దేవుని వాక్యంలో ఉన్న సంపద
అధికార దాహం గల చెడ్డ స్త్రీకి శిక్షపడింది
యూదాను పరిపాలించాలనే అధికార దాహంతో, రాజవంశంలోని వాళ్లను అతల్యా చంపేసింది (2రా 11:1; lfb 53వ పాఠం, 1-2 పేరాలు; “‘అహాబు ఇంటివాళ్లందరూ నశించిపోతారు’—2రా 9:8” అనే చార్టు చూడండి)
సింహాసనానికి వారసుడైన యెహోయాషును యెహోషెబ దాచిపెట్టింది (2రా 11:2, 3)
ప్రధానయాజకుడైన యెహోయాదా యెహోయాషును రాజుగా చేశాడు, అలాగే చెడ్డ స్త్రీ అయిన అతల్యాను చంపించేశాడు. ఆమె బహుశా అహాబు వంశంలో చివరి వ్యక్తి అయ్యుంటుంది (2రా 11:12-16; lfb 53వ పాఠం, 3-4 పేరాలు)
దీని గురించి ఆలోచించండి: సామెతలు 11:21; ప్రసంగి 8:12, 13 లో ఉన్న మాటలు ముమ్మాటికీ నిజమని ఈ బైబిలు సంఘటనలు ఎలా చూపిస్తున్నాయి?