కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb22 నవంబరు పేజీ 11
  • లోకాంతాన్ని తప్పించుకుంటాం అనే ధైర్యంతో ఉందాం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • లోకాంతాన్ని తప్పించుకుంటాం అనే ధైర్యంతో ఉందాం
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
  • ఇలాంటి మరితర సమాచారం
  • “మహాశ్రమ” కాలంలో నమ్మకంగా ఉండండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2019
  • దేవుని రాజ్యం శత్రువులను నాశనం చేయడం
    దేవుని రాజ్యం పరిపాలిస్తోంది!
  • హార్‌మెగిద్దోన్‌ ఒక శుభవార్త!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2019
  • ఈ లోకం ఎలా అంతమౌతుంది?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2012
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
mwb22 నవంబరు పేజీ 11
“ప్యూర్‌ వర్షిప్‌ ఆఫ్‌ జెహోవా​—రిస్టోర్డ్‌ అట్‌ లాస్ట్‌!” అనే పుస్తకాన్ని అధ్యయనం చేస్తున్నాడు. హార్‌మెగిద్దోనులో దేవుని ప్రజల్లో కొంతమందిని యెహోవా దూత కాపాడుతున్నట్టు ఆయన ఊహించుకుంటున్నాడు.

మన క్రైస్తవ జీవితం

లోకాంతాన్ని తప్పించుకుంటాం అనే ధైర్యంతో ఉందాం

ఈ చెడ్డలోకం విషయంలో యెహోవా ఓపిక త్వరలో నశించిపోతుంది. అబద్ధమతం నాశనమౌతుంది, దేశాల గుంపు దేవుని ప్రజలమీద దాడిచేస్తుంది, హార్‌మెగిద్దోన్‌లో చెడ్డవాళ్లందర్నీ యెహోవా నాశనం చేస్తాడు. ఈ ముఖ్యమైన సంఘటనల కోసం క్రైస్తవులమైన మనం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం.

అయితే, మహాశ్రమ గురించి మనకు అన్ని వివరాలూ తెలియవు. ఉదాహరణకు అది సరిగ్గా ఎప్పుడు మొదలౌతుందో మనకు తెలీదు. ప్రభుత్వాలు ఏ కారణాలతో మతం మీద దాడిచేస్తాయో మనకు తెలీదు. దేశాలు దేవుని ప్రజల మీద ఎంతకాలం దాడిచేస్తాయో లేదా ఎలా దాడి చేస్తాయో మనకు తెలీదు. హార్‌మెగిద్దోన్‌లో యెహోవా చెడ్డవాళ్లను ఏ విధంగా నాశనం చేస్తాడో కూడా మనకు తెలీదు.

అయితే భవిష్యత్తు కోసం నమ్మకంగా, ధైర్యంగా సిద్ధపడడానికి మనకు అవసరమయ్యే సమాచారమంతా లేఖనాల్లో ఉంది. ఉదాహరణకు, మనం “చివరి రోజుల” ముగింపులో జీవిస్తున్నామని మనకు తెలుసు. (2తి 3:1) సత్యమతం నాశనం అవ్వకుండా ఉండడానికి, అబద్ధమతం మీద జరిగేదాడి “తగ్గించబడుతుంది” అని మనకు తెలుసు. (మత్త 24:22) యెహోవా తన ప్రజల్ని కాపాడతాడని మనకు తెలుసు. (2పే 2:9) హార్‌మెగిద్దోన్‌లో చెడ్డవాళ్లను నాశనం చేసి, గొప్ప సమూహాన్ని రక్షించడానికి యెహోవా ఎంచుకున్న వ్యక్తి నీతిమంతుడు, శక్తిమంతుడు అని కూడా మనకు తెలుసు.—ప్రక 19:11, 15, 16.

భవిష్యత్తులో జరిగే ఈ సంఘటనల వల్ల ప్రజలు భయపడి “సొమ్మసిల్లుతారు.” కానీ మనం మాత్రం యెహోవా గతంలో తన ప్రజల్ని ఎలా కాపాడాడో, భవిష్యత్తు గురించి ఆయన ఏం చెప్పాడో చదివి, ధ్యానించినప్పుడు మన విడుదల దగ్గరపడిందనే ధైర్యంతో ‘స్థిరంగా నిలబడి [మన] తలలు ఎత్తుకుంటాం.’—లూకా 21:26, 28.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి