కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • wp25 No. 1 పేజీలు 4-5
  • యుద్ధాలు, దాడుల సెగ వల్ల ప్రపంచం విలవిల

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యుద్ధాలు, దాడుల సెగ వల్ల ప్రపంచం విలవిల
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2025
  • ఇలాంటి మరితర సమాచారం
  • కమ్ముకున్న యుద్ధ మేఘాలు వీడేదెప్పుడు?—బైబిలు ఏం చెప్తుంది?
    అదనపు అంశాలు
  • యుద్ధాల కోసం లక్షల కోట్లు—అంతకుమించిన నష్టం
    అదనపు అంశాలు
  • యుద్ధాలు, దాడులు లేని ప్రపంచం ఎలా సాధ్యం?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2025
  • సంవత్సరం దాటినా ఆగని యుక్రెయిన్‌ యుద్ధం—ఆశ నింపే విషయం ఏదైనా బైబిల్లో ఉందా?
    అదనపు అంశాలు
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2025
wp25 No. 1 పేజీలు 4-5
చిత్రాలు: 1. ఒక మిలిటరీ ట్యాంకర్‌ ముందు నడుస్తున్న సైనికుడు. 2. వేర్వేరు దేశాల్లో యుద్ధాల వల్ల ఇబ్బంది పడుతున్న స్త్రీలు, పురుషులు, పిల్లలు.

యుద్ధాలు, దాడుల సెగ వల్ల ప్రపంచం విలవిల

“రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత నుండి దాడుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. 200 కోట్ల జనాభా, అంటే ప్రతీ నలుగురిలో కనీసం ఒకరు దాడులు జరిగే ప్రాంతంలో నివసిస్తున్నారు.”

యునైటెడ్‌ నేషన్స్‌ డిప్యూటీ సెక్రటరీ-జనరల్‌ అమీనా జే. మొహమ్మద్‌, జనవరి 26, 2023.

ప్రశాంతంగా ఉన్న దేశాల్లో సైతం ఉన్నట్టుండి యుద్ధాలు, దాడులు జరగవచ్చు. ఒక దేశంలో యుద్ధం భగ్గుమంటే వేరే దేశాలకు కూడా ఆ సెగ తగులుతుంది. యుద్ధం ముగిసిపోయినా, దాని దెబ్బ నుండి తేరుకోవడానికి చాలా ఏళ్లు పడుతుంది. ఉదాహరణకు . . .

  • చేతుల్లో ఖాళీ గిన్నె పట్టుకున్న చిత్రం.

    ఆహార కొరతలు. వరల్డ్‌ ఫుడ్‌ ప్రోగ్రామ్‌ (WFP) సంస్థ ప్రకారం “ఆకలి బాధకు ముఖ్య కారణం యుద్ధాలే. ఆకలితో అలమటించే వాళ్లలో 70 శాతం మంది యుద్ధాలు, దాడులు జరుగుతున్న ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు.”

  • చేతులతో ముఖాన్ని కప్పుకొని బాధపడుతున్న ఒక స్త్రీ చిత్రం.

    శారీరక, మానసిక సమస్యలు. ఏ క్షణంలో యుద్ధం విరుచుకుపడుతుందో అనే ఆలోచన ప్రజల్లో ఒత్తిడిని, ఆందోళనను పెంచుతుంది. యుద్ధాలు జరిగే ప్రాంతాల్లో జీవించే ప్రజలకు శారీరక సమస్యలే కాదు మానసిక సమస్యలు కూడా వస్తాయి. పైగా, అక్కడున్న వాళ్లకు వైద్య సహాయం దొరకడం కూడా గగనమే.

  • సామానంతా పెద్ద సంచుల్లో వేసుకుని తీసుకెళ్తున్న ఒక కుటుంబం చిత్రం.

    వలస వెళ్లాల్సిరావడం. యునైటెడ్‌ నేషన్స్‌ హై కమీషనర్‌ ఫర్‌ రెఫ్యూజీస్‌ (UNHCR) ప్రకారం 2023 సెప్టెంబరు కల్లా ప్రపంచవ్యాప్తంగా 11 కోట్ల 40 లక్షలకు పైగా జనాభా తమ ఇళ్లను వదిలి వలస వెళ్లారు. యుద్ధాలు, దాడులు జరగడం వల్ల ప్రజలు తమ ప్రాణాల్ని గుప్పిట్లో పెట్టుకొని పారిపోతున్నారు.

  • రేకుల ఇంటి బయట నిలబడ్డ ఒక కుటుంబం చిత్రం.

    ఆర్థిక ఇబ్బందులు. యుద్ధం వల్ల ప్రజలు తరచూ ఆర్థిక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఉదాహరణకు, ధరలు ఆకాశాన్ని అంటుతాయి. ప్రజలకు విద్య, వైద్య సహాయం కూడా సరిగ్గా అందదు. ఎందుకంటే వాటికోసం పెట్టాల్సిన ఖర్చంతా ప్రభుత్వం తీసుకెళ్లి సైన్యం కోసం, ఆయుధాల కోసం ఖర్చు పెడుతుంది. అలాగే యుద్ధం ముగిశాక, దానివల్ల జరిగిన నష్టాన్ని పూరించాలంటే తడిసి మోపెడవుతుంది.

  • పైపులైను నుండి ఆయిల్‌ కారుతున్న చిత్రం.

    వాతావరణం కలుషితమవ్వడం. భూమి ఇచ్చే వనరుల మీదే మనిషి ఆధారపడి బ్రతుకుతాడు. కాబట్టి, వాటిని పాడు చేసినప్పుడు ప్రజలు చాలా నష్టపోతారు. కలుషితమైన నీరు, గాలి, నేల వల్ల పెద్దపెద్ద అనారోగ్య సమస్యలు వస్తాయి. అంతేకాదు, భూమిలో దాచిపెట్టిన మందుపాతరల వల్ల యుద్ధం ముగిశాక కూడా ప్రజల ప్రాణాలకు ప్రమాదం ఉండవచ్చు.

యుద్ధం అంటే వినాశనం, విధ్వంసం, తీరని నష్టం.

యుద్ధాల గురించి బైబిల్లో ఉన్న ప్రవచనాలు

‘ఈ వ్యవస్థ ముగింపులో’ అంటే, మనం జీవిస్తున్న ఈ కాలంలో యుద్ధాలు, దాడులు జరుగుతాయని బైబిలు ప్రవచించింది. (మత్తయి 24:3) యేసుక్రీస్తు ముందే ఇలా చెప్పాడు:

  • “మీరు యుద్ధాల గురించి, యుద్ధ వార్తల గురించి వింటారు. . . . ఒక దేశం మీద మరో దేశం, ఒక రాజ్యం మీద మరో రాజ్యం దాడిచేస్తాయి.”—మత్తయి 24:6, 7.

  • “మీరు యుద్ధాల గురించి, అల్లకల్లోల పరిస్థితుల గురించి విన్నప్పుడు భయపడకండి.”—లూకా 21:9.

    “అల్లకల్లోల పరిస్థితులు” అనే మాటకు ప్రభుత్వానికి ఎదురుతిరగడం, తిరుగుబాటు చేయడం, గొడవలు, కొట్లాటలు, ధర్నాలు చేయడం వంటి అర్థాలు ఉన్నాయి.

ఎక్కువ తెలుసుకోవడానికి jw.org వెబ్‌సైట్‌లో “‘చివరి రోజులు’ లేదా ‘అంత్యదినముల’ సూచన ఏమిటి?” అనే ఆర్టికల్‌ చూడండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి