ఏప్రిల్ 27–మే 3
యెషయా 56-57
పాట 12, ప్రార్థన | ఆరంభ మాటలు (1 నిమి.)
1. యెహోవా మన దేవుడు కాబట్టి సంతోషంగా ఉన్నాం
(10 నిమి.)
విగ్రహాల్ని పూజించేవాళ్లు సహాయం కోసం ఎంత ప్రార్థించినా ఎవ్వరూ వినరు (యెష 57:13; ip-2 269 ¶14-16)
యెహోవా ఎవరో తెలియనివాళ్ల పరిస్థితి అల్లకల్లోలంగా ఉంటుంది, వాళ్ల మధ్య ఐక్యత ఉండదు (యెష 57:20; w18.06 7 ¶16)
దుష్టులకు మనశ్శాంతి ఉండదు (యెష 57:21; w99 10/1 11 ¶4)
ఇలా ప్రశ్నించుకోండి: యెహోవాతో స్నేహం నాకెలా మేలు చేస్తుంది?
2. దేవుని వాక్యంలో రత్నాలు
(10 నిమి.)
యెష 56:6, 7—ఈ ప్రవచనం ఎలా నెరవేరుతుంది? (w07 1/15 10 ¶3; w06 11/1 27 ¶1)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
3. చదవాల్సిన బైబిలు భాగం
(4 నిమి.) యెష 56:4-12 (th అధ్యాయం 5)
4. మొదటిసారి మాట్లాడేటప్పుడు
(3 నిమి.) అనియత సాక్ష్యం. ఈమధ్య మీటింగ్‌లో మీరు నేర్చుకున్న ఒక విషయాన్ని చెప్పండి. (lmd పాఠం 2 పాయింట్ 4)
5. మీ నమ్మకాల్ని వివరించేటప్పుడు
(5 నిమి.) ప్రసంగం. ijwbq ఆర్టికల్ 90—అంశం: ఒక మతంలో సభ్యునిగా ఉండడం నిజంగా అవసరమా? (th అధ్యాయం 16)
6. శిష్యుల్ని చేసేటప్పుడు
(4 నిమి.) lff పాఠం 19 పాయింట్ 4 (lmd పాఠం 11 పాయింట్ 3)
పాట 58
7. యెహోవా గురించి మాట్లాడడం ఎన్నడూ మానకండి
(15 నిమి.) చర్చ.
యెహోవా అంటే తెలియని వాళ్ల జీవితానికి ఒక అర్థం గానీ, భవిష్యత్తు మీద ఆశ గానీ ఉండదు. వాళ్లకు నమ్మదగిన సలహాలు ఇచ్చి, సరైన దారిలో నడిపించేవాళ్లు ఎవ్వరూ లేరు. పరిస్థితి ఇలా ఉన్నా చాలామంది, సత్యానికున్న విలువ తెలియక రాజ్య సందేశాన్ని వినడానికి ఇష్టపడట్లేదు. ప్రజలు విననప్పుడు మనం నిరుత్సాహపడకుండా, పరిచర్యలో వెనకడుగు వేయకుండా ఉండడానికి కింద ఇచ్చిన కారణాలు మనకు సహాయం చేస్తాయి.—ప్రస 11:6.
మన టెరిటరీలో ఉన్నవాళ్లు ఇల్లు మారవచ్చు. ఆసక్తి లేని ఇంటివ్యక్తులు ఇల్లు మారవచ్చు, కొత్తగా వచ్చినవాళ్లు వినడానికి ఇష్టపడవచ్చు
అంతకుముందు కలవనివాళ్లు ఈసారి కలవచ్చు. ఉదాహరణకు ఇంటివ్యక్తుల వృద్ధ తల్లిదండ్రుల్ని కలవచ్చు, ఇంతకుముందు కలిసిన పిల్లలు ఇప్పుడు పెద్దవాళ్లు అయ్యుండవచ్చు, కొత్తగా వచ్చిన రూమ్‌మేట్స్‌ని కలవవచ్చు, లేదా ఇంటివాళ్లను పలకరించడానికి వచ్చిన గెస్ట్‌లను కలవవచ్చు
ప్రజలు మారతారు. (1తి 1:13) పరిస్థితులు మరీ ఘోరంగా తయారవ్వడం చూసినప్పుడు లేదా జీవితంలో ఏదైనా జరగరానిది జరిగినప్పుడు ఇంటివ్యక్తి మనసు కరిగి, మనం చెప్పేది ఇప్పుడు వినడానికి ఇష్టపడవచ్చు
పట్టుదలగా ప్రీచింగ్ చేస్తూనే ఉంటే యెహోవా మీద మనకున్న ప్రేమను చూపిస్తాం.—లూకా 6:45; 1యో 5:3
యెహోవా “ఏ ఒక్కరికీ దూరంగా లేడు” వీడియో చూపించండి. తర్వాత ఇలా అడగండి:
మానకుండా ప్రీచింగ్ చేస్తూనే ఉండడం గురించి మీరేం నేర్చుకున్నారు?
8. సంఘ బైబిలు అధ్యయనం
(30 నిమి.) lfb లెసన్స్ 80-81