించదు.”

2. పరిచర్యలో ఉత్సాహాన్ని కాపాడుకోవడం ఎందుకు కష్టమనిపించవచ్చు?

2 మనం ప్రీచింగ్‌ కన్నా యెహోవా సేవలో ఉన్న మిగతా పనులు చేయడానికి ఎక్కువ ఉత్సాహం చూపిస్తుండవచ్చు. ఎందుకు? ఎందుకంటే బహుశా మనం రాజ్యమందిరాల్ని కట్టినప్పుడు, లేదా విపత్తులో బ్రదర్స్‌సిస్టర్స్‌కి సహాయం చేసినప్పుడు, లేదా వేరే సందర్భాల్లో వాళ్లను ప్రోత్సహించినప్పుడు ఫలితాలు వెంటనే కనిపిస్తాయి కాబట్టి, ఏదో సాధించామనే సంతృప్తి మనకు రావచ్చు. అంతేకాదు మన బ్రదర్స్‌సిస్టర్స్‌తో చేయిచేయి కలిపి పనిచేసినప్పుడు అక్కడున్న ప్రశాంతత, ప్రేమ మనకు నచ్చొచ్చు. అలాగే మన పనికి వాళ్లు మనల్ని మెచ్చుకోవచ్చు. మరోవైపు మనం కొన్ని సంవత్సరాలుగా అదే టెరిటరీలో ప్రీచింగ్‌ చేసినా ఎవ్వరూ పెద్దగా స్పందించకపోవచ్చు. ఆఖరికి మనం మంచివార్త చెప్పడానికి వెళ్తే ప్రజలు మనల్ని తిట్టొచ్చు, బెదిరించవచ్చు. అంతేకాదు, అంతం దగ్గరపడేకొద్దీ మనం చెప్పే మంచివార్త ప్రజలకు ఇంకా చేదుగా మారవచ్చు. (మత్త. 10:22) మరి ఇలాంటి సందర్భంలో, ప్రీచింగ్‌లో మన ఉత్సాహాన్ని కాపాడుకోవడానికి, ఇంకా పెంచుకోవడానికి ఏది సహాయం చేస్తుంది?

3. లూకా 13:6-9 వచనాలు యేసు ఉత్సాహాన్ని ఎలా ఉదహరిస్తున్నాయి?

3 మనం ఉత్సాహంగా ప్రీచింగ్‌ ఎలా చేయాలో యేసు నుండి నేర్చుకోవచ్చు. యేసు పరిచర్య చేసినప్పుడు తన ఉత్సాహాన్ని రవ్వంత కూడా తగ్గనివ్వలేదు. నిజానికి, కాలం గడిచేకొద్దీ ఆయన ఆ పనిని ఇంకా ఎక్కువ ఉత్సాహంతో చేశాడు. (లూకా 13:6-9 చదవండి.) తన ద్రాక్షతోటలో అంజూరపు చెట్టును నాటించి, దాని పండ్ల కోసం మూడు సంవత్సరాలు ఎదురుచూసిన వ్యక్తిలాగే, యేసు కూడా యూదులకు దాదాపు మూడు సంవత్సరాలు ప్రకటించాడు. కానీ వాళ్లలో చాలామంది దానికి అస్సలు స్పందించలేదు. అయితే, ఆ ద్రాక్షతోట యజమాని ఎలాగైతే అంజూరపు చెట్టుకు పండ్లు కాస్తాయని ఆశ వదులుకోలేదో యేసు కూడా ప్రజల మీద ఆశ వదులుకోలేదు, తన పరిచర్యను నీరుగార్చనివ్వలేదు. దానికి బదులు ప్రజల హృదయాల్ని చేరుకోవడానికి తన ప్రయత్నాల్ని ఇంకా ముమ్మరం చేశాడు.

4. ఈ ఆర్టికల్‌లో ఏ నాలుగు విషయాల్ని చూస్తాం?

4 ఈ ఆర్టికల్‌లో యేసు చూపించిన ఉత్సాహం గురించి చూస్తాం. ముఖ్యంగా, తన పరిచర్యలోని చివరి ఆరు నెలల్లో ఆయన ఎలాంటి ఉత్సాహం చూపించాడో చూస్తాం. (లూకా 10:1) అంతేకాదు యేసు ఏం నేర్పించాడో, ఆయన చేసినట్టు మనమూ చేస్తే పరిచర్యలో ఎలా ఉత్సాహంగా ఉండవచ్చో చూస్తాం. యేసు నుండి మనం నేర్చుకునే ఈ నాలుగు విషయాల్ని పరిశీలిద్దాం: (1) ఆయన యెహోవా ఇష్టం మీద మనసుపెట్టాడు, (2) ఆయన బైబిలు ప్రవచనాల మీద మనసుపెట్టాడు, (3) ఆయన సహాయం కోసం యెహోవావైపు చూశాడు, (4) కొంతమందైనా వింటారనే ఆశతో ఆయన ఉన్నాడు.

ఆయన యెహోవా ఇష్టం మీద మనసుపెట్టాడు

5. తన మనసంతా దేవుని ఇష్టం చేయడం మీదే ఉందని యేసు ఎలా చూపించాడు?

5 యేసు ఉత్సాహంగా “దేవుని రాజ్యం గురించిన మంచివార్తను” ప్రకటించాడు. (లూకా 4:43) ఎందుకంటే తను ఆ పని చేయాలనేది దేవుని ఇష్టమని ఆయనకు తెలుసు. తన జీవితంలో పరిచర్యకే అన్నిటికంటే ముఖ్యమైన స్థానాన్ని ఇచ్చాడు. ఆఖరికి తన పరిచర్య ముగింపులో కూడా యేసు “ఒక నగరం నుండి ఇంకో నగరానికి, ఒక గ్రామం నుండి ఇంకో గ్రామానికి వెళ్తూ ప్రజలకు బోధిస్తూ ఉన్నాడు.” (లూకా 13:22) ప్రకటనాపని చేసేలా ఇంకా ఎక్కువమంది శిష్యులకు శిక్షణ కూడా ఇచ్చాడు.—లూకా 10:1.

6. మనకున్న నియామకాలన్నీ పరిచర్యకు నేరుగా సంబంధం ఉన్నవని ఎలా చెప్పవచ్చు? (చిత్రం కూడా చూడండి.)

6 ఇప్పుడు కూడా మంచివార్త ప్రకటించడమే అన్నిటికన్నా ముఖ్యమైన పని అని యెహోవా, యేసు అనుకుంటున్నారు. (మత్త. 24:14; 28:19, 20) యెహోవా సేవలో మనం చేసే మిగతా అన్నీ పనులకు పరిచర్యకు నేరుగా సంబంధం ఉంది. ఉదాహరణకు, మనం రాజ్యమందిరాల్ని కడతాం ఎందుకంటే, ప్రజలు అక్కడికి వచ్చి యెహోవాను ఆరాధించగలుగుతారు. అలాగే బెతెల్‌లో, మిగతా చోట్లలో జరిగే పనంతా పరిచర్యకు మద్దతివ్వడానికే జరుగుతుంది. విపత్తు వచ్చినప్పుడు మనం చేసే సహాయక పనులు కూడా మన బ్రదర్స్‌సిస్టర్స్‌కి మద్దతివ్వడం కోసం మాత్రమే కాదుగానీ, వాళ్లు మళ్లీ తమ ఆధ్యాత్మిక పనుల్ని గాడిలో పెట్టుకోవడానికి అంటే ప్రీచింగ్‌ చేయడానికి సహాయం చేస్తుంది. పరిచర్య చాలా ప్రాముఖ్యమని, మనం ఆ పని చేయాలన్నది యెహోవా ఇష్టమని గుర్తించిన్నప్పుడు క్రమంగా పరిచర్య చేయాలనే ప్రేరణ కలుగుతుంది. హంగరిలో ఉంటున్న యోనోష్‌ అనే సంఘ పెద్ద ఇలా చెప్తున్నాడు: “యెహోవా కోసం మనం చేసే మిగతా ఏ పని కూడా పరిచర్య పని స్థానంలోకి రాలేదు. ఎందుకంటే అదే అన్నిటికన్నా ముఖ్యమైన నియామకం.”

చిత్రాలు: 1. ఒక బ్రదర్‌ నిర్మాణ పనిలో సేవచేస్తున్నాడు. 2. ఒక బ్రదర్‌ ఇంట్లో నుండే బెతెల్‌ పని కోసం రిమోట్‌ వాలంటీరుగా సేవ చేస్తున్నాడు. 3. తర్వాత, ఆ ఇద్దరు బ్రదర్స్‌, ప్రీచింగ్‌లో కలిసి పనిచేస్తున్నారు.

ప్రస్తుతం మంచివార్త ప్రకటించడమే అన్నిటికన్నా ప్రాముఖ్యమైన పని అని యెహోవా, యేసు అనుకుంటున్నారు (6వ పేరా చూడండి)


7. మనం ఎందుకు ప్రీచింగ్‌ చేస్తూనే ఉండాలని యెహోవా కోరుకుంటున్నాడు? (1 తిమోతి 2:3, 4)

7 ప్రీచింగ్‌లో మన ఉత్సాహాన్ని పెంచుకోవాలంటే ప్రజల్ని యెహోవా చూసినట్టే చూడాలి. వీలైనంత ఎక్కువమంది మంచివార్త విని, దానికి స్పందించాలని యెహోవా కోరుకుంటున్నాడు. (1 తిమోతి 2:3, 4 చదవండి.) అందుకోసమే ప్రాణాల్ని కాపాడే ఈ సందేశాన్ని చక్కగా చెప్పడానికి మనకు కావాల్సిన శిక్షణ ఇస్తున్నాడు. ఉదాహరణకు ప్రజల్ని ప్రేమిద్దాం—శిష్యుల్ని చేద్దాం అనే బ్రోషురులో, శిష్యుల్ని చేయాలనే లక్ష్యంతో మనం సంభాషణల్ని మొదలుపెట్టడానికి మంచి సలహాలున్నాయి. ప్రజలు ఇప్పుడు స్పందించకపోయినా, మహాశ్రమ ముగిసేలోపు స్పందించే అవకాశం ఉండవచ్చు. కాబట్టి ఇప్పుడు మనం చెప్పే మాటల వల్ల భవిష్యత్తులో వాళ్లు యెహోవా సేవచేయడానికి కదిలి రావచ్చు. అలా జరగాలంటే, ప్రీచింగ్‌లో మన అడుగులు ఆగకూడదు!

ఆయన బైబిలు ప్రవచనాల మీద మనసుపెట్టాడు

8. ఏ బైబిలు ప్రవచనాలు తెలియడం వల్ల యేసు తన సమయాన్ని చక్కగా ఉపయోగించుకున్నాడు?

8 బైబిలు ప్రవచనాలు ఎలా నెరవేరతాయో యేసు అర్థం చేసుకున్నాడు. తను కేవలం మూడున్నర సంవత్సరాలు మాత్రమే పరిచర్య చేస్తాడని యేసుకు తెలుసు. (దాని. 9:26, 27) అంతేకాదు తను ఎప్పుడు, ఎలా చనిపోతాడో చెప్పే ప్రవచనాలు కూడా ఆయనకు తెలుసు. (లూకా 18:31-34) అవన్నీ తెలుసు కాబట్టే యేసు తన సమయాన్ని చక్కగా ఉపయోగించుకున్నాడు. దానివల్ల తనకు అప్పగించిన పనిని పూర్తిచేయడానికి ఉత్సాహంగా ప్రీచింగ్‌ చేశాడు.

9. ప్రీచింగ్‌ ఉత్సాహంగా చేయాలనే కసిని బైబిలు ప్రవచనాలు మనలో ఎలా పెంచుతాయి?

9 బైబిలు ప్రవచనాల్ని అర్థం చేసుకుంటే ఉత్సాహంగా ప్రీచింగ్‌ చేస్తాం. ఈ వ్యవస్థ నాశనానికి కౌంట్‌డౌన్‌ మొదలైందని మనకు తెలుసు. ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు-ప్రజల ఆలోచనలు చివరి రోజుల గురించి బైబిలు ముందే చెప్పిన వాటికి సరిగ్గా సరిపోతున్నాయని మనం గుర్తించాం. ఆంగ్లో-అమెరికన్‌ ప్రపంచాధిపత్యానికి, రష్యా అలాగే దానికి మద్దతిచ్చే దేశాలకు మధ్య ఉన్న శత్రుత్వం, “అంత్యకాలంలో” లేదా చివరి రోజుల్లో ఉత్తర రాజుకు, దక్షిణ రాజుకు సంబంధించిన ప్రవచనాన్ని ఎలా నెరవేరుస్తుందో మనం అర్థం చేసుకున్నాం. (దాని. 11:40) అంతేకాదు, ఆంగ్లో-అమెరికన్‌ ప్రపంచాధిపత్యం దానియేలు 2:43-45 లో ఉన్న ప్రతిమ పాదాన్ని సూచిస్తుందని కూడా మనకు తెలుసు. ఆ ప్రవచనం చెప్తున్నట్టు త్వరలోనే, అతిత్వరలోనే దేవుని రాజ్యం మనుషుల ప్రభుత్వాలన్నిటినీ నేలమట్టం చేస్తుందని గట్టిగా నమ్ముతున్నాం. ఈ ప్రవచనాలన్నీ కాలగమనంలో మనం ఎక్కడున్నామో చూపిస్తున్నాయి. అలాగే అర్జెంట్‌గా ప్రీచింగ్‌ చేయాలనే కసిని మనలో పెంచుతున్నాయి.

10. బైబిలు ప్రవచనాలు మీ ఉత్సాహాన్ని ఇంకా ఎలా పెంచుతాయి?

10 పరిచర్యలో మనం ఇతరులకు ఉత్సాహంగా చెప్పాల్సిన సందేశం ఏంటో కూడా బైబిలు ప్రవచనాల నుండి తెలుస్తుంది. డొమినికన్‌ రిపబ్లిక్‌లో ఉంటున్న క్యారీ అనే సిస్టర్‌ ఇలా చెప్తుంది: “యెహోవా మాటిచ్చిన అందమైన భవిష్యత్తు ఇతరులకు సత్యాన్ని ప్రకటించాలనే ప్రేరణ ఇస్తుంది. ప్రజలు పడుతున్న కష్టాల్ని చూసినప్పుడు యెహోవా మాటిచ్చినవన్నీ కేవలం నాకే కాదు వాళ్లకూ అవసరమని అనిపిస్తుంది.” ఈ పని వెనుక యెహోవా ఉన్నాడని మనకు తెలుసు కాబట్టి, అస్సలు వెనకడుగు వేయకూడదని కూడా బైబిలు ప్రవచనాలు మనకు ప్రోత్సాహాన్నిస్తాయి. హంగరిలో ఉంటున్న లైలా అనే సిస్టర్‌ ఇలా చెప్తుంది: “ఫలానా వాళ్లు మంచివార్త అంగీకరించరని నాకు అనిపించినా, వాళ్లకు మంచివార్త ప్రకటించడానికి యెషయా 11:6-9 ప్రేరణ ఇస్తుంది. యెహోవా సహాయంతో ఎవ్వరైనా మారగలరని నాకు తెలుసు.” జాంబియాలో ఉంటున్న క్రిస్టఫర్‌ ఇలా చెప్తున్నాడు: “మార్కు 13:10 ముందే చెప్పినట్టు మంచివార్త ప్రపంచమంతటా వ్యాపిస్తుంది. ఆ ప్రవచన నెరవేర్పులో నేను కూడా ఉండడం నాకు దొరికిన భలే చాన్స్‌ అనుకుంటాను.” మీరు ప్రీచింగ్‌ చేస్తూనే ఉండడానికి ఏ ప్రవచనాలు మీకు ప్రేరణ ఇచ్చాయి?

ఆయన సహాయం కోసం యెహోవా వైపు చూశాడు

11. ఉత్సాహంగా ప్రీచింగ్‌ చేస్తూ ఉండడానికి యేసు ఎందుకు యెహోవా వైపు చూడాల్సి వచ్చింది? (లూకా 12:49, 53)

11 యేసు ఉత్సాహంగా పరిచర్య చేస్తూ ఉండడానికి సహాయం కోసం యెహోవా వైపు చూశాడు. ఆయన ఎంత జాగ్రత్తగా ప్రీచింగ్‌ చేసినా, రాజ్యం గురించిన మంచివార్త కొంతమంది ప్రజల్లో భగ్గుమని మంట రేపుతుందని, తీవ్రమైన వ్యతిరేకత వస్తుందని ఆయనకు తెలుసు. (లూకా 12:49, 53 చదవండి.) యేసు ప్రీచింగ్‌ చేసినందుకు మతనాయకులు చాలాసార్లు ఆయన్ని చంపడానికి కూడా చూశారు. (యోహా. 8:59; 10:31, 39) కానీ ఆయన ప్రీచింగ్‌ మానలేదు. ఎందుకంటే, యెహోవా తనతోపాటు ఉన్నాడని ఆయనకు తెలుసు. ఆయనిలా అన్నాడు: “నేను ఒంటరిగా లేను, నన్ను పంపించిన తండ్రి నాకు తోడుగా ఉన్నాడు. . . . నేను ఎప్పుడూ ఆయనకు ఇష్టమైన పనులే చేస్తాను, కాబట్టి ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు.”—యోహా. 8:16, 29.

12. హింసలు వచ్చినా ప్రీచింగ్‌ చేస్తూ ఉండడానికి యేసు తన శిష్యుల్ని ఎలా సిద్ధం చేశాడు?

12 అవసరమైనప్పుడు సహాయం కోసం యెహోవా వైపు చూడొచ్చని యేసు తన శిష్యులకు గుర్తు చేశాడు. హింసలు వచ్చినప్పుడు కూడా యెహోవా సహాయం చేస్తాడని ఆయన వాళ్లకు పదేపదే అభయమిచ్చాడు. (మత్త. 10:18-20; లూకా 12:11, 12) దాంతోపాటు జాగ్రత్తగా ఉండమని కూడా చెప్పాడు. (మత్త. 10:16; లూకా 10:3) వినడానికి ఇష్టపడని వాళ్లమీద తమ సందేశాన్ని రుద్దకూడదని కూడా యేసు చెప్పాడు. (లూకా 10:10, 11) ఒకవేళ హింసలు వస్తే అక్కడినుండి పారిపొమ్మని చెప్పాడు. (మత్త. 10:23) యేసు చాలా ఉత్సాహంగా పరిచర్య చేసినా, యెహోవా వైపు చూసినా, ఆయన ఏరికోరి ప్రమాదాన్ని కొని తెచ్చుకోలేదు, దానికి అనవసరంగా ఎదురు వెళ్లలేదు.—యోహా. 11:53, 54.

13. యెహోవా మీకు సహాయం చేస్తాడని ఖచ్చితంగా ఎలా చెప్పవచ్చు?

13 ఈరోజుల్లో కూడా వ్యతిరేకత, హింస ఉన్నా ఉత్సాహంగా ప్రీచింగ్‌ చేయడానికి యెహోవా సహాయం మనకు అవసరం. (ప్రక. 12:17) యెహోవా మనకు సహాయం చేస్తాడని ఖచ్చితంగా ఎలా చెప్పవచ్చు? యోహాను 17వ అధ్యాయంలో యేసు చేసిన ప్రార్థన గురించి ఆలోచించండి. తన అపొస్తలుల్ని జాగ్రత్తగా చూసుకోమని యేసు యెహోవాను అడిగాడు. యెహోవా ఆయన అడిగింది చేశాడు. ఎందుకంటే వ్యతిరేకత, హింస ఉన్నా అపొస్తలులు ఉత్సాహంగా పరిచర్య చేసేలా యెహోవా ఎలా సహాయం చేశాడో అపొస్తలుల కార్యాలు పుస్తకంలో మనం చూస్తాం. అపొస్తలులు చేసే ప్రీచింగ్‌కి స్పందించి, విశ్వాసం చూపించిన వాళ్లను కూడా జాగ్రత్తగా చూసుకోమని యేసు తన ప్రార్థనలో యెహోవాను అడిగాడు. అందులో మీరు కూడా ఉన్నారు. నిజానికి యేసు చేసిన ప్రార్థనకు జవాబివ్వడం యెహోవా ఆపలేదు. అప్పట్లో అపొస్తలులకు యెహోవా సహాయం చేసినట్టే, ఇప్పుడు కూడా మీకు సహాయం చేస్తాడు.—యోహా. 17:11, 15, 20.

14. మనం ఉత్సాహంగా ప్రీచింగ్‌ చేస్తూ ఉండగలమనే నమ్మకంతో ఎలా ఉండవచ్చు? (చిత్రం కూడా చూడండి.)

14 అంతం దగ్గరయ్యేకొద్దీ ఉత్సాహంగా మంచివార్తను ప్రకటించడం ఇంకాఇంకా కష్టమైనాసరే, మనకు కావాల్సిన సహాయం దొరుకుతూనే ఉంటుంది. (లూకా 21:12-15) యేసును, శిష్యుల్ని అనుసరిస్తూ మనం చెప్పేది వినాలా లేదా అనేది ప్రజలకే వదిలేద్దాం. మనం వాళ్లతో వాదించకుండా ఉందాం. మన పనిపై ఆంక్షలు ఉన్న దేశంలో కూడా మన బ్రదర్స్‌సిస్టర్స్‌ తమ సొంత శక్తి మీద కాదుగానీ, యెహోవా మీద ఆధారపడుతున్నందుకే మంచివార్తను ప్రకటిస్తూ ఉండగలుగుతున్నారు. మొదటి శతాబ్దంలో తన సేవకులకు శక్తిని ఇచ్చినట్టే, యెహోవా ఇప్పుడు కూడా ఇస్తాడు. ఆయన కోరుకున్నట్టు “ప్రకటనా పని పూర్తిగా” జరిగే వరకు మనకు కావాల్సిందంతా ఆయన ఇస్తాడు. (2 తిమో. 4:17) కాబట్టి యెహోవా మీద ఆధారపడితే మీరు ఉత్సాహంగా ప్రీచింగ్‌ చేయగలుగుతారు అనే నమ్మకంతో ఉండవచ్చు.

మన పనిపై ఆంక్షలు ఉన్నా, ఉత్సాహంగల ప్రచారకులు ఏదోక పద్ధతిలో తెలివిగా ప్రీచింగ్‌ చేస్తున్నారు (14వ పేరా చూడండి)a


కొంతమందైనా వింటారనే ఆశతో ఆయన ఉన్నాడు

15. మంచివార్త వినేవాళ్లు కొంతమందైనా ఉంటారనే నమ్మకాన్ని యేసు ఎలా చూపించాడు?

15 కొంతమందైనా మంచివార్తను వింటారని యేసు నమ్మకంతో ఉన్నాడు. అందుకే ఆయన ఉత్సాహంగా ప్రీచింగ్‌ చేయగలిగాడు. ఉదాహరణకు క్రీ.శ. 30 చివర్లో తన పరిచర్య పనికి స్పందించేవాళ్లు చాలామంది ఉన్నారని యేసు గమనించాడు. అందుకే పంట కోతకు సిద్ధంగా ఉందని ఆయన చెప్పాడు. (యోహా. 4:35) దాదాపు ఒక సంవత్సరం తర్వాత తన శిష్యులకు ఆయన ఇలా చెప్పాడు: “కోయాల్సిన పంట చాలా ఉంది.” (మత్త. 9:37, 38) ఆ తర్వాత మళ్లీ దానిగురించి చెప్తూ “కోయాల్సిన పంట చాలా ఉంది, . . . కాబట్టి తన పంట కోయడానికి పనివాళ్లను పంపించమని కోత యజమానిని వేడుకోండి” అని అన్నాడు. (లూకా 10:2) మంచివార్తకు స్పందించే ప్రజలు తప్పకుండా ఉంటారనే నమ్మకంతో యేసు ఉన్నాడు, వాళ్లు అలా స్పందించినప్పుడు ఆయన సంతోషించాడు.—లూకా 10:21.

16. మనం ప్రకటించే సందేశానికి తిరుగుండదని యేసు చెప్పిన ఏ ఉదాహరణలు చూపిస్తున్నాయి? (లూకా 13:18-21) (చిత్రం కూడా చూడండి.)

16 తాము ప్రకటించే సందేశానికి అద్భుతమైన ఫలితాలు వస్తాయని యేసు గుర్తుచేయడం వల్ల శిష్యులు తమ ఉత్సాహాన్ని కాపాడుకోగలిగారు. దానికి సంబంధించి యేసు చెప్పిన రెండు ఉదాహరణల్ని చూడండి. (లూకా 13:18-21 చదవండి.) రాజ్య సందేశం అద్భుతంగా ఎదుగుతుందని, దాని ఎదుగుదలను ఎవ్వరూ ఆపలేరని చెప్పడానికి ఆయన ఆవగింజ ఉదాహరణ చెప్పాడు. అలాగే రాజ్య సందేశం విస్తృతంగా వ్యాప్తి చెందుతుందని, అది తీసుకొచ్చే మార్పులు వెంటనే కనిపించకపోవచ్చని చెప్పడానికి పులిసిన పిండి ఉదాహరణ చెప్పాడు. శిష్యులు ప్రకటించే సందేశానికి తిరుగుండదని అర్థం చేసుకోవడానికి యేసు వాళ్లకు సహాయం చేశాడు.

రద్దీగా ఉన్న ఒక రోడ్డు పక్కన ఇద్దరు సిస్టర్స్‌ కార్టు పెట్టుకున్నారు. దాన్ని ఎవ్వరూ పట్టించుకోకుండా వెళ్లిపోతున్నారు.

యేసులాగే మనం కూడా మన ప్రీచింగ్‌కి ఎవరోఒకరు స్పందిస్తారనే ఆశతో ఉంటాం (16వ పేరా చూడండి)


17. ఉత్సాహంగా ప్రీచింగ్‌ చేస్తూ ఉండడానికి మనకు ఏ కారణాలున్నాయి?

17 ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రకటనా పని జోరు అందుకోవడం చూసినప్పుడు, ప్రీచింగ్‌ ఉత్సాహంగా చేయడానికి ముందుకొస్తాం. ప్రతీ సంవత్సరం లక్షలమంది ఆసక్తిగలవాళ్లు జ్ఞాపకార్థ ఆచరణకు వస్తున్నారు, బైబిలు స్టడీలు తీసుకుంటున్నారు. వేలమంది బాప్తిస్మం తీసుకుని ప్రీచింగ్‌లో మనతోపాటు అడుగులు కలుపుతున్నారు. అయితే, మన ప్రీచింగ్‌కి ఎంతమంది స్పందిస్తారో మనకు తెలీదు. కానీ రాబోయే మహాశ్రమ తప్పించుకోవడానికి యెహోవా ఒక గొప్ప సమూహాన్ని సమకూరుస్తున్నాడని మాత్రం మనకు తెలుసు. (ప్రక. 7:9, 14) ఈ కోత యజమానియైన యెహోవా, ప్రకటనా పనికి స్పందించేవాళ్లు చాలామంది ఉంటారనే నమ్మకంతో ఉన్నాడు. మనం కూడా అదే నమ్మకంతో ప్రీచింగ్‌ చేద్దాం!

18. ప్రజలు మనలో ఏది గమనించాలని కోరుకుంటాం?

18 యేసు శిష్యులు పరిచర్యలో ఉత్సాహానికి మారుపేరుగా నిలిచారు. ప్రజలు అపొస్తలుల ధైర్యాన్ని చూసినప్పుడు వాళ్ల వెనుక యేసు ఉన్నాడని “గ్రహించడం మొదలుపెట్టారు.” (అపొ. 4:13) పరిచర్యలో ప్రజలు మనల్ని కూడా గమనించినప్పుడు మనలో యేసులాంటి ఉత్సాహం కనిపించేలా చేద్దాం!

మీరెలా జవాబిస్తారు?

  • యేసు పరిచర్యను ఎలా చూశాడు? ఆయనలాగే మనం కూడా ఉత్సాహంగా పరిచర్య ఎలా చేయవచ్చు?

  • యేసు యెహోవా వైపు ఎలా చూశాడు? ఆయనలాగే మనం కూడా ఎలా చూడవచ్చు?

  • కొంతమందైనా వింటారనే ఆశతో యేసు ఎలా ఉన్నాడు? మనం కూడా ఎలా ఉండవచ్చు?

పాట 58 శాంతిని ప్రేమించేవాళ్ల కోసం వెతుకుదాం

a చిత్రం వివరణ: పెట్రోల్‌ బంకు దగ్గర మన బ్రదర్‌ ఒకతనికి జాగ్రత్తగా ప్రీచింగ్‌ చేస్తున్నాడు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి