మన క్రైస్తవ జీవితం
బెతెల్ సేవ చేస్తున్నవాళ్లను ఓదార్చడానికి ఒక ఏర్పాటు
అందరికీ కష్టాలు వస్తాయి. అందరికీ ఓదార్పు, సహాయం అవసరం. ఆధ్యాత్మికంగా బలంగా ఉన్నవాళ్లకు లేదా పెద్దపెద్ద సేవావకాశాలు ఉన్నవాళ్లకు కూడా కొన్నిసార్లు నిరుత్సాహంగా అనిపించవచ్చు. (యోబు 3:1-3; కీర్త 34:19) బెతెల్ కుటుంబ సభ్యులకు కాపరి సందర్శనాలు చేసే ఏర్పాటు నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?
“దేవునిపై నమ్మకం ఉంచండి” అనే వీడియో చూసి, ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పండి:
బెతెల్ కుటుంబ సభ్యులకు ఎదురయ్యే కొన్ని సవాళ్లు ఏంటి?
వాళ్లను ఓదార్చడానికి ఏ నాలుగు పనులు చేశారు?
వాళ్లను ఓదార్చిన సహోదరులు ఎలా ప్రయోజనం పొందారు?