ఏప్రిల్ 20-26
యెషయా 54-55
పాట 86, ప్రార్థన | ఆరంభ మాటలు (1 నిమి.)
1. యెహోవా దగ్గర నేర్చుకోవడానికి మీరు ఎంతగా కృషి చేస్తారు?
(10 నిమి.)
తన కుమారులకు బోధిస్తానని యెహోవా మాటిచ్చాడు (యెష 54:13, అధస్సూచి; w09 9/15 21 ¶3)
మనం టైం ఖర్చుపెట్టి, సత్యాన్ని కొనుక్కోవాలి (యెష 55:1, 2; w18.11 4-5 ¶6-7)
యెహోవా చెప్పేది శ్రద్ధగా వినాలంటే కష్టపడాలి, కానీ అలా చేస్తేనే మన ప్రాణాల్ని కాపాడుకుంటాం (యెష 55:3; be 14 ¶2-4)
ఇలా ప్రశ్నించుకోండి, ‘నేను వ్యక్తిగత అధ్యయనాన్ని ఇంకా బాగా, క్రమంగా ఎలా చేయవచ్చు?’
2. దేవుని వాక్యంలో రత్నాలు
(10 నిమి.)
యెష 54:17—ఈ వచనంలోని మొదటి భాగం, ఏ మూడు ముఖ్యమైన వాస్తవాల్ని గుర్తుచేస్తుంది? (w19.01 6 ¶14-15)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
3. చదవాల్సిన బైబిలు భాగం
(4 నిమి.) యెష 54:1-10 (th అధ్యాయం 11)
4. మొదటిసారి మాట్లాడేటప్పుడు
(2 నిమి.) ఇంటింటి పరిచర్య. ప్రజల్ని ప్రేమిద్దాం బ్రోషుర్‌లోని అనుబంధం Aలో ఉన్న ఒక సత్యాన్ని చెప్పండి. (lmd పాఠం 1 పాయింట్ 4)
5. మొదటిసారి మాట్లాడేటప్పుడు
(2 నిమి.) బహిరంగ సాక్ష్యం. ప్రజల్ని ప్రేమిద్దాం బ్రోషుర్‌లోని అనుబంధం Aలో ఉన్న ఒక సత్యాన్ని చెప్పండి. (lmd పాఠం 2 పాయింట్ 3)
6. మళ్లీ కలిసినప్పుడు
(2 నిమి.) బహిరంగ సాక్ష్యం. కాంటాక్ట్ కార్డ్ ఇవ్వండి. (lmd పాఠం 9 పాయింట్ 3)
7. ప్రసంగం
(5 నిమి.) be 28 ¶3–31 ¶2—అంశం: అధ్యయనం ఎలా చెయ్యాలి? (th అధ్యాయం 14)
పాట 97
8. ఎన్ని ఆటంకాలు వచ్చినా వ్యక్తిగత అధ్యయనం చేయండి
(15 నిమి.) చర్చ.
క్రమంగా వ్యక్తిగత అధ్యయనం చేయాలనుకున్నప్పుడు చాలా ఆటంకాలు వస్తుంటాయి. ఈ విషయంలో, మీరు ఒక బ్రదర్‌ని లేదా సిస్టర్‌ని ప్రోత్సహిస్తున్నట్టు ఊహించుకోండి. వాళ్లు క్రమంగా వ్యక్తిగత అధ్యయనం చేయలేకపోతున్నారు, రోజూ బైబిలు చదవలేకపోతున్నారు. దానికి వాళ్లు కింద ఇచ్చిన కొన్ని ఆటంకాలు చెప్పారు. ఒక్కో ఆటంకానికి, కనీసం ఒక సలహా గానీ, ఒక లేఖనం గానీ, ఒక రెఫరెన్స్ గానీ రాయండి.
“నేను సరిగ్గా చదవలేను”
“నాకు చదవడం-అధ్యయనం చేయడం అంటే ఇష్టం ఉండదు”
“బైబిల్లో ఎక్కడ నుండి చదవాలో, ఎంత చదవాలో తెలీదు”
“చదవడానికి చాలా ఉంది! ప్రతీవారం ఏం చదవాలో అర్థం కావట్లేదు”
“నేను చాలా బిజీగా ఉంటాను, నాకు చదవడానికి అస్సలు టైం దొరకదు”
“బుర్ర పెట్టి చదవాలంటే నాకు కష్టం, కొన్నిసార్లు ఏం చదివానో కూడా గుర్తుండదు”
వ్యక్తిగత అధ్యయనాన్ని చక్కగా చేయండి వీడియో చూపించండి. తర్వాత ఇలా అడగండి:
వ్యక్తిగత అధ్యయనాన్ని చక్కగా చేయడానికి బ్రదర్స్-సిస్టర్స్ ఇచ్చిన సలహాల్లో మీకేది బాగా నచ్చింది?
9. సంఘ బైబిలు అధ్యయనం
(30 నిమి.) lfb లెసన్స్ 78-79