కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb24 జూలై పేజీలు 10-16
  • ఆగస్టు 5-11

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఆగస్టు 5-11
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2024
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2024
mwb24 జూలై పేజీలు 10-16

ఆగస్టు 5-11

కీర్తనలు 70-72

పాట 59, ప్రార్థన | ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

1. దేవుని బలం గురించి “తర్వాతి తరానికి” చెప్పండి

(10 నిమి.)

దావీదు తన యౌవనంలో యెహోవా కాపుదలను రుచి చూశాడు (కీర్త 71:5; w99 9/1 18వ పేజీ, 17వ పేరా)

దావీదు తన ముసలితనంలో యెహోవా సహాయాన్ని చూశాడు (కీర్త 71:9; g04-E 10/8 23వ పేజీ, 3వ పేరా)

దావీదు చిన్న వయసువాళ్లకు తన అనుభవాల్ని చెప్పి ప్రోత్సహించాడు (కీర్త 71:17, 18; w14 1/15 23వ పేజీ, 4-5 పేరాలు)

పోయినవారం “కుటుంబ ఆరాధన కోసం సూత్రాలు” భాగంలో చూపించిన కుటుంబం. వాళ్లు వృద్ధ దంపతుల్ని కుటుంబ ఆరాధనకు పిలిచారు, ఆ దంపతులు ఫోటోల్ని చూపిస్తూ అనుభవాలు చెప్తుండగా అందరూ సంతోషంగా వింటున్నారు.

ఇలా ప్రశ్నించుకోండి,​ ‘కుటుంబ ఆరాధనలో ఇంటర్వ్యూ చేయడానికి, సంఘంలో చాలాకాలంగా సేవ చేస్తున్న వాళ్లలో ఎవర్ని పిలవవచ్చు?’

2. దేవుని వాక్యంలో రత్నాలు

(10 నిమి.)

  • కీర్త 72:8—ఆదికాండం 15:18 లో యెహోవా అబ్రాహాముకు ఇచ్చిన మాట రాజైన సొలొమోను పరిపాలనలో ఎలా నెరవేరింది? (it-1-E 768వ పేజీ)

  • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

3. చదవాల్సిన బైబిలు భాగం

(4 నిమి.) కీర్త 71:1-24 (th 5వ అధ్యాయం)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

4. మొదటిసారి మాట్లాడేటప్పుడు

(3 నిమి.) ఇంటింటి పరిచర్య. ఇంటివ్యక్తి వాదించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు సంభాషణను ప్రశాంతంగా ముగించండి. (lmd 4వ పాఠంలో 5వ పాయింట్‌)

5. మళ్లీ కలిసినప్పుడు

(4 నిమి.) అనియత సాక్ష్యం. ఇంతకుముందు ఒకసారి మాట్లాడిన మీ బంధువుతో సంభాషణను కొనసాగిస్తుండగా, బైబిలు స్టడీ తీసుకోవడం వాళ్లకు ఇష్టం లేదన్నట్టు చెప్తారు. (lmd 8వ పాఠంలో 4వ పాయింట్‌)

6. మీ నమ్మకాల్ని వివరించేటప్పుడు

(5 నిమి.) ప్రసంగం. ijwfq 49—అంశం: యెహోవాసాక్షులు తమ నమ్మకాల్లో కొన్నిటిని ఎందుకు మార్చుకున్నారు? (th 17వ అధ్యాయం)

మన క్రైస్తవ జీవితం

పాట 76

7. కుటుంబ ఆరాధన కోసం ఐడియాలు

(15 నిమి.) చర్చ.

అంతకుముందు చూపించిన కుటుంబం ఒక రాజ్యగీతాన్ని నిలబడి ప్రాక్టీస్‌ చేస్తుంది.
ఆ కుటుంబం JW బ్రాడ్‌కాస్టింగ్‌ వీడియో చూస్తుంది.
కుటుంబ ఆరాధనలో ఒక సన్నివేశాన్ని ప్రాక్టీస్‌ చేస్తుండగా, ఆ కుటుంబంలోని ఒక కూతురు తన తల్లికి జవాబిస్తుంది.

పిల్లలకు “యెహోవా నిర్దేశాల ప్రకారం క్రమశిక్షణను, ఉపదేశాన్ని” ఇవ్వడానికి కుటుంబ ఆరాధన ప్రాముఖ్యమైన ఏర్పాటు. (ఎఫె 6:4) నేర్చుకోవడానికి కొంచెం కష్టపడాలి కానీ బైబిలు సత్యాల పట్ల ఆకలి పెంచుకునే కొద్దీ పిల్లలు ఆనందిస్తారు. (యోహా 6:27; 1పే 2:2) కుటుంబ ఆరాధనలో తల్లిదండ్రులు చక్కగా బోధించడానికి, పిల్లలతో సరదాగా గడపడానికి సహాయం చేయగల “కుటుంబ ఆరాధన కోసం ఐడియాలు” అనే బాక్సు చర్చించి ఈ ప్రశ్నలు అడగండి:

  • వీటిలో ఏ ఐడియాల్ని మీరు ప్రయత్నించాలని అనుకుంటున్నారు?

  • వేరే ఇంకేదైనా ఐడియా మీకు ఉపయోగపడిందా?

కుటుంబ ఆరాధన కోసం ఐడియాలు

బైబిలు:

  • ఆ వారం చదవాల్సిన బైబిలు భాగం ఆడియో వినండి లేదా మీరే దాన్ని వంతుల వారీగా బిగ్గరగా చదవండి. కుటుంబంలో ఒక్కొక్కరు ఒక్కో బైబిలు వ్యక్తిని ఎంచుకుని చదవొచ్చు

  • ఆ వారం చదవాల్సిన బైబిలు భాగానికి సంబంధించి కొన్ని ప్రశ్నలు తయారుచేయండి. కుటుంబంలో ఒక్కొక్కరు ఒక్కో ప్రశ్న ఎంచుకుని, పరిశోధన చేసి, తర్వాత వాళ్లు ఏం నేర్చుకున్నారో అందరికీ చెప్పాలి

  • ఒక ప్రశ్న లేదా ఒక సందర్భం తీసుకుని, దానికి సరిపోయే బైబిలు సూత్రాల్ని మంచి క్రైస్తవులుగా ఉండడానికి ఉపయోగపడే లేఖనాలు అనే పుస్తకం నుండి పరిశోధన చేయండి

  • బైబిల్లో ఏదైనా ఒక కథ ఆధారంగా డ్రామా వేయండి

  • ప్రతీవారం ఒక లేఖనాన్ని ఒక చిన్న కార్డు మీద రాయండి, ఉదాహరణకు ప్రజల్ని ప్రేమిద్దాం—శిష్యుల్ని చేద్దాం బ్రోషురులోని అనుబంధం Aలో ఉన్న లేఖనాల్ని మీరు ఉపయోగించవచ్చు. తర్వాత వాటిని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ముందు వారాల్లో రాసిన కార్డుల్ని మళ్లీ గుర్తుచేసుకోండి

  • ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! పుస్తకంలో ఏదైనా ఒక చిన్న భాగాన్ని స్టడీ చేయండి

  • కుటుంబంలో ప్రతీఒక్కరికి jw.orgలో బైబిలు బోధలు సెక్షన్‌ కింద “బైబిలు ప్రశ్నలకు జవాబులు” లేదా “బైబిలు వచనాల వివరణ” సిరీస్‌లో ఉన్న ఒక ఆర్టికల్‌ ఇచ్చి దాని గురించి చెప్పమనండి

మీటింగ్స్‌:

  • మీటింగ్‌లో జరిగే ఒక భాగానికి సిద్ధపడండి

  • కామెంట్స్‌ సిద్ధపడండి. టైం దాటకుండా కామెంట్‌ చెప్పేలా ప్రాక్టీస్‌ చేయండి

  • మీటింగ్స్‌లో పాడే పాటలు ప్రాక్టీస్‌ చేయండి

  • మీటింగ్‌కి ముందు, తర్వాత ఎవరినైనా ప్రోత్సహించడానికి ఏం మాట్లాడాలో ప్రాక్టీస్‌ చేయండి

  • మీకిచ్చిన విద్యార్థి నియామకాన్ని కుటుంబం ముందు ప్రాక్టీస్‌ చేయండి

పరిచర్య:

  • ఇంటింటి పరిచర్య కోసం సిద్ధపడండి

  • రిటన్‌ విజిట్స్‌ కోసం సిద్ధపడండి

  • రోజువారీ పనుల కోసం బయటికి వెళ్తున్నప్పుడు జరిగే ఏదైనా ఒక సన్నివేశాన్ని ఊహించుకుని, స్నేహపూర్వకంగా మాటల్ని ఎలా మొదలుపెట్టవచ్చో ప్రాక్టీస్‌ చేయండి

  • జ్ఞాపకార్థ ఆచరణ సమయంలో లేదా స్కూల్‌కి-పనికి సెలవులు ఇచ్చిన సమయంలో పరిచర్యను ఇంకా ఎక్కువ చేయడానికి మీరు పెట్టుకోగలిగే లక్ష్యాల గురించి మాట్లాడుకోండి

కుటుంబ అవసరాలు:

  • డేటింగ్‌, పండుగలు, ఎవరైనా ఏడ్పించడం, జెండా వందనం, జాతీయ గీతం, రాజకీయాలు లాంటి వాటికి సంబంధించి పిల్లలకు ఏదైనా ఒక సమస్య వచ్చుంటే లేదా రావచ్చని అనిపిస్తే, అలాంటి సందర్భాల్లో ఏం చేయాలో ప్రాక్టీస్‌ చేయండి

  • తల్లిదండ్రులు పిల్లల్లా, పిల్లలు తల్లిదండ్రుల్లా నటిస్తూ ప్రాక్టీస్‌ చేయండి. పిల్లలు ఒక విషయం గురించి పరిశోధన చేసి తల్లిదండ్రులకు అర్థమయ్యేలా చెప్పాలి

ఇంకొన్ని ఐడియాలు:

  • JW బ్రాడ్‌కాస్టింగ్‌ చూసి దానిగురించి మాట్లాడుకోండి

  • jw.orgలో ఉన్న ఒక వీడియో చూసి లేదా ఒక ఆర్టికల్‌ని చదివి దానిగురించి మాట్లాడుకోండి

  • jw.orgలో బైబిలు బోధలు కింద “టీనేజర్లు, యౌవనులు” లేదా “పిల్లలు” అనే సెక్షన్‌లలో ఉన్న ఏదోక విషయాన్ని చర్చించండి

  • సమావేశాల్లో రాసుకున్న నోట్సును మళ్లీ ఒకసారి చూసి మాట్లాడుకోండి

  • సృష్టిలో ఏదైనా ఒక విషయాన్ని తీసుకుని, అది యెహోవా గురించి ఏం చెప్తుందో మాట్లాడుకోండి

  • అప్పుడప్పుడు ఎవరినైనా పిలిచి ఇంటర్వ్యూ చేయండి

  • ఆధ్యాత్మిక లక్ష్యాలు పెట్టుకుని, వాటిని ఎలా చేరుకోవాలో మాట్లాడుకోండి

  • అందరూ కలిసి ఒక ప్రాజెక్ట్‌ చేయండి. ఉదాహరణకు ఒక నమూనా (మోడల్‌), మ్యాప్‌ లేదా చార్టు లాంటివి తయారుచేయవచ్చు

కుటుంబ ఆరాధనను ఆనందించేలా మార్పులు చేసుకోండి అనే వీడియో చూపించి, ఇలా అడగండి:

  • పిల్లలు లేనప్పుడు తన భార్య కుటుంబ ఆరాధనను ఆనందించడానికి భర్త ఏం చేయవచ్చు?

8. సంఘ బైబిలు అధ్యయనం

(30 నిమి.) bt 13వ అధ్యాయంలో 17-24 పేరాలు

ముగింపు మాటలు (3 నిమి.) | పాట 123, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి