మన క్రైస్తవ జీవితం | శిష్యుల్ని చేసే పనిలో ఆనందం పొందండి
యెహోవాతో వ్యక్తిగత సంబంధాన్ని ఏర్పర్చుకునేలా బైబిలు విద్యార్థులకు సహాయం చేయండి
మనం తనకు ప్రేమతో సేవ చేయాలని యెహోవా కోరుకుంటున్నాడు. (మత్త 22:37, 38) బైబిలు విద్యార్థులు అవసరమైన మార్పులు చేసుకోవాలన్నా, కష్టాల్ని తట్టుకోవాలన్నా వాళ్లకు దేవుని మీద ప్రేమ ఉండాలి. (1యో 5:3) ఆ ప్రేమే వాళ్లను బాప్తిస్మం దాకా తీసుకెళ్తుంది.
మీ బైబిలు విద్యార్థులకు, దేవుడు వాళ్లను ఎంత ప్రేమిస్తున్నాడో అర్థంచేసుకునేలా సహాయం చేయండి. స్టడీ చేస్తున్నప్పుడు వాళ్లను ఇలా అడగచ్చు: “ఇది యెహోవా గురించి మీకు ఏం నేర్పిస్తుంది?” లేదా “దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని ఇది ఎలా చూపిస్తుంది?” యెహోవా ఎలా సహాయం చేస్తున్నాడో వాళ్లు గుర్తించేలా చేయండి. (2ది 16:9) మీ ప్రార్థనలకు యెహోవా ఎలా జవాబు ఇచ్చాడో వాళ్లకు చెప్పండి. తర్వాత వాళ్ల ప్రార్థనలకు దేవుడు ఎలా జవాబిస్తున్నాడో గమనించమని ప్రోత్సహించండి. బైబిలు విద్యార్థులు యెహోవా ప్రేమను అర్థంచేసుకుని ఆయన్ను తిరిగి ప్రేమించినప్పుడు, ఆయనతో స్నేహం చేయడానికి ప్రయత్నించినప్పుడు మనకు చాలా సంతోషంగా అనిపిస్తుంది.
మీ బైబిలు విద్యార్థులకు సహాయం చేయండి—యెహోవాతో వ్యక్తిగత సంబంధాన్ని ఏర్పర్చుకునేలా వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి:
జాస్మిన్కు ఏ సమస్య ఎదురైంది?
నీతా జాస్మిన్కు ఎలా సహాయం చేసింది?
ఆ సమస్యను జాస్మిన్ ఎలా అధిగమించింది?