ఏప్రిల్ 1-7
కీర్తనలు 23-25
పాట 4, ప్రార్థన | ఆరంభ మాటలు (1 నిమి.)
1. “యెహోవా నా కాపరి”
(10 నిమి.)
యెహోవా మనల్ని నడిపిస్తాడు (కీర్త 23:1-3; w11-E 5/1 31వ పేజీ, 3వ పేరా)
యెహోవా మనల్ని కాపాడతాడు (కీర్త 23:4; w11-E 5/1 31వ పేజీ, 4వ పేరా)
యెహోవా మనల్ని పోషిస్తాడు (కీర్త 23:5; w11-E 5/1 31వ పేజీ, 5వ పేరా)
ఒక ప్రేమగల కాపరి తన గొర్రెల్ని శ్రద్ధగా చూసుకున్నట్టే, యెహోవా తన సేవకుల్ని శ్రద్ధగా చూసుకుంటాడు.
ఇలా ప్రశ్నించుకోండి, ‘యెహోవా నన్ను ఎలా శ్రద్ధగా చూసుకున్నాడు?’
2. దేవుని వాక్యంలో రత్నాలు
(10 నిమి.)
కీర్త 23:3—“నీతి మార్గాలు” అంటే ఏంటి? వాటినుండి పక్కకు వెళ్లకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? (w11 2/15 24వ పేజీ, 1-3 పేరాలు)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
3. చదవాల్సిన బైబిలు భాగం
(4 నిమి.) కీర్త 23:1–24:10 (th 5వ అధ్యాయం)
4. మొదటిసారి మాట్లాడేటప్పుడు
(3 నిమి.) అనియత సాక్ష్యం. కాలుష్యం వల్ల భూమికి ఏమైపోతుందో అని కంగారుపడుతున్న వ్యక్తితో ఒక మంచి లేఖనం పంచుకోండి. (lmd 2వ పాఠంలో 5వ పాయింట్)
5. మళ్లీ కలిసినప్పుడు
(4 నిమి.) ఇంటింటి పరిచర్య. ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! బ్రోషురు తీసుకున్న వ్యక్తికి, బైబిలు స్టడీ ఎలా ఉంటుందో చూపించండి. (lmd 9వ పాఠంలో 3వ పాయింట్)
6. శిష్యుల్ని చేసేటప్పుడు
(5 నిమి.) lff 14వ పాఠంలో 4వ పాయింట్ (lmd 11వ పాఠంలో 3వ పాయింట్)
పాట 54
7. మనం పరాయివాళ్ల స్వరాన్ని అస్సలు వినం
(15 నిమి.) చర్చ.
గొర్రెలకు కాపరి స్వరం తెలుసు, కాబట్టి ఆయన వెనక వెళ్తాయి. కానీ పరాయివాళ్ల స్వరం వాటికి తెలీదు, కాబట్టి అవి పారిపోతాయి. (యోహా 10:5) మనం కూడా ప్రేమగల, నమ్మదగిన కాపరులైన యెహోవా, యేసు స్వరాన్ని వింటాం. (కీర్త 23:1; యోహా 10:11) కానీ, “మోసపూరిత మాటలతో” మన విశ్వాసాన్ని నీరుగార్చాలని చూసే పరాయివాళ్ల స్వరాన్ని అస్సలు వినం.—2పే 2:1, 3.
భూమ్మీద మొట్టమొదటిసారి పరాయివాళ్ల స్వరం ఎప్పుడు వినిపించిందో ఆదికాండం మూడో అధ్యాయం చెప్తుంది. సాతాను తన నిజ స్వరూపాన్ని దాచేసి, పాము ద్వారా హవ్వతో మాట్లాడాడు. అతనేదో ఆమె మేలు కోరుతున్నట్టు నటిస్తూ యెహోవా మాటల్ని, ఉద్దేశాల్ని మార్చిచెప్పాడు. విచారకరంగా, హవ్వ అది నమ్మేసి తనకు, తన కుటుంబానికి లేనిపోని కష్టాలు తెచ్చింది.
ఈరోజుల్లో కూడా సాతాను యెహోవా మీద, ఆయన సంస్థ మీద అనుమానాలు పుట్టిస్తున్నాడు. అందుకోసం తప్పుడు నివేదికలు, అర్ధ సత్యాలు, పచ్చి అబద్ధాలు వ్యాప్తి చేస్తున్నాడు. పరాయివాళ్ల స్వరం వినబడగానే, మనం పారిపోవాలి! కుతూహలంతో కాసేపు విన్నా, ప్రమాదకరమే. సాతాను హవ్వను మోసం చేయడానికి ఎంతసేపు పట్టింది చెప్పండి? కొన్ని మాటలతోనే ఆమెను నమ్మించేశాడు కదా. (ఆది 3:1, 4, 5) ఒకవేళ మనల్ని ప్రేమించేవాళ్లు, మన మంచి కోరేవాళ్లు వచ్చి యెహోవా సంస్థ గురించి తప్పుడు సమాచారం చెప్తే, అప్పుడేంటి?
‘పరాయివాళ్ల స్వరాన్ని’ తిరస్కరించండి అనే వీడియో చూపించి, ఇలా అడగండి:
జాస్మిన్ సత్యంలోలేని వాళ్ల అమ్మతో ప్రవర్తించిన విధానం నుండి మీరేం నేర్చుకున్నారు?
8. సంఘ బైబిలు అధ్యయనం
(30 నిమి.) bt 8వ అధ్యాయంలో 1-4 పేరాలు, 61-62 పేజీల బాక్సులు