కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb24 మార్చి పేజీలు 10-11
  • ఏప్రిల్‌ 8-14

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఏప్రిల్‌ 8-14
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2024
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2024
mwb24 మార్చి పేజీలు 10-11

ఏప్రిల్‌ 8-14

కీర్తనలు 26-28

పాట 34, ప్రార్థన | ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

రాజైన దావీదు పట్టుదలగా ప్రార్థిస్తున్నాడు.

1. దావీదు ఎలా యథార్థతను కాపాడుకున్నాడు?

(10 నిమి.)

తనను శుద్ధి చేయమని దావీదు యెహోవాను అడిగాడు (కీర్త 26:1, 2; w04 12/1 14వ పేజీ, 8-9 పేరాలు)

దావీదు చెడు సహవాసాలకు దూరంగా ఉన్నాడు (కీర్త 26:4, 5; w04 12/1 15-16 పేజీలు, 12-13 పేరాలు)

యెహోవా ఆరాధన అంటే దావీదుకు చాలా ఇష్టం (కీర్త 26:8; w04 12/1 16వ పేజీ, 17-18 పేరాలు)


దావీదు పొరపాట్లు చేసినా, “యథార్థ హృదయంతో” నడుచుకున్నాడు. (1రా 9:4) మనస్ఫూర్తిగా యెహోవాను ప్రేమించడంలో, ఆరాధించడంలో ఆయన యథార్థత కనిపించింది.

2. దేవుని వాక్యంలో రత్నాలు

(10 నిమి.)

  • కీర్త 27:10—అయినవాళ్లే మనల్ని విడిచిపెట్టినట్టు అనిపిస్తే, ఈ వచనం ఎలా ఓదార్పునిస్తుంది? (w06 7/15 28వ పేజీ, 15వ పేరా)

  • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

3. చదవాల్సిన బైబిలు భాగం

(4 నిమి.) కీర్త 27:1-14 (th 2వ అధ్యాయం)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

4. మొదటిసారి మాట్లాడేటప్పుడు

(2 నిమి.) ఇంటింటి పరిచర్య. బోధనా పనిముట్లలో ఒక కరపత్రాన్ని ఉపయోగించండి. (th 3వ అధ్యాయం)

5. మళ్లీ కలిసినప్పుడు

(4 నిమి.) ఇంటింటి పరిచర్య. పోయినసారి మీరు ఇచ్చిన కరపత్రం వెనక ఉన్న ప్రశ్నను చర్చించండి. jw.org చూపించి, అందులో ఏమేం ఉంటాయో చెప్పండి. (lmd 9వ పాఠంలో 3వ పాయింట్‌)

6. ప్రసంగం

(5 నిమి.) lmd అనుబంధం A, 3వ పాయింట్‌—అంశం: కాలుష్యం లేకుండా పోతుంది, భూమి అందమైన తోటలా మారుతుంది. (th 13వ అధ్యాయం)

మన క్రైస్తవ జీవితం

పాట 128

7. నైతిక విషయాల్లో యథార్థంగా ఉంటున్న టీనేజర్లు

(15 నిమి.) చర్చ.

ఒక టీనేజ్‌ అబ్బాయి తను అప్పుడే చదివిన లేఖనాన్ని ధ్యానిస్తున్నాడు. పక్కన ఉన్న టాబ్‌లో, “టీనేజ్‌లో నా జీవితం—పెళ్లి అవ్వకుండానే సెక్స్‌ చేయాలనే ఒత్తిడిని ఎలా ఎదిరించొచ్చు?” అనే వీడియోలోని సన్నివేశం కనిపిస్తుంది. ఆ సన్నివేశంలో యోసేపు పోతీఫరు భార్య దగ్గర నుండి పారిపోతున్నాడు.

నైతిక విషయాల్లో యథార్థంగా ఉండడానికి యౌవనులు పోరాడాలి. వాళ్లు అపరిపూర్ణతతో పోరాడుతూనే, యౌవనప్రాయంలో పవిత్రంగా ఉండడానికి కృషిచేస్తారు. ఎందుకంటే, ఆ సమయంలో లైంగిక కోరికలు బలంగా ఉండడం వల్ల వాళ్లు మంచి నిర్ణయాలు తీసుకోలేకపోవచ్చు. (రోమా 7:21; 1కొ 7:36) అంతేకాదు సెక్స్‌లో పాల్గొనమని, అమ్మాయిలు అమ్మాయిలతో, అబ్బాయిలు అబ్బాయిలతో సెక్స్‌లో పాల్గొన్నా తప్పులేదని తోటివాళ్లు అదేపనిగా తెస్తున్న ఒత్తిడిని వాళ్లు ఎదిరించాలి. (ఎఫె 2:2) ఇంత ఒత్తిడిలో కూడా తమ యథార్థతను కాపాడుకుంటూ వస్తున్న మన యౌవనుల్ని చూస్తుంటే గర్వంగా ఉంది!

టీనేజ్‌లో నా జీవితం—పెళ్లి అవ్వకుండానే సెక్స్‌ చేయాలనే ఒత్తిడిని ఎలా ఎదిరించొచ్చు? అనే వీడియో చూపించి, ఇలా అడగండి:

  • కోరి, క్యామ్రిన్‌లను తోటి పిల్లలు ఎలా ఒత్తిడి చేశారు?

  • యథార్థతను కాపాడుకోవడానికి వాళ్లకు ఏది సహాయం చేసింది?

  • మీకు అలాంటి పరిస్థితి వస్తే, ఏ బైబిలు సూత్రాలు సహాయం చేస్తాయి?

8. సంఘ బైబిలు అధ్యయనం

(30 నిమి.) bt 8వ అధ్యాయంలో 5-12 పేరాలు

ముగింపు మాటలు (3 నిమి.) | పాట 38, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి