కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • wp21 No. 3 పేజీలు 9-11
  • ఇతరులకు మేలు చేస్తే మంచి భవిష్యత్తు పొందుతామా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఇతరులకు మేలు చేస్తే మంచి భవిష్యత్తు పొందుతామా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2021
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • చాలామంది ఎంచుకునే మార్గం
  • ఫలితం
  • మంచి భవిష్యత్తు—ప్రతీఒక్కరి కల
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2021
  • మంచి భవిష్యత్తు పొందడానికి మార్గం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2021
  • పరిచయం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2021
  • “దీనులు భూమిని స్వతంత్రించుకొందురు”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2018
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2021
wp21 No. 3 పేజీలు 9-11
బస్సులో ఒక స్త్రీ తన సీటును ఒక పెద్దావిడకు ఇస్తుంది.

ఇతరులకు మేలు చేస్తే మంచి భవిష్యత్తు పొందుతామా?

మంచి పనులు చేస్తే, వేరేవాళ్లకు సహాయం చేస్తే పుణ్యం వస్తుందని, మంచి భవిష్యత్తు పొందుతారని వందల సంవత్సరాలుగా ప్రజలు నమ్ముతున్నారు. కన్‌ఫ్యూషియస్‌ (పుట్టుక: క్రీ.పూ. 551-మరణం: క్రీ.పూ. 479) అనే ఒక పేరుపొందిన బోధకుడు ఇలా చెప్పాడు: “ఇతరులు మీకు ఏమి చేయకూడదని మీరు కోరుకుంటారో, అది మీరు ఇతరులకు చేయకండి.” ఆసియాలో ఉండే చాలామంది ఆయన చెప్పిన ఈ మాటల్ని గౌరవిస్తారు.

చాలామంది ఎంచుకునే మార్గం

ఇతరులతో మంచిగా ఉంటే, వాళ్లకు కూడా తిరిగి మంచి జరుగుతుందని జీవితం బాగుంటుందని ఇప్పటికీ చాలామంది నమ్ముతున్నారు. అందుకే వాళ్లు ఇతరులతో మర్యాదగా నడుచుకోవడానికి, బాధ్యతల్ని సరిగ్గా నిర్వర్తించడానికి, ఎవరి మనసును నొప్పించకుండా ఉండడానికి ప్రయత్నిస్తారు. వియత్నాంలో ఉంటున్న లిన్‌ ఇలా చెప్పింది: “నేను నిజాయితీగా, ఏ తప్పు చేయకుండా ఉంటే నాకు అంతా మంచే జరుగుతుందని నమ్మాను.”

అదే స్త్రీ పేదవాళ్లకు, ఇళ్లులేని వాళ్లకు ఆహారం వడ్డిస్తుంది.

ఇంకొంతమంది, సాటిమనిషికి మంచి చేయమని తమ మతం చెప్తున్న మాటను పాటిస్తూ, ఇతరులకు వీలైన సహాయం చేస్తుంటారు. తైవాన్‌లో ఉంటున్న షుయూన్‌ అనే వ్యక్తి ఇలా చెప్పాడు: ‘మనం బ్రతికున్నప్పుడు మంచి పనులు చేస్తే చనిపోయాక స్వర్గంలో సంతోషంగా ఉంటామని, చెడ్డపనులు చేస్తే నరకంలో నిత్యం బాధలు పడతామని నాకు నేర్పించారు.’

ఫలితం

రాత్రి ఆమె తన బాబును ఒళ్లో పడుకోబెట్టుకొని బాధగా, అలసటగా ఉంది.

ఇతరులకు మేలు చేసినప్పుడు మనకు కూడా కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. అయితే ఇతరులకు మేలు చేసిన ప్రతీసారి, వాళ్లు మనకు తిరిగి మేలు చేయకపోవచ్చని చాలామంది గుర్తించారు. హాంగ్‌కాంగ్‌లో ఉంటున్న సియూ-పింగ్‌ జీవితంలో అదే జరిగింది. ఆమె ఇలా చెప్పింది: “నేను నా కుటుంబాన్ని చాలా బాగా చూసుకున్నాను. కానీ నాకు మాత్రం మంచి జరగలేదు. నా భర్త నన్నూ, మా అబ్బాయిని వదిలేసి వెళ్లిపోయాడు.”

మతనమ్మకాలు పాటించే వాళ్లందరూ మంచిగా ఉండకపోవచ్చని చాలామంది తెలుసుకున్నారు. ఉదాహరణకు జపాన్‌లో ఉంటున్న ఎట్‌సుకో అనే ఆవిడ ఇలా చెప్పింది: “నేను ఒక మత సంస్థలో చేరాను. యౌవనస్థుల కోసం ఆ సంస్థవాళ్లు చేసే సహాయ కార్యక్రమాల్ని నేను దగ్గరుండి చూసుకునేదాన్ని. కానీ ఆ సంస్థలో కొందరు తప్పుడు పనులు చేయడం, అధికారం చెలాయించాలని కోరుకోవడం, చర్చీ డబ్బుల్ని సొంత పనుల కోసం వాడుకోవడం చూసి షాక్‌ అయ్యాను.”

“నేను నా కుటుంబాన్ని చాలా బాగా చూసుకున్నాను. కానీ నాకు మాత్రం మంచి జరగలేదు. నా భర్త నన్నూ, మా అబ్బాయిని వదిలేసి వెళ్లిపోయాడు.”—సియూ-పింగ్‌, హాంగ్‌కాంగ్‌

కొంతమందికి దేవుని మీద నిజంగా భక్తి ఉంటుంది, వాళ్లు ఎప్పుడూ ఇతరులకు మంచి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ వాళ్లకు తిరిగి మంచి జరగనప్పుడు నిరాశపడుతుంటారు. వియత్నాంలో ఉంటున్న వాన్‌కు కూడా అలాంటి నిరాశే ఎదురైంది. ఆమె ఇలా చెప్పింది: “చనిపోయిన మా కుటుంబ సభ్యుల ఫోటోల ముందు నేను ప్రతిరోజు పువ్వులు, పండ్లు, వాళ్లకు ఇష్టమైన ఆహారపదార్థాలు పెట్టేదాన్ని. అలాచేస్తే మా కుటుంబం బాగుంటుందని నమ్మాను. కానీ, ఎన్నో ఏళ్ల పాటు నేను చేసిన మంచి పనులు, పూజలు ఏవీ ఫలించలేదు. నా భర్త జబ్బు చేసి మంచానపడ్డాడు, విదేశాల్లో చదువుకుంటున్న మా కూతురు చిన్న వయసులోనే చనిపోయింది.”

మంచి పనులు ఒక్కటే ఎందుకు సరిపోవు?

మంచి పనులు చేయడం ముఖ్యమే, కానీ మంచి భవిష్యత్తును పొందడానికి అవి మాత్రమే సరిపోవు. ఎందుకు? పవిత్ర లేఖనాలు ఏం చెప్తున్నాయో చూడండి.

మంచి చేయాలని అందరూ అనుకోకపోవచ్చు

“ఒక్క పాపి ఎంతో మంచిని పాడుచేయగలడు.”—ప్రసంగి 9:18.

మీరు మంచి వ్యక్తిగా ఉండడానికి ఎంత ప్రయత్నించినా, వేరేవాళ్లు స్వార్థంతో చేసే పనుల వల్ల మీకు చెడు జరగవచ్చు. ఉదాహరణకు భయంకరమైన అంటువ్యాధి వ్యాపిస్తున్న కాలంలో, మీరు అధికారులు ఇచ్చే సూచనలు పాటిస్తూ సామాజిక దూరం పాటిస్తున్నారని, మాస్క్‌ పెట్టుకుంటున్నారని అనుకుందాం. కానీ ఇతరులు ఆ సూచనల్ని పాటించకపోతే, వాళ్ల వల్ల మీ ప్రాణం ప్రమాదంలో పడవచ్చు.

చెడును మంచి అని కొందరు పొరపాటు పడవచ్చు

“ఒక మార్గం మనిషికి సరైనదిగా కనిపిస్తుంది, కానీ చివరికి అది మరణానికి దారితీస్తుంది.”—సామెతలు 14:12.

చరిత్రలో చాలామంది, మంచి చేస్తున్నామనే భ్రమలో చెడ్డ పనులు చేశారు. వాళ్లు చేసింది తప్పని ఆ తర్వాత వాళ్లే తెలుసుకున్నారు. కానీ ఏం లాభం, వాటి వల్ల వచ్చే పర్యవసానాలు అనుభవించక తప్పలేదు.

ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలీదు

“రేపు మీకు ఏమౌతుందో మీకు తెలీదు.”—యాకోబు 4:14.

ఒక వ్యక్తి ఎంత మంచివాడైనా అతని ప్రాణానికి గ్యారెంటీ లేదు. కోవిడ్‌ కాలాన్నే తీసుకుంటే, నిస్వార్థంగా ఇతరులకు సహాయం చేసిన ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. చైనాలో ఉంటున్న లిటేన్‌ అనుభవాన్ని పరిశీలించండి. వాళ్ల నాన్న కారు ఆక్సిడెంట్‌లో చనిపోయాడు. లిటేన్‌ ఇలా చెప్పింది: “మా నాన్న చాలా మంచివాడు, కష్టపడి పనిచేసేవాడు, కొంచెం కూడా గర్వం ఉండేది కాదు. ఆక్సిడెంట్‌ అయిన కారులో ఉన్నవాళ్లందరూ బ్రతికారు. మా నాన్న మాత్రమే ఎందుకు చనిపోయాడో నాకు అర్థంకాలేదు.”

మంచి పనులు చేసినంత మాత్రాన మంచి భవిష్యత్తు పొందలేమని దీన్నిబట్టి తెలుస్తోంది. మరి మంచి భవిష్యత్తు పొందాలంటే ఏం చేయాలి? ఈ ప్రశ్నకు జవాబు తర్వాతి పేజీల్లో తెలుసుకుందాం.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి