కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb22 సెప్టెంబరు పేజీ 3
  • రోజు ఉపయోగపడే తెలివైన సలహాలు JW.ORGలో ఉన్నాయి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • రోజు ఉపయోగపడే తెలివైన సలహాలు JW.ORGలో ఉన్నాయి
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
  • ఇలాంటి మరితర సమాచారం
  • అధ్యయనం కోసం చిట్కా
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2023
  • సహాయం మీకు చేరువలో ఉంది
    తేజరిల్లు!—2020
  • వెబ్‌సైట్‌ ఉపయోగించడానికి చిట్కా
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2023
  • మన అధికారిక వెబ్‌సైట్‌—మనకు, ఇతరులకు ప్రయోజనం చేకూర్చేలా రూపొందింది
    మన రాజ్య పరిచర్య—2012
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
mwb22 సెప్టెంబరు పేజీ 3

మన క్రైస్తవ జీవితం

రోజూ ఉపయోగపడే తెలివైన సలహాలు Jw.orgలో ఉన్నాయి

కష్టాలతో నిండిన ఈ చివరి రోజుల్లో మనకు అవసరమయ్యే సూత్రాలన్నీ బైబిల్లో ఉన్నాయి. (2 తిమో. 3:1, 16, 17) అయినాగానీ మన పరిస్థితికి సరిగ్గా సరిపోయే సూత్రాలు బైబిల్లో ఎక్కడున్నాయో మనకు తెలీకపోవచ్చు. ఉదాహరణకు మీరు పిల్లలున్న వాళ్లా? పిల్లల్ని పెంచే విషయంలో సలహాల కోసం వెదుకుతున్నారా? లేదా మీరు టీనేజీ వయస్సున్న పిల్లలా? మీ విశ్వాసానికి ఎదురయ్యే పరీక్షల్ని ఎలా తట్టుకోవాలో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? లేదా మీ భర్తగానీ, భార్యగానీ చనిపోయినందుకు బాధపడుతున్నవాళ్లా? అయితే jw.org వెబ్‌సైట్‌ చూడండి. అందులో ఉన్న ఆర్టికల్స్‌లో మీరు ఇప్పుడున్న పరిస్థితికి అలాగే ఇతర పరిస్థితులకు ఉపయోగపడే బైబిలు సూత్రాలు ఉన్నాయి.—సామె. 2:3-6.

ఒక ట్యాబ్‌లెట్‌లో jw.org వెబ్‌సైట్‌ కనిపిస్తుంది. పక్కన సర్కిల్‌లో బైబిలు బోధలు అనే సెక్షన్‌ కనిపిస్తుంది.

ముందుగా మీరు jw.org హోమ్‌ పేజీలో ఉన్న బైబిలు బోధలు మీద క్లిక్‌ చేయండి. (1వ చిత్రం చూడండి.) ఆ తర్వాత అందులో మీకు నచ్చిన భాగాన్ని సెలెక్ట్‌ చేసుకోండి. లేదా లైబ్రరీ మీద క్లిక్‌ చేసి అందులో ఆర్టికల్‌ సిరీస్‌ను తెరవండి. ఇప్పుడు వీటిలో నుండి మీకు నచ్చిన భాగాన్ని ఎంచుకోండి. (2వ చిత్రం చూడండి.) JW లైబ్రరీ యాప్‌లో కూడా మీరు ఇలానే చేయవచ్చు.a ఈ రెండిటిలో వేటిలోనైనా మీరు ఆర్టికల్స్‌ చదవచ్చు. ఆర్టికల్స్‌ని వెతకడానికి ఇంకో పద్ధతి కూడా ఉంది. jw.org వెబ్‌సైట్‌కి వెళ్లి మీరు దేనిగురించైతే వెతకాలి అనుకుంటున్నారో ఆ పదాన్ని సెర్చ్‌ బాక్సులో టైపు చేసి వెదకవచ్చు.

ఒక ట్యాబ్‌లెట్‌లో jw.org వెబ్‌సైట్‌ కనిపిస్తుంది. పక్కన సర్కిల్స్‌లో లైబ్రరీ అనే సెక్షన్‌ అలాగే దాని కిందున్న ఆర్టికల్‌ సిరీస్‌ కనిపిస్తున్నాయి.

ఈ కిందవున్న అంశాల్ని సెర్చ్‌ బాక్సులో టైపు చేసి, వచ్చిన ఆర్టికల్స్‌లో మీరు వేటిని చదవాలి అనుకుంటున్నారో రాసిపెట్టుకోండి.

  • పిల్లల్ని పెంచడం

  • టీనేజీ పిల్లల్లో డిప్రెషన్‌

  • భర్త చనిపోవడం/భార్య చనిపోవడం

a కొన్ని అంశాలకు సంబంధించి అన్ని ఆర్టికల్స్‌ ప్రస్తుతం jw.orgలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి