కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • wp21 No. 3 పేజీలు 6-8
  • చదువు, డబ్బు మంచి భవిష్యత్తును ఇస్తాయా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • చదువు, డబ్బు మంచి భవిష్యత్తును ఇస్తాయా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2021
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • చాలామంది పైచదువును ఎంచుకుంటారు
  • ఫలితం
  • తల్లిదండ్రులారా—మీరు మీ పిల్లలకు ఎలాంటి భవిష్యత్తు కావాలని కోరుకుంటున్నారు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
  • భద్రతగల జీవితానికై అన్వేషణ
    తేజరిల్లు!—1998
  • అదనపు విద్య విషయంలో మంచి నిర్ణయాలు తీసుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2026
  • మంచి భవిష్యత్తు—ప్రతీఒక్కరి కల
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2021
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2021
wp21 No. 3 పేజీలు 6-8
ఒక యూనివర్సిటీలో ఇద్దరు అమ్మాయిలు క్లాస్‌ వైపు నడుచుకుంటూ వెళ్తున్నారు.

చదువు, డబ్బు మంచి భవిష్యత్తును ఇస్తాయా?

పైచదువులు చదివితే, బాగా డబ్బు సంపాదిస్తే భవిష్యత్తు బాగుంటుందని చాలామంది అనుకుంటారు. బాగా చదువుకున్న వ్యక్తి పనిలో నైపుణ్యం సాధిస్తాడని, ఇంట్లోవాళ్లను బాగా చూసుకుంటాడని, సమాజానికి కూడా సేవ చేస్తాడనేది వాళ్ల అభిప్రాయం. పైగా అలాంటివాళ్లకు ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగం దొరుకుతుందని, అప్పుడు బాగా డబ్బు సంపాదించి సంతోషంగా ఉండవచ్చని వాళ్లు అనుకుంటారు.

చాలామంది పైచదువును ఎంచుకుంటారు

చైనాలో ఉన్న జాంగ్‌ చెన్‌ ఇలా చెప్పాడు: “నేను పేదరికంలో పెరిగాను. నేను యూనివర్సిటీలో చదివి డిగ్రీ సంపాదిస్తే మంచి ఉద్యోగం దొరుకుతుంది, అప్పుడు కష్టాలేవీ లేకుండా సంతోషంగా ఉండొచ్చు అనుకున్నాను.”

చాలామంది మంచి భవిష్యత్తు ఉంటుందనే ఆశతో, పేరున్న యూనివర్సిటీలో చదవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అందుకోసం వేరేదేశాలకు కూడా వెళ్తున్నారు, అలా వెళ్లే వాళ్ల సంఖ్య కొన్నేళ్లుగా పెరుగుతూ వస్తోంది. కాకపోతే, ఈమధ్య కోవిడ్‌ వల్ల విదేశీ ప్రయాణాలపై షరతులు విధించారు. ఆ కారణంగా, పైచదువుల కోసం విదేశాలకు వెళ్లేవాళ్ల సంఖ్య కాస్త తగ్గింది. సుమారు 10 ఏళ్ల క్రితం ఒక సంస్థ చేసిన అధ్యయనం ప్రకారం, విదేశాల్లో చదువుతున్న విద్యార్థుల్లో 52 శాతం మంది ఆసియా నుండి వెళ్లినవాళ్లే అని తేలింది.

పిల్లల్ని విదేశాల్లో చదివించడం కోసం తల్లిదండ్రులు రెక్కలు ముక్కలు చేసుకుని పని చేస్తారు, ఎన్నో త్యాగాలు చేస్తారు. తైవాన్‌లో ఉంటున్న సీసియాంగ్‌ ఇలా గుర్తుచేసుకుంటున్నాడు: “మా అమ్మానాన్నలకు నలుగురు పిల్లలం. మేము డబ్బు ఉన్నవాళ్లం కాదు. అయినా పైచదువుల కోసం మా నలుగురిని అమెరికా పంపించారు.” చాలామందిలాగే, సీసియాంగ్‌ వాళ్ల అమ్మానాన్నలు కూడా తమ పిల్లల చదువుల కోసం చాలాచోట్ల అప్పులు చేశారు.

ఫలితం

వాళ్లలో ఒక అమ్మాయి రాత్రివరకు కంప్యూటర్‌ ముందు కూర్చుని పనిచేస్తోంది. ఆమె బాగా అలసటగా, ఒత్తిడిలో ఉన్నట్లు కనిపిస్తోంది.

ఎక్కువ చదువుకుని చేతినిండా డబ్బు సంపాదించిన చాలామంది, చివరికి జీవితంతో విసిగిపోయారు.

పైచదువుల వల్ల కొన్ని ఉపయోగాలు ఉన్నాయి, కానీ విద్యార్థులు కోరుకున్న జీవితాన్ని అది అన్నిసార్లు ఇవ్వలేదు. ఉదాహరణకు, ఎన్నో ఏళ్లు పగలనకా-రాత్రనకా కష్టపడి పనిచేసి, ఎన్నో అప్పులు చేసి, పైచదువులు చదివించాక కూడా చాలామందికి కోరుకున్న ఉద్యోగం దొరకట్లేదు. సింగపూర్‌ బిజినెస్‌ టైమ్స్‌ అనే వార్తాపత్రికలో ఇలా వచ్చింది: “ఈమధ్య కాలంలో, యూనివర్సిటీ డిగ్రీ ఉన్న చాలామంది ఉద్యోగాలు దొరకక ఇబ్బంది పడుతున్నారు.” తైవాన్‌లో ఉంటున్న జీయాంజికు డాక్టరేట్‌ డిగ్రీ ఉంది. అతను ఇలా అంటున్నాడు: “వేరే దారిలేక చాలామంది ఎలాంటి ఉద్యోగాలు చేస్తున్నారంటే, వాళ్ల చదువుకూ చేస్తున్న ఉద్యోగానికీ ఎలాంటి సంబంధం ఉండట్లేదు.”

కొంతమందికి కోరుకున్న ఉద్యోగం దొరికినా, సంతోషం మాత్రం ఉండట్లేదు. థాయ్‌లాండ్‌కి చెందిన నిరాన్‌ అనే వ్యక్తికి అలాంటి పరిస్థితే ఎదురైంది. అతను యూరప్‌లోని ఒక యూనివర్సిటీలో చదువు పూర్తి చేసుకుని తన దేశానికి తిరిగొచ్చాడు. చదువుకు తగ్గ ఉద్యోగం కూడా దొరికింది. అతను ఇలా అంటున్నాడు: “నేను అనుకున్నట్లుగానే, యూనివర్సిటీ డిగ్రీ ఉండడం వల్ల మంచి జీతం వచ్చే ఉద్యోగం దొరికింది. కానీ తీరిక లేనంత పని, రోజులో ఎక్కువ గంటలు ఆఫీసులోనే గడిచిపోయేవి. కొంతకాలానికి కంపెనీ వాళ్లు చాలామంది ఉద్యోగుల్ని పనిలో నుండి తీసేశారు, అలా నా ఉద్యోగం కూడా పోయింది. అప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది, కష్టపడి ఎంత మంచి ఉద్యోగం సంపాదించినా అది ఎంతకాలం ఉంటుందో గ్యారెంటీ లేదు.”

కొన్నిసార్లు డబ్బున్నవాళ్లను చూసి ‘వీళ్లకు ఏ కష్టం లేదు’ అని అనుకుంటారు. నిజానికి వాళ్లకు కూడా సమస్యలు ఉంటాయి. వాళ్లకూ ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు ఉంటాయి. జపాన్‌లో ఉంటున్న కజూయా ఇలా అంటున్నాడు: “నాకు అన్నీ ఉన్నా సంతోషం మాత్రం ఉండేది కాదు. ఎందుకంటే వేరేవాళ్లు నన్ను చూసి అసూయపడేవాళ్లు, నన్ను ఎగతాళి చేసేవాళ్లు.” వియత్నాంలో ఉంటున్న లామ్‌ అనే ఆవిడ ఇలా చెప్పింది: “ప్రశాంతంగా జీవించవచ్చు అనే ఉద్దేశంతో చాలామంది మంచి జీతం వచ్చే ఉద్యోగం కోసం కష్టపడతారు. కానీ వాస్తవం వేరు. అది ప్రశాంతతను ఇవ్వకపోగా, రకరకాల టెన్షన్‌లతో పాటు ఆరోగ్య సమస్యల్ని, మానసిక సమస్యల్ని తెచ్చిపెడుతుంది.”

చదువు, డబ్బు ఉంటే సరిపోదు

బ్రతకడానికి, కుటుంబాన్ని పోషించుకోవడానికి కొంత చదువు, డబ్బు అవసరమే. కానీ అవి ఉన్నంత మాత్రాన సంతోషంగా ఉంటామనే గ్యారెంటీ లేదు. ఈ విషయం గురించి పవిత్ర లేఖనాలు ఏం చెప్తున్నాయో చూడండి.

పైచదువు అన్నిసార్లూ సక్సెస్‌ ఇవ్వదు

“వేగం గలవాళ్లు అన్నిసార్లూ పందెంలో గెలవరు . . . మేధావులకు అన్నివేళలా సంపదలు ఉండవు, జ్ఞానం గలవాళ్లు అన్నిసార్లూ విజయం సాధించరు; ఎందుకంటే అనుకోని సమయాల్లో, అనుకోని సంఘటనలు వాళ్లందరికీ ఎదురౌతాయి.”—ప్రసంగి 9:11.

కొంతమంది ఎక్కువ చదువుకున్నప్పటికీ జీవితంలో సక్సెస్‌ అవ్వలేకపోవచ్చు. ఎందుకంటే కొన్ని విషయాలు వాళ్ల చేతుల్లో ఉండవు. ఉదాహరణకు ఆర్థిక మాంద్యం, వివక్ష, పక్షపాతం లాంటి విషయాలు వాళ్ల ఎదుగుదలకు అడ్డుపడే అవకాశం ఉంది.

డబ్బు ఈ రోజు ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు

“ఆస్తిని సంపాదించడానికి అతిగా ప్రయాసపడకు. కాస్త ఆగి, అవగాహన చూపించు. నీ చూపు దానిమీద పడగానే, అది లేకుండా పోతుంది; అది గద్దలా రెక్కలు కట్టుకొని ఆకాశంలోకి ఎగిరిపోతుంది.”—సామెతలు 23:4, 5.

డబ్బు ఇచ్చే భద్రత శాశ్వతమైనది కాదు. ఎందుకంటే ఈరోజు ఉన్న డబ్బు రేపు ఉంటుందో ఉండదో గ్యారెంటీ లేదు. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం వల్ల, దాచుకున్న బ్యాంక్‌ బ్యాలెన్స్‌ అంతా ఒక్క రాత్రిలో ఖాళీ అయిపోవచ్చు. భూకంపాలు, అడవులు తగలబడడం, తుఫాన్లు వంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు సంపాదించిన డబ్బు, కట్టుకున్న ఇల్లు కూడా పోవచ్చు.

డబ్బు సమస్యల్ని వెంట తెస్తుంది

“ధనవంతుని సమృద్ధి అతన్ని నిద్రపోనివ్వదు.”—ప్రసంగి 5:12.

ఈ మాటలు ఎంత నిజమో హాంగ్‌కాంగ్‌లో ఉంటున్న ఫ్రాంక్లిన్‌ అనుభవంతో తెలుసుకున్నాడు. ఫ్రాంక్లిన్‌ ఎక్కువ చదువుకున్నాడు, పెద్ద ఉద్యోగం సంపాదించాడు, కొన్ని రోజులకు మేనేజర్‌గా ప్రమోషన్‌ కూడా పొందాడు. అతను ఇలా చెప్పాడు: “ఒత్తిడి వల్ల రాత్రుళ్లు నిద్రపట్టేది కాదు, నా ఆరోగ్యం కూడా పాడైపోయింది. ‘అసలు నేను దేనికోసం ఇంత కష్టపడుతున్నాను? జీవితం అంటే ఇంతేనా లేదా ఇంకేదైనా ఉందా?’ అని ఆలోచించడం మొదలుపెట్టాను.” చివరికి ఒత్తిడిని తట్టుకోలేక ఫ్రాంక్లిన్‌ ఆ ఉద్యోగం మానేశాడు.

“ఆస్తిని సంపాదించడానికి అతిగా ప్రయాసపడకు.”—సామెతలు 23:4

ఫ్రాంక్లిన్‌లాగే చాలామంది, జీవితం అంటే పెద్దపెద్ద చదువులు చదవడం, డబ్బు సంపాదించడం మాత్రమే కాదని అర్థంచేసుకున్నారు. వాటికన్నా ముఖ్యమైనవి జీవితంలో ఉన్నాయని గ్రహించారు. సాటిమనుషులకు వీలైన సహాయం చేస్తూ మంచి వ్యక్తిగా జీవిస్తే భవిష్యత్తు బాగుంటుందని కొంతమంది అనుకుంటారు. వాళ్లు అనుకునేది నిజమేనా? జవాబు తర్వాతి పేజీల్లో తెలుసుకుందాం.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి