కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • wp21 No. 3 పేజీ 3
  • మంచి భవిష్యత్తు—ప్రతీఒక్కరి కల

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మంచి భవిష్యత్తు—ప్రతీఒక్కరి కల
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2021
  • ఇలాంటి మరితర సమాచారం
  • పరిచయం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2021
  • మంచి భవిష్యత్తు పొందడానికి మార్గం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2021
  • ఇతరులకు మేలు చేస్తే మంచి భవిష్యత్తు పొందుతామా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2021
  • చదువు, డబ్బు మంచి భవిష్యత్తును ఇస్తాయా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2021
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2021
wp21 No. 3 పేజీ 3
తల్లిదండ్రులు తమ పాపతో కలిసి చెర్రీ చెట్టు పువ్వుల్ని చూస్తూ ఆనందిస్తున్నారు.

మంచి భవిష్యత్తు —ప్రతీఒక్కరి కల

‘మీ భవిష్యత్తు ఎలా ఉండాలనుకుంటున్నారు’ అని అడిగితే ఏం చెప్తారు? మీరూ, మీ ఇంట్లోవాళ్లు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని, సుఖశాంతులతో వర్ధిల్లాలని, జీవితంలో పైకి ఎదగాలని కోరుకుంటారు. కదా? ఎవరైనా అదే కోరుకుంటాం.

అయితే, మంచి భవిష్యత్తు పొందాలనే కోరిక తీరని కలలానే మిగిలిపోతుందని చాలామంది భయపడుతున్నారు. ఏ క్షణంలో ఏమి జరుగుతుందో, పరిస్థితులు ఎలా మారిపోతాయో తెలియకపోవడమే ఆ భయానికి కారణం. ఉదాహరణకు, కరోనా వైరస్‌ వల్ల ఎంతోమంది జీవితాలు రాత్రికిరాత్రే తలకిందులు అయిపోయాయి, లక్షలమంది ప్రాణాలు కోల్పోయారు, చాలామంది ఉద్యోగాలు పోగొట్టుకుని ఆర్థికంగా నష్టపోయారు. ఇలాంటి పరిస్థితిని చూశాక, రేపటి రోజున జీవితం ఎలా ఉంటుంది అనే ఆందోళన ప్రతీఒక్కరిలో మొదలైంది.

‘ఈరోజు నేను ఏం చేస్తే రేపు నా జీవితం బాగుంటుంది’ అని అందరూ ఆలోచిస్తున్నారు. చేయగలిగింది ఏదైనా ఉందని తెలిస్తే వెనకాడకుండా దాన్ని చేస్తున్నారు. భవిష్యత్తు బాగుండడం కోసం కొంతమంది తలరాతను లేదా అదృష్టాన్ని నమ్ముతారు. ఇంకొంతమందేమో ఎక్కువ చదువు, బాగా డబ్బు ఉంటే ఏ చీకూచింతా లేకుండా జీవితం సాఫీగా గడిచిపోతుందని అనుకుంటారు. ఇంకొందరు, వేరేవాళ్లకు మేలు చేస్తే పుణ్యం వస్తుందని నమ్ముతారు.

ఇవి ఏవైనా మీకు మంచి భవిష్యత్తును ఇవ్వగలవా? అది తెలియాలంటే, ముందు ఈ ప్రశ్నలకు జవాబు తెలుసుకోవాలి:

  • మీ భవిష్యత్తు దేనిమీద ఆధారపడి ఉంటుంది?

  • చదువు, డబ్బు మంచి భవిష్యత్తును ఇస్తాయా?

  • మంచి పనులు చేసినంత మాత్రాన మంచి భవిష్యత్తు పొందుతామా?

  • మంచి భవిష్యత్తు పొందే మార్గాన్ని ఎవరు చూపిస్తారు?

ఈ ప్రశ్నలన్నిటికీ ఈ కావలికోట పత్రికలో జవాబులు ఉన్నాయి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి