ఎలీషా తన పరిచారకుడితో ఇలా అంటున్నాడు: “వాళ్ల దగ్గర ఉన్నవాళ్ల కన్నా మన దగ్గర ఉన్నవాళ్లే ఎక్కువ.”—2రా 6:16
దేవుని వాక్యంలో ఉన్న సంపద
వాళ్ల దగ్గర ఉన్నవాళ్ల కన్నా మన దగ్గర ఉన్నవాళ్లే ఎక్కువ
ఎలీషాను, అతని పరిచారకుణ్ణి శత్రువులు చుట్టుముట్టారు (2రా 6:13, 14; lfb 52వ పాఠం, 1-2 పేరాలు)
ఎలీషా కంగారుపడకుండా ప్రశాంతంగా ఉంటూ, తన పరిచారకుడి విశ్వాసాన్ని బలపర్చాడు (2రా 6:15-17; w13 8⁄15 30వ పేజీ, 2వ పేరా; ముఖచిత్రం చూడండి)
యెహోవా అద్భుత రీతిలో ఎలీషాను, అతని పరిచారకుణ్ణి కాపాడాడు (2రా 6:18, 19; it-1-E 343వ పేజీ, 1వ పేరా)
మన వ్యతిరేకులు యెహోవా కన్నా బలవంతులు కాదు. ఒకవేళ, తన ప్రజల్ని కాపాడడానికి యెహోవా దేవదూతల్ని ఎలా ఉపయోగిస్తున్నాడో మనం కూడా చూడగలిగితే, మనకు ఏం కనిపిస్తుంది అంటారు?